రహస్య ప్రాజెక్ట్‌.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు | Facebook Snooped On Snapchat YouTube Users Data In Secret Project | Sakshi
Sakshi News home page

రహస్య ప్రాజెక్ట్‌.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు

Published Wed, Mar 27 2024 12:41 PM | Last Updated on Wed, Mar 27 2024 1:17 PM

Facebook Snooped On Snapchat YouTube Users Data In Secret Project - Sakshi

Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్‌బుక్‌ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. 

‘టెక్‌ క్రంచ్‌’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్‌ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్‌లకు మధ్య నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్‌బుక్‌ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం..   యూజర్‌ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్‌బుక్‌ ఈ చొరవను రూపొందించింది.

ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్‌బుక్‌ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్‌లో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్‌క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది.

దీంతో నిర్దిష్ట సబ్‌డొమైన్‌ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్‌బుక్‌ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్‌బుక్‌ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్‌లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్‌ యూజర్ల డేటా కోసం విస్తరించారు. 

సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్‌లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్‌బుక్ టీనేజర్‌లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్‌బుక్ 2019లో ఒనావోను మూసివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement