సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఆరంభ నష్టాలను తగ్గించుకొన్నమార్కెట్లు మిడ్ సెషన్ తరువాతి కొనుగోళ్లతో లాభాల బాటపట్టాయి. దీంతో మరోసారి కీలక సూచీలు రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 105 పాయింట్లు ఎగిసి 33,147వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 10, 343 వద్ద స్థిరంగా ముగిశాయి.
ఆయిల్ అండ్‌గ్యాస్ మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో రంగాలు బలపడగా ఐటీ నష్టపోయింది. అలాగే కొన్ని పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లలో లాభాల స్వీకరణ కారణంగా పీఎస్‌యూ బ్యాంక్‌షేర్లు నష్టపోయాయి. బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, బీహెచ్‌ఈఎల్, సిప్లా, సెయిల్, దిలీప్ బిల్డ్‌కాన్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా , ఐఎఫ్‌సీఐ టెక్ మహీంద్ర లాభపడగా, ఇండియాబుల్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, ఐడియా హెచ్‌సీఎల్, పవర్ గ్రిడ్, బాష్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment