
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే లాభపడిన సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రయివేటు, ప్రభుత్వ బ్యాంకింగ్, ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియల్ ఎస్టేట్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. సెన్సక్స్ ఏకంగా 403 పాయింట్లు ఎగిసి 62533 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 18608 వద్ద స్థిరపడ్డాయి. తద్వార సెన్సెక్స్ 62500 ఎగువకు, నిఫ్టీ 18600 ఎగువకు చేరాయి.
ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం ఓఎన్జీసీ, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడగా, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో బీపీసీఎల్, యూపీఎల్, హీరోమోటా టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 32 పైసలు కుప్ప కూలి 82.79 వద్దకు చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో ట్రేడర్లు పాజిటివ్‌గా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment