
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు కూడా రికార్డుల మోత మోగించాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా మిడ్ సెషన్ తరువాత పుంజుకుని కీలక సూచీలు అత్యధిక స్థాయిల వద్ద రికార్డు ముగింపును నమోదు చేసాయి. సెన్సెక్స్ 199 పాయింట్లు ఎగిసి 41021 వద్ద, మొదటిసారి 41 వేల ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు ఎగిసి తొలిసారిగా 12100 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్ రంగ లాభాలతో అటు బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డు ముగింపును నమోదు చేసింది. ఎస్‌బీఐ కార్డు ఐపీవోకు రానుందన్న వార్తలతో చివర్లో బాగా పుంజుకుంది. వీటితోపాటు ఆటోమొబైల్, ఎనర్జీ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్లను లీడ్ చేసాయి. యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు, భారతి ఇన్‌ఫ్రాటెల్, సిప్లా,ఎల్ అండ్, ఐటీసీ ఐసిఐసిఐ బ్యాంక్ నష్టపోయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment