సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గ్లోబల్ ముడి చమురు ధరలు దిగి వస్తున్న క్రమంలో సూచీలు అప్ ట్రెండ్‌లోకి వచ్చాయి. సెన్సెక్స్ 54వేల పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16 వేల స్థాయిని సునాయాసంగా అధిగమించింది. సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 54178 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 16132 వద్ద ముగిసాయి.
ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపించింది. టైటన్, ఎల్ అండ్‌టీ, యూపీఎల్, హిందాల్కో, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, జూబ్లియంట్ ఫార్మా ఇండస్ ఇండ్, బీవోబీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు సిప్లా, భారతి ఎయిర్‌టెల్ నెస్లే, బజాజ్ ఫైనాన్స్, డా.రెడ్డీస్ నష్ట పోయాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
అటు చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు పతనమైంది. చమురు ధరలు వరుసగా మూడో రోజు కూడా నేల చూపులు చూస్తుండటంతో దేశీయ కరెన్సీ రూపాయికి బలవ చ్చింది. 16 పైసల లాబంతో 79.17 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment