సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి.వారాంతంలో బలమైన లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగిసి 54481 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 16220 వద్ద ఉత్సాహంగా ముగిసాయి. అలాగే ఈ వారంలో ఇప్పటివరకు సెన్సెక్స్ దాదాపు 1,700 పాయింట్లు పెరగడం విశేషం.
బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్, యూకే డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థతో M&M, EVCo రూ.1,925 కోట్లుపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ఆరంభంలో 5.4 శాతం పెరిగింది. కానీ చివరల్లో లాభాలను కోల్పోయింది.
ఆటో షేర్లు లాభాలనార్జించగా ఐటీ మెటల్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, టాటామోటార్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టాటాస్టీల్, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఓఎన్‌జీసీ నష్టపోయాయి. మరోవైపు డాలరు మాకరంలో రూపాయి మరోసారి బేర్ మంది. 11 పైసల నష్టంతో 79.26 వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment