క్రోమ్ ను అధిగమించిన యూసీ బ్రౌజర్
హైదరాబాద్: అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌజర్ తాజాగా క్రోమ్‌ను వెనక్కు నెట్టింది. నెలకు 40 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ఆసియాలో అగ్ర పీఠాన్ని, అంతర్జాతీయంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు వెబ్ ట్రాఫిక్ అనలిటిక్స్ సంస్థ స్టాట్ కౌంటర్ వెల్లడించింది. అందరికీ నాణ్యమైన, సౌకర్యవంతమైన ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని అలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జీఎం కెన్నీ యె తెలిపారు. క్లౌడ్ ఆధారిత బ్రౌజింగ్, వేగవంతమైన డౌన్‌లోడ్స్, కస్టమైజ్డ్ కంటెంట్ వంటి అంశాలు తమ బ్రౌజర్ ప్రత్యేకతలన్నారు. యూసీ క్రికెట్‌కు మంచి ఆధరణ లభించిందని... ఇక మీదట మ్యూజిక్, వీడియోస్ వంటి తదితర వాటిల్లో స్థానిక కంటెంట్‌ను అధికంగా ఇస్తామని తెలిపారు.