Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి.
బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి.
రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment