
Today Stockmarket Opening దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం లాభాలతో మురిపించిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో దాదాపు 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 67,754 వద్ద ,నిఫ్టీ 15 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 20,177 వద్ద ఉంది. తద్వారా కీలక 20 వేలకు ఎగువన సాగుతోంది.
టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, కోల్ ఇండియా లాభపడుతుండగా, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, విప్రో, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,నెస్టే నష్టపోతున్నాయి. మరోవైపు ఈ రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల కొనసాగే అవకాశం ఉంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment