క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త! | 3 Million Chrome and Edge Users Infected via Extensions | Sakshi
Sakshi News home page

క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!

Published Fri, Dec 18 2020 6:18 PM | Last Updated on Fri, Dec 18 2020 8:42 PM

3 Million Chrome and Edge Users Infected via Extensions - Sakshi

మీరు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం ఆడ్-అన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వీడియోల కోసం, ఇతర అవసరాల కోసం ఆడ్-అన్స్ ను గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ల నుండి డౌన్లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 28 ఆడ్-అన్స్ వరకు మాల్వేర్ సోకినట్లు ఇటీవల గుర్తించబడ్డాయి. యూజర్లను అసురక్షితమైన వెబ్‌సైట్‌లకు ఈ ఆడ్-అన్స్ మళ్లిస్తున్నట్లు కనుగున్నారు. దీని ద్వారా ఇమెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్స్,  బ్యాంక్ కార్డ్ సమాచారం వంటి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీటి ద్వారా సుమారు 3 మిలియన్ల మంది ప్రభావితమై ఉండవచ్చని భద్రతా సంస్థ అవాస్ట్ తన నివేదికలో పేర్కొంది.(చదవండి: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్)

యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం బ్రౌజర్‌లో ఉపయోగించే ఆడ్-అన్స్ ద్వారా ఇప్పటికే మాల్వేర్ సోకినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక ఆడ్-అన్స్ జాబితాను అవాస్ట్ విడుదల చేసింది. ఈ ఆడ్-అన్స్ ద్వారా సులభంగా హానికరమైన కోడ్‌లను మీ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ లోకి పంపించవచ్చని అవాస్ట్ తెలిపింది. ఈ 28 ఆడ్ల-ఆన్స్ లో మాల్వేర్లను సులభంగా ప్రవేశించే విదంగా హానికరమైన జావాస్క్రిప్ట్ ఉన్నట్లు ఇటీవల కనుగొన్నారు. సాధారణంగా ఏదైనా లింక్ క్లిక్ చేసిన సమయంలో ఆడ్-అన్స్ ద్వారా డేటా మొత్తం హ్యాకర్ల సర్వర్‌కు వెళ్తుంది. దింతో వారు ఒక్కసారి మనం చూడాలనుకున్న వెబ్‌సైట్‌కు కాకుండా వేరే వెబ్‌సైట్‌కు దారి మళ్లించి వినియోగదారుల డేటాని చోరీ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు అవాస్ట్ పేర్కొంది.      

"ఈ ఆడ్ ఆన్స్ ద్వారా లాగిన్ సమయం, పరికరం పేరు, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపయోగించిన బ్రౌజర్, వెర్షన్, ఐపీ చిరునామాలతో సహా యూజర్ పుట్టిన తేదీలు, ఇమెయిల్ చిరునామాలు వంటి డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్తుంది. అలాగే వినియోగదారు యొక్క సుమారు లొకేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి సహాయపడుతున్నట్లు” అవాస్ట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారం ద్వారా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయడం లేదా మీ సమాచారాన్ని ఇతర థర్డ్ పార్టీ వారికీ అమ్మడం చేయవచ్చు. ఇలాంటి హానికరమైన ఆడ్-ఆన్స్ గురుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండింటినీ సంప్రదించినట్లు అవాస్ట్ తెలిపింది. దీనికి రెండు కంపెనీలు "ప్రస్తుతం ఈ సమస్యను పరిశీలిస్తున్నామని" చెప్పాయి అని పేర్కొంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement