సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. మరోవైపు పాయింట్లకి ఎగసింది. సెన్సెక్స్ 424 పాయింట్ల వరకు ఎగిసింది. మరోవైపు 15705 వద్ద నిఫ్టీ మరో సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఫార్మా షేర్లు మినహా నిఫ్టీ బ్యాంక్, మెటల్ సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్గ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ ఏకంగా 990 పాయింట్లు పెరగడం విశేం. సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 52,232 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 114 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 15,690 వద్ద ముగిసింది.
ఓఎన్‌జీసీ, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా లాభపడ్డాయి. సింధుఇండ్ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, సిప్లా, ఎం అండ్ ఎం సన్ ఫార్మా నష్టపోయాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టడం సానుకూల అంశమని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే శుక్రవారం రానున్న ఆర్‌బీఐ పాలసీ రివ్యూపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. తగిన ద్రవ్యత లభ్యతను అందించే వ్యూహంలో కీలక వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఉండనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment