madan singh
-
అక్క కోసం చెల్లించింది!
జీడిమెట్ల: అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధకు చలించిన ఓ చెల్లి రాష్ట్ర ప్రభుత్వ దత్తత నియమాలు అనుసరించకుండా రూ.22 వేలకు మగ శిశువును కొన్న వ్యవహారం జీడిమెట్ల ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఇద్దరితో పాటు మధ్యవర్తులు ఇద్దరిపై, మగ శిశువును అమ్మిన తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని 80, 81 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా కాచీపుట్లకు చెందిన దంపతులు మదన్‌సింగ్, సరిత 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (6 ఏళ్లు, 2 నెలలు). అడ్డా కూలి అయిన మదన్‌సింగ్ మద్యానికి అలవాటుపడ్డాడు. లాక్డౌన్ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయితే ఇదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉండే మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితిని ఎల్లమ్మబండలో ఉంటున్న శేషు అనే మహిళకు వివరించారు. అంతకుముందే శేషు తన అక్క దేవీ పెంచుకునేందుకు ఓ బాబు కావాలని.. ఎవరన్నా ఉంటే చెప్పమని.. వీరికి చెప్పింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చిన శేషు... మదన్ సింగ్ దంపతులకు కూడా రూ.22 వేలు చెల్లించింది. అలాగే దత్తత తీసుకున్నట్లు బాండ్ పేపర్ రాయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారికి 2 నెలల బాబును ఇచ్చిన సరిత.. ఆదివారం ఉదయం ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు. దీంతో ఆమె జరిగిన విషయమంతా చెప్పడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ బాబును తీసుకొని వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటకు శేషు, అరవింద్ (శేషు అన్న కొడుకు) వాహనంలో వెళుతుండగా బోయిన్పల్లి, సికింద్రాబాద్ మధ్యలో జీడిమెట్ల పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయిందని, పిల్లలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో కొనుక్కొని తీసుకెళుతున్నామని చెప్పింది. ఆ తర్వాత మదన్‌సింగ్, సరితను కూడా జీడిమెట్ల ఠాణాకు తీసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నారని, ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని, అలాగే బాబును అమ్మారని... ఇలా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్‌కు తరలించారు. అయితే బాబును అమ్మేందుకు మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఇటువంటి ఉదంతాలపై కఠినంగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతారావు.. బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డిని డిమాండ్ చేశారు. -
ఫేస్బుక్లో ట్రెండవుతున్న ఎస్ఐ.. ఎందుకు?
ఆయన ఢిల్లీ పోలీసుశాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైరయిపోతారు కూడా. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా.. దాదాపు రూ. 50 వేల విలువైన నగదు ఉన్న తన వాలెట్ పోగొట్టుకున్న ఓ వ్యాపారవేత్త.. దాన్ని తిరిగిచ్చిన ఎస్ఐ మదన్ సింగ్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అంతే, పోలీసులలో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ ఒక్కసారిగా ఆ పోస్టుకు లైకులు, షేర్లు వెల్లువెత్తాయి. కేవలం ఆ పర్సు తిరిగివ్వడమే కాదు, సదరు వ్యాపారి తనకు బహుమతిగా ఇవ్వబోయిన 5వేల రూపాయలను కూడా మదన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు. ఈనెల ఏడోతేదీ ఉదయం 9.30 గంటల సమయంలో జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలోని నిజాముద్దీన్ బ్రిడ్జి సమీపంలో తన పర్సు పోగొట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ కాలనీ నుంచి ప్రీత్‌విహార్ లోని తన ఇంటికి వెళ్తుండగా కారు ఆగిపోయింది. కారును స్టార్ట్ చేయడానికి తోయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పర్సు పడిపోయింది. రాత్రి 10.30 గంటలకు ఇంటికి వెళ్లి చూసుకోగా పర్సు లేదు. ఇంతలో రోడ్డుమీద వెళ్తున్న ఓ సైక్లిస్టు ఆ పర్సు తీసుకుని వెళ్తుండటాన్ని మదన్ సింగ్ చూశారు. అతడిని వెంబడించి పట్టుకుని, పర్సు తీసుకున్నారు. అందులో చాలా పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, విజిటింగ్ కార్డులు ఉన్నాయి. అందులో విజిటింగ్ కార్డు మీద నెంబరు చూసి జగ్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ వచ్చే సమయానికి కారు మొత్తం గాలించిన జగ్రీత్.. ఇక పర్సు దొరకదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇంతలో మదన్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో.. పర్సులో కేవలం తన ఐడెంటిటీ కార్డు మాత్రమే ఉండి ఉండొచ్చని, డబ్బులు ఉండకపోవచ్చని అనుకున్నారు. తీరా ఆక్కడకు వెళ్లి చూస్తే.. మొత్తం డబ్బు యథాతథంగా ఉంది. తాను కేవలం డ్రైవింగ్ లైసెన్సు మాత్రమే చూశానని, తర్వాత విజిటింగ్ కార్డు చూసి ఫోన్ చేశానని మదన్ సింగ్ చెప్పారు. అలాంటి నిజాయితీపరుడైన పోలీసును ఇంతవరకు చూడలేదని, చివరకు ఫొటో తీయించుకోడానికి కూడా ఒప్పుకోలేదని అన్నారు. మదన్ సింగ్ తమ శాఖకే గర్వకారణమని ట్రాఫిక్ డీసీపీ డీకే గుప్తా అన్నారు. అతడికి శాఖాపరంగా తగిన రివార్డు ఇప్పిస్తామని, ఇతరులు కూడా ఆయనను చూసి స్ఫూర్తి పొందాలని చెప్పారు. అల్వార్‌కు చెందిన మదన్ సింగ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. కొడుకులిద్దరిలో ఒకరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుండగా మరొకరు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. -
బలపరీక్షకు ముందు రావత్ కు స్టింగ్ దెబ్బ!
న్యూఢిల్లీ: బలనిరూపణకు ముందు హరిశ్ రావత్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మే10న అసెంబ్లీలో బలనిరూపణకు కొంతమంది సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ సింగ్ బేరమాడినట్లు చూపుతున్న వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది. తనకు డబ్బు అవసరం లేదని.. పేద ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వదలుచుకున్నానని ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున సొంత ఖర్చులకు ఇచ్చినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చానని.. హరిష్ రావత్ కు కూడా ఈ విషయం తెలుసననే మదన్ సింగ్ మాటలు ఉన్నాయి. ఈ వీడియోను ఉత్తరాఖండ్ సమాచార్ ప్లస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బయటపెట్టారు. పాత స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోతో పాటు ఈ వీడియోను కలిపి సమాచార్ ప్లస్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారనే హరీశ్ రావత్ ఆరోపణలు అబద్ధమని తెలిపోయాయి. కుర్చీని నిలబెట్టుకోవడానికి రావత్ ఎంతకైనా దిగజారతారని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గ్యానంద్ అన్నారు.