సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ కంపెనీ క్యూ4లో మెరుగైన ఫలితాలతో సూచీలకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లతో సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 60649వద్ద, నిఫ్టీ సూచీ 101 పాయింట్ల లాభంలో 17915 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు మేర ఎగిసింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు)
F&O గడువు ముగింపు రోజున మార్కెట్లు చాలా బుల్లిష్‌గా మారాయి. ఐటీ, రియాల్టీ,కొన్ని మెటల్ స్టాక్‌లు గణనీయమైన కొనుగోళ్లు కనిపించాయి. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ను, మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ గా ముగిశాయి. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!)
అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పడి 81.84 వద్ద ముగిసింది
Comments
Please login to add a commentAdd a comment