Alibaba Group
-
పేటీఎమ్‌లో విజయ్‌కు అదనపు వాటా
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్‌ఫిన్ విజయ్‌కు పేటీఎమ్‌లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్‌ఫిన్‌వద్దనే కొనసాగనున్నాయి. కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్‌లో యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్‌లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్‌ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్‌లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ చేపట్టింది. -
అనిశ్చితిలో ‘అద్భుత దీపం’.. 15 వేల మందిని నియమించుకోనున్న ఈ-కామర్స్ దిగ్గజం!
ఆర్థిక అనిశ్చితితో ప్రపంచమంతా అనేక కంపెనీల్లో నియామకాలు మందగించి లేఆఫ్‌ల బాట పడుతున్న వేళ చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మంచి వార్త చెప్పింది. ఈ సంవత్సరం 15000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది మొత్తంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు అలీబాబా గ్రూప్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ "వీబో" ద్వారా మే 25న ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు తెలిపింది. అంటే ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వనుంది. తమ సంస్థలో భారీగా తొలగింపులు జరగనున్నాయని గతంలో వచ్చిన వార్తలను పుకార్లుగా కొట్టిపారేసింది. ఉద్యోగులు వెళ్లిపోవడం అనేది సాధారణ ప్రవాహంలో భాగమని పేర్కొంది. కాగా అలీబాబాకు చెందిన క్లౌడ్ విభాగం ఉద్యోగ కోతలను ప్రారంభించిందని, సుమారు 7 శాతం సిబ్బందిని తగ్గించవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదించింది. అలీబాబా 15000 ఉద్యోగాల నియామకాల గురించి వెల్లడించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ నివేదిక అవాస్తవం అని తెలియజేసింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేనియల్ జాంగ్ మే నెల ప్రారంభంలో మొదటిసారిగా కంపెనీ వివరాలను వెల్లడించారు. 2023 మార్చి నాటికి సంస్థలో 2,35,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అప్పటికింకా సంస్థలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు కాలేదు. ఇదీ చదవండి: Meta Layoffs 2023: మెటాలో తొలగింపులు! వారికి జుకర్‌బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా? -
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
6 బిజినెస్ గ్రూపులుగా అలీబాబా
న్యూయార్క్: ఆరు విభిన్న బిజినెస్ గ్రూప్‌లుగా సంస్థను విడదీయనున్నట్లు చైనా కార్పొరేట్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. క్లౌడ్ ఇంటెలిజెన్స్, టౌబవ్ టీమాల్ బిజినెస్, లోకల్ సర్వీసెస్, గ్లోబల్ డిజిటల్ బిజినెస్, కాయ్నియావో స్మార్ట్ లాజిస్టిక్స్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూపులుగా విడదీయనున్నట్లు నియంత్రణ సంస్థలకు అలీబాబా సమాచారమిచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో అలీబాబా షేరు 8 శాతం జంప్‌చేసింది. కాగా.. ఒక్కో గ్రూప్ విడిగా పెట్టుబడులు సమీకరించగలదని తెలియజేసింది. తద్వారా పబ్లిక్ ఇష్యూలను చేపట్టగలవని పేర్కొంది. అయితే టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్ మాత్రం అలీబాబాకు అనుబంధ సంస్థగా వ్యవహ రించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన గ్రూప్‌లన్నీ సొంత సీఈవో, డైరెక్టర్ల బోర్డుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగించనున్నట్లు స్పష్టం చేసింది. టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్‌లో టౌబవ్, టీమాల్, టౌబవ్ డీల్స్, 1688.కామ్ తదితరాలు భాగం కానున్నట్లు తెలియజేసింది. -
తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..
చైనాకు చెందిన టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. కొన్ని నెలల క్రితం చైనా నుంచి అదృశ్యమైన ఆయన మెల్బోర్న్లోని ఒక హోటల్లో కనిపించాడని, కొన్ని రోజులపాటు ఆ దేశంలోనే జాక్‌మా గడిపినట్లు చైనాకు చెందిన వయికై మీడియా సంస్థ పేర్కొంది. అయితే దీన్ని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ధ్రువీకరించడం లేదు. ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం ఆస్ట్రేలియాలో జాక్‌మా జాడపై స్పష్టత లేనప్పటికీ, ఆయనకు ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి మోర్లీ కుటుంబానికి మా సన్నిహితంగా ఉండేవారు. 1980 ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్‌లోని న్యూకాజిల్‌ను సందర్శించడానికి ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు వచ్చారు. ఈ సమయంలో మెంటర్‌గా ఉంటూ జాక్‌మా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మోర్లీ కృషి చేశారు. అందుకే 2017లో దివంగత కెన్ మోర్లీ పేరు మీద 20 మిలియన్ డాలర్లతో యూనివర్శిటీ స్కాలర్షిప్ ఫండ్‌ను జాక్‌మా ఏర్పాటు చేశారు. జాక్‌మా థాయ్‌లాండ్ వెళ్లే ముందు జపాన్ లోని టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో గడిపారు. ముయే థాయ్ బాక్సింగ్ మ్యాచ్‌లోనూ మా పాల్గొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఫైనాన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసేందుకు ఆయన గత నెలలో హాంకాంగ్ వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (ఇదీ చదవండి: అదానీ, అంబానీలపై రామ్‌దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు) -
చైనా బిలియనీర్ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్ నుంచే తరుచూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. స్పెయిన్, నెదర్లాండ్‌లోనూ ఆయన కనిపించినట్లు సమాచారం. కాగా జాక్ మా టోక్యోకు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌కు సన్నిహిత మిత్రుడు. అంతేగాక మసయోషి అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. జాక్ మా ఒకప్పుడు చైనాలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా వెలుగొందారు. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగ వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్‌ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జాక్ మా సంస్థలపై చైనా ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి. అప్పటి నుంచి జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలు నిబంధనలు పాటించడం లేదని నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఆలీబాబా కంపెనీపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ప్రభుత్వంతో విబేధాల కారణంగా 2020 ఆయన బహిరంగంగా కనిపించడం మానేశారు. చైనాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
ఉద్యోగులకు జాక్ మా భారీ షాక్, వేలాది మందిపై వేటు!
అంతర్జాతీయ ఈకామర్స్ సంస్థ అలీబాబా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ సేల్స్ తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అలీబాబా ఫౌండ్ జాక్ మా సుమారు 10వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అలీబాబా గ్రూప్ అనుబంధ మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. చైనా ప్రభుత్వ విధానాలతో వృద్దిరేటు పడిపోవడం, రెండేళ్ల క్రితం అలీబాబా డ్రాగన్ ప్రభుత్వంపై,నియంత్రణ సంస్థలపైనా అలీబాబా ఫౌండర్ జాక్‌మా విమర్శలు గుప్పించారు. నాటి నుంచి జాక్ మాపై దర్యాప్తు సంస్థలు ఉక్కు పాదం మోపుతూ వస్తున్నాయి. ఫలితంగా అలీ బాబా గ్రూప్ నష్టాల్లో కూరుకుపోతుంది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 22.74 బిలియన్ల యువాన్ల విక్రయాలు జరిపింది. గతేడాది 45.14 బిలియన్ల యువాన్ల విలువైన వస్తువుల అమ్మకాలు జరిపింది. అయితే ద్రవ్యోల్బణం, నష్టాల్ని తగ్గించుకునేందుకు జాక్ మా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించారని, ఇప్పటి వరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు తగ్గినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
‘డేటా’ నిబంధనలను పాటిస్తున్నాం
న్యూఢిల్లీ: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) స్పష్టం చేసింది. తమ బ్యాంక్ డేటా అంతా దేశీయంగానే భద్రపరుస్తున్నామని వివరించింది. పర్యవేక్షణపరమైన లోపాల కారణంగా కొత్త ఖాతాలు తెరవొద్దంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ గత వారం ఆదేశించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్ సర్వర్లలోని వివరాలు చైనా సంస్థల చేతుల్లోకి వెడుతున్నాయనే వార్తలతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఒక్కసారిగా పతనమైంది. ఈ వన్97 కమ్యూనికేషన్స్‌లో చైనా ఆలీబాబా గ్రూప్ సంస్థలకు 31 శాతం వాటాలు ఉన్నాయి. తద్వారా పీపీబీఎల్‌లో కూడా చైనా కంపెనీలకు పరోక్షంగా వాటాలు ఉన్నాయి. -
అయ్యో! జాక్ మా.. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది?
Jack Ma-China: జాక్ మా నేతృత్వంలోని యాంట్ గ్రూప్ కో లిమిటెడ్ కంపెనీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, బ్యాంకులను చైనా అధికారులు ఆదేశించినట్లు బ్లూమ్ బెర్గ్ న్యూస్ నివేదించింది. చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్‌తో సహా దాని అనుబంధ సంస్థలు, వాటాదారుల ఆర్ధిక మూలాలకు సంబంధించి వివరాలను నిశితంగా పరిశీలించాలని సంస్థలను కోరినట్లు నివేదిక తెలిపింది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నేషనల్ ఆడిట్ కార్యాలయం ఈ తనిఖీలకు నాయకత్వం వహిస్తోంది అని నివేదిక తెలిపింది. 2020 చివరలో $37 బిలియన్లతో ఐపీఓకు వచ్చిన యాంట్ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐపీఓ రద్దు అయ్యింది. ఐపీఓ రద్దు చేసినప్పటి నుంచి అలీబాబా బిలియనీర్ వ్యవస్థాపకుడు జాక్ మా నియంత్రణలో ఉంది. చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో ఆ కంపెనీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ ప్రభావం అలీబాబా షేర్ల మీద పడటంతో ఆ కంపెనీ షేర్లు జనవరి 28 నుంచి 5.3% వరకు పడిపోయాయి. తాజా చర్యలో, నియంత్రణ అధికారులు ఈక్విటీలలో పెట్టుబడుల పెట్టిన వారి వివరాలను సమర్పించాలని, యాంట్ గ్రూప్‌కు సంబంధించి రుణాలను సమర్పించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కోరాయి. గత నెలలో, చైనాలోని నాలుగు అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తి నిర్వహణ సంస్థలలో(ఏఎంసీలు) ఒకటైన చైనా సిండా అసెట్ మేనేజ్ మెంట్ కో లిమిటెడ్, ప్రణాళికాబద్ధమైన యాంట్ గ్రూప్ పెట్టుబడిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర అధికారుల ఒత్తిడి కారణంగా యాంట్ గ్రూప్ వినియోగదారు ఫైనాన్స్ విభాగంలో సుమారు $944 మిలియన్ల విలువైన 20% వాటాను కొనుగోలు చేసే ఒప్పందాన్ని సిండా రద్దు చేసింది. 2020 అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని జాక్ మా బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు బ్రేకులు పడ్డాయి. (చదవండి: ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!) -
'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం
చైనాలో 'సింగిల్స్ డే' పేరుతో నిర్వహించే ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. తాజాగా జరిగిన ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో దాదాపు రూ.10 లక్షల కోట్లు(139 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా చైనీయుల షాపింగ్ చేసినట్లు వెల్లడైంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఖర్చు తగ్గినప్పటికి గత సంవత్సరం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది 'సింగిల్స్ డే' సందర్భంగా రూ.5 లక్షల కోట్లు(74 బిలియన్ డాలర్లు) విలువ చేసే అమ్మకాలు జరిగాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు సాగిన సింగిల్స్ డే ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో అలీబాబా పోర్టల్ ద్వారా 84.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. దాని ప్రధాన ప్రత్యర్థి JD.com ఈ ఏడాది 54.6 బిలియన్ డాలర్లు లావాదేవీలను జరిపినట్లు పేర్కొంది. సాధారణంగా నవంబర్ 11న ముగిసే ఈ సింగిల్స్ డే ఈవెంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్. వినియోగదారులను ఆకర్షించడానికి బ్రాండ్లు, వ్యాపారులు భారీగా డిస్కౌంట్లను అందించడంతో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా జరిగాయి. (చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లింపు) సింగిల్స్ డే అంటే..? అలీబాబా గ్రూప్ 2009 నవంబరు 11న మొదటి సారి 'సింగిల్స్ డే' పేరుతో షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. 11వ నెల, 11వ తేదీలో అన్నీ ఒకట్లు ఉండటంతో ఈ రోజును 'సింగిల్స్ డే' పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తుండటం వల్ల ప్రజలు కూడా భారీ స్థాయిలో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది కేవలం ఆన్లైన్ షాపింగ్ ఈవెంట్ కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంతర్గత చలామణి సమయమని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా?) -
జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో
Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్ కుబేరుడు ‘జాక్–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. సుదీర్ఘ విరామం తరువాత జాక్ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు. అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్ – మా హామీలు మాత్రమే కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే! అప్పటికే ఉప్పు.. నిప్పు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్–మా, ట్రంప్‌ల మీటింగ్ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది. నవంబరు 5న జాక్–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక దశలో జాక్–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మారిపోయిన సీన్... చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్–మా కే చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది. వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ సి త్సాయి జూన్ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..!
గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వాన్ని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో కొద్ది రోజులపాటు జాక్ మా అండర్ గ్రౌండ్ కూడా వెళ్లిపోయాడు. అక్కడి ప్రభుత్వం జాక్ మా కంపెనీలపై ఉక్కుపాదం వేసింది. ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఇప్పుడు జాక్ మా కొంపముంచాయి. భారీ నష్టాలు...! చైనా బిజినెస్ టైకూన్ జాక్ మాకు చెందిన అలీబాబా గత ఏడాది కాలంలో 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది అక్టోబర్‌లో అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా విమర్శించినప్పుడే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ పతనమవుతాయని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే జాక్ మా భారీ నష్టాలను సొంతం చేసుకున్నారు. మూడు వారాల ముందు హాంకాంగ్‌లో అలీబాబా షేర్లు అత్యధికంగా రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్టోబర్ 5 నుంచి 30శాతం రికవరీ ఉన్నప్పటికీ...గత ఏడాదితో పోలిస్తే 43 శాతం మేర స్టాక్ ధర తగ్గింది. చదవండి: ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?! బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం...అలీబాబా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాదిలో 344 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా షేర్‌హోల్డింగ్‌లో అతిపెద్ద నష్టాలను అలీబాబా ముటకట్టుకుంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆరోపణలు చేయడంతో...చైనాకు చెందిన జాక్ మా ఫిన్‌టెక్ ఆర్మ్ యాంట్ గ్రూప్ జాబితాను ఐపీవోకు వెళ్లకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి దేశంలోని అత్యంత శక్తివంతమైన రంగంపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీ అణిచివేత చేపట్టి, అలీబాబాకు తీవ్ర నష్టాలు వచ్చేలా చేసింది. జిన్పింగ్ప్రభుత్వంపై భారీ విమర్శలు..! గత ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. దీంతో జాక్ మా వ్యాపార లావాదేవీలకు అక్కడి చైనా ప్రభుత్వం భారీ ఆటంకాలను సృష్టించింది. చదవండి: Tesla: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! -
ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు
బీజింగ్: చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ పిండుయోడువో ఇంక్ వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం హువాంగ్ సంపద 27 బిలియన్ డాలర్లకు(19,85,72,31,00,000 రూపాయలు) పైగా పడిపోయింది. చైనా తన దేశంలోని ఇంటర్నెట్ దిగ్గజాలపై విరుచుకుపడడంతో కంపెనీ స్టాక్ ఇంత భారీగా పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లోని 500 మంది సభ్యులలో ఇది అతిపెద్ద క్షీణత కాగా కోలిన్ తర్వత అత్యధికంగా నష్టపోయిన తదుపరి వ్యక్తిగా చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ ఛైర్మన్ హుయ్ కా యాన్ నిలిచారు. ఈ చైనీస్ బిలయనీర్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఈ ఏడాది సుమారు $ 16 బిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో కోల్పోయి.. అప్పుల కుప్పతో పోరాడుతోంది. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవించాయి. జిన్‌పింగ్ తీసుకువచ్చిన నూతన విధానం ఫలితంగా పిండుయోడువో (పీడీడీ) షేర్లు ఈ సంవత్సరం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంటే ఎక్కువగా పడిపోయాయి. ఫలితంగా కోలిన్ భారీ నష్టాన్ని చవి చూశాడు. దీనిపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. పిండుడువో అమెరికన్ డిపాజిటరీ రసీదులు ఈ సంవత్సరం 44 శాతం పడిపోయాయి. అలానే మరో దిగ్గజం ఆలీబాబా ఏడీఆర్ డిపాజిటరీ రసీదులు 33 శాతం క్షీణించగా... టెన్సెంట్ రసీదులు 20 శాతం పడిపోయాయి. హువాంగ్ 2015లో పిండుయోడువో కంపెనీలో 28 శాతం వాటా కలిగి ఉన్నాడు. కమ్యూనిటీ కొనుగోలుకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా పిండుయోడువోని అనతి కాలంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా మలిచాడు. పీడీడీ వార్షిక క్రియాశీల వినియోగదారులు డిసెంబరులో 788 మిలియన్లకు చేరుకున్నారు. ఇది ఆలీబాబా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లలో 779 మిలియన్లను అధిగమించింది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 125 బిలియన్ డాలర్లకు పడిపోయే ముందు గరిష్టంగా 178 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత నెలలో పబ్లిక్ కంపెనీగా మొదటి త్రైమాసిక నికర లాభాన్ని నివేదించింది. హువాంగ్, గత ఏడాది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవికి రాజీనామా చేశారు. అలానే మార్చిలో మార్చిలో చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. చైనాలో ఆదాయ అంతరాన్ని తగ్గించేందుకు ప్రెసిడెంట్ జిన్‌పింగ్ తీసుకువచ్చిన దాతృత్వ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుత, భవిష్యత్తు కార్పొరేట్ లాభాలను తాకట్టు పెడుతున్న టెక్ దిగ్గజాలలో పీడీడీ ఒకటి. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి సహాయపడటానికి గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కేటాయిస్తామని పీడీడీ వెల్లడించింది. అంతకు ముందు, హువాంగ్, పీడీడీ వ్యవస్థాపక బృందం గత సంవత్సరం ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌కు కంపెనీ వాటాలలో 2.4 బిలియన్ డాలర్లను కేటాయించారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఈ సంవత్సరం అతిపెద్ద నికర విలువ క్షీణత కలిగిన 10 మంది బిలియనీర్లలో ఆరుగురు చైనాకు చెందిన వారే ఉన్నారు. అంతేకాక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఈ సంవత్సరం $ 6.9 బిలియన్ సంపదను కోల్పోయారు. -
పాపం ఈ ఆలీబాబాకు మరో షాక్!
బీజింగ్: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏ ముహుర్తంలో చైనా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారో,ఇక అప్పటి నుంచి ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది డ్రాగన్ సర్కార్. ఈ క్రమంలో జాక్ మాను, ఆయన సంస్థలను కష్టాలు వదలక వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జిన్‌పింగ్ ప్రభుత్వం ఆ సంస్థపై మరో బాంబ్ పేల్చింది. మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించారంటూ జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది. ‘పిక్ వన్ ఫ్రమ్ టూ’ అనే నినాదంతో దేశీయ ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో పోటీని పరిమితం చేస్తూ అలీబాబా గ్రూప్ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తోందంటూ చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 2.8బిలియన్ డాలర్లు జరిమానా విధించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో 4 శాతానికి సమానం కావడం గమనార్హం. కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనా ప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఇవేకాక గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది.దాని ఫలితంగానే తాజా ఈ జరిమానాను జాక్ మా పై విధించింది. ( చదవండి: వైరల్: బ్రూస్లీ వన్ ఇంచ్ పంచ్‌తో అదరగొడుతున్న యువకుడు ) -
ట్రంప్ బుద్ద.. ఎంతైనా చైనోడి తెలివే వేరబ్బా!
డోనాల్డ్ ట్రంప్‌కు, చైనాకు మధ్య భగ్గుమనడానికి పచ్చిగడ్డితో పనిలేదు. చూపులు చాలు! రాజకీయంగా ఎంత శతృత్వం ఉన్నా వ్యాపారంలో చైనాకు అందరూ మిత్రులే. ఆత్మీయులే. తాజాగా అలిబాబా గ్రూప్‌కు చెందిన ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం ఒకటి ధ్యానస్థితిలో ఉన్న ట్రంప్ విగ్రహాలను అమ్మకానికి పెట్టింది. ‘ట్రంప్, అందరికంటే బుద్దిజం కాస్త ఎక్కువ తెలిసిన వ్యక్తి’ అని కామెంట్ కూడా పెట్టింది. ‘మనమేమిటీ, మన చరిత్ర ఏమిటీ, ట్రంప్ విగ్రహం ఏమిటీ మన పరువంతా పోయింది’ అంటూ నిరసనలేవీ భగ్గుమనలేదు. విచిత్రమేమింటే ట్రంప్ విగ్రహాలే కాదు ట్రంప్ ఫేస్‌మాస్క్‌లు, మోడల్స్, టీషర్ట్లు... బ్రహ్మాండంగా అమ్ముడవుతున్నాయట! -
వెలుగులోకి అలీబాబా చీఫ్ జాక్‌మా
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా రెండున్నర నెలల తర్వాత ఆన్లైన్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో.. తన ఫౌండేషన్ మద్దతు పొందిన టీచర్లకు అభినందనలు తెలియజేశారు. తను రెండున్నర నెలలుగా కనిపించకుండా పోవడానికి, అలీబాబా గ్రూపుపై చైనా సర్కారు నియంత్రణ చర్యల గురించి మా ప్రస్తావించలేదు. ఈ వీడియో చైనా బిజినెస్ న్యూస్, ఇతర పోర్టళ్లలో దర్శనమిచ్చింది. ‘‘జనవరి 20న జరిగిన వార్షిక గ్రామీణ టీచర్ల ఆన్లైన్ కార్యక్రమంలో జాక్‌మా పాల్గొన్నారు’’అంటూ జాక్‌మా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 24న షాంఘై కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా నియంత్రణ సంస్థలను జాక్‌మా విమర్శించారు. ఆవిష్కరణలను తొక్కి పెడుతున్నాయని ఆయన ఎత్తిచూపారు. తర్వాత కొన్ని రోజుల్లోనే జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూపు భారీ ఐపీవో ప్రయత్నాలను నియంత్రణ సంస్థలు సస్పెండ్ చేశాయి. వ్యాపార దిగ్గజంగా ఎదిగిన 56 ఏళ్ల జాక్‌మా ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోవడంతో.. చైనా కమ్యూనిస్ట్ సర్కారు నిర్బంధించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మూడు నెలల సస్పెన్స్‌కు బ్రేక్...
బీజింగ్: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఆయన బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. చైనా బ్యాంకుల తీరును ఎండగట్టిన నాటి నుంచి జాక్ మా బహిరంగంగా కనిపించలేదు. ఇక ఆయన నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ షోకు కూడా హాజరు కాలేదు. దాంతో జాక్ మా మిస్సింగ్ అంటూ రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వ్యతిరేకంగా మాట్లడటంతో జిన్‌పింగ్ ఆయనను ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. జాక్ మా కనిపించారు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసిన జాక్ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు. ఇక జాక్ మా వీడియో కాన్ఫరెన్స్‌కు సంబందించి వీడియో తొలుత ఓ లోకల్ బ్లాగ్‌లో ప్రచారం కాగా.. ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెర పడింది. (చదవండి: జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్ ) ప్రభుత్వంపై విమర్శలతో వివాదం.. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది. -
మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా
న్యూఢిల్లీ: చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ జియామీ మ్యూజిక్‌ను వచ్చే నెల నుంచీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత వేసిన ప్రణాళికలకు దీంతో చెక్ పడవచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో అభిప్రాయపడింది. కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్‌ను ఫిబ్రవరి 5 నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 2013లో మ్యూజిక్ యాప్‌పై అలీబాబా గ్రూప్ మిలియన్లకొద్దీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా చైనీస్ భారీ మ్యూజిక్ మార్కెట్లో ప్రవేశించింది. అయితే ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో జియామీ కేవలం 2 శాతం మార్కెట్ వాటాను మాత్రమే సాధించగలిగింది. వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్ఈజ్, క్లౌడ్ మ్యూజిక్ తదితర సంస్థల వెనుక నిలిచింది. ఈ వివరాలను బీజింగ్ సంస్థ టాకింగ్ డేటా వెల్లడించింది. కాగా.. గత నెలలో చైనా నియంత్రణ సంస్థలు అలీబాబా గ్రూప్‌నకు చెందన యాంట్ గ్రూప్‌పై యాంటీట్రస్ట్ చట్టంకింద దర్యాప్తును చేపట్టిన విషయం విదితమే. -
జాక్ మా ఎక్కడ?
న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో ఆయన అదృశ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తన సొంత టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ కార్యక్రమం తుది ఎపిసోడ్లో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. కార్యక్రమానికి మా హాజరు కాకపోవడం, షో వెబ్సైట్ నుంచి ఆయన ఫొటోలను కూడా తొలగించడం వంటి అంశాలన్నీ చూస్తే దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో వివాదం.. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది. -
షాకింగ్.. జాక్ మా మిస్సింగ్?!
బీజింగ్: చైనీస్ బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కనిపించడం లేదట. చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన కనిపించడం లేదని సమాచారం. రెండు నెలల క్రితం జాక్ మా తన స్వంత టాలెంట్ షో ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత నుంచి పబ్లిక్‌గా కనిపించడం లేదని తెలిసింది. గతేడాది అక్టోబర్ 24న జాక్ మా షాంగైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ పని తీరు వల్ల దేశంలో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నాడు జాక్ మా తన ప్రసంగంలో ‘నేటి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక యుగం నాటి పరిస్థితులకు వారసత్వంగా నిలుస్తుంది. భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త వ్యవస్థను రూపొందించుకోవాలి. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించాలి. యువతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి’ అన్నారు. (చదవండి: అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్) జాక్ మా వ్యాఖ్యలు బీజింగ్ పాలనా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదాస్పద ప్రసంగం అనంతరం యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన సొంత టాలెంట్ షో చివరి ఏపిసోడ్ తర్వాత జాక్ మా బహిరంగంగా కనిపించలేదు. దాంతో ప్రస్తుతం అతడి భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక టాలెంట్ షో అధికారిక వెబ్సైట్ నుంచి జాక్ మా ఫోటోని తొలగించారు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇక జాక్ మా కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఆ సంస్థ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలని కొట్టి పారేయడం గమనార్హం. (చదవండి: జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్) ఈ సందర్భంగా అలీబాబా గ్రూపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జాక్ మా మిస్సయ్యారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం. షెడ్యూల్లో ఏర్పడిన గందరగోళం వల్ల ఆయన ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ షోలో కనిపించడం లేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం జాక్ మా స్థానంలో అలీబాబా గ్రూపు ఎగ్జిక్యూటివ్, లూసీ పెంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆఫ్రికాస్ బిజినేస్ హీరోస్ షో కంటెస్టెంట్ ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘జాక్ మాకు సంబంధించి చైనాలో ఏదో జరుగుతుంది. త్వరలోనే ఆ విషయాలు వెలుగులోకి వస్తాయి’ అన్నారు. -
అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్
హాంకాంగ్, షాంఘై: ఇటీవల పతన బాటలో సాగుతున్న చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో హాంకాంగ్‌లో లిస్టయిన అలీబాబా షేరు 9 శాతం పతనమైంది. తద్వారా జూన్ తదుపరి కనిష్టానికి చేరింది. గత రెండు రోజుల్లో షేరు భారీగా తిరోగమించడంతో కంపెనీ మార్కెట్ విలువలో 116 బిలియన్ డాలర్లమేర ఆవిరైనట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లోనూ షేరు ఇంట్రాడేలో 15 శాతం వరకూ పతనంకావడం గమనార్హం! నిజానికి కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. అయినప్పటికీ చైనీస్ నియంత్రణ సంస్థలు కంపెనీ ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టనుండటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. (యాంట్ గ్రూప్ ఐపీవోకు చైనీస్ షాక్) దర్యాప్తు ఎఫెక్ట్ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మాతోపాటు.. అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యంపై ఇటీవల కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అలీబాబాపై గుత్తాధిపత్య నిబంధనలకింద చైనీస్ నియంత్రణ సంస్థలు దర్యాప్తునకు ఆదేశించాయి. యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపైనా దర్యాప్తునకు శ్రీకారం చుట్టాయి. యాంటీట్రస్ట్ చట్ట ప్రకారం అలీబాబా గ్రూప్‌పై భారీ స్థాయిలో జరిమానాలు విధించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. తొలుత ప్రతిపాదించిన 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022వరకూ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. అయినప్పటికీ సోమవారం షేరు 222 డాలర్ల వద్ద ముగిసింది. (యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్) కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వారాంతాన యాంట్ గ్రూప్‌నకు చెందిన రుణ వ్యాపారం, కన్జూమర్ ఫైనాన్స్ వివరాలపై ఆరా తీసింది. ఇప్పటికే అంటే గత నెలలో 37 బిలియన్ డాలర్ల విలువైన యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూని చైనా నియంత్రణ సంస్థలు నిషేధించాయి. తద్వారా హాంకాంగ్, షాంఘైలలో లిస్టింగ్ చేపట్టేందుకు యాంట్ గ్రూప్ చేసుకున్న సన్నాహాలకు సరిగ్గా రెండు రోజుల ముందు చెక్ పెట్టాయి. కొద్ది రోజుల క్రితం జాక్ మా ఒక ఇంటర్వ్యూలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ నిబంధనలు తదితర అంశాలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు టెన్సెంట్ తదితర టెక్ దిగ్గజాలకు సైతం సమస్యలు సృష్టించవచ్చని ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
43 యాప్స్‌పై బ్యాన్: చైనా అభ్యంతరం
న్యూ ఢిల్లీ: దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ కేంద్రం నుంచి సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనా యాప్ ల నిషేధంపై భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. చైనా కచ్చితంగా ఈ నిషేధింపు చర్యను ఖండిస్తుంది అని తెలిపారు. (చదవండి: భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) #China firmly opposes #Indian side’s repeated use of "national security” as excuse to prohibit #MobileAPPs with Chinese background. Hope India provides fair,impartial&non-discriminatory biz environ for all market players,& rectify discriminatory practices. https://t.co/hPqSHT7NLF pic.twitter.com/zD4FhajYt1 — Ji Rong (@ChinaSpox_India) November 25, 2020 "చైనా నేపథ్యం ఉన్న యాప్ లను నిషేదించటానికి భారత ప్రభుత్వం 'జాతీయ భద్రత' అనే పదాన్ని పదేపదే ఉపయోగించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది. భారతదేశంలో అన్ని మార్కెట్ ఆటగాళ్లకు న్యాయమైన, నిష్పాక్షికమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తుంది" అని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మే నెలలో లడఖ్ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా 43 మొబైల్ యాప్‌లపై కొరడా ఝుళిపించింది. తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లూ ఉన్నాయి. -
జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్
సరిగ్గా రెండు రోజుల ముందు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. గురువారం అటు హాంకాంగ్, ఇటు షాంఘైలలో ఒకేసారి లిస్టింగ్ చేసే యోచనలో యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. అయితే మంగళవారం రాత్రి షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ ఇందుకు బ్రేక్ వేసింది. ఈ వార్తల ఫలితంగా మంగళవారం యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం పతనంకావడం గమనార్హం! అన్లైన్ లెండింగ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంట్ గ్రూప్ ప్రమోటర్ జాక్ మా చైనీస్ బ్యాంకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభావం చూపినట్లు యాంట్ గ్రూప్ తాజాగా అభిప్రాయపడింది. యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. ఆన్లైన్లో మైక్రోరుణాలందించే యాంట్ గ్రూప్‌ను జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ ప్రమోట్ చేసింది. ఆన్లైన్ లెండింగ్పై సవరించిన ఫిన్‌టెక్ నిబంధనలు, లిస్టింగ్‌కు సంబంధించిన వివరాల వెల్లడిలో వైఫల్యం తదితర కారణాలతో యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు చైనీస్ నియంత్రణ సంస్థలు మోకాలడ్డినట్లు అక్కడి మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థల అధికారులు సోమవారం యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్‌తోపాటు.. సీఈవో సైమన్ హును ఆన్లైన్ లెండింగ్ బిజినెస్‌పై ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. చదవండి: యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్ -
యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్
డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 555 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 27,480కు చేరగా.. ఎస్అండ్పీ 59 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 3,369 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 203 పాయింట్ల(1.9 శాతం) వృద్ధిచూపి 11,161 వద్ద స్థిరపడింది. బైడెన్ గెలిస్తే ఎన్నికలకు ముందు డెమొక్రాట్లు పట్టుపట్టిన 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.4 శాతం ఎగసింది. మళ్లీ 94 దిగువన 93.49కు చేరింది. ఇక పసిడి ఔన్స్ 1900 డాలర్లను అధిగమించింది. బీఎన్పీ పరిబాస్‌సహా బ్యాంకింగ్ దిగ్గజాల సానుకూల ఫలితాల కారణంగా మంగళవారం యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం జంప్‌చేశాయి. చమురు అప్ గత వారం పతన బాట పట్టిన ముడిచమురు ధరలు రెండు రోజులుగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తున్నాయి. రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను మరికొంతకాలం కొనసాగించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3 శాతం జంప్‌చేయగా.. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.7 శాతం లాభపడింది. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 1.4 శాతం ఎగసి 38.18 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 1.2 శాతం బలపడి 40.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యాంట్‌కు చెక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనీస్ ప్రభుత్వం చెక్ పెట్టడంతో మంగళవారం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. యాంట్ గ్రూప్‌లో అలీబాబాకు మూడో వంతు వాటా ఉండటం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, అల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.5 శాతం, మోడర్నా ఇంక్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి. -
‘ఆలీబాబా’కు అద్భుత లాభాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవడంతోపాటు ఆ దేశాల ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా చిధ్రం అవడం మనకు తెల్సిందే. ఇందుకు భిన్నంగా అనతి కాలంలోనే చైనా తన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోగా, అక్కడి కొందరు కుభేరులు అనూహ్యంగా అద్భుతమైన లాభాలు సాధించగా, మరో 257 మంది చైనా వాణిజ్యవేత్తలు బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. చైనాలోనే అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించిన జాక్ మాకు చెందిన ‘అలీబాబా’ ఈ కామర్స్ సంస్థ ప్రపంచంలో ఎవరూ ఊహించలేనంత ఏడాదిలో సంపాదించి కొత్త చరిత్రను సృష్టించింది. ఏడాదిలో 1.5 ట్రిలియన్ డాలర్ల (కోటాను కోట్ల రూపాయలు, అక్షరాల్లో చెప్పాలంటే 12 పక్కన 13 సున్నాలు) లాభాలను గడించి అలీబాబా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆయన మొత్తం ఆస్తిలో 45 శాతాన్ని ఏడాది లాభాల ద్వారానే సమకూరినట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అలీబాబా ఈ కామర్స్ వ్యాపారం పెరగడానికి లాక్డౌన్లు, ఆంక్షలు బాగా పనికొచ్చాయి. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారు కూడా కోట్లకు పడగలెత్తారు. వ్యాక్సిన్లను తయారు చేసే ఝిఫీ కంపెనీ వ్యవస్థాపకులు జియాంగ్ రెన్‌షెంగ్ ఆస్తులు కూడా ఏడాదిలో 19.9 బిలియన్ డాలర్లకు, అంటే మూడింతలు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా చైనా జీడీపీ రేటు మైనస్‌లోకి పడిపోతుందనుకోగా, ఈ ఏడాది జీడీపీ 4.9 శాతం ఉన్నట్లు సోమవారం విడుదలైన ఆర్థిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల జీడీపీ రేట్లు మైనస్‌లో పడిపోగా, చైనా ఒక్కటే ప్లస్ వైపు దూసుకుపోవడం అద్భుతమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనానే కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించిందన్న ఆరోపలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి. అయితే అందుకు సాక్ష్యాధారాలు ఏ దేశమూ చూపలేక పోయింది.