buy
-
కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్‌కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్‌మైట్రిప్ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్‌మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్‌ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్‌స్టార్‌కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
కారట్‌లేన్‌లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్‌లేన్‌లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్‌లేన్‌లో తమ వాటా 98.28 శాతానికి జంప్‌చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్‌లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్‌నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్‌లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్‌కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
ఆ నిర్మాత ఇంటి పక్కనే బంగ్లా కొన్న ఊర్వశి రేటెంతో తెలుసా..!
-
అక్షయ తృతీయ..కళ్ళు చెదిరే ఆఫర్స్
-
యాక్సెంచర్ చేతికి ఫ్లూచురా
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్‌జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! -
'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'
లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు. मेरे भाई सत्य का कवच पहनकर चल रहे हैं। : @priyankagandhi जी#BharatJodoYatra pic.twitter.com/chp3baB0Pb — Congress (@INCIndia) January 3, 2023 కాంగ్రెస్‌కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో కొనసాగుతోంది. చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై.. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్‌కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్‌లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్‌తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్‌ఫోలియో కంపెనీ కోహేన్స్‌ను సువెన్‌లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్‌కేర్‌లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్‌తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మాస్క్
-
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్‌వే ఎడిషన్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్‌ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్‌లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్‌లాండ్‌కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్‌ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్‌గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్‌లో న్యూ ఓర్లిన్స్‌లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. 5384 చదరపు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్‌బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించింది. -
రూ.10 నాణేలతో లక్షలు ఖరీదు చేసే కారు...కారణం వింటే షాక్ అవుతారు
ఇంతవరకు తమకు నచ్చిన స్కూటీ, లేదా మంచి ఖరీదు చేసే బైక్ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ ఇక్కడొక వ్యక్తి వారిలానే నాణేలను పోగుచూసి తన కలల కారుని కొనుకున్నాడు. కానీ అతను వారందరికీ భిన్నం. పైగా అతను ఎందుకు అలా చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను సుమారు రూ. 6 లక్షలు పోగుచేసి వాటితో తనకు నచ్చిన కారుని కొనుకున్నాడు. ఐతే మొదటగా ఆ షాప్ డీలర్ ఈ రూ. 10 నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు అంగీకరించ లేదు. వెట్రివేల్ ధృడ నిశ్చయం విని షాప్ డీలర్ ఈ విక్రయానికి అంగీకరించాడు. ఇంతకీ అతను ఎందుకు ఏకంగా రూ. 6 లక్షల రూ. 10 నాణేలను పోగు చేశాడంటే...అతని తల్లి ఒక దుకాణం నడుపుతుంటుందని చెప్పాడు. ఐతే కస్టమర్లు రూ. 10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించాడంతో చాలా పెద్ద మొత్తంలో రూ.10 నాణేలు ఉండిపోయాయి. పైగా పిల్లలు కూడా ఆ రూ. 10 నాణేలు విలువ లేనివని ఆడుకోవడం చూశానని చెప్పాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలతోనే కారు కొనుక్కుని చూపి.. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నట్లు తెలిపాడు. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడూ ఎందుకు బ్యాంకులు స్వీకరించడంలేదంటూ ప్రశ్నించాడు. తాను ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలు విలువైనవేనని చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ పని చేశానని చెప్పాడు. అందుకోసం తాను దాదాపు నెలరోజులకు పైగా పది రూపాయల నాణేలను రూ. 6 లక్షలు పోగుచేశానని చెప్పుకొచ్చాడు. (చదవండి: సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్) -
లగ్జరీ కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్ఆర్ఆర్తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Volvo Car India (@volvocarsin) -
గూగుల్ చరిత్రలో మరో అతి పెద్ద డీల్..!
ప్రముఖ టెక్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ మరో అతి పెద్ద భారీ డీల్‌ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు పోటీగా..! గూగుల్ సమీప టెక్ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్‌ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్ డాలర్లతో గూగుల్ కైవసం చేసుకుంది. మరింత వేగంగా..! మాండియంట్ ఇంక్ కొనుగోలుతో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ కోసం 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్‌తో మాండియంట్ ఇంక్ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! -
ఖరీదైన బైక్ కొన్న బిగ్‌బాస్ బ్యూటీ.. ధర ఎంతంటే..
Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్‌బాస్ సీజన్-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్‌బాస్ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొత్తానికి ఈ బైక్ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్ సౌండ్ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆనీ మాస్టర్ సహా పలువురు లహరికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ వచ్చే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీరంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అక్టోబర్ 10న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్జెటి) యాక్సెస్‌తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తయారీలో దిగ్గజ ప్లేయర్‌గా మారడానికి ఆర్ఐఎల్ పనిచేస్తోంది. 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో...