Today Stockmarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పి భారీ లాభాలతోముగిసాయి.ముగింపులో, సెన్సెక్స్ 406 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 65,632 వద్ద, నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 19,544 వద్ద ముగిసాయి. రెండు రోజుల నష్టాల పరంపరను అధిగమించిన నిఫ్టీ 19,550పైన స్థిరపడింది. ఆటో, బ్యాంక్, ఐటీ క్యాపిటల్ గూడ్స్ లాభపడగా, ఫార్మా, పవర్ , పిఎస్‌యు బ్యాంకింగ్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి.
నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, M&M , TCS టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, NTPC, నెస్లే ఇండియా ఉన్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది.
రూపాయి: బుధవారం నాటి ముగింపు 83.23తో పోలిస్తే భారత రూపాయి గురువారం డాలర్‌కు 83.25 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment