TodayStock Market Closing bell: గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. తద్వారా ఈ వారంలో రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సెషన్‌లో నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ బైయింగ్ కనిపించింది. ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గినా మిడ్‌సెషన్ నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 19,700కు ఎగువకు చేరింది. మిడ్‌క్యాప్‌లు, స్మాల్‌క్యాప్‌లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి.
చివరికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 66,119 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు ఎగిసి 19,717 వద్ద ముగిసింది. లార్సెన్, కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ ఎక్కువగా లాభ పడగా, టైటన్, గ్రాసిం, హీరో మోటో, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోయాయి.
రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం స్వల్పంగా లాభ పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే 83.22 వద్ద స్థిరపడింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment