Today StockMarketUpdate: మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్‌, అదానీ షేర్లు భేష్‌  | Sensex jumps 378 points and Nifty above 17850 | Sakshi
Sakshi News home page

Today StockMarketUpdate: మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్‌, అదానీ షేర్లు భేష్‌ 

Published Wed, Feb 8 2023 4:24 PM | Last Updated on Wed, Feb 8 2023 4:29 PM

Sensex jumps 378 points and Nifty above 17850 - Sakshi

సాక్షి,ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు  సెన్సెక్స్ , నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఆర్‌బీఐ పాలసీ రివ్యూ తరువాత భారీగా పుంజుకున్నాయి.  ఒక దశలో నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి, 17871 వద్ద  సెన్సెక్స్‌ 378పాయింట్ల లాభంతో 60664  వద్ద స్థిరపడ్డాయి.  

ఐటీ, చమురు, గ్యాస్ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.  అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 16 శాతం ఎగియడం విశేషం. మరోవైపు బ్యాంకింగ్‌, టెలికాం షేర్లు నష్ట పోయాయి.

అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ  లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ భారీగా లాభపడగా,  పవర్‌ గగ్రిడ్‌, కోల్‌ ఇండియా, లార్సెన్‌, హీరో  మోటో, ఐషర్‌ మోటార్స్‌ ఎక్కువగా నష్టపోయాయి.  ఫలితాల్లోమెరుగ్గా ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్‌  1 శాతానికి పైగా నష్టపోయింది.  అటు డాలరుమారకంలో రూపాయి 25 పాయింట్లు లాభపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement