నష్టాల్లో స్టాక్ మార్కెట్లు(ప్రతీకాత్మక చిత్రం)
ముంబై : ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం మార్కెట్లు నష్టాలు పాలయ్యాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించడంతో, ఉదయం సెషన్‌లో కోలుకున్న మార్కెట్లు, చివరికి మళ్లీ నష్టాలే పాలయ్యాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు పడిపోయి, 34,082 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంలో 10,500 కింద 10,476 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు సైతం 141 పాయింట్లు కోల్పోయింది.
నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా హెచ్‌పీసీఎల్, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా పవర్‌లు ఉండగా... టాప్ లూజర్లుగా అంబుజా సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, వేదాంత, విప్రోలు నష్టాలు గడించాయి. కాగ, కీలక వడ్డీరేట్లు అయిన రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా 6 శాతం, 5.75 శాతంగా ఉంచుతున్నట్టు ఆర్‌బీఐ తన త్రైమాసిక పాలసీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 64.16 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment