down
-
మెరుపు తగ్గిన ‘మిరప’
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.అవగాహన కల్పించే వారేరి?సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు. ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.భారీగా పతనమైన ధర2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022–23 సీజన్లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్‌లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్‌తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్‌లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్‌కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్‌బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్సైట్లో వీడియోలను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్‌లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.యూట్యూబ్‌లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్‌సైట్‌తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.Youtube Video Upload But not showing in YouTube application as well as Yt studio please fix this issue as early as possible.... #Youtubedown #Videouploadbutnotshowingproblem @TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024#YouTube Ka Bhi Systumm Hang Ho Gya Aaj 🤦♀️🤦♀️Upload Nahi Ho Rahi Videos#YoutubeDown— Aditi Shharmaa (@AditiSharma780) July 22, 2024 -
హౌతీల మిసైల్ కూల్చివేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami (צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024 తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది. -
మైక్రోసాఫ్ట్ డౌన్ : మస్క్ సైటైర్, సోషల్‌మీడియా మీమ్స్, ఫన్సీ ట్వీట్స్ వైరల్
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. మస్క్ రియాక్షన్ మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ ఒక మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024 Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024 కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్‌లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.… https://t.co/X9a2ghyo4P— Elon Musk (@elonmusk) July 19, 2024 -
ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024 -
తగ్గిపోయిన కొత్త అఫోర్డబుల్ ఇళ్లు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. మరోవైపు 2023 క్యాలెండర్ ఇయర్లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘రియల్ ఎస్టేట్ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా ప్రకారం హైదరబాద్‌లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్‌కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గింది. -
ఫేస్బుక్, ఇన్‌స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది. -
మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్, లాగిన్ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్‌లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్లో చాలా మీమ్స్ చక్కర్లు కొట్టాయి.telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024 -
స్తంభించిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్ల గగ్గోలు!
ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్సైట్లు, సర్వీస్ స్టేటస్ గురించి యూజర్లకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్లోడ్ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు. ఏం జరిగిందంటే.. డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్ ఛానళ్ల నుంచి ఫీడ్/ వీడియోలు/ లైవ్ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్‌కు సర్వీస్ రిక్వెస్ట్‌లు పంపించారు. వర్కింగ్ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. Any YouTube Server Down or any other issues please clarify I go live and upload shorts but nothing shown in channel and yt studio #YouTubeDown @YouTubeCreators @YouTubeIndia https://t.co/qnIvSd0OiV — Nithish R Yuvirosk (@OneNimitPlzz_NR) February 27, 2024 -
‘ఎక్స్’లో పోస్టులు మాయం.. యూజర్ల గగ్గోలు!
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విటర్) సేవల్లో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇటీవల మొరాయించిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రోజుల వ్యవధిలో మళ్లీ స్తంభించడంతో యూజర్ల గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గురువారం ఉదయం 11 గంటల తర్వాత ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం జరిగిందో తెలియక లక్షలాదిమంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా.. అసంపూర్తిగా ఉండడంతోపాటు పోస్టలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. తమ పోస్టులు కూడా కనిపించకుండా పోయాయని కొందరు యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమకు ఎక్స్ అకౌంట్ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్‌సైట్స్‌కు ఇలాంటి ఫిర్యాదులు 4,800 వచ్చాయి. అయితే సేవల్లో అంతరాయంపై ఎక్స్ ఎలాంటి స్పందనా రాలేదు. -
భారీగా క్షీణించిన ఎఫ్‌డీఐలు.. కేమన్ ఐల్యాండ్స్, సైప్రస్ వెనకడుగు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఆరు నెలల(ఏప్రిల్–సెప్టెంబర్)లో కేమన్ ఐలాండ్స్, సైప్రస్ నుంచి భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు భారీగా క్షీణించాయి. వెరసి దేశీయంగా నమోదైన ఎఫ్‌డీఐలు 24 శాతం బలహీనపడ్డాయి. కేమన్ ఐల్యాండ్స్ నుంచి 75 శాతం తగ్గి 14.5 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో 58.2 కోట్ల డాలర్లు లభించాయి. ఇక సైప్రస్ నుంచి మరింత అధికంగా 95 శాతం పడిపోయి 3.5 కోట్ల డాలర్లకు చేరాయి. గతంలో 76.4 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందుకు ఈ రెండు దేశాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించడం ప్రభావం చూపింది. ఈ బాటలో సింగపూర్, యూఏఈల నుంచి సైతం పెట్టుబడులు వెనకడుగు వేశాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్, ఇతర పశ్చిమ దేశాలలో వడ్డీ రేట్లు పెరగడం, తూర్పు యూరప్, పశ్చిమాసియాలలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలను దెబ్బతీసినట్లు రెగ్యులేటరీ, నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ అంజలీ మల్హోత్రా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైప్రస్ పెట్టుబడులు వార్షికంగా 62 శాతం తగ్గినట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సంజయ్ కుమార్ తెలియజేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి కేమన్ ఐల్యాండ్స్‌ను ఎఫ్ఏటీఎఫ్ రిస్కుల జాబితా(గ్రే లిస్ట్) నుంచి తప్పించడంతో రానున్న కాలంలో భారత్‌కు పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 199 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 0.9 శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 74.96 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ బీజేపీకి, తగ్గినప్పుడు కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతూ వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందనే దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రాజస్థాన్‌లో గత ఐదు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే, ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం వస్తోంది. గత 20 ఏళ్ల ఓటింగ్ ట్రెండ్ కూడా ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ లాభపడిందని, ఓటింగ్ పెరిగినప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. దీంతో డిసెంబరు 3న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాత ట్రెండ్ కొనసాగుతుందో లేదో అనేది ఆరోజున తేలిపోనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని 20 ఏళ్ల రాజస్థాన్ ఎన్నికల చరిత్ర చెబుతోంది. 1998 ఎన్నికల్లో 63.39 శాతం ఓటింగ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గెహ్లాట్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2003 ఎన్నికల్లో ఓటింగ్ 3.79 శాతం పెరిగింది. 67.18 శాతం ఓటింగ్ జరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వసుంధర రాజే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2008లో రాష్ట్రంలో 66.25 శాతం ఓటింగ్ నమోదై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఓటింగ్ శాతం 0.93 శాతం తగ్గింది. గెహ్లాట్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 2013 ఎన్నికల్లో మరోసారి 8.79 శాతం ఎక్కువ ఓటింగ్ రావడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. రాజే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో 0.98 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తం 74.06 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో తక్కువ ఓటింగ్ శాతం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో బీజేపీకే విజయావకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్‌మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
అగ్రి - టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్‌పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్‌ఎస్‌జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్‌ఎస్‌జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్‌లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్‌లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
సాక్షి మనీ మంత్రా: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది. ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్‌లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్‌గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ
Today StockMarket Closin: దేశీయ స్టాక్‌మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి. చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్ఎం ఎస్బీఐ, కోల్ ఇండియా టాప్ గెయనర్స్‌గా నిలవగా, డా.రెడ్డీస్, విప్రో,యూపీఎల్, బజాజ్ ఆటో, సిప్లా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది. 82.93 ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్..రోజంతా నష్టాలే
Bloodbath in Today StockMarket: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్ రోజంతానష్టాలతోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19742 వద్ద ముగిసింఇ. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్; హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్,కోటక్ మహీంద్ర, పీఎన్బీ, ఫెడలర్, ఎస్బీఐ, తదితర బ్యాంకింగ్ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్ ఇతర టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్ర, ఏసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్ బీపీసీఎల్, లాభపడ్డాయి. రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయి 83.09 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో భారీ నష్టాలు
Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు పండగరోజు విరామం తరువాత భారీ పతనాన్నినమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.వరుగా రెండో సెషన్లో పతనమైనాయి. చివరికి సెన్సెక్స్796 పాయింట్లు పతనమై 66,800 వద్ద, నిఫ్టీ 239 పాయింట్ల నష్టతో 19, 901వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌లు, టెక్నాలజీ, మెటల్స్,ఎనర్జీ స్టాక్‌ల మార్కెట్‌ను ప్రభావితం చేవాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 19,900 స్థాయిని తాకింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద, బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) దాదాపు రూ. 2.60 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. హెచ్డీఎఫ్సీ ఏకంగా 4 శాతం కుప్పకూలాగా రిలయన్స్ 2.5 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మ, ఏసిన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్,రిలయన్స్ బీపీసీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది. రూపాయి: సోమవారం నాటి ముగింపు 83.27తో పోలిస్తే బుధవారం డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ 19 పైసలు పెరిగి 83.08 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
Today Stockmarket Opening దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం లాభాలతో మురిపించిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో దాదాపు 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 67,754 వద్ద ,నిఫ్టీ 15 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 20,177 వద్ద ఉంది. తద్వారా కీలక 20 వేలకు ఎగువన సాగుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, కోల్ ఇండియా లాభపడుతుండగా, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, విప్రో, దివీస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,నెస్టే నష్టపోతున్నాయి. మరోవైపు ఈ రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల కొనసాగే అవకాశం ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్బీఐ 2-6 శాతం పరిధితో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో ముగిసిన మార్కెట్, అదానీ జోరు
TodayStockMarketClosingదేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సేచీలు చివరికి వారాంతంలో నెగిటివ్‌గానే ముగిసాయి. సెన్సెక్స్ 202.36 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 64,949వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 19,310 ముగిసాయి. ఎఫ్ఎంసిజి, పవర్ మినహా దాదాపుఅన్ని రంగాలునష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలుప్రతికూలంగా ముగిశాయి. అయితే పెట్టుబడుల జోష్‌తో అదానీ గ్రూపు షేర్లుభారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ దాదాపు 3 శాతం ఎగిసాయి. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు లాభాలనార్జించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ డేట్ ప్రకటించడంతో రిలయన్స్ లాభపడింది. ఇంకా ఐషర్ మోటార్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు లాభపడిన వాటిల్లోఉండగా కోల్ ఇండియా, హీరోమోటో కాప్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హిందాల్కో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?) అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.15తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 83.10 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)