సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటించిన అనంతరం సెన్సెక్స్ 300పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 60596 వద్ద, 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17800 ఎగువకు చేరింది.
బ్యాంకింగ్, ఆటో తప్ప, దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11 శాతం ఎగిసింది. అదానీ పోరర్ట్స్ , హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఇన్ఫోసిస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిప్, కోల్ ఇండియా, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటో కార్ప్, ఐఫర్ మోటార్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.68 వద్ద ఉంది.
కాగా రిజర్వ్ బ్యాంకు ఇండియా అనుకున్నట్టుగా రెపో రేటు పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతంగా కీలక వడ్డీరేటు 6.50 శాతానికి పెరిగింది. ఇది వరుసగా ఆరోపెంపు.
Comments
Please login to add a commentAdd a comment