సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయింది. మిడిసెషన్‌నుంచి ఆటోమొబైల్, ఫైనాన్షియల్ షేర్లు లాభాలతో చివరికి లాభపడ్డాయి. సెన్సెక్స్ 62వేల స్థాయికి ఎగువన ముగిసింది. (సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే)
ప్రారంభ నష్టాలను పుంజుకున్నసెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,028 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 18,314.80 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 18300 పాయింట్లు ఎగువన స్థిరపడింది. ఐషర్ మోటార్స్, ఎం అండ్‌ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ టాప్ విన్నర్స్‌గానూ, హిందాల్కో, బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?)
అటు డాలరుమారకంలో రూపాయి గురువారం నాటి ముగింపు 82.09 తో పోలిస్తే శుక్రవారం 82.16 వద్ద ముగిసింది.
⇒ మరిన్ని మార్కెట్ సంబంధిత వార్తల కోసం చదవండి సాక్షి బిజినెస్, మీ అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment