సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మూడు రోజుల లాభాలకు నిన్న (బుధవారం) స్వల్ప విరామిచ్చినా..తిరిగి రికార్డు దిశగా పయనించాయి. కేంద్రంలో జెంబో క్యాబినెట్ కొలువుదీరనున్ననేపథ్యంలో సూచీలు ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంనుంచి దూకుడు మీదున్న మార్కెట్లు చివరిదాకా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సక్స్ 330 పాయింట్లు ఎగిసి 39832 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 11946 వద్ద ముగిశాయి. తద్వారా సెన్సెక్స్,నిఫ్టీ చారిత్ర క్లోజింగ్ గరిష్టాలను నమోదు చేశాయి. ముఖ‍్యంగా ఈ మాసపు ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపులో సూచీలు రెండూ ఆల్‌టైం హై క్లోజింగ్ వద్ద ముగియడం విశేషం. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ లాభాలతో బాగా పుంజుకున్నాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐసీఐసీఐ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్,నిఫ్టీ చారత్రిక క్లోజింగ్ గరిష్టాలను నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment