rs.25 lakhs
-
రైతు మరణం ప్రభుత్వ హత్యే
- బాలునాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పెనుకొండ రూరల్ : మండలంలోని మక్కాజీపల్లి తాండాకు చెందిన బాలునాయక్ అనే రైతు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతు మరణం ప్రభుత్వ హత్యగానే భావించాలన్నారు. దక్షిణకోరియాకు చెందిన కియో కార్ల కంపెనికి భూములు ఇచ్చే ఎర్రమంచి రైతులు బంజర భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారన్నారు. అయితే ఏడాదికి మూడు పంటలు పండే సాగు భూములను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి రైతులపై ఒత్తిడి తెచ్చి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తండాలో నివసిస్తున్న గిరిజనులు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. స్థానిక ఆర్డీఓ కార్యాయంలో రైతుల సమావేశం జరిగిన అనంతరం ఎకరాకు రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించారని తెలుసుకున్న రైతు బాలునాయక్ మనోవేదనతోనే గుండెపోటుతో చనిపోయాడన్నారు. ఎకరాకు రూ.40 లక్షల ధర పలుకుతున్న భూములకు రూ.10 లక్షలు ప్రటించడం దారుణమన్నారు. పరిశ్రమలు రావడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. అయితే బంజరు భూముల్లో పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. రైతు హత్య పార్థసారథి చేసిన హత్యగానే భావించాలన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెలేలు బినామీల పేర్లతో భూములు కొన్నారని, వారి భూముల జోలికి వెళ్లకుండా రైతుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి వివరించడం జరిగిందన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతామన్నారు. ఎమ్యెల్యేకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే భూసేకరణ ఆపి మృతుని కుటంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
బలపరీక్షకు ముందు రావత్ కు స్టింగ్ దెబ్బ!
న్యూఢిల్లీ: బలనిరూపణకు ముందు హరిశ్ రావత్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మే10న అసెంబ్లీలో బలనిరూపణకు కొంతమంది సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ సింగ్ బేరమాడినట్లు చూపుతున్న వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది. తనకు డబ్బు అవసరం లేదని.. పేద ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వదలుచుకున్నానని ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున సొంత ఖర్చులకు ఇచ్చినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చానని.. హరిష్ రావత్ కు కూడా ఈ విషయం తెలుసననే మదన్ సింగ్ మాటలు ఉన్నాయి. ఈ వీడియోను ఉత్తరాఖండ్ సమాచార్ ప్లస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బయటపెట్టారు. పాత స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోతో పాటు ఈ వీడియోను కలిపి సమాచార్ ప్లస్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారనే హరీశ్ రావత్ ఆరోపణలు అబద్ధమని తెలిపోయాయి. కుర్చీని నిలబెట్టుకోవడానికి రావత్ ఎంతకైనా దిగజారతారని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గ్యానంద్ అన్నారు. -
రూ. 25 లక్షలిచ్చి హత్య చేయించా
నిందితుడి సంచలన వాంగ్మూలం చెన్నై: వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి హత్య కేసులో అరెస్టయిన ముఖ్య నిందితుడు జగన్నాథన్ బుధవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి వెట్రిసెల్వన్ మే 20వ తేదీన మూవరసంపట్టు అనే ప్రాంతంలో స్థలం తగాదా గురించి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీని గురించి మడిపాక్కం డెప్యూటీ కమిషనర్ లక్ష్మినారాయణన్, ఇన్స్పెక్టర్ ధనరాజ్ కేసు నమోదు చేసి 28వ తేదీన కిరాయి ముఠాకు చెందిన పెరుమాళ్, వినోద్, మోహన్, సతీష్, ప్రభులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ముఖ్య నిందితుడైన జగన్నాథన్ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తూ వచ్చింది. అయితే జగన్నాథన్ తన లాయర్ ద్వారా మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. హత్య పూర్వపరాల గురించి జగన్నాథన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కానాత్తూరులోగల రూ.10 కోట్ల విలువైన భూమికి సంబంధించి తనకు వెట్రిసెల్వన్‌కు తగాదా ఏర్పడిందని, ఆ సమయంలో తనను హత్య చేస్తానని వెట్రిసెల్వన్ బెదిరించాడు... దీంతో భయపడిన తాను ముందుగానే అతన్ని హతమార్చేందుకు పథకం రూపొందించానన్నారు. ఆ క్రమంలో అతడిని హత్య చేసేందుకు రూ. 25 లక్షలతో కిరాయి ముఠాతో బేరం కుదుర్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆ ముఠా వెట్రిసెల్వన్‌ను హతమార్చిందన్నారు. -
పైసామే పోస్టింగ్
తిరుపతిలో కీలకమైన సర్కిల్లో పోస్టింగ్ కోసం నలుగురు సీఐలు పోటీ పడ్డారు. పోటీ అధికమవడంతో ఎవరు ఎక్కువ డబ్బు ముట్టజెబితే వారికి పోస్టింగ్ ఇప్పిస్తానని ఓ ప్రజాప్రతినిధి తెగేసి చెప్పారు. ఆ సీఐల సూచన మేరకే సదరు ప్రజాప్రతినిధి వేలంపాట పెట్టారు. రూ.25 లక్షలకు పాడిన ఓ సీఐ ఆ పోస్టింగ్‌ను కొనుక్కున్నారనే అంశంపై పోలీసువర్గాల్లోరసవత్తరమైన చర్చ సాగుతోంది. పోలీసు బదిలీల్లో టీడీపీ నేతలు ప్రదర్శిస్తోన్న చేతివాటానికి ఇదో తార్కాణం. పోలీసుశాఖే కాదు, కీలకమైన శాఖల్లో పోస్టింగ్ కోసం ఆశ్రయిస్తోన్న వారి నుంచి టీడీపీ నేతలు భారీ ఎత్తున గుంజుతోండడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారంలో ఉండగానే కోట్లకు పడగలెత్తాలన్న లక్ష్యంతో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచోవడానికి అధికార నేతలు అంగీకరించడం లేదు. చివరకు అధికారుల బదిలీలనూ అక్రమార్జనకు అనువుగా మల్చుకుంటున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు చేసిన దిశానిర్దేశాన్ని పెట్టుబడిగా పెడుతోండటం గమనార్హం. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులకు ప్రతి రెండేళ్లు లేదా మూడేళ్లకు ఒకసారి స్థానభ్రంశం కల్పించడమన్నది సాధారణం. కౌన్సెలింగ్‌ల ద్వారా, సీనియారిటీ, సమర్థత, నిజాయితీ ఆధారంగానూ బదిలీలు చేస్తారు. నిజాయితీ, నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులను కీలక ప్రదేశాల్లో నియమించి, వారి సేవలు వినియోగించుకోవడం పరిపాటి. తద్వారా అధికారగణంలో విశ్వాసాన్ని నింపవచ్చునన్నది ప్రభుత్వ భావన. కానీ ఇప్పుడు ఆ విధానానికి సీఎం చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారు. టీడీపీకి దన్నుగా నిలిచే కార్యకర్తలు చెప్పినట్టల్లా తలాడించే అధికారులను ఏరికోరి నియమించుకోవడం వల్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సీఎం మార్గదర్శకాల మేరకు తమ నియోజకవర్గం, మండలం పరిధిలో ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నది శాఖలవారీగా టీడీపీ నేతలు ఆయా శాఖల ఉన్నతాధికారులకు జాబితా అందిస్తున్నారు. ఆ జాబితా ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నారని అధికారవర్గాలు స్పష్టీకరిస్తోండటం అందుకు నిదర్శనం. పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, నీటిపారుదల, విద్యాశాఖకే టీడీపీ నేతలు పరిమితం కాలేదు. చివరకు పోలీసుశాఖను కూడా విడిచిపెట్టడం లేదు. తమ నియోజకవర్గంలో ఎవరు డీఎస్పీగా పనిచేయాలి, ఎవరు సీఐగా విధులు నిర్వహించాలి, ఎవరు ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించాలి అన్న అంశాన్ని ఆ నియోజకవర్గాల నేతలే నిర్ణయించి, అదే జాబితాను పోలీసు ఉన్నతాధికారులకు అందించి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారు. ఇది పసిగట్టిన అధికశాతం మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు అడిగింది ముట్టజెప్పి పోస్టింగ్‌లు దక్కించుకునేలా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నేతల చేతులు తడపలేని నిజాయితీపరులైన అధికారులకు పోస్టింగ్‌లు దక్కక వీఆర్ (వెకెన్సీ రిజర్వు)లోకి వెళ్లాల్సిన దుస్థితి దాపురించందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముడపులు ముట్టజెప్పి పోస్టింగ్‌లు దక్కించుకున్న అధికారులు నిజాయితీతో విధులను నిర్వర్తించలేరని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. పోస్టింగ్ కోసం తాను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి అక్రమాలకు పాల్పడాల్సిన పరిస్థితిని అధికారపార్టీ నేతలే కల్పిస్తున్నారనే భావన బలంగా వ్యక్తమవుతోంది. అధికారపార్టీ నేతల ప్రతిపాదన మేరకు పోస్టింగ్‌లు పొందిన అధికారులు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితే ఉండదని, పక్షపాతంగానే పనిచేయాల్సి వస్తుందని అధికారవర్గాలు వాపోతున్నాయి.