RBI Policy Review
-
RBI Monetary Policy: అదుపులో ద్రవ్యోల్బణ ‘గుర్రం’
ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీ తొలి భేటీ కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడిన వెంటనే కీలక లాభాల్లోకి మళ్లాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 146 పాయింట్లు ఎగిసి 59,835 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 17592 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. కాగా రెపో రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ అందర్నీ ఆశ్చర్యపర్చింది. తాజా నిర్ణయంతో రెపోటు 6.50 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించారు. అయితే ప్రస్తుత గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల్లో మరోసారి 25పాయింట్ల మేర రెపో రేటు పెంపుఉంటుందనే అంచనాలు ఎక్కువగా వినిపించాయి. (గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు) -
ఆర్బీఐ పాలసీ రివ్యూపై దృష్టి, నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58588 వద్ద,నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 17526వద్ద కొనసాగుతున్నాయి ఈ ఉదయం RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్‌మార్క్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వడ్డన ఉంటుందనేది ప్రధాన అంచనా. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఎస్బిఐ లైఫ్, ఐషర్ మోటార్స్ ,యాక్సిస్ బ్యాంక్ ఒక్కో శాతం చొప్పున ఎగిసి గిటాప్ గెయినర్లుగా ఉండగా, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ , ఎంఅండ్ ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
Today StockMarketUpdate: మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్, అదానీ షేర్లు భేష్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ , నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ తరువాత భారీగా పుంజుకున్నాయి. ఒక దశలో నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి, 17871 వద్ద సెన్సెక్స్ 378పాయింట్ల లాభంతో 60664 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, చమురు, గ్యాస్ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 16 శాతం ఎగియడం విశేషం. మరోవైపు బ్యాంకింగ్, టెలికాం షేర్లు నష్ట పోయాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ భారీగా లాభపడగా, పవర్ గగ్రిడ్, కోల్ ఇండియా, లార్సెన్, హీరో మోటో, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఫలితాల్లోమెరుగ్గా ఉన్నప్పటికీ ఎయిర్టెల్ 1 శాతానికి పైగా నష్టపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 25 పాయింట్లు లాభపడింది. -
ఆర్బీఐ వడ్డింపు: సెన్సెక్స్ జూమ్, బ్యాంకు షేర్లకు దెబ్బ!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్బీఐ పాలసీ రివ్యూ ప్రకటించిన అనంతరం సెన్సెక్స్ 300పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 60596 వద్ద, 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17800 ఎగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో తప్ప, దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 11 శాతం ఎగిసింది. అదానీ పోరర్ట్స్ , హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిప్, కోల్ ఇండియా, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, ఐఫర్ మోటార్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.68 వద్ద ఉంది. కాగా రిజర్వ్ బ్యాంకు ఇండియా అనుకున్నట్టుగా రెపో రేటు పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతంగా కీలక వడ్డీరేటు 6.50 శాతానికి పెరిగింది. ఇది వరుసగా ఆరోపెంపు. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం, స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నేడు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరుగుతుండగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.15గంటల సమయానికి సెన్సెక్స్ 63.83 పాయింట్ల లాభంతో 56488 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 16837 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్‌పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
ఆర్బీఐషాక్:16400 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా ఆర్బీఐ రెపో రేటు వడ్డింపు తరువాత భారీ అమ్మకాల ఒత్తిడితో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. చివరి అర్థ గంటలో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16356వద్ద స్థిరపడ్డాయి. అయితే కీలక మద్దతు స్థాయి 16400 పాయింట్ల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ మరింత బలహీన సంకేతాలిచ్చింది. భారతి ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్, యూపీఎల్, ఏషియన్స్ పెయింట్స్ నష్టపోగా, ఎల్ఐసీ బుధవారం కూడా మరో 3 శాతం పతనమైంది. ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, డా. రెడ్డీస్ లాభాల్లో ముగిసాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపుతో పోలిస్తే 77.68 వద్ద ప్రారంభమైంది. చివరికి 77.73 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై) వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) -
ఆర్బీఐ పాలసీ ఇక మార్కెట్లకు దిక్సూచి
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టడనుండంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించవచ్చని తెలియజేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్న మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం) నిర్ణయాలు ప్రకటించనుంది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే మెరుగ్గా రికవర్కావడాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణతను చవిచూసింది. కోవిడ్-19 కారణంగా లాక్‌డవున్‌ల అమలు, పలు వ్యవస్థలు స్థంభించడం తదితర ప్రతికూలతతో క్యూ1(ఏప్రిల్- జూన్)లో జీడీపీ 23.9 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. ఇక అక్టోబర్‌లో మౌలిక పరిశ్రమలు 2.5 శాతం నీరసించాయి. వరుసగా 8వ నెలలోనూ వెనకడుగులో నిలిచాయి. వీటికితోడు రిటైల్(సీపీఐ), హోల్‌సేల్ ధరల(డబ్ల్యూపీఐ) గణాంకాలు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలలో ప్రధానంగా ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆర్బీఐ లక్ష్యమైన 6 శాతానికి ఎగువన సీపీఐ, 2 శాతానికంటే అధికంగా డబ్ల్యూపీఐ నమోదవుతుండటం గమనించదగ్గ అంశమని తెలియజేశారు. ఇప్పటికే ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 1.15 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఆటో అమ్మకాలు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. నవంబర్ నెలకుగాను మంగళవారం(డిసెంబర్ 1న) వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. పండుగల సీజన్లో భాగంగా నవంబర్లోనూ అమ్మకాలు మెరుగ్గా నమోదుకావచ్చని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐల అండ ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! సాంకేతికంగా.. శుక్రవారం(27)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 267 పాయింట్లు పుంజుకుని 44,150 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు బలపడి 12,969 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించుతూ 2-4 శాతం చొప్పున జంప్‌చేశాయి. కాగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 13,040 పాయింట్ల దిగువనే నిలిచింది. ఈ స్థాయి దాటితే నిఫ్టీకి 13,150 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,750 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
పాలసీ రివ్యూపై దృష్టి : లాభాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలతో మొదలయ్యాయి. ఆరంభంలోనే 300 పాయింట్లు జంప్ చేసిన సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 37825 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11151 వద్ద కొనసాగుతోంది. రిజర్వు బ్యాంకు మరికొన్ని గంటల్లో ప్రకటించనున్న ద్వైమాసిక పాలసీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 38వేల దిగువన, నిఫ్టీ 11150కి దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. ఓఎన్జీజీసీ, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతుండగా మారుతి సుజుకి, ఎయిర్ టెల్ భారీగా నష్టపోతున్నాయి. ఇంకా హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, అదానీ, టాటా మోర్స్ లాభపడుతున్నాయి. అటు హెచ్డీఎఫ్ సీ లైఫ్, యూపీఎల్, విప్రో, పవర్ గ్రిడ్ నష్టపోతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నేడు (ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు) మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది. ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్‌రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ను ప్రకటించడంతో ఈ ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది. చదవండి : రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం మారని రేట్లు.. వృద్ధికి చర్యలు -
ఆర్బీఐ బూస్ట్ : రియల్టీ షేర్ల ర్యాలీ
సాక్షి, ముంబై: ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే దలాల్ స్ట్రీట్‌లో దీపావళి సందడి నెలకొంది. దాదాపు అన్ని రంగాలషేర్లు కొనుగోళ్లతో కళకళల్లాడాయి. సెన్సెక్స్ ఏకంగా 200 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 60 పాయింట్లు ఎగిసింది. తద్వారా నిఫ్టీ 12150 స్థాయికి చేరింది. ఉదయం నుంచీ కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూసిన ట్రేడర్లు, ఇన్వెస్లర్టు కొనుగోళ్లకు దిగారు.ముఖ్యంగా బ్యాంక్‌నిఫ్టీ భారీగా లాభపడింది. అలాగే రియల్ ఎస్టేట్రంగానికి ఊతమిచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో పిరామల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ సంబంధిత షేర్లు పుంజుకున్నాయి. ఆటో, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్లు పెరిగాయి. అలాగే ఫార్మా, మెటల్ ఇండెక్స్ లాభపడుతుండగా, ఒక్క ఎఫ్ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గెయిల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, యస్‌బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, జీ లిమిటెడ్ టాప్ విన్నర్స్‌గా ఉండగా హిందాల్కో, బీపీసీఎల్, టైటాన్, ఇన్ఫోసిస్, టాటా మోటర్స్ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి. కాగా ఆర్బీఐ పాలసీ రివ్యూలో రెపో రేటును 5.15 శాతంవద్ద, రివర్స్రెపో రేటును 4.90 శాతం వద్దే ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. -
పాలసీ రివ్యూ, అప్రమత్తంగా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా ఉత్సాహంగా మొదలైనాయి. ఒక దశలో డబుల్ సెంచరీకిపైగా లాభాలతో దూసుకుపోయినా, ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంతో 41211 వద్ద నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 12115 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ప్రధానంగా మెటల్, ఫార్మా, మీడియా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో ఉన్నాయి. జీ, యస్ బ్యాంక్, ఐవోసీ, వేదాంతా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ లాభపడుతుండగా, అయితే టాటా మోటార్స్, టైటన్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, యూపీఎల్, హిందాల్కో, నష్టపోతున్నాయి. -
ఆర్బీఐ బూస్ట్ : మార్కెట్ల లాభాల దౌడు
సాక్షి,ముంబై : స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు ఎగిసి, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి కొనసాగుతోంది. ఆర్బీఐ రేట్ కట్ అంచనాలతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలపైన స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడుతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్లకు పైగా ఎగిసింది. ఈ రోజు కూడా యస్ బ్యాంకు మరో 5 శాతం ఎగిసింది. వీటితోపాటు బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, వేదాంతా భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు జీఎంటర్ టైన్మెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతి ఇన్ఫ్రాటెల్, గ్రాసిం, పవర్‌గ్రిడ్ నష్టపోతున్నాయి. అటు డారు మారకంలో రూపాయి కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించి, 70.82 వద్ద కొనసాగుతోంది. -
ఆర్బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచి..!
ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఎంపీసీ గురువారం ప్రకటనలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. మరోవైపు కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈయన క్యాబినెట్లో కొత్తగా ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్ 2019–20 సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ వ్యయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు పన్నుల తగ్గింపుకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుం దనే అంచనాలు ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. మొత్తంగా మార్కెట్‌కు ఈవారం కదలికలు అత్యంత కీలకంగా మారనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అన్నారు. ఇక రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు అయినందున ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. మెక్సికోపై టారిఫ్‌లను అనూహ్యంగా పెంచుతూ అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఒకదశలో క్రూడ్ ధరలు 6% మేర పతనమయ్యాయి. వారాంతాన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5.57% తగ్గి 61.69 డాలర్లకు పడిపోగా.. నైమెక్స్ క్రూడ్ 5.69% పతనమై 53.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనం ఇలానే కొనసాగి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కకుండా ఉంటే, దేశీ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందనే ఆశావాదంతో ఉన్నట్లు బీఎన్పీ పారిబా అడ్వైజరీ విభాగం హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ మేనెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత వారాంతాన వెల్లడైన ఆటో రంగ అమ్మకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఈ అంశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ నిధుల వెల్లువ భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గవ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మే నెలలో మొదటి 3 వారాలు అమ్మకాలకు పాల్పడినప్పటికీ.. బీజేపీ ఘనవిజయంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నికరంగా మే 2–31 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.7,920 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.1,111 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా మే నెలలో రూ.9,031 కోట్లను వీరు పెట్టుబడిపెట్టారు. -
గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
సాక్షి, ముంబై : ఆర్బీఐ పాలసీ రివ్యూలో వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపడంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. రెపో రేటుపై పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గడం గృహ, వాహన రుణగ్రహీతలకు శుభపరిణామమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీరేట్ల కోత విధించి గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర బ్యాంకు శుభవార్త అందించిందని పేర్కొన్నాయి. ఈ సవరించిన రేట్లను బ్యాంకులు వినియోగదారులక పాస్ చేస్తాయని తాము భావిస్తున్నామని నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ చెప్పారు. ఇది కస్టమర్ల కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేస్తుంది. కొంతకాలంగా డిమాండ్ లేక నీరసించిన రియల్ రంగ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ యధాతథానికే మొగ్గు చూపనుందన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా మానిటరీ పాలసీ కమిటీ స్పందించింది. వరుస యథాతథ పాలసీకి చెక్ చెబుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ రెపో రేట్ కోతకే మొగ్గు చూపింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగి వచ్చింది. రివర్స్ రెపో 6 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలు కానుంది. -
మళ్లీ 11,000 పైకి నిఫ్టీ
కీలక రేట్ల విషయమై ఆర్బీఐ విధానం మారవచ్చనే అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. వడ్డీ రేట్ల ప్రభావిత రంగ షేర్లతో పాటు ఇతర రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. స్టాక్ సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 37,000 పాయింట్లపైకి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 36,975 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ పాలసీ.. మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు (గురువారం) ముగియనుంది. కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ నేడు వెల్లడిస్తుంది. రేట్ల కోత ఉండకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో రేట్ల విషయమై ఆర్బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చని అంచనాలున్నాయి. బాండ్ల రాబడులు తగ్గడం, రూపాయి స్వల్పంగా బలపడటం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధించగలమని కేంద్రం పేర్కొనడం... సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. జపాన్ మార్కెట్ స్వల్పంగా పెరగ్గా, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు చాంద్రమాన కొత్త సంవత్సరాది కారణంగా పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆల్‌టైమ్ హైకి టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఈ క్యూ3లో నికర లాభం 28 శాతం పెరగడంతో టెక్ మహీంద్రా షేర్ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.814ను తాకిన ఈ షేర్ చివరకు 8 శాతం లాభంతో రూ.811 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,995 కోట్లు పెరిగి రూ.79,588 కోట్లకు ఎగసింది. ఈ షేర్‌తో పాటు ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, బాటా ఇండియా తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆగని అనిల్ షేర్ల పతనం... అనిల్ అంబానీ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ఇంట్రాడేలో 38 శాతం క్షీణించి రూ.142ను తాకింది. చివరకు 32 శాతం నష్టంతో రూ.154 వద్ద ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ఇంట్రాడేలో 11 శాతం తగ్గి ముఖ విలువ రూ.5 కంటే దిగువకు, రూ.4.85ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.5.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇతర గ్రూప్ కంపెనీలు–రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 12 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 11 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ షేర్ మినహా అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఆరు షేర్లు 22 శాతం నుంచి 53 శాతం రేంజ్లో పడిపోయాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు 31 సెన్సెక్స్ షేర్లలో కేవలం మూడు– యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ.. మాత్రమే నష్టపోగా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు భారీగా లాభపడినప్పటికీ, దాదాపు 400 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అరవింద్, ఏబీజీ షిప్‌యార్డ్, ఇక్రా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
రూపాయికి ఆర్బీఐ షాక్
-
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ఆర్బీఐ ప్రకటన : కుప్పకూలిన మార్కెట్లు
