
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్‌లో కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 164 పాయింట్లు క్షీణించి 52,318 వద్ద ముగియగా, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 15,680 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 52500, నిఫ్టీ 15700 స్థాయిని కోల్పోయాయి. ఆటో, ఫార్మ లాభపడగా,బ్యాంకింగ్ ,రియాల్టీ ఇతర రంగాల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి.
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి డెల్టా, డెల్టా ప్లస్ కొత్త వేరియంట్లు పెరుగుతున్న ఆందోళన పెట్టుబడిదారులను వెంటాడినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, టిసిఎస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.డాక్టర్ రెడ్డి ల్యాబ్, బజాజ్-ఆటో, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టైటాన్ లాభపడ్డాయి.
చదవండి: Stockmarkets : నష్టాలు, వొడాఫోన్ ఐడియా ఢమాల్!
Twitter down: సమ్‌థింగ్ వెంట్ రాంగ్..
Comments
Please login to add a commentAdd a comment