
అలీబాబా పిక్చర్స్‌కి టికెట్‌న్యూలో మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ టికెట్‌న్యూలో చైనాకి చెందిన అలీబాబా గ్రూప్ సంస్థ అలీబాబా పిక్చర్స్ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో తమ కార్యకలాపాలు, సర్వీసుల పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టం కాగలదని టికెట్‌న్యూ పేర్కొంది.
అలీబాబా విడతలవారీగా రూ. 120 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు టికెట్‌న్యూ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్‌కుమార్ నమ్మాళ్వార్ తెలిపారు. ఈ డీల్‌తో తమ సిబ్బందికి, కంపెనీకి ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. 2007లో రామ్‌కుమార్ నమ్మాళ్వార్ .. టికెట్‌న్యూని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి.