బలపరీక్షకు ముందు రావత్ కు స్టింగ్ దెబ్బ!
Published Sun, May 8 2016 5:03 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: బలనిరూపణకు ముందు హరిశ్ రావత్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మే10న అసెంబ్లీలో బలనిరూపణకు కొంతమంది సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ సింగ్ బేరమాడినట్లు చూపుతున్న వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది.
తనకు డబ్బు అవసరం లేదని.. పేద ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వదలుచుకున్నానని ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున సొంత ఖర్చులకు ఇచ్చినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చానని.. హరిష్ రావత్ కు కూడా ఈ విషయం తెలుసననే మదన్ సింగ్ మాటలు ఉన్నాయి.
ఈ వీడియోను ఉత్తరాఖండ్ సమాచార్ ప్లస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బయటపెట్టారు. పాత స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోతో పాటు ఈ వీడియోను కలిపి సమాచార్ ప్లస్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారనే హరీశ్ రావత్ ఆరోపణలు అబద్ధమని తెలిపోయాయి. కుర్చీని నిలబెట్టుకోవడానికి రావత్ ఎంతకైనా దిగజారతారని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గ్యానంద్ అన్నారు.
Advertisement
Advertisement