
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. లాభాలనుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా నిఫ్టీ 15500కి ఎగువన రికార్డు ముగింపును నమోదు చేసింది. ఐటీ, ఆటో మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ప్రధానంగా మెటల్, ఎనర్జీ షేర్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ 515 పాయింట్లు లాభంతో 51937 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు ఎగిసి 15583 వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, ఐటీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ, భారతి ఎయిర్‌టెల్, డా.రెడ్డీస్, హిందాల్కో, మారుతి లాభపడిన వాటిల్లోఉన్నాయి. మరోవైపు ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఇండస్ బ్యాంకు, సన్‌ఫార్మ, టెక్ మహీంద్ర నష్టపోయాయి.
చదవండి : బుల్ రన్: రాందేవ్ అగర్వాల్ సంచలన అంచనాలు
కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్
Comments
Please login to add a commentAdd a comment