
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి పటిష్టంగా ఉన్న మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. నిఫ్టీ 10350కి పైన ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, ఆటో ఇండెక్సులు లాభాలతో సెన్సెక్స్ 109 పాయింట్ల ఎగిసి 33,266 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 10364వద్ద ముగిశాయి.
గెయిల్, ఓఎన్‌జీసీ, యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐషర్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్‌మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్, జీ, అంబుజా, జస్ట్ డయల్, లాభపడగా హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, విప్రో, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, ఐబీ హౌసింగ్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment