
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్‌బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది.
రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్‌కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి.
రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment