record closing
-
సాక్షి మనీ మంత్రా: బ్యాంక్స్, ఆటో, ఐటీ జోరు, నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
దలాల్ స్ట్రీట్‌లో లాభాల హోరు, రికార్డు ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు చివరికి రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి.సెన్సెక్స్ 803 పాయింట్లు ఎగబాకి 64,719 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189వద్ద ముగిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఎంఅండ్ ఎం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, సన్‌ఫార్మ, హీరోమోటో టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ , అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ఆటో, దివీస్ ల్యాబ్స్ భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.03 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. -
stockmarket: రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లులాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం, లాక్డౌన్ ఆంక్షల సడింపుతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 222 పాయింట్లుఎగిసి 52773 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 15869 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా కీలకసూచీలు రెండూ మరో రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసిజి, మీడియా రియాల్టీ షేర్లు లాభపడగా, మెటల్, ఫార్మా నష్టపోయాయి. 3 శాతం ఎగిసి ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇంకా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్బిఐ లైఫ్, ఇండియన్ ఆయిల్, యుపిఎల్, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిండాల్కో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సిప్లా, టైటాన్ నష్టపోయాయి. చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్ దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్ -
లాభాల జోరు: రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. మరోవైపు పాయింట్లకి ఎగసింది. సెన్సెక్స్ 424 పాయింట్ల వరకు ఎగిసింది. మరోవైపు 15705 వద్ద నిఫ్టీ మరో సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఫార్మా షేర్లు మినహా నిఫ్టీ బ్యాంక్, మెటల్ సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్గ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ ఏకంగా 990 పాయింట్లు పెరగడం విశేం. సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 52,232 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 114 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 15,690 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా లాభపడ్డాయి. సింధుఇండ్ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, సిప్లా, ఎం అండ్ ఎం సన్ ఫార్మా నష్టపోయాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టడం సానుకూల అంశమని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే శుక్రవారం రానున్న ఆర్బీఐ పాలసీ రివ్యూపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. తగిన ద్రవ్యత లభ్యతను అందించే వ్యూహంలో కీలక వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఉండనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. -
దలాల్ స్ట్రీట్ దూకుడు : నిఫ్టీ రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. లాభాలనుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా నిఫ్టీ 15500కి ఎగువన రికార్డు ముగింపును నమోదు చేసింది. ఐటీ, ఆటో మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ప్రధానంగా మెటల్, ఎనర్జీ షేర్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ 515 పాయింట్లు లాభంతో 51937 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు ఎగిసి 15583 వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, ఐటీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ, భారతి ఎయిర్టెల్, డా.రెడ్డీస్, హిందాల్కో, మారుతి లాభపడిన వాటిల్లోఉన్నాయి. మరోవైపు ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఇండస్ బ్యాంకు, సన్‌ఫార్మ, టెక్ మహీంద్ర నష్టపోయాయి. చదవండి : బుల్ రన్: రాందేవ్ అగర్వాల్ సంచలన అంచనాలు కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్ -
దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మెరుపులు
సాక్షి,ముంబై: దలాల్ స్ట్రీట్‌లో నేడు(మంగళవారం) రికార్డుల హోరెత్తింది.అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ వరుస రికార్డులను నమోదు చేయడంతోపాటు హై స్థాయిల వద్ద రికార్డు క్లోజింగ్వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల కళ కళల్లాడాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు ఎగిసి 41,352 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 12165 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో నిఫ్టీ బ్యాంకు రికార్డు స్థాయిలను సాధించింది. టాటా స్టీల్, భారతి ఎయిర్ టెల్, వేదాంతా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ టీసీఎస్, ఐటీసీ యస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు గెయిల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, నష్టపోయాయి. -
లాభాల జోరు, రికార్డు ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు కూడా రికార్డుల మోత మోగించాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా మిడ్ సెషన్ తరువాత పుంజుకుని కీలక సూచీలు అత్యధిక స్థాయిల వద్ద రికార్డు ముగింపును నమోదు చేసాయి. సెన్సెక్స్ 199 పాయింట్లు ఎగిసి 41021 వద్ద, మొదటిసారి 41 వేల ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు ఎగిసి తొలిసారిగా 12100 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్ రంగ లాభాలతో అటు బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డు ముగింపును నమోదు చేసింది. ఎస్బీఐ కార్డు ఐపీవోకు రానుందన్న వార్తలతో చివర్లో బాగా పుంజుకుంది. వీటితోపాటు ఆటోమొబైల్, ఎనర్జీ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్లను లీడ్ చేసాయి. యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు, భారతి ఇన్ఫ్రాటెల్, సిప్లా,ఎల్ అండ్, ఐటీసీ ఐసిఐసిఐ బ్యాంక్ నష్టపోయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి. -
ఏడో రోజు లాభాలు : రికార్డు ముగింపు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పటిష్టంగా ముగిసాయి. సోమవారం ఆరంభంలోనే కీలక సూచీలు రెండూ రికార్డు స్థాయిలను నమోదు చేసాయి. అనంతరం ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ అత్యధిక స్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి. అయితే మిడ్ సెషన్లో కాస్త వెనుకంజవేసినప్పటికీ చివరి గంటలో పుంజుకుని వరుసగా ఏడవ రోజు కూడా స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ 137 పాయింట్లు ఎగిసి 40302 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 11941 వద్ద ముగిసాయి. అమెరికాలో ఉపాధి మార్కెట్ పుంజుకోవడం, చైనాలో తయారీ రంగ వృద్ధి అంచనాలను మించడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా చైనా ట్రేడ్‌వార్ వివాదం ఒక కొలిక్కి రానుందన్న అంచనాలు కూడా బలాన్నిచ్చాయి. దీనికితోడు విజిల్ బ్లోయర్ ఆరోపణలపై ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇన్ఫోసిస్ ఇచ్చిన వివరణ ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చింది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా మెటల్, నిఫ్టీ బ్యాంక్, రియల్టీ బాగా పుంజుకున్నాయి. ఆటో, మీడియా రంగ షేర్లు నష్టపోయాయి. భారతి ఇన్ఫ్రాటెల్, జెఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, జీ, ఐవోసీ, మారుతి సుజుకి, హీరో మోటో, ఇండస్ ఇండ్బ్యాంకు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
కొలువుదీరనున్న కొత్త సర్కార్: మార్కెట్లు కొత్త రికార్డులు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మూడు రోజుల లాభాలకు నిన్న (బుధవారం) స్వల్ప విరామిచ్చినా..తిరిగి రికార్డు దిశగా పయనించాయి. కేంద్రంలో జెంబో క్యాబినెట్ కొలువుదీరనున్ననేపథ్యంలో సూచీలు ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంనుంచి దూకుడు మీదున్న మార్కెట్లు చివరిదాకా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సక్స్ 330 పాయింట్లు ఎగిసి 39832 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 11946 వద్ద ముగిశాయి. తద్వారా సెన్సెక్స్,నిఫ్టీ చారిత్ర క్లోజింగ్ గరిష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఈ మాసపు ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపులో సూచీలు రెండూ ఆల్‌టైం హై క్లోజింగ్ వద్ద ముగియడం విశేషం. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ లాభాలతో బాగా పుంజుకున్నాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఐసీఐసీఐ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్,నిఫ్టీ చారత్రిక క్లోజింగ్ గరిష్టాలను నమోదు చేశాయి. -
మార్కెట్ల దూకుడు, రికార్డ్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి పటిష్టంగా ఉన్న మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. నిఫ్టీ 10350కి పైన ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, ఆటో ఇండెక్సులు లాభాలతో సెన్సెక్స్ 109 పాయింట్ల ఎగిసి 33,266 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 10364వద్ద ముగిశాయి. గెయిల్, ఓఎన్జీసీ, యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐషర్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్‌మహీంద్రా, ఇన్ఫ్రాటెల్, జీ, అంబుజా, జస్ట్ డయల్, లాభపడగా హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, విప్రో, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, ఐబీ హౌసింగ్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
మార్కెట్ల రికార్డ్ క్లోజింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఆరంభ నష్టాలను తగ్గించుకొన్నమార్కెట్లు మిడ్ సెషన్ తరువాతి కొనుగోళ్లతో లాభాల బాటపట్టాయి. దీంతో మరోసారి కీలక సూచీలు రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 105 పాయింట్లు ఎగిసి 33,147వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 10, 343 వద్ద స్థిరంగా ముగిశాయి. ఆయిల్ అండ్‌గ్యాస్ మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో రంగాలు బలపడగా ఐటీ నష్టపోయింది. అలాగే కొన్ని పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లలో లాభాల స్వీకరణ కారణంగా పీఎస్‌యూ బ్యాంక్‌షేర్లు నష్టపోయాయి. బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, సిప్లా, సెయిల్, దిలీప్ బిల్డ్‌కాన్, ఐఆర్బీ ఇన్ఫ్రా , ఐఎఫ్సీఐ టెక్ మహీంద్ర లాభపడగా, ఇండియాబుల్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఐడియా హెచ్‌సీఎల్, పవర్ గ్రిడ్, బాష్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
తొలిసారి 30వేలకు పైన సెన్సెక్స్
వరుసగా మూడో సెషన్ లోనూ ఈక్విటీ బెంచ్ మార్కులు లాభాల జోరు కొనసాగించాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఆటో, ఎఫ్ఎమ్సీజీ స్టాక్స్ మద్దతుతో సెన్సెక్స్ మొదటిసారి 30వేల మార్కు పైన ముగిసింది. ఇటు నిఫ్టీ సైతం రికార్డు క్లోజింగ్ నమోదుచేసింది. సెన్సెక్స్ 190.11 పాయింట్ల ర్యాలీ జరిపి 30,133.35 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 45.25 పాయింట్ల లాభంలో 9,351.85 వద్ద ముగిసింది. గ్లోబల్ అవుట్ లుక్ మెరుగ్గా ఉండటం, స్ట్రాంగ్ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ల సెంటిమెంట్ ను బలపర్చాయి. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో సెంట్రిస్ట్ అభ్యర్థి మాక్రన్ విజయం సాధించడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్‌వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు అమెరికా సహా ఇటు ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఆసియన్ స్టాక్స్ వరుసగా ఐదు రోజుల నుంచి లాభాలను ఆర్జించగా.. వాల్ స్ట్రీట్ కూడా కొత్త శిఖరాలను తాకింది. ఇటు దేశీయ మార్కెట్ల లాభాల జోరు, అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలతో రూపాయి కూడా మాంచి జోష్ లో కొనసాగింది. డాలర్ తో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.64 స్థాయిని బ్రేక్ చేసి 20 నెలల గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్ చివర్లో 18 పైసల లాభంలో 64.09 వద్ద ముగిసింది. మరో ఒక్క రోజులో అక్షయ తృతీయ వేడుక కావడంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కొంత కోలుకున్నాయి. 60 రూపాయల నష్టంతోనే 28,754 రూపాయలుగా నమోదయ్యాయి. -
సెన్సెక్స్ రికార్డు ముగింపు
బుధవారం ముగింపులో చిన్న ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త రికార్డును సృష్టించగలిగింది. 86 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 21,338 వద్ద ముగిసింది. గత డిసెంబర్ 9న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన ర్యాలీలో 21,484 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయికి పెరిగిన సూచి ఆ రోజున 21,326 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి అప్పటి రికార్డు ముగింపు 6,364 పాయింట్లు కాగా, తాజాగా 25 పాయింట్ల పెరుగుదలతో 6,339 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ సూచి కొత్త రికార్డును నెలకొల్పాలంటే మరో 25 పాయింట్ల దూరాన్ని ప్రయాణించాల్సివుంటుంది. తాజా మార్కెట్ ర్యాలీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు ఫార్మా, మెటల్ షేర్లు తోడ్పాటునందించాయి. సన్‌ఫార్మా 2.8%, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాబ్ 1% పెరిగాయి. టాటా స్టీల్, హిందాల్కో, సేసా స్టెరిలైట్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, మహీంద్రాలు 1%పైగా పెరిగాయి. ఎస్బీఐ, హీరో మోటార్ కార్ప్‌లు స్వల్పంగా తగ్గాయి. ఎఫ్ఐఐలు రూ. 279 కోట్ల నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 90 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్.. నిఫ్టీ మద్దతుస్థాయి క్రమేపీ 6,200 నుంచి 6,300 స్థాయికి పెరిగినట్లు తాజా ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. తాజాగా 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 62.85 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 2.69 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం ఓఐ 45.32 లక్షల షేర్లకు దిగింది. 6,400 కాల్ ఆప్షన్లో స్వల్పంగా 1.68 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 49.09 లక్షల షేర్లకు పెరిగింది.