Today StockMaket Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారంతాంలో పాజిటివ్‌గా ముగిసాయి. ఆరంభంలోనే లాభాలతో మురిపించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 19,600 ఎగువకుచేరింది. చివరికి 320పాయింట్లు పెరిగి 65,828 వద్ద,నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 19,638.వద్ద ముగిసాయి. ఐటీ మినహా దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ హెల్త్‌కేర్ సూచీలు 1-2.7 శాతం ఎగిసాయి. కాగ్నిజెంట్ ఫలితాల నిరాశాజనకంగా ఉండటంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ చివర్లో నష్టాలనుంచి తేరు కున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, దివీస్ ల్యాబ్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్‌టిమైండ్‌ట్రీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టపోయాయి.
రూపాయి: డాలరు మారకంలో రూపాయి గత ముగింపు 83.18తో పోలిస్తే డాలర్‌కు 14 పైసలు పెరిగి 83.04 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment