luxury homes
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
లగ్జరీ ఇళ్ల మెరుపులు
న్యూఢిల్లీ: విశాలమైన ఇళ్లు, ప్రీమియం సదుపాయాలు కోరుకునే సంపన్నుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. మొత్తం 19,700 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) అత్యధికంగా 10,500 యూనిట్లను రియల్టీ సంస్థలు విక్రయించాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూ. 4 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ ఇళ్లు 12,895 అమ్ముడయ్యాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై–ఎండ్ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు, అసమానమైన సౌకర్యాన్ని అందించే హై–ఎండ్ ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటోందని క్రిసుమి కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆకాశ్ ఖురానా వివరించారు. సీబీఆర్ఈ డేటా ప్రకారం.. → రూ. 4 కోట్ల పైబడి ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరిగాయి. → పుణెలో 400 నుంచి 825 పెరగ్గా, బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి పడిపోయాయి. → కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి. -
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
నో కార్, నో బంగ్లా, నో డిజైనర్ వేర్ : ఇదే వారి సక్సెస్ సీక్రెట్!
విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు, లగ్జరీ బంగ్లాలు, విలాసవంతమై హాలి డే ట్రిప్‌లు ఇదీ సంపన్నుల జీవనశైలి గురించి తరచుగా వినిపించే మాటలు. కానీ ఈ ప్రపంచంలో అపరకుబేరుల జీవన విధానం దీనికి పూర్తిగా భిన్నమైందిగా ఉంది అంటే నమ్ముతారా? విలాస జీవితాన్ని పక్కన బెట్టి అది సాధారణంగా అతి తక్కువ ఖర్చుతోనే కాలం గడుపున్న సంపన్నుల (Millionaires) సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరో విధంగా చెప్పాలంటే ఇది లేటెస్ట్ ట్రెండ్.. ఆసక్తికరంగా ఉంది కదూ.. పదండి వీరి గురించి తెలుసుకుందాం.సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెప్పేమాట. అధిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. 'తక్కువ ఖర్చు’ అనే పద్దతిలో జీవనశైలిని మార్చున్నారు. పొదుపు, తక్కువ ఖర్చు దీర్ఘకాలిక భద్రతనిస్తుందని ఇది ముందస్తు పదవీ విరమణ ,ఆర్థిక స్వేచ్ఛకు గేట్‌వే అని విశ్వసిస్తున్నారు. ది ఎకానమిక్ టైమ్స్ అందించిన కథనం ప్రకారం అలాంటి వారిలో షాంగ్ సావెడ్రా,డా. రాబర్ట్ చిన్, అనీ కోలెది ముందు వరుసలో ఉన్నారు.షాంగ్ సావేద్ర: పొదుపు ద్వారా సంపదను నిర్మించడం39 ఏళ్ల షాంగ్ సావెడ్రా ఒక వ్యాపారవేత్త, రచయిత.ఫార్చ్యూన్ ప్రకారం తన భర్తతో కలిసి మల్టీ మిలియన్ డాలర్ల నికర విలువను సొంతం చేసుకుంది. పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నషాంగ్ దంపతులు లైఫ్‌స్టైల్ చూస్తే ఔరా అనాల్సిందే. లాస్ ఏంజిల్స్‌లో అద్దెకు తీసుకున్న నాలుగు పడకగదుల ఇంటిలో నివాసం. ఇప్పటికీ 16 ఏళ్ల పాత సెకండ్ హ్యాండ్ కారే వాడతారు. ఎక్కడ తక్కువకు కిరాణా సరుకులు దొరుకుతాయో అక్కడే కొటారు. అంతేకాదు పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు వాడతారు. ఫేస్బుక్ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మలే కొనిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పిల్లల చదువు, పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలకు మాత్రం డబ్బు ఖర్చుపెడతారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్‌లో ఆస్తులున్నాయి. లక్షల్లో జీతం, అతితక్కువ ఖర్చుడెంటిస్ట్ రాబర్ట్ చిన్, జెస్సికా ఫారర్ దంపతులదీ దాదాపు ఇదే స్టైల్. నెలకు లక్షల్లో జీతం. లాస్ వెగాస్‌లో అద్దె ఇంట్లో నివాసం. ఇద్దరూ కలిసి ఒక కారునే వాడతారు. నెలలో ఒకటి రెండుసార్లు తప్ప బయట ఫుడ్ తినరు. హోం ఫుడ్‌కే ప్రాధాన్యత. కిరాణా సరకులు, దుస్తులన్నీహోల్సేల్గానే కొంటారు. వారు కావాలనుకున్నప్పుడు నచ్చినట్టుగా ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.కోట్ల ఆస్తి, తొడిగేదిమాత్రం సెకండ్ హ్యాండ్ దుస్తులురీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అనీ కోలెది ఈ కోవకు చెందిన వారే. వీరి ఆస్తులు మిలియన్ డాలర్లకుపై మాటే. అయినా ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడతారు. డబ్బును ఎలా పొదుపు చేయాలో మహిళలకు సూచనలిచ్చే ఈమె ఏడాదికి మూడుసార్లు మాత్రమే దుస్తులు కొంటారట.పైసా ఖర్చుపెట్టాలంటే ఆచితూచి వ్యవహరిస్తారు. విమాన ప్రయాణాల విషయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటుంటారు.ఉచితంగా ఎక్కడ స్విమ్మింగ్ చేసుకొనే అవకాశం ఉంటే అక్కడికే వెళతారు. ఇలా సంపన్నుల మన్న ఆర్భాటం లేకుండా అత్యంత సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ, రిటైర్మెంట్ జీవితానికి చక్కటి బాటలు వేసుకుంటున్నారు.ఆదాయం తక్కువ, అప్పులెక్కువ అనే ధోరణితో జీవించే వారికి వీరి జీవనశైలి కనువిప్పు కావాలి. లేనిపోని ఆడంబరాలు, హంగూ ఆర్భాటాలు లేకుండా సంపాదించే ప్రతీ పైసాని సద్వినియోగం చేసుకుంటూ, భవిష్యత్తుకు బాటలు వేసే మార్గాలను ఆచరించడం ఆదర్శనీయం. -
హైదరాబాద్‌లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్‌లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్‌కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్‌లో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్‌లోని బుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ పెంట్‌హౌస్‌ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్‌తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్‌తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్‌తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. → ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. → ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. → పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. → కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆధునిక అపార్ట్మెంట్ల వైపు మొగ్గు.. ‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. -
రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే !
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బేబీ బంప్‌తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.రూ.100 కోట్లతో భవనం..అయితే బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మన్నత్‌కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్వీర్ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.దీపికా- రణ్వీర్ ప్రేమకథ..2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్‌బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. సింగం ఎగైన్‌లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్ డాన్ 3లో కూడా నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎక్స్‌యూవీ700 ఫీచర్స్.. ఫ్రీమియం హోసింగ్! ఇదే టార్గెట్
రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'మహీంద్రా లైఫ్‌స్పేస్' తనను తాను ప్రీమియం హౌసింగ్ కంపెనీగా రీబ్రాండ్ చేసుకోవాలని.. ముంబై, పూణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ కుమార్ సిన్హా అన్నారు.అమిత్ కుమార్ సిన్హా.. మహీంద్రా కార్లను గురించి ప్రస్తావిస్తూ, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన బ్రాండ్ (మహీంద్రా) కార్ల మాదిరిగానే గృహాలను కూడా ఫ్రీమియం సౌకర్యాలతో అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని పేర్కొన్నారు.మహీంద్రా XUV700 కారును ఉపయోగించే వినియోగదారుడు ఎంత అనుభూతి పొందుతాడో.. తప్పకుండా మహీంద్రా లైఫ్‌స్పేస్ గృహాలు కూడా అంత అనుభూతిని అందించేలా రూపొందిస్తామని అమిత్ అన్నారు. మా ప్రాజెక్ట్ నిర్మించే గృహాలు.. ఉత్తమమైన స్థలంలో, పచ్చదనం, కావలసిన సౌకర్యాలను అందిస్తాయని అన్నారు.మహీంద్రా లైఫ్‌స్పేస్ ముంబై, పూణె, బెంగళూరులలో తన ఉనికిని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 45000 కోట్లను వెచ్చిస్తోంది. అంతే కాకుండా 2028నాటికి రూ. 8000 కోట్ల నుంచి రూ. 10000 కోట్ల మధ్య ప్రీ-సేల్స్ సాధించడం కంపెనీ లక్ష్యం అని అమిత్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. -
వావ్ కిచెన్..
- అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు - బ్రాండ్స్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత - జర్మన్, కొరియా, ఇటలీ, ఇండియన్ మాడ్యుల్స్ పట్ల ఆసక్తి - సెన్సార్ వైపు వినియోగదారుల ఆసక్తి పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. ఇప్పుడు వంట గది విషయంలోనూ ఇదే తరహా ఒరవడి నడుస్తోంది. అత్యాధునిక కిచెన్ మాడ్యుల్స్ కోసం రూ.లక్షలు వెచి్చస్తున్నారు. లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు, అపార్ట్మెంట్, గ్రూప్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్.. ఎలాంటి ఇల్లైనా... అందులో ఏర్పాటు చేసే కిచెన్ విషయంలో కొనుగోలుదారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటి కంటే అత్యాధునిక సదుపాయాలున్న కిచెన్ కావాలి. అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలి. బ్రాండ్ విషయంలో అసలే రాజీ పడొద్దు. విశాలమైన గదికి ఇంద్రభవనం లాంటి అలంకరణ తోడవ్వాలి. అందుకోసం ఎల్లలు దాటి మాడ్యుల్స్‌ను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఇటలీ, జర్మనీ, కొరియా, ఇండియన్ మేడ్ కిచెన్ మాడ్యుల్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సౌకర్యాలు, సదుపాయాల విషయంలో వినియోగదారుల ఆలోచనా విధానం మారుతోంది. ఇంటి నిర్మాణంతో మొదలై.. కిచెన్ వరకూ ప్రతిదీ కొత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూస్తున్నారు. దీని కోసం ఎంత ఖరీదైనా చెల్లించేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా కిచెన్‌లో అల్మరాలు, చిమ్నీల విషయంలో సరికొత్తవే ఎంచుకుంటున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా కొనుగోలదారుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఖర్చుకు వెనుకాడం.. నగరం నలుదిక్కుల నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాధారణంగా అపార్ట్మెంట్లో 3 పడక గదుల ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటోంది. అదే సమయంలో విల్లాలు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పలుకుతున్నాయి. అంత మొత్తం వెచి్చంచి ఇల్లు కొనుగోలు చేసిన యజమానులు ఇంటీరియర్ డెకరేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులోనూ కిచెన్ విషయంలో మరింత ఆధునికత కోరుకుంటున్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. మాడ్యులర్ కిచెన్ విషయంలో ఆర్కిటెక్ట్‌లను సంప్రదిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయో ఇంటర్నెట్లో వెతుకుతు న్నారు. ప్రధానంగా ఇటలీ, కొరియన్, జర్మన్, భారతదేశంలో తయారయ్యే మోడల్స్ పట్ల వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రధాన బ్రాండెడ్ కిచెన్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో కిచెన్ గదిని ఆధునికీకరించడానికి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మాణ సంస్థలు నివాస సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయి. విల్లా, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ ఇలా ఏదైనా నిర్మా ణ ప్రాంతాన్ని బట్టి, సంస్థకున్న గుర్తింపు, వినియోగదారులకు ఇస్తున్న వసతులు, మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే కిచెన్‌కు ప్రత్యేక ఆకృతిని తెస్తున్నారు. డిజైన్, లుక్, టెక్నాలజీ.. ఇన్నాళ్లు హాల్, పడక గదికి మాత్రమే ప్రత్యేక అలంకరణలు చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. వంట గదిలో అత్యాధునిక డిజైన్లు కోరుకుంటున్నారు. కిచెన్ చూడగానే అదిరిపోయే అనుభూతి కావాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో అద్భుతమైన టెక్నాలజీతో మాడ్యులర్ కిచెన్ తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌లను ఆశ్రయిస్తున్నారు.సెన్సార్ సిస్టం..కిచెన్ గదిలోకి వ్యక్తి అడుగు పెట్టగానే గోడలకున్న సెన్సార్ వ్యవస్థ విద్యుత్తు దీపాలను వెలిగిస్తుంది. గ్యాస్ స్టవ్ దగ్గర సైతం ఇలాంటి వ్యవస్థే అందుబాటులోకి వచి్చంది. గదిలో ఎక్కడా నీటి లీకేజీలు లేకుండా, చెదలు పట్టే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్రీ మెయింటెనెన్స్ కోసం గ్రనైట్ వాడకుండా క్వాడ్జ్, కొరియన్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఫ్రిజ్, మైక్రో ఒవెన్, నీటి శుద్ధి యంత్రం, ఇతర వస్తువులు బయటకు కనిపించకుండా ఉడ్ వర్క్ చేయిస్తున్నారు. వంట సమయంలో వచ్చే ఆవిర్లు, పొగను బయటకు పంపే చిమ్నీలు, గ్యాస్ స్టవ్ వద్ద పొగ రాకుండా కింది భాగంలోనే ఏర్పాటు చేసే మైక్రో ఫ్యాన్లు, వంట, తినేందుకు ఉపయోగించే సామాన్లు భద్రపరచుకోవడానికి ర్యాక్‌లు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఇతర ఆహార వస్తువులు నిల్వ చేసుకోవడానికి విడివిడిగా ప్రత్యేక గ్యాలరీల కోసం ప్రత్యేకంగా జర్మన్ టెక్నాలజీ హార్డ్‌వేర్ వాడుతున్నారు.ఐలాండ్ కిచెన్ ఎంపిక చేసుకున్నాం బిల్డర్ ఇల్లు అప్పగించిన తరువాత కిచెన్ కోసం ప్రత్యేకంగా రూ.8 లక్షలు వెచి్చంచాను. ఐలాండ్ కిచెన్ కావాలని పెట్టించుకున్నాం. అక్రిలిక్ ఫినిష్ మెటీరియల్, చిమ్ని జర్మన్ హార్డ్‌వేర్ వినియోగించాం. ఆర్కిటెక్ట్ సూచించిన డిజైన్, ఫంక్షనాలిటీ నచ్చింది. – అఖిల్, సాన్సియా విల్లాస్ఇంపోర్టెడ్పై ఆసక్తి ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తి కిచెన్ మోడ్రన్‌గా ఉండాలని ఆలోచిస్తున్నారు. మార్కెట్లో కొత్త మోడల్స్‌ను కోరుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి మోడల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఖర్చు కోసం ఎవరూ వెనుకాడటం లేదు. మోడల్ నచ్చితే చాలని అంటున్నారు. వారి అభిరుచికి అనువైన మోడల్స్ కోరుతున్నారు. – రాకేష్ వర్మ, మికాసా, ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్, మాదాపూర్. -
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
-
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
లగ్జరీ ఇళ్లకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస గృహాల(లగ్జరీ ఇళ్లు)కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రూ.50 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న లగ్జరీ ఇళ్లు విక్రయాలు గతేడాదిలో 51% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. అమ్ముడైన మొత్తం 45 లగ్జరీ ఇళ్ల విలువ రూ.4,319 కోట్లుగా ఉంది. వీటిలో 58% అపార్ట్మెంట్లు, 42% బంగ్లాలు. అంతకు ముందు ఏడాది(2022)లో అమ్ముడైన 29 విలాస గృహాల విలువ రూ.2,859 కోట్లుగా ఉంది. మొత్తం 45 యూనిట్లలో ముంబైలో విక్రయమైన 29 లగ్జరీ ఇళ్ల విలువ రూ.3,031 కోట్లు, ఢిల్లీలోని ఎన్సీఆర్లో అమ్ముడైన 12 లగ్జరీ ఇళ్ల విలువ రూ.1,043 కోట్లు, బెంగుళూరు విక్రయమైన 4 లగ్జరీ ఇళ్ల విలువ రూ.245 కోట్లుగా ఉంది. ‘‘అత్యంత సంపన్నల నుంచి అధిక గిరాకీ ఉండటంతో లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అమ్ముడైన 45 లగ్జరీ ఇళ్లలో రూ.100 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న ఇళ్ల సంఖ్య 14గా ఉంది. వీటిలో అత్యధిక అమ్మకాలు ముంబై జరిగాయి. విలాసవంతమైన ఆస్తులపై సంపన్నులకు విశ్వాసం క్రమంగా పెరుగుతుండంతో భవిష్యత్తులోనూ లగ్జరీ అమ్మ కాలు పెరగొచ్చు’’ అని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ తెలిపారు. -
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్‌ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్‌బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్‌బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
విలాస గృహాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రముఖ పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా టాప్–7 పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి ఖరీదు చేసే ఇళ్ల విక్రయాలు గతేడాది (2023లో) 75 శాతం అధికంగా నమోదయ్యాయి. సంపన్నులు (హెచ్ఎన్ఐలు) లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో గతేడాది విలాస గృహాల అమ్మకాలు 2,030 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2022)లో ఇవి 1,240 యూనిట్లు కావడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి విలువైన ఇళ్ల అమ్మకాలు 2023లో 12,935 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో 7,395 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘‘ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లకు ఉన్న ఆకర్షణ కొనసాగుతుంది. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతుంది. ప్రాంతీయంగా కొంత అస్థిరతలు ఉండొచ్చు. మొత్తం మీద భవిష్యత్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2023లో 5,530 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో అమ్మకాలు 1,860 యూనిట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. ► ముంబైలో 4,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదిలో అమ్మకాలు 3,390 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణెలో 450 యూనిట్ల విక్రయాలు గతేడాది నమోయ్యాయి. అంతకుముందు ఏడాది ఇవి 190 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 265 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో 2022లో 300 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా, గతేడాది ఇవి 310 యూనిట్లకు పెరిగాయి. ► చెన్నైలోనూ విక్రయాలు 150 యూనిట్ల నుంచి 160 యూనిట్లకు పెరిగాయి. ► 2023లో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల కేటగిరీల్లో ఇళ్ల అమ్మకాలు 3,22,000 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ► మెరుగైన డిమాండ్ నేపథ్యంలో డెవలపర్లు 3,13,000 యూనిట్ల కొత్త ఇళ్ల యూనిట్లను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. ఆర్థిక స్థితిలో మార్పు. ‘‘బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతోంది. మెరుగైన ఉపాధి అవకాశాలు ఏ్పడుతున్నాయి. దీంతో మరింత మందికి మెరుగైన జీవనశైలి చేరువ అవుతోంది. పేరొందిన సొసైటీల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’’అని గురుగ్రామ్‌కు చెందిన రియల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. ఈ ధోరణి ఇక ముందూ కొనసాగడమే కాకుండా, భారత్ వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్‌లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్‌లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్‌హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్‌లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. 2022లో ఏడు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెపె్టంబర్ వరకు) అమ్మకాలు క్రితం ఏడాది మొత్తం అమ్మకాలతో పోల్చి చూసినా, 7 శాతం వృద్ధితో రూ.3,48,776 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది తొమ్మిది నెలల అమ్మకాలు గతేడాది మొత్తం అమ్మకాలను మించి ఉండడం, ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తోంది. ఇళ్ల ధరలు సగటున 8–18 శాతం మధ్య ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది పెరిగాయి. కనుక గతేడాది అమ్మకాలతో కచి్చతంగా పోల్చి చూడలేం’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఏడు పట్టణాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోగా, తర్వాతి మూడు నెలల్లో (జూన్ త్రైమాసికం) ఒక శాతం అధికంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్టు చెప్పారు. పండుగల్లో జోరుగా విక్రయాలు పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు ప్రముఖ పట్టణాల్లో బలంగా ఉన్నట్టు అనుజ్ పురి వెల్లడించారు. కనుక మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది చివరికి రూ.4.5 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో ఏడు పట్టణాల్లో 3.49 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ చివరి వరకు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఇళ్లు అమ్మడవుతాయన్నది అంచనాగా ఉంది. 2022 మొత్తం మీద అమ్ముడైన యూనిట్లు 3.65 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 43 శాతం అధికం ► ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు, 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా ఉంది. ► పుణెలో 96 శాతం అధికంగా రూ.39,945 కోట్ల విక్రయాలు కొనసాగాయి. ► చెన్నైలో 45 శాతం వృద్ధితో రూ.11,374 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 41 శాతం పెరిగి రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 29 శాతం వృద్ధితో 50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ► కోల్‌కతాలో అమ్మకాల విలువ 19 శాతం పెరిగి రూ.9,025 కోట్లుగా ఉంది. -
విలాస భవనాలకు గిరాకీ.. ఈ ఏడాది అదే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాసవంతమైన ఇళ్లకు (అల్ట్రా లగ్జరీ) అధిక గిరాకీ నెలకొన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.40 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు రూ. 4,063 కోట్ల మేర నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె పట్టణాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 58 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022 ఏడాది మొత్తం మీద ఈ విభాగంలో అమ్ముడుడైనవి 13 యూనిట్లుగానే ఉన్నాయి. వీటి విలువ రూ. 1,170 కోట్లుగా ఉంది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ధనవంతులు (హెచ్ఎన్ఐ), అధిక ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) ఖరీదైన ఇళ్లను పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న నేపథ్యంలో హెచ్ఎన్ఐలు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయడం అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డివండ్ను పెంచినట్టు చెప్పారు. ముంబై టాప్.. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యంత ఖరీదైన ఇళ్లు 58 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో 53 యూనిట్లు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నాలుగు యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోనూ ర.40 కోట్ల పైన విలువ చేసే ఒక యూనిట్ విక్రయం నమోదైంది. ముంబైలోని 53 యూనిట్లలో మూడు ఇళ్ల ధర రూ. 200 కోట్లపైనే ఉంది. ఏడు ఇళ్ల ధర రూ. 100–200 కోట్ల మధ్య ఉంది. ఢిల్లీలో రెండు యూనిట్ల ధర రూ.100 కోట్లపైన ఉంది. ‘‘ఇటీవలి కాలంలో సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష అన్ని ఆదాయ వర్గాల వారిలో పెరిగింది. జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇందుకు కారణం. మరింత విలాసవంతమైన ఇల్లును కలిగి ఉండాలన్న ధోరణి ధనవంతుల్లో పెరిగింది’’అని గురుగ్రామ్‌కు చెందిన క్రిసూమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. -
లగ్జరీ ఇళ్ల గిరాకీ : కోట్లు అయినా...సరే! హైదరాబాదీల జోరు
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో భారతీయ రియల్ ఎస్టేట్ దూసుకుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పుంజుకుంది. స్మార్ట్, లగ్జరీ హోమ్స్, టాప్ క్లాస్ ఎమినిటీస్ ఉంటే చాలు ధర ఎంతైనా వెనుకాడ్డం లేదు. 4 కోట్ల రూపాయ విలువైన ఇళ్లను సొంతం చేసుకునేందుకు బడాబాబులు ఎగబడుతున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి అభిస్తున్న ఆదరణ, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాపై పెరుగుతున్న ఆకాంక్ష,ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విలాసవంతమైన నివాసాల కొరత వంటి అనేక అంశాలు లగ్జరీ హౌసింగ్ అమ్మకాల పెరుగుదలకు దారితీసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2023 జనవరి-సెప్టెంబర్ మధ్య భారతదేశంలో రూ. 4 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన విలాస వంతమైన గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 తొలి తొమ్మిది నెలల్లో 97 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఏడు నగరాల్లో, ఈ సంవత్సరం 9,200 లగ్జరీ గృహాలు అమ్ముడైనాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 4,700 యూనిట్లు మాత్రమే. ఈ కాలంలో జరిగిన మొత్తం లగ్జరీ హౌసింగ్ విక్రయాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్‌ల వాటా 90 శాతంగా ఉందని వేదిక ఢిల్లీ-ఎన్సీఆర్లో 37 శాతం, ముంబైలో 35 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం అమ్మకాలు జరిగాయి. మిగిలిన 4 శాతం పూణేలో నమోదైనాయి. (విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్ సింఘానియా) అంతేకాదు అక్టోబరు- డిసెంబరు పండుగల సీజన్లో లగ్జరీ హౌసింగ్ విక్రయాలు మరింత జోరందు కుంటాయని కూడా నివేదించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తొలిసారిగా లగ్జరీ గృహాలను కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లగ్జరీ లైఫ్‌పై పెరుగుతున్న ఆసక్తి, ఈ పెరుగుదలకు కొన్నికారణాలులుగా సీబీఆర్ఈ వెల్లడించింది. ఈప్రాధాన్యతల కారణంగా ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగంలో రెసిడెన్షియల్ అమ్మకాలతోపాటు, కొత్త లాంచ్‌లు పెరుగుతాయని అంచనా వేసింది. 2023లో 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. అలాగే సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే అధిక-నికర-విలువ గల వ్యక్తులు (HNIలు), ప్రవాస భారతీయులు (NRIలు) ఆసక్తి కూడా ఈ పెరుగుదలకు దోహదపడుతోందని వెల్లడించింది. (ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?) -
ఖరీదైన ఇళ్లకు గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు అధిక డిమాండ్ నెలకొంది. రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 97 శాతం పెరిగి 9,200 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 4,700 యూనిట్లుగానే ఉన్నాయి. టాప్–7 పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ‘ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3, 2023’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ విలావంత ఇళ్ల అమ్మకాల్లో టాప్–3గా ఉన్నాయి. సెపె్టంబర్ క్వార్టర్లో మొత్తం విక్రయాల్లో 90 శాతం ఈ మూడు పట్టణాల్లోనే నమోదయ్యాయి. 9,200 యూనిట్ల అమ్మకాల్లో 37 శాతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. ముంబై వాటా 35 శాతం, హైదరాబాద్ వాటా 18 శాతం, పుణె వాటా 4 శాతం చొప్పున ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం పెరిగి 2,400 యూనిట్లుగా ఉన్నాయి. జూలై త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ టాప్–3 మార్కెట్లుగా ఉండడం, కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య మార్కెట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పండుగల జోష్ ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 2021 నుంచి చూస్తే అత్యధికంగా ఉంటాయని సీబీఆర్ఈ అంచనా వేసింది. 2021 పండుగ సీజన్లో 1,14,500 యూనిట్లు అమ్ముడుపోగా, 2022 పండుగల సీజన్లో 1,47,300 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 1,50,000 యూనిట్లు మైలురాయిని దాటిపోవచ్చని సీబీఆర్ఈ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల విభాగాల్లో 2,30,000 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2,20,000 యూనిట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో నూతన ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో ముంబై, పుణె, హైదరాబాద్‌లో మెరుగైన వృద్ధి కనిపించింది. ఈ మూడు పట్టణాలు మొత్తం నూతన ప్రాజెక్టుల ప్రారంభంలో 64 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
లగ్జరీ ఇళ్ల అమ్మకాలు డబుల్.. టాప్‌లో హైదరాబాద్!
Luxury housing sales: దేశంలో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. ఖరీదు ఎక్కువైనా విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లో ఈ ధోరణి ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్లు, అంతకంటే విలువైన లగ్జరీ నివాసాల అమ్మకాలు దాదాపు రెట్టింపైనట్లు రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ (CBRE South Asia Pvt.Ltd) ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా టాప్ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 లగ్జరీ నివాసాలు అమ్ముడుపోగా ఈ ఏడాది వాటి సంఖ్య దాదాపు రెట్టింపై 9,200లకు చేరింది. మూడు నగరాల్లోనే 90 శాతం ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలలో మొదటి మూడు మార్కెట్లుగా ఉద్భవించాయి. మొత్తం టాప్ ఏడు నగరాల్లో జరిగిన అమ్మకాలలో దాదాపు 90 శాతం ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో దాదాపు 37 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్సీఆర్ టాప్‌లో ఉండగా ముంబయి, హైదరాబాద్, పుణె వరుసగా 35 శాతం, 18 శాతం, 4 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి. ఈ తొమ్మిది నెలల్లో నమోదైన పటిష్టమైన అమ్మకాల ఆధారంగా ఈ పండుగల సీజన్లో హౌసింగ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ కొత్త రికార్డును నెలకొల్పుతుందని, మొత్తం గృహాల విక్రయాలు 150,000 యూనిట్లను దాటతాయని అంచనా వేస్తున్నారు. -
జవాన్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పఠాన్‌తో దుమ్మురేపిన కింగ్ ఖాన్.. తాజాగా 'జవాన్' చిత్రంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలో అన్ని భాషలలో కలిపి రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కథానాయకుడైన షారుఖ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐదు పదుల వయసు దాటినా ఎంతో హుందాగా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ పాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈయన ఒక సినిమాకు రూ.130 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వివిధ వ్యాపార సంస్థల నుంచి రూ. 100 కోట్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు.. వార్షిక ఆదాయం మొత్తం రూ. 280 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా వీరు సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇవి కాకుండా దుబాయ్‌లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అమెరికాలో ఒక ఖరీదైన విల్లా ఉన్నట్లు చెబుతారు. ఇదీ చదవండి: ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు! కార్ కలెక్షన్స్.. షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద సుమారు రూ. 7 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ8 ఎల్, బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పజెరో, హ్యుందాయ్ క్రెటా మొదలైన కార్లు ఉన్నాయి. మొత్తం మీద అయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. -
లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?
అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్ ప్రపంచంలోనే మూడో కుబేరుడు ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో దాదాపు రూ.560 కోట్ల (68 మిలియన్ల డాలర్లు) ఎస్టేట్‌ను కొనుగోలుకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. లారెన్ శాంచెజ్‌తో చెట్టాపట్టాల్, రూ.560 కోట్ల ఇల్లు ఇటీవల గర్ల్‌ఫ్రెండ్‌తో లారెన్ శాంచెజ్‌తో సందడి చేసిన జెఫ్ బెజోస్ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ను జోడించడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8-acre (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ MTM స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై దృష్టి పెట్టారని, ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్ ఇండియన్ క్రీక్‌ను "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సమాచారం ద్వారా తెలుస్తోందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. బెజోస్‌తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు బెజోస్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే దిమ్మదిరిగే ప్రాపర్టీలు బెజోస్‌కు ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్ , ఇంకా మౌయ్లోని ఒక ఎస్టేట్‌తో సహా పలు లగ్జరీ భవనాలు ఆయన సొంతం. అలాగే మాన్హాటన్ ,సీటెల్‌లో ఖరీదైన ఆస్తులు, టెక్సాస్‌లో 300,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్‌కు ప్రయోగ కేంద్రం కొలువై ఉంది. లగ్జరీ ప్రాపర్టీలపై మోజు 2021లో అమెజాన్ సీఈవోగా వైదొలగిన బెజెస్కు భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకుల తరువాత సూపర్ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌యాచ్ కోరును కొనుగోలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో, ఈ ఐలాండ్ ఎస్టేట్‌లో అత్యంత సంపన్న నివాసి అవుతాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ . సొంత పోలీసు విభాగం గా ఉన్నాయి. -
హైదరాబాదా మజాకా! విలాసానికి 'సై'.. లగ్జరీ గృహాల ధరల్లో అత్యధిక వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ.100 కోట్లు.. మోకిలాలో గజానికి రూ.1,0,5000 ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలోనూ మరో మైలురాయి సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. విలాసవంతమైన ఇళ్లలో ఇలా... హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా, 2023 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర మాత్రమే పెరిగాయి. కరోనా తర్వాత నుంచే లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,210గా ఉండగా, ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది. రెండోస్థానంలో హైదరాబాద్ ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.3,750గా ఉండగా, ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.4 వేలుగా ఉంది. మధ్యతరగతిలోనూ మనమే టాప్ ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.6,050లుగా ఉండగా, ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.5,780గా ఉంది. దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2023 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే, విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధిగా నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 2018లో 12,400గా ఉండగా, 2023 నాటికి 15,350కి పెరిగింది. -
ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'అంబానీ ఫ్యామిలీ'. ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారన్న విషయం అందరికి తెలిసిందే. 2018లో ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం ఈ కొత్త జంట అప్పట్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ బంగ్లా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గులిటాలోని ఇషా అంబానీ మాన్షన్ అని పిలువబడే సంపన్నమైన ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆధునిక సదుపాయాలు, అధునాతన వసతులు కలిగిన ఈ భవనం భూలోక ఇంద్ర భావనాన్ని తలపిస్తుంది. వర్లీలోని హిందూస్తాన్ యూనిలీవర్‌కి చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకుంది. ఈ అద్భుతమైన భవనం అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది. దీనిని అజయ్ పిరమల్ అండ్ స్వాతి పిరమల్ ఇషా అంబానీకి కానుకగా అందించారు. (ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) 50000 చదరపు అడుగుల అల్ట్రా లగ్జరీ బంగ్లా ఖరీదు సుమారు రూ. 450 కోట్లు అని తెలుస్తోంది. ఐదు అంతస్తులు కలిగిన ఈ సౌధం మొదటి అంతస్థులో విశాలమైన మల్టి పర్పస్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ వంటి వాటితో పాటు ఆ తరువాత అంతస్తుల్లో లివింగ్, డిన్నర్, డ్రెస్సింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకమైన రూమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇషా ఆనంద్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. -
20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
Mohammed Siraj Net Worth: అద్దె ఇంట్లో.. ఆటో నడుపుతూ తండ్రి సంపాదించిన డబ్బుతో కాలం వెళ్లదీసిన స్థితి నుంచి నుంచి జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లా కొనే స్థాయికి ఎదిగాడు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచిన ఈ ఫాస్ట్ బౌలర్.. టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్నాడు. భారత జట్టులో కీలక బౌలర్‌గా సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాడు. ఆటగాడిగా అద్భుత ప్రదర్శనతో అందరి నీరాజనాలు అందుకుంటున్న సిరాజ్.. సంపాదనలోనూ తగ్గేదేలే అంటున్నాడు. మరి ఈ హైదరాబాదీ నెట్‌వర్త్, అతడి వద్దనున్న విలాసవంతమైన కార్ల గురించి తెలుసుకుందామా? 2017లో ‘కోటీశ్వరుడిగా’... దేశవాళీ క్రికెట్లో ప్రతిభ చాటుకున్న సిరాజ్‌ను ఐపీఎల్ రూపంలో అదృష్టం వరించింది. 2017లో అతడు రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. దీంతో సిరాజ్ కోటీశ్వరుడియ్యాడు. ఇక ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిరాజ్‌ను సొంతం చేసుకోగా.. ఇప్పటికీ అదే జట్టుతో కొనసాగుతున్నాడు. 2017లోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్.. నాటి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రోత్సాహంతో టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇక ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టులో రెగ్యులర్ మెంబర్‌గా మారాడు. ఈ క్రమంలో అతడి సంపాదన కూడా పెరుగుతూ వస్తోంది. ఏడాదికి మూడు కోట్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో బీ గ్రేడ్‌లో ఉన్న సిరాజ్.. ఏడాదికి రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నాడు. టీమిండియా తరఫున ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు 3 లక్షల రూపాయల చొప్పున ఫీజుగా అందుకుంటున్నాడు. ఆర్సీబీ కీలక బౌలర్‌గా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ కీలక బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్-2023 వేలానికి ముందు రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రూ. 7 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ మియా నెట్‌వర్త్ సుమారు 48 కోట్లు ఉంటుందని క్రిక్బౌన్సర్ అంచనా వేసింది. కార్లు, బంగ్లా.. అద్దె ఇంట్లో కాలం గడిపిన సిరాజ్ తన కుటుంబం కోసం ఇటీవలే ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ ఏరియాలో ఖరీదైన ఇంటిని కొన్నాడు. ఐపీఎల్-2023 జరుగుతున్న సమయంలోనే గృహప్రవేశం చేయగా.. ఆర్సీబీ ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు సిరాజ్. సిరాజ్ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ సెడాన్‌తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర బహుమతిగా అందించిన మహేంద్ర థార్ కూడా ఉంది. కాగా ఐపీఎల్లో అడుగుపెట్టిన తర్వాత తనకు వచ్చిన మొత్తంతో సిరాజ్ తొలుత టయోటా కరోలాను కొనుగోలు చేశాడు. ఇలా ఆటో డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి ఖరీదైన కార్లు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన సిరాజ్ యువతకు ఆదర్శనీయమే కదా!! కాగా సిరాజ్ ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చదవండి: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ! Hyderabadi Biryani time! 🥳 The boys took a pitstop at Miyan's beautiful new house last night! 🏡#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/kEjtB1pQid — Royal Challengers Bangalore (@RCBTweets) May 16, 2023 -
పెంపుడు కుక్క కోసం 20 వేల డాలర్లతో కాస్ట్లీ ఇల్లు
పెంపుడు కుక్కలను అపురూపంగా చూసుకునే వాళ్లు చాలామందే ఉంటారు గాని, పెంపుడు కుక్కకు ఏకంగా కొత్తిల్లు కట్టించిన ఘనత మాత్రం కాలిఫోర్నియాకు చెందిన యూట్యూబర్ బ్రెంట్ రివెరాకు మాత్రమే దక్కుతుంది. బ్రెంట్ కొంతకాలంగా చార్లీ అనే కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ కుక్క ఏడాది పుట్టిన రోజు మే 29న జరిగింది. ఈ సందర్భంగా బ్రెంట్ తన కుక్కకు విలాసవంతమైన కొత్త ఇంటిని బహూకరించాడు. దీని కోసం అతడికి 20 వేల డాలర్లకు (రూ.16.54 లక్షలు) పైగానే ఖర్చయింది. యూట్యూబ్‌లో బ్రెంట్ తన కుక్క ఇంటి వీడియోను పెడితే, ఏకంగా 7.9 మిలియన్వ్యూస్ వచ్చాయి. కుక్కగారి కొత్త ఇంట్లో చక్కని పడకతో పాటు టీవీ, ఫ్రిజ్ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం. -
హైదరాబాద్‌లో ఆ గృహాలకు మహా గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో విలాస గృహాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) 430 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో విక్రయాలు 50 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది రెట్లకు పైగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఈ వివరాలను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ విలాస నివాసాలు జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. మొత్తం 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1,600 యూనిట్లతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా నమోదయ్యాయి. అన్ని రకాల ఇళ్లు కలసి ఈ ఏడు పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో 78,700 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 70,500 యూనిట్లుగా ఉన్నాయి. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 600 యూనిట్లు ఉంటే, అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 1,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబైలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి. ► పుణెలో 10 రెట్లు అధికంగా 150 యూనిట్లు అమ్ముడుపోగా, బెంగళూరులో కేవలం 50 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 50 యూనిట్ల నుంచి 100కు పెరిగాయి. ► చెన్నై మార్కెట్లో విలాస నివాసాల అమ్మకాలు 250 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 50 యూనిట్లుగానే ఉన్నాయి. బలంగా సొంతిల్లు ఆకాంక్ష 2022లో ఖరీదైన ఇళ్ల విభాగం బలమైన పనితీరు చూపించగా, ఆ తర్వాత కూడా అదే విధమైన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగినట్టు సీబీఆర్ఈ తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత విలాస గృహాలకు డిమాండ్ ఎగిసింది. సొంతిల్లు కావాలని, విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారు పెరిగారు’’అని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. సొంతిల్లు కావాలనే ఆకాంక్ష ఈ ఏడాది కూడా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. వినియోగ ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, భద్రత, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందన్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందించే సోథెబీ ఎండీ అమిత్ గోయల్ స్పందిస్తూ.. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5–7 ఏళ్ల పాటు బేర్, బుల్ సైకిల్ ఉంటుందని చెబుతూ.. ప్రస్తుతం కచ్చితంగా బుల్ సైకిల్ అని పేర్కొన్నారు. -
ఇంద్రభవనం లాంటి సత్య నాదెళ్ల ఇల్లు.. చూసారా?
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి అగ్రరాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పగ్గాలు చేతపట్టుకుని భారతదేశానికి గొప్ప కీర్తి తెచ్చారు. గతంలో సత్య నాదెళ్ల జాబ్, ఆస్తులను గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు బెల్లేవ్‌లోని సత్య నాదెళ్ల ఇంటి గురించి తెలుసుకుందాం. 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో విఫలమై ఆ తరువాత 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్.. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA చేశారు. (ఇదీ చదవండి: బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?) మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ళ బెల్లేవ్‌లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో రెండు అంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్, పెద్ద అవుట్డోర్ డెక్, హాట్ టబ్‌తో సహా అనేక సౌకర్యాలు మాత్రమే కాకుండా వైన్ సెల్లార్ కూడా ఉంది. ఆధునికమైన, అధునాతన సదుపాయాలు కలిగిన ఈ విలాసవంతమైన ఇంట్లో పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు, అద్భుతమైన బెడ్రూమ్లు, పెరట్లో కొలను, గేమ్ రూమ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. మొత్తానికి సత్యనాదెళ్ళ ఇల్లు భూలక స్వర్గాన్ని తలపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. -
నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు అన్ని కోట్లా!
అక్కినేని నాగచైతన్య ఇటీవల కొత్త ఇల్లు కొన్న విషయం దాదాపు అందరికి తెలిసింది. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు కలిగిన ఈ ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నాగచైతన్య కొన్న కొత్త ఇల్లు ఖరీదు చాలామందికి ఇంకా ప్రశ్నర్థకంగానే మిగిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగ చైతన్య కొత్త ఇంటి ధర సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ ఇంటిని తన అభిరుచికి తగినట్లుగా, లగ్జరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. తన సన్నిహితులకు దగ్గరగా ఉండాలన్న కారణంగా కుటుంబీకులకు సమీపంలోని నిర్మించుకున్నాడు. (ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు) నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఇంట్లో ఉండేవారు. అయితే వారి విడాకుల తరువాత వారిద్దరూ ఆ ఇంటిని వదిలేసారు. కొన్ని నెలల పాటు తండ్రితోనే ఉన్న ఇతడు ఇటీవలే కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. నాగ చైతన్య వద్ద అత్యంత ఖరీదైన 'ఫెరారీ 488జీటీబీ' కారుతో పాటు బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ, నిస్సాన్ జిటి-ఆర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా MV అగస్టా, బీఎండబ్ల్యూ 9RT వంటి అరుదైన బైకులు ఉన్నాయి. -
Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించిన హీరోయిన్స్‌లో కీర్తి సురేశ్ ఒకరు. నేను శైలజ సినిమాతో మొదలై మహానటి సినిమాతో తరువాతి తరాలు కూడా గుర్తుపెట్టుకునేంత పాపులారిటీ సంపాదించిందామె. ప్రస్తుతం నాని సరసన దసరా మూవీలో నటించింది కీర్తి. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేశ్ ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 35 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే కీర్తి దసరా సినిమా కోసం ఏకంగా 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఉద్యోగుల పాలిట అమావాస్య.. విప్రో నుంచి 120 మంది అవుట్) కీర్తి సురేశ్ రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుక్కాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఉంది. కీర్తి సురేశ్ ఖరీదైన ఆస్తులలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో BMW X7 సిరీస్ ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లను కూడా కలిగి ఉంది. -
ఆ ఇళ్లపై ఇదేం పిచ్చి.. ఎన్ని కోట్లయినా కొనేస్తున్నారు!
విలాసవంతమైన ఇళ్లపై సంపన్నులకు మోజు తగ్గడం లేదు. ధర ఎన్ని కోట్లయినా కొనడానికి వెనకాడటం లేదు. అందుకే అత్యంత విలాసవంతమైన రెసిడెన్సియల్ ప్రాజెక్ట్‌లను కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి ఏర్పాటు చేస్తున్నాయి. ఇవీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి! గత నెలలో డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో 72 గంటల్లో రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంగతి మరవకముందే గోద్రెజ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో రూ.24,575 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే. గోద్రేజ్ సంస్థ ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో కొనుగోలుదారులను ఆహ్వానించి వారికి ప్రాజెక్ట్‌కు సంబంధించిన త్రీడీ మోడల్‌ను, వీడియోలను ప్రదర్శించింది. అందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూపించింది. వీటిలో వేడినీటి కొలను (హాట్ పూల్) వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 160 ఎంపిక చేసిన కస్టమర్లను ఈ ఫ్లాట్లను సందర్శించేందుకు ఆహ్వానించగా ఎనిమిది అంతస్తుల ప్రాజెక్ట్‌లో 46 ఫ్లాట్లలో 17 అమ్ముడుపోయాయి. తాము విలాసవంతమైన నివాసాలను మాత్రమే విక్రయించడం లేదని, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నామని గోద్రెజ్ సేల్స్ మేనేజర్ యువరాజ్ మంచందా పేర్కొన్నారు. తమ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లను మిలియనీర్లు, బిలియనీర్లు కొనుగోలు చేస్తారని చెప్పారు. కాగా గురుగ్రామ్‌లో గతనెల అమ్ముడైన ఫ్లాట్లకు సంబంధించిన పేపర్ వర్క్ ఇటీవలె పూర్తయింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ న్యూస్: ఇక మరింత ఫాస్ట్‌గా ఇంటర్నెట్! -
విలాస నివాసాల్లో ముంబై టాప్
న్యూఢిల్లీ: విలాసవంత ఇళ్ల ధరల వృద్ధిలో ముంబై స్థానం అంతర్జాతీయంగా మరింత మెరుగుపడింది. ప్రపంచవ్యాప్త జాబితాలో 92వ స్థానం నుంచి (2021లో) ఏకంగా 37కు చేరుకుంది. 2022 సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. ఫలితంగా ముంబై 37వ ర్యాంక్‌కు చేరుకున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అంతేకాదు ముంబై ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్‌గా 18వ స్థానంలో నిలిచింది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ని నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిని ట్రాక్ చేసే ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పిరి100) 2022లో 5.2 శాతమే పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఈ సూచీ కంటే ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు ఎక్కువ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 పట్టణాల్లోని విలాసవంతమైన ఇళ్ల ధరలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ముంబైలో ప్రధాన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు 3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. బెంగళూరులో విలాసవంతమైన ఇళ్ల ధరలు గతేడాది 3 శాతం పెరగడంతో, 2022లో ప్రపంచవ్యాప్తంగా 63వ ర్యాంక్ దక్కించుకుంది. ఢిల్లీలో ఖరీదైన ఇళ్ల ధరలు 1.2 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఢిల్లీ 77వ స్థానంలో ఉంది. 2021లో 93వ ర్యాంకులో ఉండడం గమనించాలి. దుబాయి చిరునామా.. దుబాయిలో అత్యధికంగా ఖరీదైన ఇళ్ల ధరలు 20 22లో 44.2% పెరిగాయి. నైట్ ఫ్రాంక్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కేంద్రంగా దుబాయి నిలిచింది. ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధి పరంగా రియాద్, టోక్యో, మియా మి, ప్రాగ్యూ, అల్గర్వే, బహమాస్, అథెన్స్, పోర్టో 2వ స్థానం నుంచి వరుసగా జాబితాలో ఉన్నాయి. -
Hyderabad: ఫ్లోర్‌కో ఫ్లాట్.. ఆ ఇళ్లకు భారీ డిమాండ్.. హాట్‌కేకుల్లా..
