Crude Oil Prices
-
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
40 శాతం పెరిగిన క్రూడ్ దిగుమతులు.. అయినా భారత్‌కు మేలే!
ప్రపంచంలో యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలురష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్ యూనియన్ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి. -
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. -
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్‌సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్‌సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 90 యూఎస్ డాలర్లకు చేరింది. కానీ భారత్‌లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్‌ఆన్ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్‌పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్, ఇరాన్‌ల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే.. ఎన్నికల వేళ ఆచితూచి.. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
క్రూడ్ఆయిల్తో ఇవి తయారీ..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. కొన్నిసార్లు స్వల్పంగా తగ్గినా మరికొన్ని పరిస్థితుల వల్ల తిరిగి ధరలు పెంచుతున్నారు. దేశంలో వినియోగించే క్రూడ్‌లో అధికభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. అయితే దేశీయంగా ఈ కింది రాష్ట్రాల్లో అధికంగా క్రూడ్‌ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. రాజస్థాన్-7667 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) గుజరాత్-4626 ఎంఎంటీ అసోం-4309 ఎంఎంటీ తమిళనాడు-395 ఎంఎంటీ ఆంధ్రప్రదేశ్-296 ఎంఎంటీ అరుణాచల్‌ప్రదేశ్-43 మిలియన్ మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఆన్‌షోర్(భూ అంతరాల్లో నుంచి వెలికితీసే ఆయిల్) ఉత్పత్తిలో 17336 ఎంఎంటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో ప్రైవేట్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పాటై 9367 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్‌ను వెలికి తీస్తున్నాయి. పూర్తి ప్రైవేట్ కంపెనీలు 7969 ఎంఎంటీల క్రూడ్ ఆయిల్‌ను బయటికి తీస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో జాయింట్ వెంచర్ ద్వారా ఆఫ్‌షోర్(సముద్రం అడుగు నుంచి వెలికితేసే ఆయిల్) ప్రొడక్షన్లో భాగంగా 14,969 ఎంఎంటీలు, ప్రైవేట్ జాయింట్ వెంచర్ ద్వారా 1,899 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్ వెలికితీస్తున్నారు. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. అయితే క్రూడ్‌ఆయిల్ ఎన్నో రంగాల్లోని ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. ఆయా రంగాల్లో క్రూడ్ ఆయిల్ వినియోగించి తయారుచేస్తున్న ఉత్పత్తులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఫ్యుయెల్: గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యుయెల్, పెట్రోల్. ప్లాస్టిక్: బాటిళ్లు, కంటైనర్లు, టాయ్స్. కాస్మాటిక్స్: లోషన్లు, ఫెర్ఫ్యూమ్, డీయోడరెంట్లు. మెడిసిన్లు: ఆస్పరిన్, యంటీసెప్టిక్స్, సిరంజీలు. ఎలక్ట్రానిక్స్: ఇన్సులేటర్లు, కంపోనెంట్లు. వస్త్రరంగం: పాలీస్టర్, నైలాన్, ఆక్రిలిక్. గృహోపకరణాలు: డిటర్జెంట్లు, క్యాండిళ్లు. రియల్టీ: ఆస్పాల్ట్, పైపులు, స్విచ్‌లు. వ్యవసాయం: కృత్రిమ ఎరువులు, ఫెస్టిసైడ్స్. ల్యూబ్రికెంట్లు: మోటార్ ఆయిల్, గ్రిజ్ -
పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
Israel-Hamas war: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
Tax On Crude Oil: ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
దేశంలో ఉత్పత్తి చేసే ముడిచమురుపై అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ లేదా విండ్‌ఫాల్) టన్నుకు రూ.9050కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 18 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు సెప్టెంబరు 29న ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను టన్నుకు రూ.12200గా ఉంది. గతంతో పోలిస్తే రూ.3050కు తగ్గింది. డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.5గా ఉన్న విండ్‌ఫాల్ సుంకాన్ని రూ.4 చేశారు. లీటర్ విమాన ఇంధనంపై సుంకాన్ని రూ.3.5 నుంచి రూ.1కు తగ్గించారు. పెట్రోల్‌పై సున్నా సుంకం కొనసాగుతుంది. డీజిల్ అమ్మకంపై లీటర్‌కు రూ.5.5 నుంచి రూ.5కి, విమాన ఇంధనంపై లీటర్‌కు రూ.3.5 నుంచి రూ.2.5కు పన్ను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. సవరించిన పన్నులు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రష్యా ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో భారత కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. దాంతో దేశీయంగా చమురు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై జులై 1, 2022 నుంచి వాటి చమురు అమ్మకాలపై కేంద్రం మొదటగా విండ్‌ఫాల్ పన్నులను విధించింది. -
పుతిన్‌తో పెట్టుకుంటే అంతే!.. ఆ దేశాలకు చమురు ఎగుమతులు బంద్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్క్యాప్ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాల ప్రైస్ క్యాప్‌కు కౌంటర్ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్ క్యాప్ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్‌పై ప్రైస్ క్యాప్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్ ఇచ్చింది క్రెమ్లిన్. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్‌ను అధ్యక్షుడు పుతిన్ ఎత్తివేసే అవకాశం కల్పించింది. ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ -
ఈ వారమూ మరింత ముందుకే !
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడుతూ.., ముందుకే కదిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘మార్కెట్ అప్‌సైడ్ మూమెంట్‌ను ప్రోత్సహించే సానుకూలాంశాలు పరిమితంగా ఉన్నందున్న స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం, కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. నిఫ్టీ 18,500 స్థాయిని నిలుపుకోలిగితే 18,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 19,000 వద్ద మరో కీలక నిరోధం ఉంది. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,100 తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ పతనంతో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌మార్క్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, బ్యాంక్స్, టెక్నాలజీ, మౌలిక రంగ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 631 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ డేటా బుధవారం(నవంబర్ 30న) విడుదల అవుతుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ క్యూ2లో వృద్ధి ఆరుశాతానికి పైగా నమోదుకావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేరోజున అక్టోబర్ ద్రవ్య లోటు, మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(గురువారం) నవంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా, వాహన విక్రయ గణాంకాలు విడుదల అవుతాయి. అలాగే శుక్రవారం ఆర్బీఐ నవంబర్ 25 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 18వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రపంచ పరిణామాలు ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసగించనున్నారు. కీలక వడ్డీరేట్ల పెంపుదల క్రమంగా నెమ్మదించవచ్చని ఫెడ్ మినిట్స్‌లో వెల్లడైన తర్వాత మార్కెట్ వర్గాలు పావెల్ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం వెల్లడి అవుతుంది. అదే రోజున ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల స్థితిగతులను తెలియజేసే ‘‘బీజ్ బుక్’’ను ఫెడ్ రిజర్వ్ విడుదల చేయనుంది. చైనాలో కరోనా కేసులు, లాక్డౌన్ విధింపు వార్తలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. రష్యా చమురు నిషేధం తొలగింపుపై పాశ్చత్య దేశాల చర్యలతో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. గతవారంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర పదినెలల కనిష్టానికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి దిగివచ్చింది. బుల్లిష్‌గా ఎఫ్ఐఐల వైఖరి భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు (25 తేదీనాటికి) దేశీయ మార్కెట్లో రూ.31,630 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ దూకుడు వైఖరిని తగ్గించుకోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో ఎఫ్ఐఐలు మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్ల పట్ల అధిక బుల్లిష్ వైఖరిని కనబరుస్తున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తెరపైకి వస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ వారంలో రెండు ఐపీవోలు ఈ వారంలో ధర్మజ్ క్రాప్, యూనిపార్ట్స్ ఇండియా కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఆగ్రో కెమికల్ ధర్మజ్ క్రాప్ సంస్థ ఇష్యూ భాగంగా రూ.216 కోట్ల విలువైన తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. తద్వారా మొత్తం రూ. 251 కోట్లను సమీకరించనుంది. ఇందుకు ధర శ్రేణి రూ.216 – 327గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 28న మొదలై 30న ముగిస్తుంది. ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుంది. మొత్తం 1.4 కోట్ల షేర్లను విక్రయించి రూ.836 కోట్లను కంపెనీ సేకరిస్తుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.548–577గా ఉంది. -
ఓఎన్జీసీ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్‌ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్‌చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది. విక్రయ ధరలు అప్ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు. వెరసి ప్రతీ బ్యారల్‌కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది. -
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్‌లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్‌పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు
భూమిలోని క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? • సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది.. • భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ అయిపోతే..? • మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా? • ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం.. •పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్.. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్‌లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో 82 శాతం ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్‌లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్‌కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్‌ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. -ఈవీ బాలాజీ, సాక్షి -
100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు!
భారత్‌లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు. కానీ వాటి ధరలు అలాగే కొనసాగుతాయని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా ఏప్రిల్ 25న బ్యారెల్ క్రూడాయిల్ ధర 99.17 డాలర్లు ఉండగా..ఆ తర్వాత వాటి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ వచ్చాయి. అయితే జులై 14న అదే క్రూడాయిల్ ధర బ్యారెల్ 99.76 డాలర్లు చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం, డిమాండ్ - సప్లై వంటి భయాల కారణంగా ధర 5.5శాతం తగ్గింది. మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సౌదీ అరేబియా ముందస్తు ఉత్పత్తిని పెంచుతుందనే ఆశతో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ 100డాలర్ల కంటే ఎక్కువ పెరిగింది. కానీ యూఏఈ మాత్రం క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించింది. అయితే ఈ తరుణంలో పెట్రోల్,డీజిల్ తగ్గిపోతాయనుకున్న వాహన దారులకు భంగపాటు ఎదురైంది. చమురు కంపెనీలు నష్టాల్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్పా.. వాటిని వాహనదారులపై బదాలయించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. గతంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మే నెలలో కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 తగ్గించడంతో చమురు కంపెనీలకు మరింత భారం పెరిగింది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, బ్యారల్ ధర పెరుగు ధరలతో చమురు కంపెనీలు క్రూడాయిల్‌పై భారీగా ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు తక్కువకే ధరకే క్రూడాయిల్ బ్యారెల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. పెట్రో ధరల్ని అలాగే కొనసాగిస్తున్నాయి. -
క్రూడ్ ఎఫెక్ట్: 54 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గ్లోబల్ ముడి చమురు ధరలు దిగి వస్తున్న క్రమంలో సూచీలు అప్ ట్రెండ్‌లోకి వచ్చాయి. సెన్సెక్స్ 54వేల పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16 వేల స్థాయిని సునాయాసంగా అధిగమించింది. సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 54178 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 16132 వద్ద ముగిసాయి. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపించింది. టైటన్, ఎల్ అండ్‌టీ, యూపీఎల్, హిందాల్కో, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, జూబ్లియంట్ ఫార్మా ఇండస్ ఇండ్, బీవోబీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు సిప్లా, భారతి ఎయిర్టెల్ నెస్లే, బజాజ్ ఫైనాన్స్, డా.రెడ్డీస్ నష్ట పోయాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అటు చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు పతనమైంది. చమురు ధరలు వరుసగా మూడో రోజు కూడా నేల చూపులు చూస్తుండటంతో దేశీయ కరెన్సీ రూపాయికి బలవ చ్చింది. 16 పైసల లాబంతో 79.17 వద్ద ఉంది. -
మార్కెట్లో ఒడిదుడుకులే..?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయన్నారు. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(గురువారం) తేదీ ఉంది. అదే రోజున జూన్ ద్రవ్యలోటు, మే మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా, మరుసటి రోజున(జూలై 1న) ఆటో కంపెనీల జూన్ విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, కోవిడ్ కేసులు అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూలతలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు కనిష్ట స్థాయి నుంచి రెండున్నర శాతం రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 1,368 పాయింట్లు, నిఫ్టీ 406 చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 15,700 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 15,900–16,250 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెండ్ బేర్స్‌కు అనుకూలంగా మారితే దిగువస్థాయిలో 15,350 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ► క్రూడాయిల్ కదలికలు ఇటీవల గరిష్టాలకు(127.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ ధర శుక్రవారం నాటికి 113.12 డాలర్లగా ఉంది. ‘‘ప్రస్తుతానికి క్రూడ్ ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రతికూలతలు సద్దుమణిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు తిరిగి పెరొగొచ్చు’’ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ జూన్‌లో రూ.46,000 కోట్లు, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి(జూన్ 24వ తేదీ నాటికి) వరకు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌లు కఠినతర ద్రవ్య విధాన అమలు తదితర అంశాలు ఎఫ్ఐఐల విక్రయాలకు కారమణని యస్ సెక్యూరిటీస్ ఇస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ జైన్ తెలిపారు. గురువారం ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ గురువారం(జూన్ 30న) నిఫ్టీ సూచీకి చెందిన జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. ► శుక్రవారం ఆటో విక్రయ గణాంకాలు దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం జూన్ నెల వాహన విక్రయాలు గణాంకాలను వెల్లడించనున్నాయి. ఆటో డేటా విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, ఎస్కార్ట్స్ షేర్లు అధిక పరిమాణంలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడంతో గత వారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా ఏడు శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన ‘‘లో బేస్ ఎఫెక్ట్’’తో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చు. ► అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా మే నెల గృహ అమ్మక గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఎల్లుండి యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ యూరోపియన్ యూనియన్ జూన్ పారిశ్రామిక, సేవా రంగ గణాంకాలు(జూన్ 29న) విడుదల అవుతాయి. అదే రోజున జపాన్ రిటైల్ విక్రయాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజున(జూన్ 30)న అమెరికా నిరుద్యోగ గణాంకాల డేటా వెల్లడి అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్లో ద్రవ్యోల్బణం దడ
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్యపాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్లు క్షీణించి 16,201 వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.3.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2,52 లక్షల కోట్లకు దిగివచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ వంటి అధిక వెయిటేజీ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఎనిమిది మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు రెండుశాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,974 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,831 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.., రానున్న రోజుల్లో పెంపు తప్పదనే ఈసీబీ వ్యాఖ్యలతో యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 2% నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,466 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు చొప్పున పెరిగాయి. నష్టాలు ఎందుకంటే..! ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర(121.28డాలర్లకు) మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి నాలుగుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం తదితర అంశాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ బజాజ్ ఆటో షేరు రాణించింది. రెండు శాతం లాభంతో రూ.3,965 వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ బైబ్యాక్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైంది. ► హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు ఈ వారంలో ఐదుశాతం నష్టాన్ని చవిచూశాయి. ► మెడ్‌ప్లస్ షేరు మూడుశాతం నష్టపోయి రూ.753 వద్ద స్థిరపడింది. -
రూపాయి... పతనాల రికార్డు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ‘కనిష్ట పతన రికార్డులు’ కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి 77.93కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, దేశం నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు మళ్లడం, ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి బలహీనతలకు ప్రధాన కారణాలు. రూపాయి గురువారం ముగింపు 77.74. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 77.81ని చూసింది. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 77.81 వద్దే ప్రారంభమైంది. 77.79 స్థాయిని దాటి ఏ దశలోనూ బలపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 80 వరకూ బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.90 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.20 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ బేరల్‌కు 120 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలావుండగా, జూన్ 3తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వల పరిస్థితి 601.057 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం వారంతో పోల్చితే 306 మిలియన్ డాలర్లు తగ్గాయి.