సాక్షి,న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధర లీటరుకు 40-44 పైసలు తగ్గిస్తున్నట్టు దేశీయ ఆయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో ఢిల్లీ, కోలకతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ సహా ఇతర నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు మరింత దిగి వచ్చాయి. ముఖ్యంగా అక్టోబరులో నింగిని తాకిన పెట్రోలు ధర ఇప్పటివరకూ రూ.8 లు దిగి వచ్చింది. ముఖ్యంగా ఈ నవంబరు నెలలో లీటరు పెట్రోలు ధరరూ.4లు , డీజిలు ధర రూ.3.10 మేర తగ్గింది.
హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 80.12 డీజిలు ధర రూ. 76.77.
విజయవాడ : పెట్రోలు ధర లీటరుకు రూ. 79.39, డీజిలు ధర రూ. 75.64.
న్యూఢిల్లీ: పెట్రోలు ధర రూ. 75.57, డీజిలు ధర్ రూ. 70.56.
ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 81.10, డీజిలు ధర రూ. 73.91.
కోలకతా: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.53, డీజిలు ధర రూ. 72.41.
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 78.46, డీజిలు ధర రూ. 74.55.
మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా భారీగా బలపడింది. నిన్న(గురువారం) దాదాపు మూడు నెలల తరువాత రూ.71నుంచి పైకి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment