సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. అయితే ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 60 వేల దిగువన స్థిరపడింది. సెన్సెక్స్ 203 పాయింట్లు ఎగిసి 59959 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17786 వద్ద క్లోజ్ అయింది. వరుసగా రెండో సెషన్‌లోనూ విజయ పరంపరను కొనసాగించాయి. అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు టెక్ దిగ్గజాలనిరాశాజనక ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా దేశీయ సూచీలు గరిష్ట స్థాయిలను కోల్పోయాయి..
లాభాల జోష్‌తో మారుతి సుజుకి ఏకంగా 5 శాతం ఎగిసింది. రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, హీరోమోటా కార్ప్ భారీగా లాభపడగా, టెక్ ఎం, టాటా స్టీల్, గ్రాసిం, సన్ ఫార్మా, దివీస్ లాబ్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయికూడా లాభాలను కోల్పోయి 82.47 స్థాయి వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment