chrome
-
క్రోమ్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే?
కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్‌కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.👉ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్‌ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్‌కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.👉ఐఓఎస్‌లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.👉ఐఓఎస్‌లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్‌లో డిస్కవర్ ఫీడ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు ముఖ్య గమనిక!
ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. తద్వారా వీపీఎన్ అవసరం లేకుండా వెబ్సైట్లలోని ఐపీ అడ్రస్‌లు కనిపించకుండా హైడ్ చేసుకోనే అవకాశం యూజర్లకు కల్పించనుంది. సాధారణంగా ఐపీ అడ్రస్‌ను ఉపయోగించి క్రోమ్ యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.దీన్ని నివారించేలా గూగుల్ ప్రాక్సీ సర్వర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో ఒరిజనల్ ఐపీ అడ్రస్ స్థానంలో ట్రాక్ చేసేందుకు వీలులేకుండా గూగుల్ ప్రొక్సీ ఐపీ అడ్రస్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా, యూజర్ల ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుందని ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రియానా గోల్డ్‌స్టీన్ మాట్లాడుతూ..అమెరికాలో ఎంపిక చేసిన క్రోమ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. వీళ్లు మాత్రమే గూగుల్.కామ్, జీమెయిల్,గూగుల్ యాడ్ సర్వర్లతో పాటు గూగుల్ ఆదీనంలో ఉన్న డొమైన్లకు ఈ ప్రోక్సీ ఐపీ అడ్రస్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఉద్దేశం ఇదే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం క్రోమ్ వెబ్ సైట్ల ఐపీ అడ్రస్‌లను దాచడమే కాదు. యూజర్లను ట్రాక్ చేసేందుకు వినియోగించే కూకీలను సైతం బ్లాక్ చేస్తుంది. అయితే, ఐపీ అడ్రస్ మీద ఆధారపడే చట్టబద్ధమైన కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ యూజర్లకు హామీ ఇస్తోంది. ముందంజలో యాపిల్ ఈ లేటెస్ట్ టెక్నాలజీని యాపిల్ ఐక్లౌడ్ ప్రైవేట్ రిలే ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇది నెట్వర్క్ ప్రొవైడర్లు యాపిల్ వినియోగదారుల ఐపి అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ముందుగా డీఎన్ఎస్ రికార్డులను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. తరువాత వెబ్సైట్లను యాక్సెస్ చేసేందుకు తాత్కాలిక ఐపీ అడ్రస్‌ను క్రియేట్ చేసేలా థర్డ్ పార్టీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తుంది. థర్ట్ పార్టీ సైట్ల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా ప్రైవసీ ఆప్షన్లను మెరుగుపరచడానికి గూగుల్ తీసుకున్న చర్య, థర్డ్ పార్టీ కుకీల వల్ల ఎదురయ్యే సవాళ్లకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ప్రైవసీ శాండ్ బాక్స్‌ను విడుదల చేసింది. 2024 నాటికి కుకీలను నిలిపివేయాలన్నది గూగుల్ ప్రణాళిక. ఐపీ ప్రొటెక్షన్‌తో వెబ్ సైట్లలో వినియోగదారులను ట్రాక్ చేయడానికి థర్డ్ పార్టీ సైట్లను తగ్గించనుంది. -
భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ షురూ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్‌పీ కలిసి భారత్‌లో క్రోమ్‌బుక్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్‌లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్‌బుక్స్‌తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్ అందుబాటులోకి రాగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో హెచ్‌పీ వీటిని తయారు చేస్తోంది. కొత్త క్రోమ్‌బుక్స్ ఆన్లైన్లో రూ. 15,990 నుంచి లభిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 నుంచి హెచ్‌పీ భారత్‌లో తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఎలీట్‌బుక్స్, ప్రోబుక్స్, జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి వివిధ ల్యాప్‌టాప్‌లు, ఆల్–ఇన్–వన్ పీసీలు, డెస్క్‌టాప్‌లు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేస్తోంది. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంది. -
గూగుల్ - హెచ్‌పీ భాగస్వామ్యంలో క్రోమ్‌బుక్..ధర ఎంతంటే?
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ భాగస్వామ్యంలో హెచ్‌పీ సాయంతో క్రోమ్‌బుక్ తయారీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలిసారి భారత్‌లో క్రోమ్‌బుక్‌లు తయారు చేసేందుకు హెచ్పీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా భారతీయ విద్యార్ధులకు అనువుగా, బడ్జెట్ ధరలో సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు మెరుగవుతాయి’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. We’re partnering with HP to manufacture Chromebooks in India - These are the first Chromebooks to be made in India and will make it easier for Indian students to have access to affordable and secure computing. https://t.co/PuzZnck1wo — Sundar Pichai (@sundarpichai) October 2, 2023 చెన్నై సమీపాన ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్ వద్ద సెప్టెంబర్ 2నుంచి క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభమైందని హెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే 2020 నుంచి ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్‌లో పలు రకాల లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్ కంప్యూటర్లను హెచ్‌పీ తయారు చేస్తుందని పేర్కొన్నారు. కాగా రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంలో విడుదల కానున్న క్రోమ్ బుక్ ధర రూ.15,990 నుంచి ప్రారంభం కానుంది. -
Bhumi Pednekar: అదర్ సైడ్ ఇన్వెస్టార్
‘నీకు తెలియని వ్యాపారంలో పొరపాటున కూడా పెట్టుబడి పెట్టవద్దు’ ‘పెట్టుబడికి సంబంధించిన రెండు రూల్స్ ఏమిటంటే... ఒకటి నష్టం రాకుండా చూసుకోవడం. రెండోది మొదటి రూల్‌ను మరచిపోకపోవడం’ అని పెద్దాయన వారెన్ బఫెట్(ప్రసిద్ధ ఇన్వెస్టర్, అపర కుబేరుడు) చెప్పిన మాటలను ఇష్టపడే బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్‌గా కూడా ‘రాణి’స్తోంది... తాజాగా క్రోమ్ ఆసియా హాస్పిటాలిటీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది భూమి పెడ్నేకర్. ‘మంచి బ్రాండ్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అంటుంది భూమి. క్రోమ్ ఆసియా గ్రూప్ ‘కయా’ పేరుతో గోవాలో బోటిక్ హోటల్‌ను ప్రారంభించింది. భోజనప్రియురాలైన భూమికి ప్రయాణాలు అంటే ఇష్టం. అందుకే ఆ రంగాలకు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ‘పెట్టుబడి పెట్టే ముందు లాభాల కంటే ముందు ఆ కంపెనీకి ఉన్న విశ్వసనీయత గురించి ఆలోచిస్తాను’ అంటుంది భూమి. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’లో ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తీసుకుంది. కమర్షియల్‌గా సక్సెస్ అయిన కామెడీ డ్రామా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’తో తన కెరీర్ ఊపందుకుంది. ఫోర్బ్స్ ఇండియా–2018 ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించింది. మూడు సంవత్సరాల క్రితం ‘క్లైమెట్ వారియర్’ క్యాంపెయిన్ మొదలుపెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తోంది. ముంబైలో జన్మించిన భూమికి మొదటి నుంచి కళలు, పర్యావరణం, వ్యాపారం అంటే ఆసక్తి. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించి నిర్మాణాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్(వెప్) సమావేశంలో మహిళా వ్యాపారవేత్తల గురించి చేసిన ప్రసంగం భూమి పెడ్నేకర్ ఆలోచనలకు అద్దం పడుతుంది. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ, మార్కెట్లో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ విడుదల!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది.హెచ్‌పీ క్రోమ్ బుక్ 15.6 అని పిలిచే క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్ ఉండగా.. మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ల్యాప్‌టాప్‌ను స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ట్యాప్‌లో పెద్ద డిస్ప్లే, వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ (stronger connectivity),11.5 గంటల బ్యాటరీ ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హెచ్‌పీ క్రోమ్‌బుక్‌పై హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ మాట్లాడుతూ.. హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి రావడంతో పర్సనల్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారింది. అందుకే స్టైలిష్, శక్తివంతంగా ఉన్న ఈ క్రోమ్ బుక్ విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఈ క్రోమ్ బుక్ 15.6 ల్యాప్‌ట్యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇంట్లో లేదా క్లాస్ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. HP Chromebook 15.6 ధర HP Chromebook 15.6 ప్రారంభ ధర రూ. 28,999కే లభిస్తుంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్ కలర్స్‌తో అందుబాటులో ఉంది. HP Chromebook 15.6 స్పెసిఫికేషన్లు HP Chromebook మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్ప్లేను కలిగి ఉంది. మైక్రో ఎడ్జ్ బెజెల్స్, 250 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, ముందు భాగంలో వీడియో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్డీ కెమెరా ఉంది. వీటితో పాటు స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో నియర్‌బై షేర్ మాదిరిగానే పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు ఈ ల్యాప్‌టాప్ లో వినియోగించుకోవచ్చు. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. -
Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్
ఖరీదైన ల్యాప్‌ట్యాప్ లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్లో విడుదలైన ఆసుస్ బాహుబలి ల్యాప్ ట్యాప్ మాత్రం కింద పడినా పగలదు.ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్‌ను యాడ్ చేసినట్లు ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. తైవాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఆసుస్ తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 విడుదలతో హాట్ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 (Asus Chromebook Detachable CZ1)ను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 స్పెసిఫికేషన్స్ 500 గ్రాముల బురువు ఉండే ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1.. ఇంట్లో వినియోగించే డెస్క్, లేదంటే డైనింగ్ టేబుల్ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్ చేసేలా నాలుగు వైపుల రబ్బర్ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు గూగుల్ అస్టిస్టెంట్ వాయిస్ రికగ్నయిజేషన్ తో వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,10.1 ఫుల్ హెచ్డీ, ఎల్సీడీ డబ్ల్యూయూఎక్స్‌జీఏ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్ఆర్జీబీ, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పాటు క్రోమ్ ఓఎస్‌తో వస్తోంది. మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు తో పాటు టైపింగ్‌కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్ డిజైన్‌తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్ కెమెరా , 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్‌బుక్‌ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్ తెలిపింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ అడ్జెస్ట్ మెంట్ కోసం స్టాండ్ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. చదవండి : ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?! -
గూగుల్ క్రోమ్ వెబ్‌లో డార్క్ మోడ్
తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ వినూత్న మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. ఇప్పటికే మొబైల్ ఓఎస్ లో ఎన్నో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను తీసుకొనిరాబోతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ సెర్చ్ కూడా ఆటోమేటిగ్గా డార్క్ మోడ్‌కు మారుతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ సెట్టింగ్స్‌ను బట్టి డార్క్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ డివైజ్ లైఫ్ ని ఆదా చేయవచ్చు. ప్రస్తుతం ఇంకా ఈ ఫీచర్‌ను బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఒకవేల మీరు బీటా యూజర్ అయితే, గూగుల్ సెర్చ్ లేదా వెబ్ పేజీని ఓపెన్ చేయగానే డార్క్ మోడ్ వచ్చినట్లు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే డార్క్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దింతో సెర్చ్ పేజీ మొత్తం డార్క్‌లోకి మారిపోతుంది. మీరు కనుక బీటా యూజర్ కాకపోతే క్రోమ్ సెట్టింగ్స్‌లో ‘ఫోర్స్ డార్క్ మోడ్’ ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చు. దీని కోసం గూగుల్ సెర్చ్ బార్లో Chrome://flags ఎంటర్ చేసి 'Dark Mode' అని టైప్ చేయాలి. అప్పుడు ఫోర్స్ డార్క్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే మీ క్రోమ్ పేజీ రీ-లాంచ్ అయిన తర్వాత పేజీ డార్క్ మోడ్ లో కనిపిస్తుంది. చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! 10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ -
క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!
మీరు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం ఆడ్-అన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వీడియోల కోసం, ఇతర అవసరాల కోసం ఆడ్-అన్స్ ను గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ల నుండి డౌన్లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 28 ఆడ్-అన్స్ వరకు మాల్వేర్ సోకినట్లు ఇటీవల గుర్తించబడ్డాయి. యూజర్లను అసురక్షితమైన వెబ్సైట్లకు ఈ ఆడ్-అన్స్ మళ్లిస్తున్నట్లు కనుగున్నారు. దీని ద్వారా ఇమెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్స్, బ్యాంక్ కార్డ్ సమాచారం వంటి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీటి ద్వారా సుమారు 3 మిలియన్ల మంది ప్రభావితమై ఉండవచ్చని భద్రతా సంస్థ అవాస్ట్ తన నివేదికలో పేర్కొంది.(చదవండి: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్) యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం బ్రౌజర్లో ఉపయోగించే ఆడ్-అన్స్ ద్వారా ఇప్పటికే మాల్వేర్ సోకినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక ఆడ్-అన్స్ జాబితాను అవాస్ట్ విడుదల చేసింది. ఈ ఆడ్-అన్స్ ద్వారా సులభంగా హానికరమైన కోడ్లను మీ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ లోకి పంపించవచ్చని అవాస్ట్ తెలిపింది. ఈ 28 ఆడ్ల-ఆన్స్ లో మాల్వేర్లను సులభంగా ప్రవేశించే విదంగా హానికరమైన జావాస్క్రిప్ట్ ఉన్నట్లు ఇటీవల కనుగొన్నారు. సాధారణంగా ఏదైనా లింక్ క్లిక్ చేసిన సమయంలో ఆడ్-అన్స్ ద్వారా డేటా మొత్తం హ్యాకర్ల సర్వర్‌కు వెళ్తుంది. దింతో వారు ఒక్కసారి మనం చూడాలనుకున్న వెబ్‌సైట్‌కు కాకుండా వేరే వెబ్‌సైట్‌కు దారి మళ్లించి వినియోగదారుల డేటాని చోరీ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు అవాస్ట్ పేర్కొంది. "ఈ ఆడ్ ఆన్స్ ద్వారా లాగిన్ సమయం, పరికరం పేరు, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపయోగించిన బ్రౌజర్, వెర్షన్, ఐపీ చిరునామాలతో సహా యూజర్ పుట్టిన తేదీలు, ఇమెయిల్ చిరునామాలు వంటి డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్తుంది. అలాగే వినియోగదారు యొక్క సుమారు లొకేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి సహాయపడుతున్నట్లు” అవాస్ట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారం ద్వారా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయడం లేదా మీ సమాచారాన్ని ఇతర థర్డ్ పార్టీ వారికీ అమ్మడం చేయవచ్చు. ఇలాంటి హానికరమైన ఆడ్-ఆన్స్ గురుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండింటినీ సంప్రదించినట్లు అవాస్ట్ తెలిపింది. దీనికి రెండు కంపెనీలు "ప్రస్తుతం ఈ సమస్యను పరిశీలిస్తున్నామని" చెప్పాయి అని పేర్కొంది. -
10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ అండ్ ట్రిక్స్
ఇంటర్నెట్ ప్రపంచం చాలా విస్తృతమైనది. ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ అనేది మొత్తం ఇంటర్ నెట్ ప్రపంచంలో ఒక శాతమే. అందుకే దీనిని ఒక సముద్రం అనడం మంచిది. దీని ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. కానీ మనం చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనకు ఇంటర్ నెడ్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేని వాటిని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మేము కొన్ని ట్రిక్స్ అందిస్తున్నాం.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్) 01) ఏ సాఫ్ట్వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేయండి Https:// wwwతర్వాత “SS” అనే కీవర్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ఏ సాఫ్ట్వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వివిధ ఫార్మాట్లలో యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే వెబ్ సైట్ కి తీసుకువెళ్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫార్మాట్ లో వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 02) కోట్స్ ఉపయోగించడం(” “) మీరు గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేస్తున్నపుడు మీకు అవసరమైన వాటితో పాటు అనవసరమైన వాటిని ఒక్కోసారి గూగుల్ చూపిస్తుంది. మీకు ఖచ్చితమైన పదం కోసం సెర్చ్ చేసేటప్పుడు ఇప్పుడు కోట్స్ (“ ") ఉపయోగించి సెర్చ్ చేయండి. అప్పుడు ఆ పదానికి సంబదించిన వాటిని మాత్రమే చూపిస్తుంది. కీలకపదాలను సెర్చ్ చేసేటప్పుడు దీన్ని ఒకసారి ప్రయత్నించండి. 03) గూగుల్ నుండి నేరుగా mp3ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏదైనా mp3 ఫార్మాట్ లో పాటని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు చాలా సులభంగా పాటని డౌన్లోడ్ చేసుకోవచ్చు. intitle: index.of? Mp3 తర్వాత మీకు నచ్చిన పాటని టైపు చేసి సెర్చ్ చేయండి. 04) క్రోమ్ లో మూసివేసిన టాబ్‌ను తెరవండి కొన్నిసార్లు మీరు చాలా ముఖ్యమైన పని చేస్తున్నపుడు అనుకోకుండా మీరు టాబ్‌ను మూసివేసిన లేదా షట్ డౌన్ అయినప్పుడు మనం సమాచారాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఆ సమస్య కోసం చింతించకండి. ఎప్పుడైనా మీ ట్యాబ్ మూసివేసినప్పుడు మీరు కీబోర్డ్ నుండి ఒకేసారి Ctrl + Shift + Tకీని నొక్కి పట్టుకోవడం ద్వారా క్రోమ్ టాబ్‌ను తిరిగి పొందవచ్చు. ఇది ఉత్తమ ఇంటర్నెట్ ట్రిక్ కానప్పటికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 05) గూగుల్ సెర్చ్‌లో డిఫైన్ కీవర్డ్‌ని ఉపయోగించండి మీరు ఏదైనా ఒక పదం యొక్క నిర్వచనం పొందాలనుకున్నపుడు Ex: Define: Internet ఇలా టైపు చేస్తే మీకు త్వరగా దానికి సంబందించిన నిర్వచనం మీకు లభిస్తుంది. 06) ఇంటర్నెట్లో బ్లాక్ చేయబడిన వెబ్సైట్లను ఉపయోగించడం కొన్ని సార్లు మన దేశంలో నిషేదించిన కొన్ని వెబ్సైట్లను VPN ఉపయోగించి మీ కంప్యూటర్ నుండి చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీ కంప్యూటర్లో VPNని డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత అందులో మన దేశానికి సంబందించిన సర్వర్‌ను వేరే దేశానికి సంబందించిన సర్వర్‌ను కనెక్ట్ చేయడం ద్వారా నిషేదించిన వెబ్ సైట్ ని ఉపయోగించవచ్చు 07) ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియోలను చూడండి మీరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నపుడు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. ఇలా యాడ్స్ రాకుండా యూట్యూబ్ వీడియోలను చూడాలని అనుకుంటే యాడ్బ్లాకర్ను ఉపయోగించండి. కానీ ఈ యాడ్‌బ్లాకర్ ఉపయోగిస్తుంటే కొన్ని వెబ్సైట్లను మీరు యాక్సెస్ చేయలేరు. 08) గూగుల్ లో టాస్ వేయండి మీరు క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు లేదా ఎప్పుడైనా టాస్ వేయాలని అనుకున్నపుడు మీ దగ్గర కాయిన్ లేకపోతె చింతించకండి ఇప్పుడు గూగుల్ లో కూడా మీరు టాస్ వేయవచ్చు ఎటువంటి కాయిన్ లేకుండా దాని కోసం మీరు గూగుల్ సెర్చ్ లో flip a coin టైపు చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది. అలాగే డైస్ కూడా రోల్ చేయవచ్చు. 09) కాలిక్యులేటర్, అజ్ఞాత మోడ్ ఉపయోగించడం మీ మొబైల్ లో కాలిక్యులేటర్ యాప్ లేకపోతే గూగుల్ శోధనలో కాలిక్యులేటర్‌ను సెర్చ్ చేసి వాడుకోవచ్చు. అలాగే మీరు ఎవరికీ తెలియకుండా, అలాగే మీ హిస్టరీ కూడా రికార్డు చేయకుండా ఉండటానికి ఏదైనా బ్రౌజర్ లో incognito మోడ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా VPNని ఉపయోగిస్తే ఇంకా సురక్షితంగా ఉంటారు. వీటి గురుంచి మీకు తెలిసే ఉంటుంది. 10) స్లో మోషన్లో యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడం యూట్యూబ్ వీడియోను ప్లే చేస్తున్నప్పుడు కీబోర్డ్ నుండి స్పేస్ కీని నొక్కి ఉంచడం ద్వారా మీ యూట్యూబ్ వీడియో స్లో మోషన్లో ప్లే అవుతుంది. దీని కోసం మీరు యూట్యూబ్ సెట్టింగ్ నుండి ప్లేబ్యాక్ వేగాన్ని సెట్ చేయవలసిన అవసరం లేదు. -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే) 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
మ్యూట్‌లో ఆటోప్లే వీడియోలు.. ఎలా?
గూగుల్ తన క్రోమ్ యూజర్లకు బుధవారం సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. కొత్త కొత్త ఫీచర్లతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. కొన్ని వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలకు ఈ అప్డేట్ శాశ్వత పరిష్కారం అందిస్తోంది. క్రోమ్ 64 పేరుతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ క్రోమ్ 64, వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునే ఫీచర్ పొందుపరించింది. చాలా వెబ్సైట్లలో కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా.. వీడియోలు కూడా ఆటోప్లే అవుతుంటాయి. అలా ఆ వెబ్సైట్లలలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునేందుకు సంబంధిత వెబ్సైట్ ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ''మ్యూట్ సైట్'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో డీఫాల్ట్‌గానే ఆటోప్లే అయ్యే అన్ని వీడియోలు ఆగిపోతాయని వెర్జ్ రిపోర్టులు పేర్కొన్నాయి. గత నవంబర్లోనే గూగుల్ ఈ సమస్యపై చర్చించి, దీనికి పరిష్కారంగా క్రోమ్ 64ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. వెబ్సైట్లలో వచ్చే పాప్-అప్స్‌ను సమస్యపై కూడా గూగుల్ పరిష్కారం తీసుకొచ్చింది. పాప్-అప్స్ అనేవి మూడో వ్యక్తి కంటెంట్ కలిగి ఉన్న కొత్త పేజీలు. క్రోమ్ 64 వెబ్సైట్లను ప్రభావితం చేసే మెల్ట్‌డౌన్, స్పెక్టర్ భద్రతా లోపాలకు కూడా పరిష్కారం కనుగొంది. -
క్రోమ్ ను అధిగమించిన యూసీ బ్రౌజర్
హైదరాబాద్: అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌజర్ తాజాగా క్రోమ్‌ను వెనక్కు నెట్టింది. నెలకు 40 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ఆసియాలో అగ్ర పీఠాన్ని, అంతర్జాతీయంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు వెబ్ ట్రాఫిక్ అనలిటిక్స్ సంస్థ స్టాట్ కౌంటర్ వెల్లడించింది. అందరికీ నాణ్యమైన, సౌకర్యవంతమైన ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని అలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జీఎం కెన్నీ యె తెలిపారు. క్లౌడ్ ఆధారిత బ్రౌజింగ్, వేగవంతమైన డౌన్లోడ్స్, కస్టమైజ్డ్ కంటెంట్ వంటి అంశాలు తమ బ్రౌజర్ ప్రత్యేకతలన్నారు. యూసీ క్రికెట్‌కు మంచి ఆధరణ లభించిందని... ఇక మీదట మ్యూజిక్, వీడియోస్ వంటి తదితర వాటిల్లో స్థానిక కంటెంట్‌ను అధికంగా ఇస్తామని తెలిపారు. -
గూగుల్ క్రోమ్ లాంచర్ ఇక ఉండదు!
గూగుల్ క్రోమ్ లాంచర్ ఇక కనిపించకుండా పోనుంది. క్రోమ్ యాప్ లను బ్రౌజర్ లోకి వెళ్లకుండానే సులభంగా ఓపెన్ చేసేందుకు డెస్క్ టాప్, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై కనిపించే గూగుల్ క్రోమ్ లాంచర్‌ను తొలగించనున్నట్లు గూగుల్ సంస్థ తాజాగా వెల్లడించింది. క్రోమ్ లాంచర్ నుంచి విండోస్, మ్యాక్, లైనెక్స్ యాప్‌ల వినియోగదారులు సులభంగా ఆయా యాప్‌లను బ్రౌజ్ చేసేందుకు లాంచర్‌ను వినియోగించే వారు. అయితే ఇటీవల లాంచర్ కారణంగా ఫోన్లలో బ్యాటరీ డౌన్ అయిపోవడం, ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అవ్వడం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటూ గూగుల్ సంస్థకు ఫిర్యాదులు రావడంతో సమస్యపై సంస్థ దృష్టిసారించింది. లాంచర్‌ను జూలై నెలకల్లా తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే లాంచర్‌ను తొలగిస్తున్న గూగుల్ సంస్థ... క్రోమ్ ఓఎస్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది. ఇప్పటికే లాంచర్ వాడుతున్న వినియోగదారులకు ఇకపై దాన్ని తొలగిస్తున్నట్లు సమాచారం వస్తుందని, తర్వాత కొన్నాళ్లకు లాంచర్ ఉండబోదని సంస్థ వెల్లడించింది. లాంచర్ లేకపోయినా క్రోమ్ యాప్‌లు బుక్ మార్క్స్ బార్ లోని యాప్ షార్ట్ కట్ ద్వారా గానీ, క్రోమ్ లో టైప్ చేసి గానీ ఓపెన్ చేయవచ్చని, లేదంటే హెల్ప్ సెంటర్ ను సంప్రదించాలని వినియోగదారులకు సంస్థ సూచించింది.