
బహు భాషా నటిగా, హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది.
Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩
House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP— Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024