gains
-
ఫేమస్ కంపెనీల మొదటిరోజు లాభాలు..(ఫొటోలు)
-
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు
ముంబై: వాల్యూయేషన్ ఆందోళనలను విస్మరిస్తూ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య స్థాయి షేర్లను కొనేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్ సూచీ లు గురువారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 73 వేల స్థాయి పైన 73,097 వద్ద నిలిచింది. నిఫ్టీ 149 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,146 వద్ద ముగిసింది. సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4 నెలల కనిష్టానికి దిగివచి్చనట్లు డేటా వెల్లడి కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు దిగువ స్థాయి లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. ఒక దశలో సె న్సెక్స్ 602 పాయింట్లు పెరిగి 73,364 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు బలపడి 22,205 వద్ద గరి ష్టాలను అందుకున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఫై నాన్స్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీ య ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవు తున్నాయి. ► కనిష్ట స్థాయిల్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 3.11%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.28% చొప్పున రాణించాయి. రంగాల వారీగా సరీ్వసెస్, టెలికం సూచీలు 4%, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, పారిశ్రామిక ఇండెక్స్‌లు 3%, కమోడిటీ సూచీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► భారత సైన్యం, తీర రక్షక దళం కోసం 34 తేలికపాటి హెలికాప్ట్టర్లు, అనుబంధ పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8,073 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ షేరు 4.2% లాభపడి రూ.3,167 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ 335 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో రూ.7.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపద బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. ► అదానీ గ్రూప్ షేర్లూ ముందడుగేశాయి. ఆదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ సొల్యూషన్స్ 11%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లు 4%, అదానీ పవర్ 2% రాణించాయి. గ్రూప్‌లో కంపెనీల మార్కెట్ క్యాపిటలేషన్ రూ.15.66 లక్షల కోట్లు పెరిగింది. గోపాల్ స్నాక్స్ లిస్టింగ్ మెప్పించలేదు. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.401)తో పోలిస్తే 13% డిస్కౌంట్‌తో రూ.350 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. దాదాపు 15% క్షీణించి రూ.342 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.342 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ, ఫెడ్ పాలసీ మినిట్స్‌పై దృష్టి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ర్యాలీకి అవకాశాలు అధికంగా ఉన్నందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడే వీలుందంటున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ పాలసీ సమావేశ వివరాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్ల రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. ‘‘దేశీయ కార్పొరేట్ క్యూ3 ఫలితాల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సంకేతాలు స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి. నిఫ్టీ కీలకమైన 22 వేల స్థాయిపై ముగిసింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని నిలుపుకోగలిగితే జీవితకాల రికార్డు స్థాయి(22126)ని చేధించే వీలుంది. లాభాల స్వీకరణ జరిగితే 21,750 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,350–21,450 పరిధిలో మరో తక్షణ మద్దతు స్థాయి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. జాతీయ అంతర్జాతీయ అంశాలు మెప్పించడంతో గత వారం సూచీలు ఒకటిన్నరశాతం లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గురువారం ఆర్బీఐ, ఫెడ్ పాలసీ సమావేశ వివరాలు ఈ ఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(గురువారం), గత జనవరి చివర్లో జరిగిన ఫెడ్ మినిట్స్ గురువారం(ఫిబ్రవరి 22న) వెల్లడి కానున్నాయి. ఇరు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్య విధాన వైఖరిలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. నికర అమ్మకందారులుగా ఎఫ్ఐఐలు అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలపై బేరిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ఫిబ్రవరి ఇప్పటి వరకు (ఫిబ్రవరి 16 నాటికి) రూ.3,776 కోట్ల ఈక్విటీలను విక్రయించినట్లు డేటా తెలియజేసింది. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐల రూ.16,560 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ‘‘వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాలకు మించిన నమోదడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇది అమెరికా బాండ్లపై రాబడుల పెరుగుదలకు దారీ తీసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత వంటి వర్ధమాన దేశాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాగే ఆర్బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవడం ఎఫ్ఐఐలను నిరాశపరిచింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. స్థూల ఆరి్థక గణాంకాలు జపాన్ డిసెంబర్ యంత్ర ఆర్డర్ల డేటా సోమవారం, యూరోజోన్ డిసెంబర్ కరెంట్ ఖాతా డేటా మంగళవారం విడుదల కానున్నాయి. బుధవారం జపాన్ జనవరి వాణిజ్యలోటు, యూరోజోన్ వినియోగ విశ్వాస గణాంకాలు, ఈసీబీ నాన్ మానిటరీ పాలసీ మీటింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి. గురువారం యూరోజోన్ డిసెంబర్ సరీ్వసులు, ద్రవ్యోల్బణ, ఈసీబీ పాలసీ మీటింగ్ వివరాలు, అమెరికా నిరుద్యోగ డేటా వివరాలు విడుదలవుతాయి. ఇక వారాంతాపు రోజున ఆర్బీఐ ఫిబ్రవరి తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు ఫిబ్రవరి 16వ తేదీతో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఆయా దేశాల ఆరి్థక వ్యవస్థను ప్రతిబింబిజేసే ఈ స్థూల ఆరి్థక గణాంకాల డేటాను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. -
నాలుగో రోజూ లాభాలు
ముంబై: ఐటీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు సెంటిమెంట్‌ను మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 22 వేల స్థాయిపై 22,041 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. భారత వాణిజ్య లోటు 9 నెలల కనిష్టానికి దిగిరావడంతో క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల ర్యాలీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,218 వద్ద కనిష్టాన్ని, 72,545 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,969 – 22,069 శ్రేణిలో ట్రేడైంది. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.68%, 0.78 % చొప్పున రాణించాయి. ► ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.1,258)తో పోలిస్తే 1% డిస్కౌంట్‌తో రూ.1245 వద్ద లిస్టయ్యింది. 9.22 % నష్టపోయి రూ.1142 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.50% క్షీణించి రూ.1149 వద్ద ముగిసింది. ► వరుస పతనాల నుంచి పేటీఎం షేరు కోలు కుంది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 5% ఎగసి రూ. 341.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశం - కారణం ఇదేనా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెప్టెంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ. 9,800 కోట్లు ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఇందుకు కారణమయ్యాయి. సెప్టెంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
సాక్షి మనీ మంత్రా: ఆర్బీఐ బూస్ట్, సెన్సెక్స్ హైజంప్
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది. రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్‌కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ, ఆటో జోరు, భారీ లాభాలు
Today Stockmarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పి భారీ లాభాలతోముగిసాయి.ముగింపులో, సెన్సెక్స్ 406 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 65,632 వద్ద, నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 19,544 వద్ద ముగిసాయి. రెండు రోజుల నష్టాల పరంపరను అధిగమించిన నిఫ్టీ 19,550పైన స్థిరపడింది. ఆటో, బ్యాంక్, ఐటీ క్యాపిటల్ గూడ్స్ లాభపడగా, ఫార్మా, పవర్ , పిఎస్‌యు బ్యాంకింగ్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, M&M , TCS టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, NTPC, నెస్లే ఇండియా ఉన్నాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. రూపాయి: బుధవారం నాటి ముగింపు 83.23తో పోలిస్తే భారత రూపాయి గురువారం డాలర్‌కు 83.25 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో లాభాలు జోరు
Today StockMaket Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారంతాంలో పాజిటివ్‌గా ముగిసాయి. ఆరంభంలోనే లాభాలతో మురిపించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 19,600 ఎగువకుచేరింది. చివరికి 320పాయింట్లు పెరిగి 65,828 వద్ద,నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 19,638.వద్ద ముగిసాయి. ఐటీ మినహా దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ హెల్త్‌కేర్ సూచీలు 1-2.7 శాతం ఎగిసాయి. కాగ్నిజెంట్ ఫలితాల నిరాశాజనకంగా ఉండటంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ చివర్లో నష్టాలనుంచి తేరు కున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, దివీస్ ల్యాబ్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్టిమైండ్ట్రీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి గత ముగింపు 83.18తో పోలిస్తే డాలర్‌కు 14 పైసలు పెరిగి 83.04 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: జోరుగా..హుషారుగా! లాభాల్లోకి మళ్లిన సూచీలు
TodayStock Market Closing bell: గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. తద్వారా ఈ వారంలో రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సెషన్లో నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ బైయింగ్ కనిపించింది. ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గినా మిడ్‌సెషన్ నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 19,700కు ఎగువకు చేరింది. మిడ్‌క్యాప్‌లు, స్మాల్‌క్యాప్‌లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 66,119 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు ఎగిసి 19,717 వద్ద ముగిసింది. లార్సెన్, కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ ఎక్కువగా లాభ పడగా, టైటన్, గ్రాసిం, హీరో మోటో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోయాయి. రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం స్వల్పంగా లాభ పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే 83.22 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
రూపాయి హై జంప్: కారణం ఇదే!
Rupee rises దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది. (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ) ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్‌మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చాలని జేప్ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు. రూపాయి ఎన్‌డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంక్స్, ఆటో, ఐటీ జోరు, నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వారమంతా దలాల్ స్ట్రీట్ జోరు, పుంజుకున్న రూపాయి
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న సూచీలు వారాంతంలో మద్దతు స్థాయిలకు పైన పటిష్టంగా ముగిసాయి. చివరికి సెన్సెక్స్ 333 పాయింట్లు ఎగిసి 66,599 వద్ద నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 19820 వద్ద స్థిరపడ్డాయి. దీంతో ఈ వారమంతా, వరుసగా ఆరో సెషన్‌లోకూడా లాభపడటం విశేషం. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, రియాల్టీ 1.5-2 శాతం చొప్పున పుంజుకోగా, ఫార్మా ఇండెక్స్ 0.3 శాతం క్షీణించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా నిలవగా, యూపిఎల్, ఐషర్ మోగటార్స్, అపోలో హాస్పిటల్స్ , ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. రూపాయి: గురువారం నాటి ముగింపు 83.21తో పోలిస్తే డాలర్‌తో రూపాయి శుక్రవారం 27 పైసలు పెరిగి 82.94 వద్ద ముగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్, రూ. 2 లక్షల కోట్లు పెరిగిన సంపద
Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టాలతో ఉన్న సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఆఖరి గంట కొనుగోళ్లతో సెన్సెక్స్ 385 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 66,265.56 వద్ద, నిఫ్టీ 116.00 పాయింట్లు లేదా 0.59 శాతం పెరిగి 19,727 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 19,700 ఎగువకు చేరింది. దీంతో వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలతో ముగిసాయి. ఎఫ్ఎంసిజి , ఫార్మా మినహా, ఇతర అన్ని సూచీలు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు బ్యాంక్, పవర్ , రియల్టీ 1-2 శాతం లాభపడ్డాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, లార్సెన్ & టూబ్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్బిఐ , ఐసిఐసిఐ బ్యాంక్‌లతో సహా కొనఇన హెవీవెయిట్ల షేర్ల నేతృత్వంలోని లాభాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ గురువారం వరుసగా ఐదవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 317.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.319.1 లక్షల కోట్లకు పెరిగింది.ఒక్క సెషన్లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.1.8 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు. కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ కాగా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎం అండ్ ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా , ఇన్ఫోసిస్,ఎంఅండ్ ఎం నష్టపోయిన వాటిల్లో టాప్ లో ఉన్నాయి రూపాయి: గత ముగింపు 83.13తో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా తగ్గి 83.21 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలే!
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే స్థబ్దుగా ఉన్న మార్కెట్లు ఆ తరువాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయాయి. కానీ ఆఖరి సెషన్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి కోలుకుని పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 100.26 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 65,880.52 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 19,611 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19,600కి ఎగువన భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్లో సానుకూలంగా ముగియడం విశేషం. ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ , పవర్ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు మెటల్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 0.4-1 శాతం క్షీణించాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దివీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, సిప్లా మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టిపిసి టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. రూపాయి: మంగళవారం ముగింపు 83.03తో పోలిస్తే బుధవారం డాలర్ మారకంలో రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: లాభాలతో శుభారంభం, కోల్ ఇండియా జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఈ వారాన్ని శుభారంభం చేశాయి. ఆరంభ లాభాలనుంచి పుంజుకుని రోజంతా లాభాలతోనే ఉత్సాహంగా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ 240.98 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 65,628.14 వద్ద,నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 19,529 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19500 ఎగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్, మెటల్, ఆటో, రియల్టీ, ఆయిల్ & గ్యాస్ , PSU బ్యాంక్ 1 , 2.8 శాతం మధ్య ఎగిసాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ , స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ షేరు వరుసగాసెషన్లు లాభపడుతూ లిస్టింగ్ ప్రైస్‌ను అధిగమించడం విశేషం. కోల్ ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్, టాటా స్టీల్ లాభపడగా, ఎం అండ్ఎం, యాక్సిస్ బ్యాంకు,ఐటీసీ, నెస్లే, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఆగస్టులో 52.3 మిలియన్ టన్నుల (MT) ఉత్పత్తిలో సంవత్సరానికి 13 శాతం వృద్ధిని నమోదు చేయడంతో కోల్ ఇండియా టాప్ గెయినర్‌గా నిలిచింది. రూపాయి: శుక్రవారం ముగింపు 82.71తో పోలిస్తే సోమవారం డాలర్‌తో రూపాయి 82.74 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) 301 reads -
స్వల్ప లాభాలకు అవకాశం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలు అందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్ధిక గణాంకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు తెన్నులు సూచీలకు దారి చూపొచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు అంచనా వేశారు. ‘‘దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలేవీ లేనందును ప్రపంచ పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. చైనా రియల్ ఎస్టేట్ సమస్యలు, డాలర్ ఇండెక్స్ హెచ్చు తగ్గులు, బాండ్లపై రాబడులు, యూఎస్ నిరుద్యోగ డేటా అంశాలు ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని మార్చగలవు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 19,200 వద్ద తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 19,600 వద్ద కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. స్థూల ఆర్ధిక గణాంకాలు మెప్పించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసిరావడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు లాభపడ్డాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, రియల్ ఎస్టేట్‌తో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చైనా ఉద్దీపన చర్యలు చేపట్టడంతో గత వారం ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో లాభాల్లో కదలాడాయి. స్థూల ఆర్ధిక డేటాపై దృష్టి దేశీయంగా ఆగస్టు సేవల రంగ పీఎంఐ డేటా మంగళవారం విడుదల అవుతుంది. అదే రోజు జూలై అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఆగస్టు వాహన అమ్మకాలు వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు బుధవారం యూఎస్ జూలై వాణిజ్య లోటు, యూరో జోన్ రిటైల్ అమ్మకాలు.., గురువారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు, చైనా వాణిజ్య లోటు డేటా విడుదల అవుతుంది. శుక్రవారం యూఎస్ హోల్‌సేల్ ఇన్వెంటరీ, జపాన్ క్యూ2 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా డేటా వెల్లడి అవుతుంది. అదే రోజున దేశీయంగా ఆగస్టు 25వ తేదీతో ముగిసిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ వృద్ది డేటా, సెపె్టంబర్ ఒకటో తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వలు డేటా విడుదల అవుతుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓ సెపె్టంబర్ 4న మొదలై ఆరో తేదిన ముగిస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.165.03 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ ధరను రూ. 93–రూ. 98గా నిర్ణయించారు. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 6న మొదలై ఎనిమిదో తేదీ ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 869.08 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ధరల శ్రేణి రూ.695– రూ. 735 గా ఉంది. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. నాలుగు నెలల కనిష్టానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు ఆగస్టులో స్వల్పంగా తగ్గాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12 వేల కోట్లకు తగ్గించారు. అంతకు ముందు వరుసగా మూడు నెలల పాటు ఎఫ్‌పీఐలు రూ.40 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ‘‘పూర్తిగా నిధుల ఉససంహరణ కంటే వేచి ఉండే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది’’ అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొనుగోలు చేశారు. -
రూపాయి జోరు:మూడు వారాల గరిష్టానికి
Rupee hits over three week high: డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా మూడో రోజూ (ఆగస్ట్ 24న ) లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి మూడు వారాల గరిష్ఠ స్థాయిని 82.47 వద్ద మునుపటి ముగింపుతో పోలిస్తే 0.26 శాతం పెరిగింది. బుధవారం 27 పైసలు పెరిగి 82.72 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే. ఇంట్రాడేలో, కరెన్సీ గరిష్టంగా 82.46ను తాకింది. ఆగస్టు 2న చివరిగా కనిపించిన స్థాయి. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రెండు నెలల వ్యవధిలో రూపాయి ఈ స్థాయిలోపెరగడం విశేషం. చైనీస్ యువాన్ , జపనీస్ యెన్లలో పెరుగుదల , దేశీయ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉండటం రూపాయికి సానుకూలంగా మారింది. ఐపీవో సంబంధ పెట్టుబడుల ప్రవాహం, దేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, క్రూడాయిల్ రేట్లు తగ్గుతుండటం తదితర అంశాలు రూపాయి పెరగడానికి దోహదపడిందని నిపుణుల భావిస్తున్నారు. సమీకాలంలో 82 స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ షేర్ల అండ లాభాల ముగింపు
Today Stock Markets Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతోముగిసాయి. ఆరంభంలాభాలను కొనసాగించిన సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 213 పాయింట్లు ఎగిసి 65433 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 19444 వద్ద స్థిరపడ్డాయి.బ్యాంకు, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్బ్యాంకు, హిందాల్కో, ఎస్బీఐ, ఐసీఐసీఐబ్యాంకు, దివీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్‌ఫార్మా, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 82.93తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 25 పైసలు పెరిగి 82.68 వద్ద ముగిసింది. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: లాభాల మెరుపులు, జియో ఫైనాన్సియల్ లిస్టింగ్ నీరసం
TodayStockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత వారం నష్టాలనుంచి కోలుకున్న సూచీలు ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేశాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65, 216వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 19394 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ,ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్‌గ్రిడ్, హిందాల్కో టాప్ విన్నర్స్‌గా నిలవగా, రిలయన్స్, ఎంఅండ్ఎం, బ్రిటానియా, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలో ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. నిరాశపర్చిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్‌లో కస్టమర్లకు షాకిచ్చింది. సోమవారం ఈ షేరు ధరబీఎస్ఈలో రూ.265 నిఫ్టీ రూ. 262 వద్ద లిస్ట్ అయింది . అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయికి జారిపోయింది. రెండు ఎక్స్ఛేంజీలలో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
సాక్షి మనీ మంత్రా: మూడు రోజుల నష్టాలకు చెక్, సరికొత్త రికార్డు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలనుచెక్ చెప్పిన దలాల్ స్ట్రీట్ భారీ లాభాలతో కొత్త రికార్డులను తాకింది. ఆరంభంలో నష్టాలను చేసిన సూచీలు చివర్లో బాగా పుంజుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, FMCG, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఐటీ షేర్లు నష్ట పోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 19750కి ఎగువన ముగిసింది. సరికొత్త ఆల్-టైమ్ హై జూలై 26న ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 351 పాయింట్లుఎగిసి 66,707 నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,979 వద్ద ముగిశాయి. దాదాపు 1,718 షేర్లు పురోగమించగా, 1,574 క్షీణించాయి. టాటా మెటార్స్, వొడాఫోన్‌ఇండియా, లార్సెన్, ఐటీసీ, బ్రిటానియీ, రిలయన్స్,సన్‌ఫార్మ టాప్ గెయినర్స్‌గా నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ ఎం,టెక్ మహీంద్ర, అపోలో భారీగా నష్టపోయాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 81.87తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 13 పైసలు తగ్గి 82 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న బుల్ జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలు మరింత ఎగిసిన సె న్సెక్స్, నిఫ్టీ మరో ఆల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 67,094 వద్ద, నిఫ్టీ పాయింట్లు ఎగిసి 19846 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి. విదేశీ నిధుల ప్రవాహం, యూఎస్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ఇండెక్స్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 67 వేలకు ఎగువన, నిఫ్టీ కూడా రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేసింది. నిఫ్టీ 19,850 సమీపంలో ముగిసింది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, టాప్ ఇండెక్స్ గెయినర్లుగా . మరోవైపు హిందాల్కో, బజాజ్ఆటో, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హీరో మోటో టాప్ లూజర్లుగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 82.04తో పోలిస్తే బుధవారం డాలర్‌కు రూపాయి స్వల్పంగా తగ్గి 82.09 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్, సరికొత్త రికార్డులు నమోదు
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే సరికత్త రికార్డుస్థాయిలను తాకాయి.వాల్ స్ట్రీట్ లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. చరిత్రలో తొలిసారి 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 67వేల స్టాయిని తాకింది. నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్-టైమ్ శిఖరాలకు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, మెటల్ షేర్లు బాగా నష్టపోయాయి. రికార్డ్ స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 66,795 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఫ్టాట్‌గా మారిన నిఫ్టీ చివర్లోపుంజుకుని 38 పాయింట్లు ఎగిసి 19,749 వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. 2 బిలియన్ల డాలర్ల డీల్ కారణంగా ఇన్ఫోసిస్ షేరు టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హీరో మోటోకార్ప్ ఎ క్కువగా లాభపడగా, ఫలితాల నేపథ్యంలో ఎల్టీఐ మైండ్ ట్రీ భారీగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి రూపాయి: మంగళవారం నాడు డాలర్‌తో రూపాయి 82.04 వద్ద స్థిరంగా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: లాభాల ప్రారంభం, రికార్డ్ స్థాయికి దలాల్ స్ట్రీట్
Today Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఆరంభంలో లాభాలతొ మొదలైనాయి. కానీ గ్లోబల్ సంకేతాలతో సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 66091 నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 19590 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందనే అంచనాలతో ట్రేడర్ల అప్రమత్తంగా వ్యవహరించే చాన్స్ ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాలతో, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. అయితే ఫలితాలు, నిపుణుల వ్యాఖ్యలు నిరాశాజనకంగా ఉనప్పటికీ ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఈ నెలలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం ఎగిసింది. టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్టీఐ మైండ్‌ట్రీ ఎక్కువగా లాభ పడుతుండగా హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిట్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, నష్టపోతున్నాయి. దీనికి తోడు మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. హెచ్డీఎఫ్సీ, ఎల్టీఐ మైండ్‌ట్రీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా నిఫ్టీ 50, సెన్సెక్స్‌లు శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిసిన సంగతి తెలిసిందే.. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: పీఎస్‌యూ బ్యాంకింగ్,మెటల్ బలహీనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. కన్సాలిడేషన్ టోన్‌కు కొనసాగింపుగా, రోజంతా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభ నష్టాల మధ్య కదులాడుతూ నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరికి సెన్సెక్స్ 274 పాయింట్లు ఎగిసి 65,617 వద్ద,నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 19,448వద్ద ముగిసాయి. మెటల్ , PSU బ్యాంకులు మినహా అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, పవర్, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్,హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి సన్‌ఫార్మా, ఐషర్‌మోటార్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా కన్జ్యూమర్, మారుతి టాప్ గెయినర్స్‌గా నిలవగా, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాలతో ముగిసింది. సోమవారం నాటి ముగింపు 82.57తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 21 పైసలు పెరిగి 82.36 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు: అదరగొట్టిన రిలయన్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 64 పాయింట్లు ఎగిసి 65344 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 19355 వద్ద స్థిర పడ్డాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్ రెండు రంగాలు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సిజి, కన్స్యూమర్ డ్యూరబుల్ , ఆటో , ఐటీ నష్ట పోయాయి. రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్,భారతి ఎ యిర్‌టెల్ టాప్ గెయినర్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, పవర్ గ్రిడ్, టీసీఎస్, నెస్లే టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద సంస్థ తన ఆర్థిక సేవల డీమెర్జ్ వార్తలతో భారీగా లాభపడింది. మూడు నెలల్లో లేనంత అత్యధికంగా లాభపడింది. వరుస లాభాలతో రిలయన్స్ మార్కెట్ క్యాప్‌లో రూ. 70వేల కోట్లు వచ్చి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న ర్యాలీని నిలబెట్టుకున్నాయి. మిడ్ అండ్ స్మాల్-క్యాప్ సెగ్మెంట్లు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించాయి, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ కన్జ్యూమర్ స్టాక్‌లు సెక్టోరియల్ ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఆటో, ఐటీ నష్టపోయాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు ఎగిసి 65,785 వద్ద, నిఫ్టీ 99పాయింట్లు లాభంతో 19497 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా మరో ఆల్ టైం రికార్డ్ హైని నమోదు చేశాయి. ఎం అండ్ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ భారీ లాభాలతో ముగియగా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్ జోరు, రికార్డు స్థాయికి సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. గురువారం ఉదయం సరికొత్త రికార్డు స్థాయిని నమోదు దిశగా కదులుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ తరువాత లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 65,609 వద్దస్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 19,450 కి చేరువలో ఉంది. రిలయన్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 65,586 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 19,435వద్ద ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, అపోలో, పవర్ గ్రిడ్, రిలయన్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్‌గా కొనసాగుతుండగా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, దివీస్లేబ్స్ , బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి 13 పైసలు కుప్పకూలి 82.36 వద్ద ఉంది. మరోసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే అంచనాల మధ్య డాలర్ బలం పుంజుకుంది. మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
రికార్డ్ ర్యాలీకి బ్రేక్, అదరగొట్టిన మారుతి సుజుకి
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతోనైనా పటిష్టంగానే ముగిసాయి. నిఫ్టీ 50 వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయి సెషన్‌ను కొనసాగించింది. 10 పాయింట్ల లాభంతో 19,398.50 వద్ద ముగియగా, సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 65,446 వద్ద ముగిసింది. ప్రాఫిట్-బుకింగ్ కారణంగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీకి బ్రేక్ పడింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల నష్టం పోయింది. సెన్సెక్స్‌లో ఎంపీవీ ఇన్విక్టో లాంచ్ తరువాత మారుతీ సుజుకి షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-క్యాప్) తొలి సారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్జ్యూమర్, యూపీఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
రిలయన్స్ జోరు: దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సరికొత్త గరిష్టాలను రికార్డ్ చేస్తూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగిసి 65,239 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 19,327 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. ఇదీ చదవండి: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్ అటు ఆటో రంగ షేర్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ లాభాల్లో కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా నష్టపోతున్నాయి. గ్రాసిం, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హిందాల్కొ, విప్రో, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, యూపీఎల్ బ్రిటానియా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో లాభాల హోరు, రికార్డు ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు చివరికి రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి.సెన్సెక్స్ 803 పాయింట్లు ఎగబాకి 64,719 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189వద్ద ముగిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఎంఅండ్ ఎం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, సన్‌ఫార్మ, హీరోమోటో టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ , అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ఆటో, దివీస్ ల్యాబ్స్ భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.03 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. -
జోరుగా దలాల్ స్ట్రీట్: బ్యాంకింగ్, ఐటీ టాప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుసగా లాభాలను కొనసాగుతున్న సూచీలు వారాంతంలో కూడా జోష్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగాఎగిసింది. నిఫ్టీ 19,100ను తాకింది. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాలు, ప్రధానంగా ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల లాభంతో 64,376 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగిసి 19,095 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ బ్రిటానియా టాప్ లూజర్స్‌గా ఉండగా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ ఎం, టెక్ ఎం, హీరో మోటో, ఇండస్ బ్యాంకు భారీగా లాభపడుతున్నాయి. -
సెన్సెక్స్ ఆల్-టైం రికార్డ్: ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీ సెన్సెక్స్ బుదవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 63,588 వద్ద సెన్సెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్‌లో 9 బిలియన్ల డాలర్ల బలమైన వాలెట్‌ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు స్థాయిని టచ్ చేసింది. దాదాపు 137 రోజుల తరువాత ఆల్‌టైం హైని తాకింది. గత ఏడాది డిసెంబర్ 1న గత ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 53,523వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 18,857 రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. పటిష్టంగా ఉన్నజీడీపీ ఔట్లుక్, ద్రవ్యోల్బణం తగ్గు ముఖం, విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లతో సహా బలమైన ఫండమెంటల్స్ మార్కెట్లను ఆల్ టైంకి చేర్చాయని మార్కెట్ పండితుల మాట. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సెన్సెక్స్ కొత్త శిఖరానికి చేరడంతో ఇకపై మార్కెట్ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. యోగాలో, బాహ్య ప్రపంచం కంటే లోపలి ప్రపంచంపైనే దృష్టి ఉంటుంది. మార్కెట్లో కూడా పెట్టుబడిదారులు ఇండెక్స్ స్థాయి కంటే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. యోగాలో, సుదీర్ఘ కాల వ్యవధిలో ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన నీలేష్ షా వ్యాఖ్యానించడం విశేషం. అటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో ట్రేడ్ అయింది. ఫ్టాట్‌గా ప్రారంభమైనప్పటికీ, వెంటనే లాభాల్లోకి మళ్లాయి. కానీ తరువాత లాభాల స్వీకరణ కారణంగా సూచీలు ఫ్లాట్ జోన్లోకి మారాయి. ఫైనాన్స్, మీడియా, రియల్టీ లాభాల్లో ఉండగా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు నష్ట పోతున్నాయి. పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లాభాల్లో ఉండగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, దివీస్, యాక్సిస్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టాలతో 82.10 వద్ద కొనసాగుతోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
స్మార్ట్ రికవరీ! లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలనుంచి కోలుకుని లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ , నిఫ్టీ మిడ్‌సెషన్ తరువాత కోలుకుని డే గరిష్టం వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు ఎగిసి 63,323 వద్ద, నిఫ్టీ 61పాయింట్ల లాభంతో 18,817 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ లాభపడగా, హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, రిలయన్స్ షేర్ల లాభాలు సూచీల స్మార్ట్ రికవరీకి తోడ్పడ్డాయి. టాటా మోటార్స్,హెచ్‌సీఎల్‌టెక్,పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్ఆటో టాప్ గెయినర్స్‌గా ఉండగా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ నష్ట పోయాయి. అటు మిడ్క్యాప్ఇండెక్స్ వరుసగా ఏడో సెషన్లో కూడా రికార్డు హైని తాకింది. -
భారీ లాభాలు: రికార్డ్ క్లోజింగ్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో మురిపించింది. భారీ లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్న నమోదు చేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. సెన్సెక్స్ 467 పాయింట్లు ఎగిసి 63,385, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,826 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు తప్ప మిగతా రంగాలు లాభాలనార్జించాయి నెస్లే ఇండియా, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్‌సీఎల్ షేర్లు టాప్ విన్నర్స్‌గా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అటు డాలరుతోపో లిస్తే రూపాయి మారకం విలువ 81.94గా నిలిచింది. రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 290.7 లక్షల కోట్ల నుండి రికార్డు స్థాయిలో రూ. 292.7 లక్షల కోట్లకు పెరిగింది, ఈఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. -
మార్కెట్ బౌన్స్ బ్యాక్, ఐటీ ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి నష్టాలనుంచి బౌన్స్ బ్యాక్ అయిన సూచీలు కీలక మద్దతు స్తాయిలను అధిగమించాయి. ఐటీ తప్ప అన్ని రంగాలు, ముఖ్యంగా మెటల్, ఫార్మా, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు తిరిగి 63 వేల మార్క్ పైకి ఎగిసింది. నిఫ్టీ 18,750 పైన బలంగా ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్‌ఫిన్‌సర్వ్, డా. రె డ్డీస్, హిందాల్కో యూపీఎల్ తదితర షేర్లు లాభాల్లోనూ, బజాజ్ఆటో, టాటా కన్జ్యూమర్, విప్రో, టీసీఎస్ బీపీసీఎల్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
మెటల్స్ షైన్, మూడో రోజు లాభాల్లో,రికార్డు స్థాయికి దగ్గర్లో
సాక్షి ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంప ఎదురు చూస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85.35 పాయింట్ల లాభపడి 63,229 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 18,756 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియాలో షేర్లు నష్టపోయాయి టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ టాప్ విన్సర్స్గానూ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ టూప్లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో భారత కరెన్సీ రూపాయి 27 పైసలు బలపడి 82.11 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
లాభాల జోరు: ఎంఆర్ఎఫ్ రికార్డ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా రియల్టీషేర్లు లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. 418 పాయింట్లు లాభంతో 63,143వద్ద 119 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,720 వద్ద ముగిసాయి. దాదాపు టాటా కన్జ్యూమర్స్, టైటన్, సిప్లా, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడగా, కోటక్ మ హీంద్ర, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి 8 పైసలు పెరిగింది. ఏప్రిల్ 2023లో 4.7శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం మే 2023లో 4.25శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే , ఎంఆర్‌ఆఫ్ రికార్డ్ ప్రఖ్యాత రబ్బరు టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మరోసారి ఆకాశానికి దూసుకుపోయింది. ఎంఆర్ఎఫ్ షేరు తొలిసారి లక్ష మార్క్‌ను టచ్ చేసింది. అంతేకాదు రానున్న కాలంలో షేర్ ధర రూ.1.47 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, మార్కెట్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కొనుగోళ్ల జోరు: సింగిల్ డేలో రూ. 2.4 లక్షల కోట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దాదాపు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ఆరంభంలో 125 పాయింట్ల లాభంతో ఎగిసిన సెన్సెక్స్ చివరికి 350 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 63,143 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభంతో 18,726 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 63వేలకు ఎగువన, నిఫ్టీ 18,700కి ఎగువన బలమైన నోట్‌తో ముగిశాయి. అంతర్జాతీ సంకేతాలకు తోడు, ఆర్బీఐ రానున్న పాలసీ రివ్యూలో వడ్డీరేటు పెంపు ఉండదనే అంచనాల మధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బిపిసిఎల్, నెస్లే ఇండియా మరియు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ అత్యధికంగా లాభపడగా, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 286.6 లక్షల కోట్ల నుండి రూ. 289 లక్షల కోట్లకు పెరిగింది, పెట్టుబడిదారులు ఒకే రోజులో రూ 2.4 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం ) -
మార్కెట్ దూకుడు: 63 వేల మార్క్‌కు చేరువలో సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 63 వేల మార్క్ వైపు సాగు తుండగా, నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి 18632 వద్ద కొనసాగుతోంది. బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, గ్రాసిం, లార్సెన్ భారీగా లాభపడుతుండగా, దివీస్, ఏసియన్ పె యింట్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్ర, హెచ్‌యూఎల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరిన్ని మార్కెట్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్ -
నష్టాలకు చెక్, వారాంతంలో లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు లాభాలతో కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 62,547 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 18,534 వద్ద స్థిరపడింది. హిందాల్కో, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ విన్నర్స్‌గా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్,హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 12పైసలు ఎగిసి 82.30 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో దలాల్ స్ట్రీట్, లక్షల కోట్లు పెరిగిన సంపద
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 629 పాయింట్లుఎగిసి 62501 వద్ద ముగియగా, నిఫ్టీ 178 పాయింట్లు ఎగిసి 18499 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద 2. లక్షల కోట్లు పెరిగింది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.ప్రధానంగా రిలయన్స్, సన్‌ఫార్మా, హిందాల్కో, దివీస్, హెచ్‌యూఎల్ లాభపడగా, ఓఎన్జీసీ, గ్రాసిం, బజాజ్ఆటో, భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) హైలైట్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలతో నిఫ్టీ శుక్రవారం 2023 ఏడాది తొలిసారి 18,500 మార్క్‌ను దాటింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.24 లక్షల కోట్లు పెరిగి రూ.282.57 లక్షల కోట్లకు చేరుకుంది. సన్ ఫార్మా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,984.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,277.25 కోట్ల నష్టం నమోదు చేయడం గమనార్హం నిఫ్టీ ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 50,000 మార్క్‌ను అధిగమించి రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
StockMarketToday: భారీ లాభాల్లో సూచీలు, అదానీ షేర్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి 62221 వద్ద, నిఫ్టీ పాయింట్ల 77 లాభంతో 18417 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాకింగ్, ఆయిల్ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. (చదవండి: సాక్షిబిజినెస్) అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ తదితర గ్రూపు షేర్లన్నీ లాభాల్లో జోరుగా ఉన్నాయి. ఇంకా బీపీసీఎల్ , బ్రిటానియా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, అపోలో హాస్పిటల్స్, టైటన్, కోటక్ మహీంద్ర, సిప్లా, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. ఇదీ చదవండి : రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు -
Today Market Closing ఐటీ,అదానీ షేర్ల జోష్, వారాంతంలో సెన్సెక్స్ దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు వివాదంలో సుప్రీం తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.దీనికి తోడు ఐటీషేర్లలో ర్యాలీ ఊతమిచ్చింది. ఫార్మా రంగ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 61730 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 18203 వద్ద ముగిసాయి. అదానీ కేసులో సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక ప్యానెల్ ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. అలాగే 13 ఎఫ్‌పిఐల వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులకు గ్రూప్‌తో లింక్ ఉందో లేదో నిర్ధారించేందుకు ఇంకా ఎక్కువ సమయం కావాలని సెబీ కోరింది. దీంతో అదానీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హిందాల్కొ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. (భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!) అటు దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ లైఫ్, హీరో మోటార్స్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసాయి.అటు గురువారం 82.59 ముగింపుతో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి స్వల్పంగా తగ్గి 82.66 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర ఇంట్రస్టింగ్ బిజినెస్ న్యూస్‌కోసం చదవండి: సాక్షి, బిజినెస్ -
కష్టాల్లో అదానీ గ్రూపుషేర్లు: సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభ పడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 240 పాయింట్లు ఎగిసి 62268 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 18380 వద్ద కొన సాగుతున్నాయి. బలమైన త్రైమాసిక ఫలితాలతో టాటా మోటార్స్ షేరు 4 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. అపోలో హాస్పిటల్స్, ఐషర్ మెటార్స్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బంధన్ బ్యాంక్ టాప్ ఇండెక్స్ గెయినర్‌గా ఉంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) మరోవైపు అదానీ ట్రాన్స్మిషన్, ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా నష్టాలతో ట్రేడ్ అతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 3.3 శాతం క్షీణించింది. ఇంకా సిప్లా, దివీస్, మారుతి సుజుకి ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోతున్నాయి. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
ఆటో, బ్యాంకింగ్ జోరు: తెప్పరిల్లిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయింది. మిడిసెషన్‌నుంచి ఆటోమొబైల్, ఫైనాన్షియల్ షేర్లు లాభాలతో చివరికి లాభపడ్డాయి. సెన్సెక్స్ 62వేల స్థాయికి ఎగువన ముగిసింది. (సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే) ప్రారంభ నష్టాలను పుంజుకున్నసెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,028 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 18,314.80 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 18300 పాయింట్లు ఎగువన స్థిరపడింది. ఐషర్ మోటార్స్, ఎం అండ్ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ టాప్ విన్నర్స్‌గానూ, హిందాల్కో, బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) అటు డాలరుమారకంలో రూపాయి గురువారం నాటి ముగింపు 82.09 తో పోలిస్తే శుక్రవారం 82.16 వద్ద ముగిసింది. ⇒ మరిన్ని మార్కెట్ సంబంధిత వార్తల కోసం చదవండి సాక్షి బిజినెస్, మీ అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సెన్సెక్స్ హైజంప్: కారణాలివే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. సెన్సెక్స్ ఏకంగా 710 పాయింట్లు పెరిగి 61,764 వద్ద, నిఫ్టీ 50 195 పాయింట్లు లాభపడి 18,264 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్, ఫైనాన్స్, ఆటో , రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. అటు రెండు అదానీ గ్రూప్ స్టాక్‌లలో ఫ్రీ ఫ్లోట్‌ను తగ్గించాలని ఎంఎస్సీఐ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఇండస్ఇండ్ బ్యాంక్ 5 శాతం. బజాజ్ ఫైనాన్స్ ,టాటా మోటార్స్ , బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, , HCL టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ , ఇండెక్స్ హెవీవెయిట్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా దాదాపు 2శాతం క్షీణించగా, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టూబ్రో నెస్లే కూడా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 2 పైసలు తగ్గి 81.80 వద్ద స్థిరపడింది. లాభాలకు కారణాలు దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, చమురు ధరల పతనం, క్యూ4లో కంపెనీల లాభాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్ సూచీలకు ఊతమిచ్చాయి. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ 777.68 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.79 శాతం పెరిగి 76.65 డాలర్లకు చేరుకుంది. -
ఇన్పీ, రిలయన్స్ దన్ను, ఎనిమిదో సెషన్లోనూ లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాల్లో ముగిసింది. ఆరంభ లాభాలను కొనసాగించిన సూచీలు రోజంతా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. త్రైమాసిక ఫలితాలకు తోడు ఏప్రిల్‌లో జీఎస్టీ రికార్డ్ వసూళ్లు, వాహన విక్రయాల్లో జోరు, విమాన ప్రయాణాలు పుంజుకోవడం, తయారీ కార్యకలాపాలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. (తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ) ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ ,రిలయన్స్ ఇండస్ట్రీస్‌లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 61,355 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లలాభంతో 18,147.65 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ నెస్లే నష్ట పోయాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆరు పైసలు పతనమై 81.88 దగ్గర ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) కాగా ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఏటా 12 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుని, ఆల్‌టైమ్ నెలవారీ గరిష్ట స్థాయిని తాకినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలను వెల్లడించింది. భారత్‌లో తయారీ కార్యకలాపాలు మరింత వేగవంతమై ఏప్రిల్‌లో నాలుగు నెలల గరిష్టాన్ని తాకాయి. -
తొమ్మిదినెలల తరువాత 18వేల స్థాయికి నిఫ్టీ, అన్ని రంగాల్లోనూ లాభాలే!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. వారంతంలో కీలక సూచీలు రెండూ పాజిటివ్ నోట్‌తో ముగిసాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ఊగిసలాడినప్పటికీ, కంపెనీ ఫలితల జోష్‌తో సెన్సెక్స్ 463 పాయింట్లు ఎగిసి 61112 వద్ద ముగియగా, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 18065 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 18000 స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ 61100 వేల స్థాయికి పైన స్థిరపడింది. గత తొమ్మినెలల కాలంలో ఇదే అదిపెద్ద లాభం. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా అదానీ ట్విన్స్ అదానీ పోర్ట్స్, ఎంటర్ప్రైజెస్ భారీగా లాభపడ్డాయి. ఇంకా బ్రిటానియా, నెస్లే, విప్రో ఇతర టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టైటన్, హెచ్‌సీఎల్, ఓఎన్జీసీ నష్టపోయాయి. -
ఫలితాల జోష్: లాభాల్లో మార్కెట్లు, ఐటీ రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ కంపెనీ క్యూ4లో మెరుగైన ఫలితాలతో సూచీలకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లతో సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 60649వద్ద, నిఫ్టీ సూచీ 101 పాయింట్ల లాభంలో 17915 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు మేర ఎగిసింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) F&O గడువు ముగింపు రోజున మార్కెట్లు చాలా బుల్లిష్‌గా మారాయి. ఐటీ, రియాల్టీ,కొన్ని మెటల్ స్టాక్‌లు గణనీయమైన కొనుగోళ్లు కనిపించాయి. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ను, మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ గా ముగిశాయి. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పడి 81.84 వద్ద ముగిసింది -
వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలు, 17800పైకి నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఏప్రిల్ 26న నిఫ్టీ 17800 ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 60,300 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 17,814 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా అయిదో సె షన్లో కూడా లాభాలనార్జించాయి.మెటల్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పవర్, ఎఫ్ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 0.4-1 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి వొడాఫోన్ ఐడియా టాప్ గెయినర్స్ కాగా, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్ , ఎన్టిపిసి నష్టపోయాయి. మంగళవారం ముగింపు 81.91తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 15 పైసలు పెరిగి 81.76 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: ఫార్మా ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఒక వారం బలహీనత తర్వాత, బెంచ్‌మార్క్ సూచీలు ఏప్రిల్ 24న పాజిటివ్‌గా ముగిసాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల మెరుగైన ఫలితాలతో దలాల్ స్ట్రీట్‌లో లాభాల కళకనిపించింది. సెన్సెక్స్ 401యింట్లు పెరిగి 60,056 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభంతో 17,743 వద్ద క్లోజ్ అయ్యాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 60వేల ఎగువకు, నిఫ్టీ 17700 స్థాయిని అధిగమించడం విశేషం. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల లాభపడగా, ఫార్మ రంగ షేర్లు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జ్యూమర్, విపప్రో, టైటన్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడగా, సిప్లా, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు, దివీస్, మారుతి సుజుకి నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ వాటాలుపెంపునకు ఆర్బిఐ అనుమతించడంతో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఏడు శాతం పెరిగింది. అలాగూ మెరుగైన ఫలితాలతో టాటాకాన్స్, షేర్ల బై బ్యాక్ ప్లాన్ నేపథ్యంలో విపప్రో షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.మరోవైపు సన్‌ఫార్మా మొహాలి యూనిట్‌కు సంబంధించిన యూఎస్‌ఎఫ్‌డీలే ఆందోళనతో భారీ నష్టపోయింది. -
వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాలు జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 60,393 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగిసి 17,812.40 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 1-2 శాతం వరకు పెరగగా, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ పేర్లలో కొంత అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్,ఐషర్ మోటార్స్ అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టిపిసి, నెస్లే ఇండియా, ఒఎన్‌జిసి , అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. -
స్వల్ప లాభాలకు పరిమితం: ఆటో, రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి. టాటా మోటార్స్, విప్రో మరియు పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్‌లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది. -
సేల్స్ బూస్ట్ టాటా మోటార్స్ టాప్ విన్నర్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌నుంచి 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగిసి 59909 వద్ద, నిఫ్టీ 33పాయింట్లు లాభపడి 17630 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. అలాగే 6.5 శాతం జీడీపీ వృద్ది రేటు అంచనాలతో మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది. దాదాపు అన్ని రంగా షేర్లు లాభపడుతున్నాయి. ప్రధానంగా రియల్టీ షేర్లు జోరుమీదున్నాయి. మరోవైపు సేల్స్ బూస్ట్‌తో టాటా మెటార్స్ దాదాపు 8 శాతం ఎగిసి టాప్ గెయినర్‌గా ఉంది. ఓఎన్జీసీ, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటన్ లాంటివి భారీగా లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,మారుతి , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. -
ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడిన వెంటనే కీలక లాభాల్లోకి మళ్లాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 146 పాయింట్లు ఎగిసి 59,835 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 17592 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. కాగా రెపో రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ అందర్నీ ఆశ్చర్యపర్చింది. తాజా నిర్ణయంతో రెపోటు 6.50 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించారు. అయితే ప్రస్తుత గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల్లో మరోసారి 25పాయింట్ల మేర రెపో రేటు పెంపుఉంటుందనే అంచనాలు ఎక్కువగా వినిపించాయి. (గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు) -
గ్లోబల్గాప్రతికూల సంకేతాలున్నా, సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు న్నప్పటికీ దేశీయ సూచీలు హుషారుగా ఉన్నాయి. సెన్సెక్స్ 367పాయింట్లు ఎగిసి 59476 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 17501 వద్ద కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ షేర్ల లాభాలు సూచీలకు మద్దతిస్తున్నాయి. మరోవైపు ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. బజాజ్ ట్విన్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడుతుండగా, ఐషర్ మోటార్స్,హిందాల్కో, ఇండస్ ఇండ్బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు ఎంఎన్సీ రెండు రోజుల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్నాయి. ఈ సారి 25 బేసిస్ పాయింట్ల వడ్డీరేపు పెంపు ఉంటుందని అంచనాలు భారీగా ఉన్నాయి. -
లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు, జోరుగా ఆటో
సాక్షి, ముంబై: భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సోమవారం సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. కానీ ఆ తరువాత నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంతో 58891 వద్ద, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 17339 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఆయిల్ అండ్‌గ్యాస్ సెక్టార్లు లాభాల్లోనూ, ఐటీ, బ్యాంకింగ్ నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాభ పడుతుండగా, బీపీసీఎల్, అదానీ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్ర, నెస్లే నష్ట పోతున్నాయి. -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు: 1032పాయింట్ల ర్యాలీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మొదలైన సూచీలు చివరి వరకూ అదో జోష్‌ను కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిసి 59 మార్క్‌ను తాకింది. చివరకు 1032 పాయింట్ల లాభంతో 58991 వద్ద ముగిసింది. ఎగువకు చేరగా నిఫ్టీ 279 పాయింట్లు ఎగిసి 17 400వద్ద న బలమైన నోట్‌తో ముగిసింది . (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ప్రధానంగా ఐటీ 2 శాతం ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ కాగా, నష్టపోయిన వాటిలో అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ , బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 15 పైసలు పెరిగి 82.18 వద్ద ముగిసింది -
అదానీ షేర్ల జోరు, సెన్సెక్స్ 620 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకుని హైజంప్ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగిసి 58580 వద్ద,నిఫ్టీ 177పాయింట్ల లాభంతో 17258 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రధానంగా అదానీ గగ్రూపు షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్య్లూ స్టీల్, ఐషర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, దివీస్ల్యాబ్స్ మాత్రమే నష్టపోతున్నాయి. -
Today StockMarket: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది. ఓఎన్జీసీ, టెక్‌మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్‌గా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది. -
TodayStockMarket: రిలయన్స్,టెక్ఎం జోరు, నెల గరిష్టానికి సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆరంభంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయిన మార్కెట్ భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకొని లాభాల్లో ముగిసింది. 243 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 61275వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 18015వద్ద ముగిసింది. పలితంగా నెల గరిష్టంత వద్ద, సెన్సెక్స్ 61 వేలకుఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన స్థిరపడటం గమనార్హం. మంగళవారం ప్రకటించిన డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారింది. హెచ్‌యూఎల్, సన్‌ఫార్మ, ఐటీసీ లార్సెన్, ఓఎన్జీసీ భారీగా నష్టపోగా టెక్ మహీంద్రా దాదాపు 6 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, ఐషర్ మోటార్స్ అదానీఎంటర్‌ప్రైజెస్ లాభపడ్డాయి. అటుడాలరు మారకంలో రూపాయి 82.80 వద్ద ముగిసింది. -
TodayStockMarketUpdates: లాభాల్లో స్టాక్‌మార్కెట్, ఐటీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, యుఎస్ సిపిఐ డేటకోసం ఆసక్తి ఎదురు చూస్తున్న గ్లోబల్, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు మంగళవారం గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. ఐటీ మెటల్, ఎఫ్ఎంసిజి సహా అన్ని రంగాల షేర్లు జోరుగా ఉన్నాయి. మెటల్ రంగ షేర్లు మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 60847 వద్ద, నిఫ్టీ 106 పాయిట్లు ఎగిసి 17876 వద్ద కొన సాగుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్లలో ఇన్ఫోసిస్, టిసిఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఇంకా రిలయన్స్, ఐటీసీ,యూపీఎల్ లాభపడుతుండగా, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, ఎస్బిఐఎన్ నష్టాల్లో ఉన్నాయి.అటు డాలరు మారకంలో రూపాయ 82.58 వద్ద కొనసాగుతోంది. చమురు ధరల క్షీణతతో డాలరు పడిపోవడంతో రూపాయి బలం వచ్చింది. -
Today StockMarketclosing: లాభాల్లోకి సూచీలు, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిసాయి. మిడ్‌సెషన్ తరువాత కోలుకున్న సెన్సెక్స్ 142 పాయింట్లు ఎగిసి 60,806 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 17894 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడగా అదానీ గ్రూపు షేర్లు మాత్రం నష్టాల్లోనే ముగిసాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. సెన్సెక్స్‌లో దివీస్ ల్యాబ్స్, హీరో మోటో, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ, స్టీల్, యూపీఎల్ టాప్ లూజర్స్‌గా బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్ ఫిన్ సర్వ్ , హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లు గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిడాలర్‌తో రూపాయి స్థిరంగా 82.51 వద్ద ముగిసింది -
Today StockMarketUpdate: మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్, అదానీ షేర్లు భేష్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ , నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ తరువాత భారీగా పుంజుకున్నాయి. ఒక దశలో నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి, 17871 వద్ద సెన్సెక్స్ 378పాయింట్ల లాభంతో 60664 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, చమురు, గ్యాస్ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 16 శాతం ఎగియడం విశేషం. మరోవైపు బ్యాంకింగ్, టెలికాం షేర్లు నష్ట పోయాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ భారీగా లాభపడగా, పవర్ గగ్రిడ్, కోల్ ఇండియా, లార్సెన్, హీరో మోటో, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఫలితాల్లోమెరుగ్గా ఉన్నప్పటికీ ఎయిర్టెల్ 1 శాతానికి పైగా నష్టపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 25 పాయింట్లు లాభపడింది. -
ఐటీ షైన్: సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు లాభంతో 60,942 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసి 18,118 వద్ద స్థిరపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ , ఐటీ షేర్లు లాభపడగా, రియల్టీ, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్ర, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యూపీఎల్, విప్రో టాప్ విన్నర్స్‌గా నిలవగా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 33 పైసలు నష్టపోయి 81.39 వద్ద ఉంది. -
61 వేల ఎగువకు సెన్సెక్స్,18150 దాటిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సానుకూలంగా ప్రారంభమైనాయి. ఆ తరువాత మరింత ఎగిసి 400 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 18,164 వద్ద రెండు వారాల గరిష్టం వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 61వేల స్థాయికి, నిఫ్టీ 18150ఎగువకు చేరాయి. ఐటీ మెటల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, లార్సెన్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ భారీగా లాభపడగా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, అదానీ ఎంటర్ పప్రైజెస్, బీపీసీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రుపీ 64 పాయింట్లు ఎగిసి 81.24 వద్ద ఉంది. గత ఏడాది డిసెంబర్ తరువాత ఈ గరిష్ట స్థాయిల వద్ద ముగియడం విశేషం. -
మూడు రోజుల నష్టాలకు చెక్, ఇన్పీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడు సెషన్ల నష్టాల తరువాత సూచీలు వారాంతంలో (శుక్రవారం) కోలుకున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, ఏడాది కనిష్టానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ఇతర సానుకూల సంకేతాలతో ఆరంభంలో కాస్త తడబడినా తరువాత నష్టాల నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లేదా 0.51శాతం పెరిగి 60,261, నిఫ్టీ 98 పాయింట్లు లేదా 0.55శాతం పెరిగి 17,957 వద్ద స్థిరపడ్డాయి. fe ముఖ్యంగా ఫైనాన్షియల్, ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ క్యూ 3 త్రైమాసిక ఫలితాల్లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఇన్ఫో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంకా అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా, టైటన్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్,నెస్లే ఇండియా ,లార్సెన్ అండ్ టుబ్రో ఐటీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు డాలరు 21 పైసలు ఎగిసి 81.38 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ 846 పాయింట్లు జంప్, ఐటీ ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేసిన సూచీలు చివరకు ఉత్సాహంగా ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యలో కాస్త పప్రాఫిట్ బుకింగ్ కనిపించినప్పటికీ, సెన్సెక్స్ ఒక దశలో 950 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 18100 పాయింట్లుపైకి చేరింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్, మెటల్, స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 846 పాయింట్లు ఎగిసి 60747 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 18089 వద్ద స్థిరపడ్డాయి. ఎం అండ్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఎస్బీఐ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు ఎగిసి 82.38 వద్దకు చేరింది. -
రెండో రోజూ జోరు:18600 ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా పెరిగి వరుసగా రెండో రోజు బుధవారం కూడా లాభాలను పొడిగించింది. నవంబరు ద్రవ్యోల్బణం దిగి రావడంతో పాటు, ఆసియా, అమెరికా మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్ 197 పాయింట్లు లాభంతో 62731 వద్ద, 60 పాయింట్లుఎగిసిన నిఫ్టీ 18677 వద్ద కొన సాగు తున్నాయి. ఫలితంగా నిఫ్టీ 18600 ఎగువన కొనసాగుతోంది. హిందాల్కో, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర టాప్ విన్నర్స్‌గా ఉండగా, భారతి ఎయిర్టెల్, నెస్లే, ఎం అండ్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 20 పైసలు ఎగిసి 82.64 వద్దకు ఉంది. -
లాభాల్లో స్టాక్‌మార్కెట్, బ్యాంకింగ్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెపుతూ లాభాల్లో ప్రారంభమైనాయి. ఆరంభంలో 90 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. ప్రస్తుతం ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. నిఫ్టీ 26 పాయింట్లు లాభంతో 18523 వద్ద, సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 62255 వద్ద కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్, ఓఎన్జీసీ, హీరోమోటో, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ లాభాల్లోనూ, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా నష్టాల్లోనూకొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 17పైసలు నష్టంతో 82.66 వద్ద ఉంది. మరోవైపు సోమవారం ప్రకటించిన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 11 నెలల కనిష్ట స్థాయి 5.88 శాతానికి దిగి వచ్చింది. డిసెంబర్ 2021 తర్వాత మొదటిసారిగా ఆర్బిఐ టార్గెట్ బ్యాండ్ 2-6 శాతానికి దిగువకు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. -
కొనసాగిన బుల్ రన్: చివర్లో లాభాల స్వీకరణ
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల్లో ముగిసాయి. వరుసగా రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చూశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ గరిష్టస్థాయిలను తాకింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో భారీ లాభాలను కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగిసి 63284 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 18815వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, టెక్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ లాంటి షేర్లు భారీగా లాభాలనార్జించాయి. మరోవైపు నవంబరు సేల్స్ నిరాశ పర్చడంతో ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. ఐసపీఐసీఐ బ్యాంకు, సిప్లా, యూపీఎల్, ఐషర్ మెటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పైసలు లాభపడి 81.21 వద్ద ముగిసింది. -
దలాల్ స్ట్రీట్ రికార్డ్: 63 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలను మొదట్లో కోల్పోయిన సూచీలు ఆతరువాత ఒక రేంజ్లో ఎగిసాయి. తద్వారా సెన్సెక్స్ 63 వేల స్థాయిని సునాయాసంగా దాటేసింది. అంతేకాదు రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజూ జోరుతో ఆల్-టైమ్ హైకి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాల నార్జించాయి. ముఖ్యంగా మూడు గంటలతర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్, అదానీ షేర్ల లాభాలు మార్కెట్లను రికార్డు స్థాయిల వైపు మళ్లించాయి. ఆటో షేర్లు మెరిపించాయి. ఒక దశలో సెన్సెక్స్ 600పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 418 పాయింట్లు ఎగిసి 63009 వద్ద, నిఫ్టీ140 పాయింట్లు 187580 వద్ద స్థిరపడ్డాయి. ఎం అండ్ ఎం, హిందాల్కో, గ్రాసిం, సిప్లా ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ టాప్ విన్నర్స్‌గా, ఇండస్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు ఎగిసి 81.42 వద్ద ఉంది. -
రికార్డుల జోరు: బుల్ రన్.. తగ్గేదేలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో స్వల్పంగా నష్టపోయిన సూచీలు ఆ వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 350పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ ఆల్ టైం హైని తాకింది. సెన్సెక్స్ 62,687 వద్ద నిఫ్టీ 18,611 వద్ద తాజా రికార్డును తాకింది. మెటల్ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాలనార్జించాయి. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 62,505 నిఫ్టీ 50 పాయింట్లు లాభంతో 18563 వద్ద ముగిసాయి. చైనాలో కరోనా మళ్లీ విస్తరించడం, లాక్డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బ్యాంకు నిఫ్టీ కూడా 43వేల ఎగువకు చేరింది. బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్స్, నెస్లే టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,టాటాస్టీల్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.64 వద్ద ఉంది. -
లాభాల జోరు: సెన్సెక్స్ 260 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 61757 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు ఎగిసి 18341 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ.790 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.414 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. టాటా కన్జ్యూమర్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 17 పైసలు ఎగిసి 81.70 వద్ద ఉంది. -
వరుసగా రెండో సెషన్లోనూ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ మధ్యలో లాభాలను కోల్పోయినా వరుసగా రెండో సెషన్లోనూ లాభపడింది. సెన్సెక్స్ 92 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 61,511 వద్ద, నిఫ్టీ 0.13 శాతం లేదా 23.05 పాయింట్లు పెరిగి 18,267 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, మారుతి సుజుకి టాప్ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, టెక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 22 పైసలు నష్టంతో 81.84 వద్ద ముగిసింది. -
లాభాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకొనసాగుతున్నాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలున్నప్పటికీ, సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎసిగింది. ప్రస్తుతం102 పాయింట్ల లాభంతో 61,521 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 18,273వద్ద కొనసాగుతోంది. ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, మారుతి సుజుకి లాభాల్లోనూ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలోరూపాయి 15 పైసలు నష్టంతో 81.78కి చేరింది. -
పీఎస్‌యూ బ్యాంకింగ్ జూమ్:లాభాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేస్తున్నారు. అయితే మూడు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సెన్సెక్స్ ఆరంభంలో లాభాలతో మురిపించింది. రోజంతా పటిష్టంగా కొనసాగి చివరకు సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 61,419 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 18,244 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. రియాల్టీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇండస్ ఇండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు నెస్లే, బీపీసీఎల్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, టాప్ లూజర్స్‌గా ముగిసాయి. అటు డాలరు మారకంలోరూపాయి 12 పైసలు ఎగిసి 81.67 వద్ద ముగిసింది. -
వరుస నష్టాలకు చెక్, లాభాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా షేర్లు వెనుకంజలో ఉన్నప్పటికీ మంగళవారం కీలక సూచీలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 61315 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభంతో 18214 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిం, ఇండస్ ఇండ్ బ్యాంకు,హిందాల్కో, డా. రెడ్డీస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిడ్, ఓఎన్జీసీ, నెస్లే, బీపీసీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు ఎగిసి, 81.75 వద్ద ఉంది