కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ చుక్కలు
అప్‌లోడ్ చేసినా కనిపించని వీడియోలు
లైవ్ ఛానళ్లకు ఇక్కట్లు
కొత్త వీడియోలు కనిపించక యూజర్ల ఆందోళన
బగ్ ఎక్కడ వచ్చిందని పరిశీలిస్తోన్న యూట్యూబ్
ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్‌సైట్‌లు, సర్వీస్ స్టేటస్ గురించి యూజర్లకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్‌లోడ్ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు.
ఏం జరిగిందంటే..
డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్ ఛానళ్ల నుంచి ఫీడ్/ వీడియోలు/ లైవ్ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్‌కు సర్వీస్ రిక్వెస్ట్‌లు పంపించారు. వర్కింగ్ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి.
Any YouTube Server Down or any other issues please clarify
— Nithish R Yuvirosk (@OneNimitPlzz_NR) February 27, 2024
I go live and upload shorts but nothing shown in channel and yt studio #YouTubeDown @YouTubeCreators @YouTubeIndia https://t.co/qnIvSd0OiV
Comments
Please login to add a commentAdd a comment