బతికుంటే బలుసాకు తిని అయినా గడపొచ్చు అన్నంతగా భయపెట్టిన కరోనా.. ఎంతకాలం బతుకుతామోగానీ రాజాలా బతకాలనే ఆలోచనను కూడా తెచ్చిపెట్టింది. విలాసం ఉన్నదే నివాసం అన్న భావన కనిపిస్తోంది. అందుబాటు గృహాలకు డిమాండ్ ఎప్పుడూ ఉండేదే. కానీ ఆకాశాన్నంటే ధరల్లోని విశాలమైన, విలాసమైన గృహాలకూ ఫుల్ డిమాండ్ ఉండటం ఇప్పటి ట్రెండ్ సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. లగ్జరీ గృహాల కొనుగోళ్లకు ఎన్నారైలు, ధనవంతులు ఆసక్తి చూపుతుండటంతో హైదరాబాద్‌లో ఈ కేటగిరీకి చెందిన ఇళ్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కరోనా నేర్పిన పాఠాలతో ఇంద్ర భవనం లాంటి ఇళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం ఒక కారణమైతే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటం, యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతలు మరో కారణంగా నిలుస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెంచింది. ఫ్లోర్‌కో ఫ్లాట్.. కరోనా తర్వాత అపార్ట్మెంట్ల విస్తీర్ణం పెరిగింది. కొనుగోలుదారులు పెద్ద సైజు నివాసాలను కోరుకుంటున్నారు. ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల కోసం స్థలం, అనారోగ్యం పాలైతే హోం ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా గది.. ఇలా పక్కా ప్లానింగ్‌తో ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. డెవలపర్లు కూడా ఆ తరహా ఇళ్లనే నిర్మిస్తున్నారు. కరోనా కంటే ముందు 2,500 చదరపు అడుగుల నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్నవాటిని లగ్జరీ ఫ్లాట్లుగా భావించేవారు. కరోనా తర్వాత వీటి ప్రారంభ విస్తీర్ణమే కనీసం 3 వేల చదరపు అడుగులకుపైగా ఉంటోంది. డీఎస్ఆర్, పౌలోమి వంటి కొన్ని నిర్మాణ సంస్థలైతే ఏకంగా అంతస్తుకు ఒకటే ఫ్లాట్ ఉండేలా నిర్మిస్తున్నాయి. ఎన్నారైలు, హెచ్‌ఎన్‌ఐలదే జోరు.. లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రవాసులు, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ). డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వీరికి బాగా కలిసి వస్తోంది. బంగారం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులతో పోలిస్తే స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చేది రియల్ ఎస్టేటే కావటంతో.. ఇళ్ల కొనుగోలుకు ఎన్నారైలు, హెచ్ఎన్ఐలు ఆసక్తిని కనబరుస్తున్నారని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఇదే సమయంలో కరోనా కాలంలో విదేశాలలో ఎదురైన ఇబ్బందులు, అనిశ్చితిలను ప్రవాసులు మర్చిపోలేదని.. ప్రతికూల వాతావరణంలో విదేశాల్లో నివసించడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వారిలో ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కనీసం ఒక్క సొంతిల్లు అయినా ఏర్పర్చుకోవడం ఎన్నారైలకు ప్రాధాన్యతగా మారిపోయిందని వివరించారు. యూరప్, అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ, ఆరి్ధక అనిశ్చితి నేపథ్యంలో ఇండియాలో పెట్టుబడులే సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. దీంతో ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని ప్రాపరీ్టలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. ► పుప్పాలగూడలో డీఎస్ఆర్ ఎస్ఎస్ఐ ట్విన్స్ ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్ 16 వేల చదరపు అడుగులు ఉంటుంది. ►కోకాపేటలో పౌలోమి ఎస్టేట్స్ పలాజో ప్రాజెక్ట్‌లో 6,225–8,100 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్లున్నాయి. ►ఖానామెట్‌లో మంజీరా కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ట్రంప్ టవర్స్‌లో 3 వేలు– 6 వేల చదరపు అడుగుల మధ్య ఫ్లాట్లున్నాయి. ►రాయదుర్గంలోని రాఘవ ఐరిస్ ప్రాజెక్ట్‌లో 5,425– 6,605 చదరపు అడుగులమధ్య 4, 6 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ►ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఎటెర్నా ప్రాజెక్ట్‌లో రాజపుష్ప 2,360–4,340 చ.అడుగుల మధ్య 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. కోవిడ్‌కు ముందు.. తర్వాత.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (హెచ్1) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1.84 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. అందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే. అదే కోవిడ్ కంటే ముందు 2019 ఏడాదిని చూస్తే.. మొత్తంగా విక్రయమైన 2.61 లక్షల యూనిట్లలో కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలు ఉండటం గమనార్హం. ఇటీవలికాలంలో డెవలపర్లు కూడా ప్రాజెక్టుల లాంచింగ్‌లో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 28వేల లగ్జరీ గృహాలను లాంచ్ చేశారు. అత్యధికంగా ముంబైలో.. 2022 తొలి అర్ధభాగంలో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. అక్కడ 13,670 యూనిట్లు విక్రయమయ్యాయి. ఆ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో 4,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ రెండు చోట్ల కలిపి 11,890 విలాసమైన ఇళ్లు అమ్ముడవగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 17,830 యూనిట్లు విక్రయించడం గమనార్హం. 2019 నాటితో పోలిస్తే.. 2022 తొలి ఆరు నెలల కాలంలో ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం నుంచి 25 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 11,730 లగ్జరీ గృహాలు అమ్మకానికి ఉండగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 2,420 యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌పై 22% ఎన్నారైల ఆసక్తి స్థిరాస్తి రంగంలో ప్రవాసుల పెట్టుబడులు పెరుగుతున్నాయి. కరోనా కంటే ముందు 55 శాతం మంది ఎన్నారైలు దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉండగా.. ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరప్, గల్ఫ్ దేశాల్లోని సుమారు 5,500 మంది ప్రవాసులతో ఈ సర్వే నిర్వహించారు. అందులో 60శాతం మంది ఎన్నారైలు ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్‌లలో గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తేలింది. అత్యధికంగా 22 శాతం మంది ప్రవాసులు హైదరాబాద్‌లోని ప్రాపర్టీలకు మొగ్గు చూపిస్తుండగా.. 20శాతం మంది ఎన్సీఆర్, 18 శాతం మంది బెంగళూరులోని నివాసాల కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారని సర్వే తేల్చింది. -
హైదరాబాద్ లగ్జరీ జోష్.. దేశంలో రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధరల రియల్టీ మార్కెట్‌గా ఉన్న హైదరాబాద్ లగ్జరీ విపణిగా అభివృద్ధి చెందింది. కరోనా కంటే ముందు వరకూ దేశంలో అఫర్డబులిటీ మార్కెట్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచేది. కానీ, ఇప్పుడు దేశంలోని అత్యంత లగ్జరీ స్థిరాస్తి విపణిలో ముంబై తర్వాత భాగ్యనగరం రెండో స్థానానికి ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే మనదే తొలిస్థానం. ∙ గృహ కొనుగోలుదారుల సగటు ఆదాయం, నెలవారీ ఈఎంఐ చెల్లింపు నిష్పత్తి ఆధారంగా నైట్‌ఫ్రాంక్ కొనుగోలు సూచీని అంచనా వేసింది. దీని ప్రకారం.. 2010లో హైదరాబాద్‌లో ఆదాయంలో 53% ఈఎంఐ కోసం వెచ్చించేవారు. ఆ తర్వాత 2014లో 42%, 2019లో 33%, 2020లో 28%గా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ, కరోనా తర్వాత వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈఎంఐ భారం కూడా పెరిగింది. ఫలితంగా 2021లో ఆదాయంలో ఈఎంఐ వాటా 29%, 2022 నాటికి 31 శాతానికి వెచ్చించాల్సి వస్తోంది. ముంబైలో 2010లో ఆదాయంలో 93 శాతంగా ఈఎంఐగా చెల్లిస్తే సరిపోయేది. 2022 నాటికి 53 శాతానికి తగ్గింది. 22 % ఈఐఎం నిష్పత్తితో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలవగా.. 26%తో పుణే రెండో స్థానంలో, 27%తో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. తగ్గిన కొనుగోలు శక్తి.: ఏడాది క్రితం 7.30 శాతంగా ఉన్న గృహ రుణ వడ్డీ రేట్లు ఏడాది కాలంలోనే 0.95% మేర పెరిగి 8.25కి చేరింది. దీంతో గృహ కొనుగోలు నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘అఫర్డబులిటీ ఇండెక్స్ క్యూ3–2022’ నివేదిక వెల్లడించింది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా స్థిరాస్తి కొనుగోళ్ల శక్తి సగటున 2% క్షీణించడంతో పాటూ ఈఎంఐలపై 7.4% అదనపు భారం పడుతుందని వివరించింది. చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా.. -
లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్లున్నా.. సొంతిల్లు లేకపోతే సంతృప్తిగా ఉండలేరు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కోవిడ్-19 కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. శాలరీ కటింగ్‌లు, నిరుద్యోగం పట్టి పీడించింది. దీంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు అడి అశలయ్యాయి. అయితే లగ్జరీ ఇళ్ల విషయంలో అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయులు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ గ్రూప్ లగ్జరీ ఇళ్ల విక్రయాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..హెచ్1 (ఫస్ట్ ఆఫ్ కేలండర్ ఇయర్) జనవరి - మార్చి 2022లో మొత్తం ఏడు నగరాల్లో 1.84లక్షల యూనిట్లను అమ్మగా..అందులో 14శాతం లగ్జరీ ఇళ్లే ఉన్నాయని హైలెట్ చేసింది. దీనికి విరుద్ధంగా, 2019 మొత్తంలో విక్రయించిన 2.61 లక్షల యూనిట్లలో కేవలం 7 శాతం మాత్రమే లగ్జరీ కేటగిరీలో ఉన్నాయి”అని అనరాక్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ ధరలో (రూ.40 లక్షల లోపు ధర కలిగిన యూనిట్లు)ఉన్న ఇళ్ల అమ్మకాల వాటా 2019లో 38 శాతం నుండి ఈఏడాది జనవరి-మార్చి సమయానికి 31 శాతానికి పడిపోయాయి. కోవిడ్-19 పరిస్థితులు అదుపులోకి రావడంతో ఇళ్లను కొనుగోలు చేయాలని భావించినా.. అందుకు ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదని తెలుస్తోంది. “ఇక లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకోవాలని కొనుగోలు దారులపై మహమ్మారి ప్రభావం చూపింది. అయినప్పటికి వారికి వచ్చే అధిక ఆదాయం లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు దోహద పడినట్లు అనరాక్ నివేదిక తెలిపింది. డెవలపర్ల తగ్గింపులతో కొనుగోలుదారులకు లగ్జరీ ఇళ్లపై మక్కువ పెరిగింది. దేశంలో అనుకూల పరిస్థితుల కారణంగా ఎన్ఆర్ఐలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు”అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు. చదవండి👉 రీసేల్ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే! -
లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్‌పురి వెల్లడించారు. వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం ‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు. పట్టణాల వారీగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్‌లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐల ఆసక్తి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది. -
లగ్జరీ హోమ్స్‌కే డిమాండ్ ఎక్కువ: 3 బీహెచ్‌కే సేల్స్ జూమ్
సాక్షి, హైదరాబాద్: కరోనా గృహ కొనుగోలుదారుల అభిరుచిని మార్చేసింది. ప్రపంచ జీవన శైలి, జీవన ప్రమాణాలపై అవగాహన, ఆదాయం పెరిగాయి. దీంతో కోవిడ్ తర్వాత గృహ ఎంపికలో మార్పులు వచ్చాయి. గతంలో గృహ కొనుగోళ్లలో బడ్జెట్ మీద దృష్టి పెట్టిన కొనుగోలుదారులు.. కరోనా తర్వాతి నుంచి విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఇళ్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ► గత ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గృహ కొనుగోలుదారుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే సరసమైన ఇళ్ల కంటే రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్య తరహా గృహాలు, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ఆధునిక గృహాల కొనుగోళ్లకే కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దాదాపు 80 శాతం మంది కస్టమర్లు మధ్య తరహా, ఆధునిక గృహాలపై ఆసక్తిని కనబర్చగా.. కేవలం 10 శాతమే అందుబాటు గృహాల వైపు ఆసక్తిగా ఉన్నారు. ► గృహ కొనుగోళ్లలో సర్వీస్ క్లాస్ కొనుగోలుదారులదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికీ పెద్ద సైజు గృహాలకే డిమాండ్ ఎక్కువగా ఉందని అనరాక్ డేటా వెల్లడించింది. గృహ విక్రయాలలో మిడ్ టు హై ఎండ్ విభాగం యూనిట్లకే ఎక్కువ గిరాకీ ఉంది. మొత్తం విక్రయాలలో ఈ విభాగం వాటా 79 శాతంగా ఉంది. 2 బీహెచ్‌కే యూనిట్లకు 38 శాతం, 3 బీహెచ్కేకు 26 శాతం వాటా ఉన్నాయి. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు.. హైదరాబాద్‌లో రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ గృహాలకు 17 శాతం, అల్ట్రా లగ్జరీ గృహాలకు 8 శాతం డిమాండ్ ఉంది. చెన్నై, పుణే నగరాలలో మధ్య తరహా, లగ్జరీ గృహాలకు డిమాండ్ ఉంది. ఆయా నగరాలలో మిడ్ సైజ్ యూనిట్లకు 60 శాతం, హై ఎండ్ ఇళ్లకు 59 శాతం గిరాకీ ఉంది. బెంగళూరులో దాదాపు 56 శాతం డిమాండ్ హై ఎండ్ గృహాలకే డిమాండ్ ఉంది. ప్రధాన నగరాలలో 2, 3 బీహెచ్‌కే యూనిట్ల విక్రయాలు 64 శాతంగా ఉన్నాయి. చెన్నైలో 2 బీహెచ్‌కే గృహాలకు అత్యంత ప్రజాదరణ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 67 శాతం విక్రయాలు 2 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి. బెంగళూరులో 3 బీహెచ్‌కే విక్రయాల వాటా 49 శాతంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 44 శాతం విక్రయాలు 3 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి. ► రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాల కొనుగోళ్లకు 10 శాతం ► రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే ఇళ్ల కొనుగోళ్లకు 42 శాతం ► రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలపై 37 శాతం ► రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లపై 5 శాతం ► రూ.2–5 కోట్ల ధర ఉండే యూనిట్లపై 5 శాతం ► రూ.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాల కొనుగోళ్లకు 1 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు. -
ఇటు ఢమాల్!
నానక్‌రామ్‌గూడలో ఐదెకరాల్లో ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నాం. 800కు పైగా యూనిట్లు. ధర చదరపు అడుగుకు రూ. 8 వేలు. ప్రాజెక్టుకు పునాదిరాయి పడటం.. నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ప్రతి నెలా 70–80 యూనిట్లు అమ్ముడుపోయేవి. 111 జీవో ఎత్తివేత ప్రకటనతో అమ్మకాలు తగ్గిపోయాయి. కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరుకోవట్లేదు... ఇదీ ఓ లగ్జరీ ప్రాజెక్టు డెవలపర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ స్థిరాస్తి రంగంపై జీవో 111 రద్దు ప్రభావం బాగా పడింది. ముఖ్యంగా నగర రియల్టీకి ఆయువు పట్టువైన పశ్చిమ హైదరాబాద్‌పై దీనిప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని లగ్జరీ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చదరపు అడుగు రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు కస్టమర్లు వెనకాడుతున్నారు. ధరలు తగ్గుతాయేమోనని ఆలోచిస్తున్నారు. ఎక్కువ ధరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనే బదులు అదే ధరకు 84 గ్రామాల పరిధిలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనొచ్చని అనుకుంటున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హై రైజ్, లగ్జరీ ప్రాజెక్టుల్లో విక్రయాలు పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయమూ బాగా తగ్గింది. పశ్చిమంలో 50 వేల యూనిట్లు ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల వల్ల పశ్చిమ హైదరాబాద్‌లో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగర రియల్టీలో ఈ ప్రాంతం వాటా 60 శాతం. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల చద రపు అడుగుల్లో నివాస సముదాయాలు నిర్మాణం లో ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో పరిధిలో లేకపోవడంతో కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతాల్లో గతేడాది జీహెచ్ఎంసీ 83 హై రైజ్ భవనాలకు అనుమతిచ్చింది. ఇందులో 13 ఆకాశహర్మ్యాలు 30 అంతస్తుల కంటే ఎత్తయినవి. అయితే తాజాగా జీవోను ఎత్తేయడంతో అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రీలాంచ్ ఒప్పందాలు రద్దు గతంలో కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో చాలా వరకు నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్లో భారీగా అమ్మకాలు జరిపేవి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులూ మొగ్గు చూపేవారు. 111 జీవో రద్దుతో వీరంతా ఆయా నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒప్పందం రద్దు చేసుకొని కట్టిన డబ్బులు ఇవ్వాలని డెవలపర్లను కోరుతున్నారు. -
లగ్జరీ గృహాలకు ఫుల్ డిమాండ్! కారణాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారితో జీవన శైలిలో నవీకరణ సంతరించుకుంది. మరోవైపు హైబ్రిడ్ పని విధానం, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంటిని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో విలాసవంతమైన గృహాలు జోరందుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎక్కువ మంది హెచ్ఎన్ఐలు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇండియా సోథెబీస్ ఇండియా ఇంటర్నేషనల్ రియల్టీ సర్వే వెల్లడించింది. 8 నగరాల్లో సర్వే ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, గోవాలలో విలాసవంతమైన గృహ కొనుగోలుదారుల స్థితిని అంచనా వేసేందుకు సోథెబీస్ సర్వే నిర్వహించింది. టాప్–8 నగరాల్లో 200 మందికి పైగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హెచ్ఎన్ఐలతో సర్వే చేసింది. ధరల వృద్ధి ప్రారంభ దశలోనే.. 76 శాతం మంది హెచ్ఎన్ఐలు ఈ ఏడాది ప్రాపర్టీ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 89 శాతం లగ్జరీ నివాస సముదాయం కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 11 శాతం మంది వాణిజ్య ప్రాపర్టీలకు ప్రణాళిక చేస్తున్నారు. 46 శాతం మంది ఈ ఏడాది రెండో ప్రాపర్టీ కొనుగోలు చేయనున్నారు. హెచ్ఎన్ఐలలో 31 శాతం మంది గత 18 నెలల్లో రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబడి సాధనంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది లగ్జరీ గృహాల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరల వృద్ధి ప్రారంభ దశలోనే ఉన్నాయి. సమాచారం కోసం ఏజెంట్లే కీలకం.. హైబ్రిడ్ పని విధానం, ఆన్లైన్ క్లాస్‌లు కొనసాగుతుండటంతో చాలా మంది ఇంటిని అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న హెచ్‌ఎన్‌ఐలో సగం మంది హైబ్రిడ్ పని విధానానికి మొగ్గు చూపించగా.. 28 శాతం మంది ఆఫీస్‌లకు తిరిగి వెళ్లేందుకే ఆసక్తి కనబరిచారు. 15 శాతం మంది పూర్తిగా ఇంటి నుంచి పనికే ఇష్టం వ్యక్తం చేశారు. హెచ్ఎన్ఐలకు ప్రాపర్టీల సమాచార సేకరణలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రధానం కాగా.. కొనుగోలు నిర్ణయంలో మాత్రం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారమే ప్రధాన వనరుగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. లగ్జరీ కావాలి ఈ ఏడాది 67 శాతం హెచ్ఎన్ఐలు లగ్జరీ గృహాల కోసం, 29 శాతం యూహెచ్‌ఎన్‌ఐలు హాలిడే హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.10–25 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ సిటీ అపార్ట్మెంట్లు, రూ.5–10 కోట్ల ధర ఉండే వెకేషన్ హోమ్స్ కొనుగోలుకు ఆసక్తిని కనబరిచారు. సర్వేలో పాల్గొన్న హెచ్ఎన్ఐలలో 34 శాతం మంది ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబైలతో పాటూ అభివృద్ధి చెందుతున్న నగరాలలో సిటీ అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపించగా.. 29 శాతం మంది గోవా వంటి వెకేషన్ డెస్టినేషన్ ప్రాంతాలలో హాలీడే హోమ్ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. వెకేషన్ హోమ్స్ కోసం 71 శాతం మంది రూ.5–10 కోట్లు, 29 శాతం మంది రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సోథెబీస్ ఇండియా ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈఓ అమిత్ గోయల్ తెలిపారు. చదవండి: ఇకనైనా మేల్కోండి.. లేకపోతే ప్రతికూలతే! -
షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?
నేల మీద ఉండీ ఉండీ బోర్ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్ న్యూస్! సముద్రంలో ఉండటమే కాదు. బోర్ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ రూ. 2.7 కోట్ల నుంచి మొదలు ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్ కంపెనీ ‘ఎంవీ నరేటివ్’పేరుతో లగ్జరీ క్రూయిజ్ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. (చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!) ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. ప్రతి అపార్ట్మెంట్లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేలా 24 గంటల హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్ సిములేటర్, డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. షిప్లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా. (చదవండి: వారిని విడుదల చేయండి!) -
ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఇళ్ల విభాగం కళకళలాడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఈ విభాగంపై పెద్దగా పడలేదు. రూ.5 కోట్లకు పైగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (ధనవంతులు/హెచ్ఎన్ఐలు) 75 శాతం మంది చెప్పారు. వచ్చే రెండేళ్లలో పెద్ద పట్టణాలు, హాలిడే ప్రదేశాల్లో వీరు ఇళ్లను కొనాలనుకుంటున్నారు. లగ్జరీ హౌసింగ్ అవుట్‌లుక్ 2022 పేరుతో లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణలపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్ల పట్ల (సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్) ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. బుల్లిష్ ధోరణి..: ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్టు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. గత రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని సోథెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సంప్రదాయ ధరల పెరుగుదల క్రమంలో ఉన్నట్టు చెప్పారు. హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారు. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా ఫర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్టు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. -
ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు
మమతలు పంచే ఊరు.. ఏమిటి దానికి పేరు.. పల్లెటూరేగా ఇంకేవూరు.. ప్రేమలు పుట్టిన ఊరు.. అనురాగానికి పేరు.. కాదనేవాళ్లే లేరు..‘శతమానం భవతి’ సినిమాలోని ఈ పాట.. ఉన్న ఊరిపై మమకారాన్ని.. అయినవాళ్ల అనురాగాన్ని తట్టి లేపుతుంది. అలాంటి సొంతూరులో మమతల కోవెల మాదిరిగా అభిరుచులకు అనుగుణంగా ఓ ఇల్లు కట్టుకుని అందులో జీవిస్తుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందుకే కొందరు తాము పుట్టి పెరిగిన పల్లెటూర్లలోనే అధునాతన ఇళ్లను కట్టుకుంటున్నారు. ఆధునిక వసతులూ సమకూర్చుకుంటున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు నిర్మించకుంటున్నారు. ఈ తరహా ట్రెండ్ మన గోదారి పల్లెల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. బిక్కవోలు: బలభద్రపురంలోని కొవ్వూరి సతీష్‌రెడ్డి నివాసం చూస్తే ఇది ఇంద్రభవనమే అనిపిస్తుంది. సమీపాన ఏ పట్టణ ప్రాంతంలోనో కాకుండా పుట్టి పెరిగిన ఊర్లో కళ్లు చెదిరేలా ఓ చక్కటి భవనాన్ని నిర్మించుకున్నారు. ఏడాదిన్నర కిత్రం భారీగా వెచ్చించి నిర్మించిన ఈ భవనం చూసి అబ్బురపడాల్సిందే. చుట్టుపక్కల చక్కటి పచ్చదనం ఉండేలా జాగ్రత్తగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఇంటికి ఎదురుగా పంచాయతీ చెరువు ఉండడంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఆయన నిర్మించిన భవనాన్ని చూడటానికి చుట్టు్టపక్కల గ్రామాల నుంచి స్నేహితులు, బంధువులు తెలిసిన వారు తరచూ వస్తుంటారు. దీంతో ఆ ఇల్లు సందడిగా ఉంటోంది. విలాసవంతంగా కనిపించే ఈ ఇల్లు వల్ల తమ ఊరికే ఓ ప్రత్యేకత వచ్చిందంటారు ఆ గ్రామస్తులు. ‘ఎంత సంపాదించాను కాదు ఎంత మంది అభిమానాన్ని పొందాం’అనే ఉద్దేశంతోనే ఈ భవనాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అమ్మనాన్నకు ప్రేమతో... తాళ్లరేవు: పల్లెలో పుట్టి నాలుగు డబ్బులు సంపాదించి ఎక్కువ మంది నగరాల్లోనే స్థిరపడిపోతున్నారు. పల్లెతో అనుబంధం తెంచుకుని బిడ్డతోనే అయిష్టంగా తల్లిదండ్రులూ ఆ నగరవాసానికే అలవాటుపడిపోతున్నారు. ఉన్న ఊరిలో పలకరింపులకు.. అయినవారి అనుబంధాలకు దీనివల్ల పండుటాకులు దూరమవుతున్నారు. తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన కనుమూరి శ్రీనివాసరాజు ఈ కోణం నుంచే ఆలోచించారు. తాను హైదరాబాద్‌లో బాగా స్థిరపడినా సొంతూరులో ఉంటామన్న తల్లిదండ్రుల ఆశలను ఘనంగా సాకారం చేశారు. ఇంద్రభవనాన్ని తలపించేలా మూడంతస్తుల ఇంటిని నిర్మించి అమ్మానాన్నలకు కానుకగా ఇచ్చారు. పెద్ద నగరాల్లో సంపన్న కాలనీల్లో ఇలాంటి ఇల్లు కనిపిస్తే గొప్ప విషయం కాదు. కుగ్రామంలోనే రూ.కోట్లు వెచ్చించి అమ్మానాన్నలపై అపారమైన ప్రేమను చాటుకున్నారు. దీని నిర్మాణానికి అధునాతన విదేశీ సామగ్రి వినియోగించడం విశేషం. శ్రీనివాసరాజు చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో అవకాశాలను అందిపుచ్చుకుని రాణించారు. ఇదో మమతల కోవెల... అమలాపురం టౌన్: పిల్లల చదువుల పేరుతో పుట్టి పెరిగిన ఊళ్లను వదిలేసి పట్టణాల్లో కొందరు కాపురాలు ఉంటున్నారు. ఊళ్లో వ్యవసాయాలు చేస్తూ... నివాసాలు పట్టణాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటిది కోనసీమలో కొందరు కన్న ఊళ్లోనే.. ఉన్న చోటే మనకు ప్రకృతి అందించిన వరి చేలు.. కొబ్బరి తోటల మధ్య ఇల్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన త్సవటపల్లి శ్రీనివాసరావు పట్నం వైపు చూడకుండా ఉన్న ఊళ్లోనే సొంత కొబ్బరి తోటల నడుమ ఓ చూడముచ్చటైన ఇల్లు కట్టుకున్నారు. అధునాతన సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇది మమతల కోవెల అంటారాయన. నగరాలు, పట్టణాలకు వెళ్లి అధునాతనంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత ఉన్నా కన్న ఊరిపై ఆయనకున్న మమకారం అలాంటిది. తన అభిరు చులకు అనుగుణంగా అందమైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. -
లగ్జరీ గృహాలకు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో నెలన్నర కాలంగా దేశంలో లగ్జరీ గృహాలకు డిమాండ్ తగ్గింది. గతేడాది లాగా పరిస్థితులు కొంత వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత విక్రయాలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత సప్లయి కారణంగా కొన్ని ప్రాంతాలలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు కొంత పెరుగుతాయని, మిగిలిన ప్రాంతాలలో స్థిరంగా ఉంటాయని తెలిపారు. ‘ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో మా నివాస ప్రాజెక్ట్‌లన్నీ వేగంగా, మంచి ధరల పనితీరును కనబరిచాయని’ హైన్స్ ఇండియా ఎండీ అండ్ కంట్రీ హెడ్ అమిత్ దివాన్ తెలిపారు. గృహ కొనుగోలుదారులు పేరున్న డెవలపర్ల నుంచి నాణ్యమైన గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 తొలి దశ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లగ్జరీ, విశాలమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈఓ అమిత్ గోయల్ చెప్పారు. గతేడాది పెట్టుబడి విభాగంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని, లగ్జరీ హౌసింగ్‌లో భారతీయులతో పాటు ప్రవాసులు కూడా విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారని ఎంబసీ గ్రూప్ రెసిడెన్షియల్ బిజినెస్ ప్రెసిడెంట్ రీజా సెబాస్టియన్ తెలిపారు. దేశంలో గత రెండేళ్లుగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే లగ్జరీ ప్రాపర్టీల ప్రారంభాలు లేవని.. నిరంతర డిమాండ్‌తో ధరల స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. లగ్జరీ గృహ కస్టమర్లు బ్రాండెడ్ డెవలపర్లు, రెడీ–టు–మూవ్ ప్రాజెక్ట్‌లకు, నాణ్యమైన గృహాలకు మాత్రమే ఇష్టపడతారని తెలిపారు. లగ్జరీ గృహాల కోసం హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు ఆసక్తిని కనబరస్తుండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు నిరంతరం వృద్ధి నమోదవుతుందని చెప్పారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రవర్తన, త్వరితగతిన ప్రజలకు టీకాలు అనే అంశాల మీద ఆధారపడి రియల్టీ రంగం ఉంటుందని ప్రాప్‌టైగర్.కామ్ సీఓఓ మణి రంగరాజన్ అభిప్రాయపడ్డారు. అయితే ఆయా అంశాల మీద భయాలు ఉన్నప్పటికీ.. గత ఏడాది మాదిరిగా మార్కెట్ ప్రతికూలంలో ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలలో కోవిడ్ నియంత్రణలోకి వస్తే గనక డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. -
బెంగళూరు వైపు ఎన్నారైల చూపు.. ఎందుకంటే..
సాక్షి, బెంగళూరు: నివాస యోగ్యమైన బెంగళూరు నగరం వైపు ఎన్నారై (ప్రవాస భారతీయులు) చూపు మళ్లింది. నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విలావవంతంగా ఉండే ఇళ్లంటే ప్రవాసులు మక్కువ చూపుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు, మూడు లేదా నాలుగు పడకల ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలుకు పోటీ నెలకొంది. వేసవి కాలంలోనూ చల్లగా ఉంటుందని పేరుండడంతో ఉద్యాననగరికి క్యూ పెరుగుతోందని పలు రియాల్టీ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. దేశానికి వస్తున్న ఎన్నారైలలో అత్యధికమంది బెంగళూరులోనే నివాసానికి మొగ్గు చూపుతున్నారట. వసతులే ముఖ్యం సుమారు 17 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేసి తిరిగి స్వదేశానికి తిరిగొచ్చే వారిని ఎన్నారైలుగా పిలుస్తారు. అయితే వారు సొంతూరి కంటే అధిక వసతులు కూడిన సిలికాన్ సిటీలో స్థిర నివాసానికి సరే అంటున్నట్లు తెలుస్తోంది. తాము ఉండడానికి 3 – 4 పడకల గదుల ఇళ్లను, బాడుగలకు ఇచ్చి ఆదాయం పొందడానికి డబుల్‌బెడ్ రూం ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. రెండో స్థానంలో పూణె బెంగళూరు తర్వాత నివాసానికి ప్రవాసాలు పూణెను ఎంచుకున్నారు. రూపాయి విలువ క్రమక్రమంగా తగ్గిపోతున్న కారణంగా డాలర్లకు, పౌండ్లకు ఎక్కువ రూపాయలు వస్తున్నాయి. దీంతో ఎన్నారైలు భారత్‌లో ఆస్తులు కొనడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నారైలలో 73 శాతం మంది సగటున రూ.2.5 కోట్లతో ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయి. కరోనాకు ముందు ఇది 41 శాతంగా ఉండేది. బెంగళూరులో ఎక్కడెక్కడ సర్జాపుర రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట రోడ్డు, వైట్ ఫీల్డ్, నెలమంగల, కనకపుర రోడ్డు, మైసూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా కట్టిన ఇళ్లంటేనే ఓకే అంటున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్ కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్ -
లగ్జరీగా ఇళ్ల అద్దెలు.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో లగ్జరీ ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కోవిడ్ కలకలం నేపథ్యంలో వందలాది ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో.. భారీగా వేతనాలు అందుకుంటున్న ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాలకు చెందిన ఉన్నతోద్యోగులు, టీమ్‌లీడర్లు, సీఈఓలు, కార్పొరేట్లు లగ్జరీ ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వీరిలో ఇప్పటికే చాలా మంది భారీగా అద్దెలు చెల్లించి విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడించింది. ఈప్రాంతంలో 2014తో పోలిస్తే ప్రస్తుతం అద్దెల విషయంలో సుమారు 26 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇక లగ్జరీ ఇళ్ల సెగ్మెంట్లో భారీగా అద్దెలు వసూలు చేస్తున్న నగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ తరవాత స్థానంలో నిలిచిన బెంగళూరులో 24 శాతం..ఆతరవాత నిలిచిన చెన్నై, కోల్‌కతా నగరాల్లో 19 శాతం అద్దెల్లో పెరుగుదల నమోదైనట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అద్దెల భూమ్‌కు కారణాలివే.. ► కోవిడ్ కలకలకం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు పరిమితమవడం. ►ఇల్లునే ఆఫీసుగా మార్చుకునేందుకు పలువురు లగ్జరీ ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిచూపడంతోపాటు..ఇంట్లో సువిశాల ప్రాంగణాన్ని ఆఫీసు కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ► నగరంలో ఐటీ కారిడార్ కాస్మొపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్‌గా నిలవడంతోపాటు విద్య,వైద్య,మౌలికవసతులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈప్రాంతంలో అద్దెకుండేందుకు ఇష్టపడడం. ► బహుళజాతి కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఐటీ కారిడార్ చిరునామాగా మారడం. సమీప భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలుండడం. ► పలు ఐటీ, బీపీఓ, కెపిఓ సంస్థలు తమ సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులకు లగ్జరీ ఇళ్లలో వసతి సదుపాయం ఏర్పాటుచేయడం. మెట్రోనగరం ప్రాంతం ఇళ్ల అద్దెల్లో పెరుగుదల శాతం హైదరాబాద్ ఐటీకారిడార్ 26 బెంగళూరు జేపినగర్ 24 చెన్నై కొట్టుపురం 19 కోల్‌కతా అలీపూర్ 19 -
నెలకు ఈ ఇంటి అద్దెంతో తెలుసా!
హాంగ్‌కాంగ్: సాధారణంగా ఓ ఇంటి అద్దె వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ దక్షిణ చైనాలో హాంగ్‌కాంగ్‌లోని ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే అందరూ కళ్లు తేలేయాల్సిందే. నెలకు ఈ ఇంటి అద్దె 1.26 కోట్ల రూపాయలు. ఇది వింటే ఇది అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అందరికి డౌట్ రావోచ్చు. కానీ ఇది అక్షరాల అద్దె. ఎందుకంటే అదే రేంజ్లో ఈ ఇంటిలో స్టార్ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయట. చూడటానికి ప్యాలేస్‌ను తలపిస్తున్న ఈ ఇళ్లు మొత్తం 10, 804 అడుగుల విస్తిర్ణంలో... విలాసవంతమైన గదులు, రకారకాల పూలతో కూడిన తోటతో నిర్మించారట. ఇక లోపల ఓ ప్రైవేటు గ్యారేజ్, అధునాతమైన సాంకేతికతతో తయారు చేయించిన లిఫ్టులు ఉన్నాయట. ఇక ఈ భవనం నుంచి బయటకు చూస్తే విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఈ ఇంటికి హాంగ్‌కాంగ్‌లో అన్నిటికంటే అధిక రెంటు ఉన్నట్లు నైట్ ప్రాంక్ ఎల్ఎల్పీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ థామస్ లామ్ పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లో గృహల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తక్కువ ఉండటం వల్ల అక్కడి శ్రీమంతులు ఈ ఇంట్లో రెంటుకు ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత -
ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా
గతేడాది గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 మిలియన్ డాలర్లు(రూ.144 కోట్ల) వెచ్చించి లాస్ ఏంజెల్స్‌లోని స్థానిక ఎన్సివో ప్రాంతంలోని ఈ విల్లాను తమ సొంతం చేసుకున్నారు. కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకుని 2018 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయిన బాలీవుడ్ నటి ప్రియాంక, హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఉంటున్నారు. రోజంతా వర్కవుట్లు, పెంపుడు కుక్కతో ఉల్లాసంగా గడుపుతున్నారు. నిక్ సోదరుడు జో జోనాస్, అతని భార్య సోఫీ టర్నర్ కూడా ప్రియాంక ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటిని కొనుకున్నారు. దీనిని కూడా ఇంచుమించు 14 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. (చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..) లాస్ ఏంజెల్స్‌లోని ప్రియాంక చోప్రా లగ్జరీ ఇల్లును చూసిన ఎవరికైనా కళ్లకు మైకం కమ్మాల్సిందే. ఇంటిలోని ఒక్కో గది చూస్తుంటే మతి పోయేంత అందంగా, స్టైల్‌గా ఉంటుంది మరి. విశాలవంతమైన గదులు, ఆధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ఇది మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. రెండు అంతస్తులలో, అద్దాలు, గోడలతో సుందరంగా తీర్చిదిద్దారు. గార్డెన్, స్విమ్మింగ్ ఫుల్, జిమ్, ఐమాక్స్‌తో సహా అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. మరి ఇంతటి అందమైన ఇంటిని మీరు కూడా చూడండి..(మిస్ ఇండియాగా నేను: ఎవరో గుర్తుపట్టారా?! ) అందగత్తెలంతా ఒక్కచోట చేరారు -
లగ్జరీ.. జూబ్లీహిల్సే మరి..
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ నివాసాలు... హై ఎండ్ షోరూమ్‌లు... నిత్యావసర సరుకులు.. గృహోప కరణ వస్తువులు.. బ్రాండెడ్ దుస్తులు... వాహనాలు... గుండు సూది నుంచి బెంజ్ కార్ల వరకు సంపన్నుల చిరునామాగా నిలుస్తోందీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్. ఇందులోనూ జూబ్లీహిల్స్ రోడ్ నం.36 దేశంలోనే లగ్జరీకి సింబల్‌గా నిలుస్తోంది. దేశంలోని మెట్రో నగరాల్లో హైఫై ప్రాంతాలను గుర్తించేందుకు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ తాజాగా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో ముంబైలోని పోవాయ్, బ్రీచ్ క్యాండీ ప్రాంతాలు తొలిస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఢిల్లీలోని మెహర్‌చంద్ మార్కెట్.. రెండో, బెంగళూరులోని ఇందిరానగర్.. మూడో, గుర్గావ్లోని గలేరియా మార్కెట్.. నాల్గో స్థానంతోపాటు.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ఐదో స్థానంలో నిలిచింది. చాలా రిచ్ ఏరియా.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ప్రాంతం సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 5,000 లగ్జరీ నివాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సుమారు వందకుపైగా హై ఎండ్ రిటైల్స్టోర్లు, షోరూమ్‌లు, మాల్‌లు, పబ్‌లు, స్టోర్లున్నాయి. వీటిలో దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు, నిత్యావసరాలు, కాఫీ షాప్‌లు, షూజ్, వాచెస్, డైమండ్స్, ఆభరణాలు, బెంజ్‌కార్లు, ర్యాప్టర్ వంటి విదేశీ బైక్ షోరూమ్‌లు సహా దేశంలో అన్ని రకాల లిక్కర్, వైన్, రమ్, జిన్ తదితర బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయి. అలాగే విదేశీ మద్యం సైతం లభ్యమయ్యే అతిపెద్దదైన టానిక్ లిక్కర్‌మాల్, అతిపెద్ద జూబ్లీ 800 పబ్ సైతం ఇక్కడే ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్ ఇళ్లు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.25 కోట్లు వెచ్చించాల్సిందేనని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దె నెలవారీగా రూ.లక్షకు పైమాటే. వాణిజ్య స్థలాలకు కూడా నెలకు రూ.లక్షల్లో చెల్లించాల్సిందే. ఇక ఈ ప్రాంతంలో చదరపు గజం స్థలం కొనుగోలు చేయాలంటే రూ.2 లక్షలు వెచ్చిం చక తప్పదు. హైపర్ మార్కెట్లు, జాయింట్ హైపర్ మార్కెట్లు, ఫ్యాషన్ స్టోర్లు, బోటిక్స్‌కు ఈ ప్రాంతం నిలయంగా మారినట్లు సర్వే వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సహా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పని చేస్తున్న సీఈఓలు, ఉన్నతోద్యోగులు, బడా కాంట్రాక్టర్లు, బహుళ జాతి కంపెనీల సీఈఓలు సైతం ఇక్కడ తమ శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో హైఎండ్ రిటైల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని అనరాక్ రియల్టీ సంస్థ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
అందుబాటు ఇళ్ల వైపు దృష్టి సారించేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ‘సామాన్యుల సొంతింటి కలను తీర్చేలా అందుబాటు ఇళ్లను కడితేనే గిరాకీ’.. మైకు దొరికితే చాలు ప్రతి బిల్డర్ పలికే పలుకులివి. స్టేజీ మీద అవకాశం దొరికితే చాలు నిర్మాణ సంఘాల ప్రతినిధులు చెప్పే మాటలూ ఇవే. కానీ, వాస్తవానికి హైదరాబాద్‌లో జరుగుతోన్న నిర్మాణాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. సామాన్యుల కోసం అందుబాటు ధరలో ఇళ్లను కట్టే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఏవో కొన్ని సంస్థలను మినహారుుస్తే.. నగరానికి చెందిన అధిక శాతం మంది బిల్డర్లు అందుబాటు ఇళ్లవైపు దృష్టి సారించట్లేదన్నది చేదు వాస్తవం. వేతన జీవుల కోసం ఇళ్లను కట్టాలన్న ఆలోచనా అధిక శాతం మందిలో కనబడట్లేదనేది నిజంగా నిజం. ⇔ ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు.. లగ్జరీ గృహాల నిర్మాణాల్ని చేపడుతూ వీటిని విస్మరిస్తున్నారుు. ప్రధాన నగరం నుంచి పది, పన్నెండు కిలోమీటర్ల దూరంలో.. కేవలం నివసించడానికి అవసరమయ్యే విధంగా అంటే ఎలాంటి ఆధునిక సదుపాయాల జోలికెళ్లకుండా.. 800 నుంచి వెరుు్య చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు కట్టేవారే కరువయ్యారు. ధర ఓ ఇరవై లక్షలకు అటుఇటుగా ఉంటే.. శరవేగంగా అమ్ముడవుతారుు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. కొనేవారి సంఖ్య పెరుగుతుందని వీరు అంటున్నారు. ⇔ ‘మార్కెట్లో ఇళ్లను కొనేవారి సంఖ్య తగ్గింది..’ ‘గత కొంతకాలం నుంచి గిరాకీ లేదు..’ ఇలా రకరకాలుగా పలువురు బిల్డర్లు అంటున్నారు. అధిక శాతం కొనుగోలుదారులకు కావాల్సిందేమిటో కనుక్కోకుండా.. కేవలం కొద్ది మందిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణుల అభిప్రాయం. బిల్డర్లు, డెవలపర్లు ఇప్పుడైనా.. తమలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లు కట్టాలని నగరానికి చెందిన మధ్యతరగతి ప్రజానీకం, వేతనజీవులు కోరుతున్నారు.