ముంబై : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అనూహ్య ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటన చేసిన అనంతరం, దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమై, 34253 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా భారీగా 316 పాయింట్లు కుప్పకూలింది. ఒక్కసారిగా 10,300 మార్కు కిందకి వచ్చి చేరింది. ఇక మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 792 పాయింట్లు నష్టపోయి 34,376 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 10,316 వద్ద క్లోజయ్యాయి. రూపాయి సైతం ఆర్బీఐ ప్రకటన తర్వాత చారిత్రాత్మక కనిష్ట స్థాయి 74ను తాకింది. 2019 మార్చిలో క్వార్టర్ వరకు ద్రవ్యోల్బణ 4.5 శాతానికి పెరుగుతుందని ఆర్బీఐ అంచనావేసింది. నిఫ్టీ ఇండెక్స్‌లో మెజార్టీ స్టాక్స్ నష్టాల్లోనే నడిచాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, గెయిల్, ఓఎన్జీసీలు దాదాపు 25 శాతం వరకు క్షీణించాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మేర పడిపోవడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలపై నిన్న కేంద్ర ప్రభుత్వం రూ.2.50 కోత పెట్టడమే. కేవలం భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే 1.25 శాతం నుంచి 2.50 శాతం మధ్యలో లాభపడ్డాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతు ప్రకటన చేయడం కరెన్సీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ఐఐఎఫ్ఎల్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ అభిమాన్యు సోఫట్ చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, దాని నుంచి కాపాడేందుకు రేట్లను పెంచుతుందని భావించామని తెలిపారు. ఒకవేళ క్రూడాయిల్ ధరలు ఇలానే పెరుగుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్బీఐ రేట్లను పెంచాల్సిందేనన్నారు. -
రూపాయికి ఆర్బీఐ షాక్
ముంబై : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లను సర్ప్రైజ్ చేస్తూ.. రెపో రేటును యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74 కు పతనమైంది. డాలర్ మారకంలో రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలరు మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా కూడా రూపాయి ఈ విధంగానే ట్రేడవుతూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో, రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఆర్బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడంతో, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రెపోను ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి ప్రకటన చేయకుండా.. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు అనూహ్య ప్రకటన చేసింది. -
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రివ్యూను ప్రకటించింది. ఆర్బీఐ చేపట్టిన ద్వైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోను 6.0 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు తెలిపింది. కాగా.. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో అయిదుగురు యథాతథానికి ఓటు వేశారు. మైఖేల్ పాత్రో ఒక్కరే వడ్డీరేటు పెంపువైపు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపిస్తోంది. తొలి క్వార్టర్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. కాగా.. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ మొదటి పరపతివిధాన సమీక్ష ఇది. గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. -
చివరికి మళ్లీ నష్టాలే
ముంబై : ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం మార్కెట్లు నష్టాలు పాలయ్యాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో, ఉదయం సెషన్లో కోలుకున్న మార్కెట్లు, చివరికి మళ్లీ నష్టాలే పాలయ్యాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు పడిపోయి, 34,082 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంలో 10,500 కింద 10,476 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు సైతం 141 పాయింట్లు కోల్పోయింది. నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా హెచ్‌పీసీఎల్, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా పవర్లు ఉండగా... టాప్ లూజర్లుగా అంబుజా సిమెంట్స్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత, విప్రోలు నష్టాలు గడించాయి. కాగ, కీలక వడ్డీరేట్లు అయిన రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా 6 శాతం, 5.75 శాతంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ తన త్రైమాసిక పాలసీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 64.16 గా ఉంది. -
ఆర్బీఐ రివ్యూపై దృష్టి: వరుసగా రెండో రోజూ నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి సెన్సెక్స్ 91, నిప్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది. తద్వారా నిఫ్టీ 10,100 స్థాయి దిగువకుచేరింది. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ నిర్ణయం మార్కెట్లను మార్గనిర్దేశనం చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అమ్మకాలతో వరుసగా రెండో రోజు నష్టాలు కొనసాగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని సెక్టార్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, మెటల్ ఇండెక్స్ బాగా నష్టపోతున్నాయి. వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, యస్‌బ్యాంక్, విప్రో, హెచ్‌పీసీఎల్, ఎంఅండ్ఎం నష్టాల్లోనూ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, సిప్లా స్వల్ప లాభాల్లోనూ కొనసాగుతున్నాయి.