Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు పండగరోజు విరామం తరువాత భారీ పతనాన్నినమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.వరుగా రెండో సెషన్‌లో పతనమైనాయి. చివరికి సెన్సెక్స్796 పాయింట్లు పతనమై 66,800 వద్ద, నిఫ్టీ 239 పాయింట్ల నష్టతో 19, 901వద్ద స్థిరపడింది.
బ్యాంకులు, ఫైనాన్షియల్‌లు, టెక్నాలజీ, మెటల్స్,ఎనర్జీ స్టాక్‌ల మార్కెట్‌ను ప్రభావితం చేవాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 19,900 స్థాయిని తాకింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద, బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) దాదాపు రూ. 2.60 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఏకంగా 4 శాతం కుప్పకూలాగా రిలయన్స్ 2.5 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మ, ఏసిన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ లైఫ్,రిలయన్స్ బీపీసీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది.
రూపాయి: సోమవారం నాటి ముగింపు 83.27తో పోలిస్తే బుధవారం డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ 19 పైసలు పెరిగి 83.08 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment