సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై)
వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు)
Comments
Please login to add a commentAdd a comment