Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఈ వారాన్ని శుభారంభం చేశాయి. ఆరంభ లాభాలనుంచి పుంజుకుని రోజంతా లాభాలతోనే ఉత్సాహంగా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ 240.98 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 65,628.14 వద్ద,నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 19,529 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19500 ఎగువకు చేరింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్, మెటల్, ఆటో, రియల్టీ, ఆయిల్ & గ్యాస్ , PSU బ్యాంక్ 1 , 2.8 శాతం మధ్య ఎగిసాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ , స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ షేరు వరుసగాసెషన్లు లాభపడుతూ లిస్టింగ్ ప్రైస్‌ను అధిగమించడం విశేషం. కోల్ ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్, టాటా స్టీల్ లాభపడగా, ఎం అండ్‌ఎం, యాక్సిస్ బ్యాంకు,ఐటీసీ, నెస్లే, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఆగస్టులో 52.3 మిలియన్ టన్నుల (MT) ఉత్పత్తిలో సంవత్సరానికి 13 శాతం వృద్ధిని నమోదు చేయడంతో కోల్ ఇండియా టాప్ గెయినర్‌గా నిలిచింది.
రూపాయి: శుక్రవారం ముగింపు 82.71తో పోలిస్తే సోమవారం డాలర్‌తో రూపాయి 82.74 వద్ద స్థిరపడింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
301 reads
Comments
Please login to add a commentAdd a comment