
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు చివరికి రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి.సెన్సెక్స్ 803 పాయింట్లు ఎగబాకి 64,719 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189వద్ద ముగిసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఎంఅండ్ ఎం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, సన్‌ఫార్మ, హీరోమోటో టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్‌ఆటో, దివీస్ ల్యాబ్స్ భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.03 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment