petrol diesel prices
-
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుందన్నారు. భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈవీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈవీలకు ప్రభుత్వం అందించే రాయితీ అవసరం లేదని తెలిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అవికాస్తా వైరల్‌గా మారడంతో మంత్రి దీనిపై తాజాగా స్పష్టతనిచ్చారు. ‘ఈవీలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు నేను వ్యతిరేకం కాదు. దీనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను బాధ్యత వహించాలని, ఈవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈవీలు ప్రారంభమైనప్పుడు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ధర 150 డాలర్లు(రూ.12,500)గా ఉండేది. ప్రస్తుతం దాని ధర 108-110 డాలర్లుగా(రూ.9,100) ఉంది. ఇది రానున్న రోజుల్లో రూ.8,300కు తగ్గుతుందని విశ్వసిస్తున్నాను. ఉత్పత్తి ఖర్చులు తగ్గినందున సబ్సిడీ లేకుండా కూడా కంపెనీలు వాటి ఖర్చులను నిర్వహించవచ్చని అంచనా వేశాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు‘వచ్చే రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుంది. కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో సబ్సిడీల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖ, భారీ పరిశ్రమల శాఖ ఈ విభాగానికి మరింత రాయితీలు అవసరమని భావిస్తే, నేను దాన్ని వ్యతిరేకించను’ అని స్పష్టం చేశారు. -
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం భారత్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గడిచిన రెండేళ్లలో ప్రపంచంలోనే ఫ్యూయల్ ధరలు తగ్గిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమేనని సూచించారు. ఇదంతా ప్రధాని మోదీ ఘనతేనని తెలిపారు. సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ధరల కట్టడిలో ప్రధాని మోదీ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు పూటల రేషన్ బియ్యం అందిస్తూనే మోదీ ఇంధన ధరల్ని తగ్గించగలిగారని పునరుద్ఘాటించారు. మోదీ నిర్ణయం..తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అంతేకాదు రెండు ఏళ్లే కాలంలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని తెలిపారు. గత కొన్నేళ్లుగా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ కొరత ఏర్పడిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నవంబర్ 2021, మే 2022 సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ఆ నిర్ణయం వల్ల పెట్రోల్ ధర 13 రూపాయలు, డీజిల్ ధర రూ.16 రూపాయలకు తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను సైతం తగ్గించాయని అన్నారు. భారత్‌లో ధరలు స్థిరంగా వరల్డ్ వైడ్‌గా ధరలు పెరిగిపోతుంటే భారత్‌లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. శ్రీలంక ధరలు 60-70 శాతం పెరిగాయి. పాకిస్తాన్లో ధరలు అదుపు లేకుండా పెరిగాయి. అమెరికా, పశ్చిమ యూరప్, కెనడాలలో 25 శాతం నుంచి 40 శాతం మధ్య పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయా? రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గుర్తు చేశారు. తాను ఏ ప్రకటన చేసినా అది ఎన్నికల ఉల్లంఘనే అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ప్రసంగాన్ని ముగించారు. -
లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలు తగ్గవు..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.8 తగ్గింది. డీజిల్‌పై రూ.6 తగ్గించడం జరిగింది. రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం! బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్ అధికారి తెలిపారు. -
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, రష్యా తమ ఉత్పత్తి– ఎగుమతి కోతల విధానాన్ని ఏడాది చివరి వరకు పొడిగించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్ల పైకి చేరాయి. ఇది 10 నెలల గరిష్ట స్థాయి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. చమురు అవసరాల కోసం 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగితే, దేశంపై దిగుమతుల భారం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. రష్యాతో కలిసి కూటమిగా ఉన్న ఒపెక్ (ఓపీఈసీ– పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా డిసెంబర్ చివరి వరకు ప్రపంచ మార్కెట్‌కు సరఫరాలో రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ తగ్గింపును కొనసాగించాలని ఇటీవల నిర్ణయించింది. అటు తర్వాత బ్రెంట్ ధర గత వారంలో 6.5% పెరిగింది. ఇక రష్యా కూడా ఇటీవలి నెలల్లో చమురు ఎగుమతులపై కోతలకు నిర్ణయం తీసుకుంది. భారత్ బిల్లు బ్యారెల్ సగటు 89.81 డాలర్లు! తాజా పరిణామాలతో మంగళవారం మొదటిసారి ఈ సంవత్సరంలో బ్రెంట్ బ్యారెల్ ధర మొదటిసారి 90 డాలర్లు దాటింది. బుధవారం కూడా ఈ వార్త రాసే 11 గంటల సమయంలో అదే స్థాయిలో ట్రేడవుతోంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ఆగస్టులో 86.43 డాలర్లు. ఈ నెలలో 89.81 డాలర్లకు పెరుగుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ ధర 73 నుంచి 75 డాలర్ల శ్రేణిలో తిరిగింది. అయితే జూలైలో 80.37 డాలర్లకు తాజాగా 90 డాలర్లకు పెరిగింది. దీనితో దేశీయంగా రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు ముగింపు పడినట్లయ్యింది. నిజానికి గత సంవత్సరం తీవ్ర స్థాయికి ధరలు చేరినప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ యేడాది మేలో పరిస్థితి కొంత మెరుగుపడుతోందనుకుంటుండగా, ధరలు మళ్లీ దూసుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నిజానికి 17 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో నిలకడగా కొనసాగుతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 పలుకుతుండగా, డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు అంతర్జాతీయ ఇంధన ధరల బెంచ్‌మార్క్ 15 రోజుల రోలింగ్ యావరేజ్ ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాలి. అయితే ఆయా సంస్థలు 2022 ఏప్రిల్ 6 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల తర్వాత రిటైల్ రేట్ల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు మే 22న చివరిసారిగా ధరలు మారాయి. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్ ధర 73–74 డాలర్ల శ్రేణిలో ఉంటే, చమురు కంపెనీలు రోజువారీ ధరల సవరణను మళ్లీ ప్రారంభించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇక తగ్గింపు అవకాశాలే సన్నగిల్లాయన్నది నిపుణుల అంచనా. భారీ ‘విండ్‌ఫాల్’ ఆదాయం! అధిక ధరల పరిస్థితుల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి దేశీయ ఉత్పత్తి సంస్థలు అధిక ఆదాయాలను పొందుతాయి. దీనితో పెరుగుతున్న ఆదాయాల నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రూపంలో భారీ మొత్తాలను పొందే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) రూపంలో విధించే పన్ను సెప్టెంబర్ 2 నుండి టన్నుకు రూ. 6,700కి తగ్గింది. ఇది గతంలో టన్నుకు రూ.7,100గా ఉంది. రానున్న నెలల్లో మళ్లీ పెంపు బాట పట్టవచ్చు. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎౖMð్సజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత అంచనా. -
పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
చేతులెత్తేసిన పాక్ సర్కార్.. దారుణంగా పాకిస్తానీల పరిస్థితి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు శ్రీలంకను మించిన పరిస్థితి దాయాది దేశంలో కనిపిస్తుంది. ఇప్పటికే తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తానీలపై ప్రభుత్వం మరో బాంబు వేసింది. ఇంధన ధరలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఒకేసారి ఏకంగా 35 రూపాయలు పెంచింది. దీంతో, బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు దర్శనమిస్తున్నాయని డాన్ పత్రిక పేర్కొంది. ఈ సందర్బంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే రేట్లను పెంచినట్టు చెప్పారు. గ్లోబల్ మార్కెట్ నుండి చమురు కొనుగోలు చేయడానికి అధిక ధర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకు ముందు, ఆర్థిక మంత్రి దార్.. పాకిస్తాన్‌ను అల్లా రక్షిస్తాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ కరెన్సీ ఇటీవలే భారీగా పతనమైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పాకిస్తాన్ రూపాయి పతనమైంది. ఒకేరోజు ఏకంగా డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయింది. ఇక, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో పాకిస్తాన్ కేవలం మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. సంక్షోభం అధిగమించేందుకు ఐఎంఎఫ్ విడుదల చేసే తదుపరి 100 కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ వేచిచూస్తోంది. మరోవైపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ ఐఎంఎఫ్ ప్రతినిధి బృందం పాకిస్తాన్లో పర్యటించనుండగా నిధుల ప్రవాహం ప్రారంభమవుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రధాన సమస్యల నుంచి పక్కదారి
త్రిసూర్(కేరళ): విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల ధాటికి ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలను సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ సర్కార్ శతథా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగసిన ధరల అంశాలను గాలికొదిలేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వయం సమాజంలో విద్వేషాన్ని పెంచి హింసకు తావు కల్పిస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రను శనివారం ఆయన త్రిసూర్ దగ్గర్లోని పెరంబ్రలో ప్రారంభించారు. త్రిసూర్‌లో భారీ జనసందోహానుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘గత ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఏం చేసిందని తరచూ ప్రధాని మోదీ అడుగుతుంటారు. అయితే, మోదీ జీ, మేం ఎన్నడూ దేశంలో నిరుద్యోగిత ఇంతటి గరిష్ట స్థాయికి తేలేదు. నిత్యావసరాల ధరలూ ఈ స్థాయికి పెరగలేదు. మా యూపీఏ హయాంలో వంటగ్యాస్ కోసం రూ.400 సరిపోయేవి. ఆ ధరే ఎక్కువ అన్నట్లు ఆనాడు మీరు మాట్లాడారు. కానీ, ఇప్పుడు రూ.1,000 దాటేసింది. ఇప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడరేం?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల సొమ్మును అన్యాయంగా లాక్కుంటున్నారు. కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల బోషాణంలో పోస్తున్నారు. హింస, విద్వేషం పెరిగేలా చేసి ప్రజా సమస్యల నుంచి పౌరుల దృష్టిని కేంద్రం మళ్లిస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘పట్టణ నిరుద్యోగిత రేటు దేశంలో కేరళలోనే అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వ పాలనను విమర్శించడం నా ఉద్దేశంకాదు. సీఎం విజయన్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. యువత భవితను పట్టించుకోండి’’ అని రాహుల్ అన్నారు. -
పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ సీఎం సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు తొలి కానుక అందించారు. పెట్రోలుపై లీటరుకు రూ. 5 డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గించినట్లు సీఎం షిండే ప్రకటించారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం షిండే విలేకరులకు వెల్లడించారు. సామాన్య పౌరులకు మేలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రజల సంక్షేమానికి శివసేన-బీజేపీ ప్రభుత్వ నిబద్ధతలో భాగమే ఈ నిర్ణయం అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మరోవైపు షిండే నిర్ణయాన్ని అభినందిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "స్వాగతించే నిర్ణయం" అని ట్వీట్ చేశారు. పెరుగుతున్న ధరల నుండి మన ప్రజలను రక్షించడానికి నవంబర్,మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గింపుతో పాటు మహారాష్ట్ర తాజా నిర్ణయం అక్కడి వినియోగదారులకు పెద్ద ఉపశమనం. మిగిలిన రాష్ట్రాలు కూడా ధరల తగ్గింపుపై ఆలోచించాలని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. Great relief to Maharashtrian & Marathi Manus ! Happy to announce that new Government under CM Eknathrao Shinde has decided to reduce Petrol & Diesel prices by ₹5/litre & ₹3/litre respectively.#CabinetDecision #PetrolDieselPrice #Maharashtra — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 14, 2022 A welcome decision! In a big relief to consumers of #Maharashtra #PetrolPrice reduced by ₹5/ltr & #diesel by ₹3/ltr. This in addition to excise duty cut by centre in Nov & May to protect our people from rising prices. Hope opposition states also bring down #PetrolDieselPrices — Hardeep Singh Puri (@HardeepSPuri) July 14, 2022 -
సీఎన్జీ వాహనాలకు డిమాండ్..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, వాటితో పోలిస్తే చౌక ఇంధనమైన సీఎన్జీతో (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో సీఎన్జీ వాహనాల వాటా దాదాపు అయిదో వంతుకు చేరింది. సరఫరాపరమైన సమస్యలు లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వాహన విక్రయాల గరిష్ట స్థాయిని (4,74,953) సీఎన్జీ విభాగం దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,30,000 పైచిలుకు సీఎన్జీ వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా మోడల్ కోసం 8–9 నెలల పైగా వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అమ్మకాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఈ ఏడాది సగటున నెలవారీగా చూస్తే సీఎన్జీ వాహనాల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చని సంస్థ ఆశిస్తోంది. గతేడాది మొత్తం మీద 37,584 సీఎన్జీ వాహనాలను అమ్మిన హ్యుందాయ్ ఈ ఏడాది తొలి అయిదు నెలల్లో ఇప్పటికే 24,730 పైగా సీఎన్జీ వాహనాలను విక్రయించింది. మూడు దిగ్గజాలు.. గతేడాది ఆగస్టులో జరిగిన భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా.. డీజిల్ వాహనాలను తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ సూచించారు. తద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగానే దేశీ ఆటొమొబైల్ సంస్థలు తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ కలిసి సీఎన్జీకి సంబంధించి 14 వాహనాలను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సీఎన్జీ వాహన విక్రయాలు 2,61,000 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటర్స్ ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టిగోర్, టియాగో వాహనాలకు సంబంధించి ఈ వేరియంట్ అమ్మకాలు 52 శాతానికి చేరినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సీఎన్జీ వాహన శ్రేణి వాటా 10 శాతం దాకా ఉంటుందని వివరించాయి. నిర్వహణ వ్యయాలు తక్కువ.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలను నడిపే వ్యయాలు తక్కువగా ఉంటున్నాయి. ద్రవ ఇంధనాలతో నడిచే వాహనాలకు సంబంధించిన ఖర్చు ప్రతి కిలోమీటరుకు రూ. 5.30–5.45గా ఉంటోంది. అదే సీఎన్జీ వాహనాల వ్యయం అందులో సగానికన్నా తక్కువగా ప్రతి కిలోమీటరుకు రూ. 2.1–2.2 స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా సీఎన్జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్జీ డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 3–4 ఏళ్ల క్రితం 1,400 అవుట్లెట్లు ఉండగా ప్రస్తుతం 3,700కు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ తగ్గింపు
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించి, వినియోగదారులకు మరింత ఊరట కలిగించాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌లో కోత విధించింది. దీనివల్ల తమ ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై 1.36 చొప్పున వ్యాట్ తగ్గించింది. తాము లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున తగ్గిస్తామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. పెట్రో పన్ను తగ్గింపును పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. పన్నులు పెంచినప్పుడు సంప్రదించారా?: తమిళనాడు ఆర్థిక మంత్రి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు విషయంలో కేంద్రం పక్షపాతం ప్రదర్శించిందని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆదివారం విమర్శించారు. రాష్ట్రాలు సైతం పన్ను తగ్గించాలని కేంద్రం కోరడం సమంజసం కాదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచినప్పుడు కేంద్రం ఏనాడూ రాష్ట్రాలను సంప్రదించలేదని తప్పుపట్టారు. 2021 నవంబర్‌లో కేంద్రం ప్రకటించిన పన్ను కోత వల్ల తమిళనాడు ఇప్పటికే రూ.1,000 కోట్లకుపైగా నష్టపోయిందన్నారు. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా పెట్రో ధరలు 2014 నాటి కంటే అధికంగానే ఉన్నాయని ఆక్షేపించారు. 72 గంటల్లోగా పెట్రోల్, డీజిల్‌పై తమిళనాడు సర్కారు పన్ను తగ్గించాలంటూ రాష్ట్ర బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రాలకు పన్ను నష్టం జరగదు: నిర్మల పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో కోత పడుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో భాగమైన రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్సును మాత్రమే తగ్గించినట్లు తెలిపారు. ఈ సెస్సును రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవడం లేదని ట్విట్టర్లో స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో ఎలాంటి కోత ఉండదని తేల్చిచెప్పారు. భారత్ భేష్: ఇమ్రాన్ ఖాన్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో ప్రశంసించారు. దక్షిణాసియా ఇండెక్స్ రిపోర్టును ట్వీట్‌కు జతచేశారు. భారత ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండడం, దేశీయంగా వినియోగదారుల కోసం ధర తగ్గించడం మంచి పరిణామం అని తెలిపారు. అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ రష్యా చమురు విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదని పేర్కొన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో తమ హయాంలోనూ ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రయత్నించామని అన్నారు. -
పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు
హిమాయత్‌నగర్(హైదరాబాద్): టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాజాగా కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కోవిడ్ సమయంలో తలెత్తిన పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని, ఆ ప్రభావం అమెరికా వంటి దేశాలతో పాటు భారత్‌పై కూడా పడిందని ఆయన పేర్కొన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయన్నారు. కొద్ది రోజుల కిందట కూడా వివిధ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై సెస్‌ను తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని విమర్శించారు. ఆదివారం నారాయణగూడలోని కేఎంఐటీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలు తెలుసుకొని పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గించడం వల్ల ఎంతోమందికి ఉపశమనం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం పన్నులు తగ్గించిందని కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ రైతులను కలుస్తూ ఏదో సాధించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలసినా, పాకిస్తాన్ అధ్యక్షుడిని కలసినా తామేమీ భయపడమన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన సంచలనాలన్నీ ఆయన ప్రగతిభవన్‌కే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. -
పెట్రోల్ వ్యాట్‌పై మోదీ వ్యాఖ్యలు.. ప్రతిపక్షాల కౌంటర్ అటాక్
పెట్రోల్, డీజిల్ పన్నుల పేరుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ దాడి చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్ ధరల పెంపుపై మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దూమారం రేపుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ తగ్గించాలంటూ కోరిన మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కౌంటర్ దాడికి దిగాయి. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని, బీజేపీయేతర రాష్ట్రాల పట్ల సవతి తల్లిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకనేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. దేశంలో పెరుగుతున్న చమురు ధరలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని కోరారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను తగ్గించారని అన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినా ఆలోచించకుండా ప్రజలకు ప్రయోజనాలు అందిచడమే మొదటి ప్రాధాన్యతగా భావించాయని పేర్కొన్నారు. అదే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇంధనంపై పన్ను తగ్గించలేదని, ఇప్పుడు తగ్గించాలని మోదీ కోరారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం అత్యవసరమన్నారు. అలాగే సహకార సమాఖ్య విలువలను నెలబెట్టాలని రాష్ట్రాలను కోరారు. చదవండి👉ముందు మీ రాష్ట్రాల్లో తగ్గించమనండి అయితే మోదీ వ్యాఖలపై ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఘాటుగా స్పందించాయి. మోదీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ విమర్శలు గుప్పించాయి. అందులో.. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగిపోయాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆరోపించారు. ట్యాక్స్‌ను తగ్గించడం కాదు.. తాము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంధనపంఐ ట్యాక్స్‌ను పెంచలేదని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్ వల్ల తమకు సరైన వాటాలో 41 శాతం రావడం లేదన్నారు. సెస్ రూపంలో కేంద్రం.. రాష్ట్రం నుంచి 11.4 శాతం దోచుకుంటుందని, 2023 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 29.6 శాతం మాత్రమే లభిస్తోందన్నారు. దయచేసి సెస్‌ని రద్దు చేయాలని తద్వారా భారతదేశం అంతటా పెట్రోల్‌ను రూ.70కి మరియు డీజిల్‌ను రూ.60కి ఇవ్వగలమని అన్నారు. అప్పుడే ఒక దేశం - ఒకే ధర అవుతుందన్నారు. చదవండి👉 గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు.. కరోనా టైంలో శవాలు తేల్చారు: కేటీఆర్ Fuel prices have shot up because of NPA Central govt Name-calling states for not reducing VAT even though we never increased it; is this the co-operative federalism you're talking about @narendramodi ji?#Telangana hasn't increased VAT on fuel since 2014 & rounded off only once — KTR (@KTRTRS) April 27, 2022 పశ్చిమ బెంగాల్ కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇతరులకు సవతి తల్లిగా వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. పెట్రోల్ పన్నును తగ్గించాలంటూ ప్రతిపక్ష రాష్ట్రాలకు ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిలో ‘రాజకీయ ఎజెండా’ ఉందని విమర్శించారు. ఇంకా, రాష్ట్ర ప్రభుత్వాలపై 'భారం' వేయవద్దని ఆమె కేంద్రాన్ని కోరారు. కేంద్రం ధరలు పెంచుతూ రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని కోరడం ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించడమేనని అన్నారు. మోదీ ఇలా మాట్లాడకూతదని హితవు పలికారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మూడేళ్లుగా ఇంధనంపై రూ. 1 సబ్సిడీ ఇస్తోందని, ఫలితంగా రూ. 1,500 కోట్లు నష్టపోయిందన్నారు. అయితే దీనిని ప్రధాని మోదీ ప్రస్తావించలేదని ఆమె అన్నారు. ‘ఇంధన ఆదాయాన్ని 50-50 పంచుకోవాలని మేము చెప్పాం. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. వారు 75 శాతం తీసుకుంటూ ఇంధనంపై లక్షల కోట్లు సంపాదించారు. రాష్ట్రాలకు ఏం ఇవ్వలేదు. కేంద్రం రూ. 97,000 కోట్లు బెంగాల్‌కు బకాయిపడింది. ఆ డబ్బు నాకు ఇవ్వండి. మేము సబ్సిడీలు ఇస్తాం. సామాన్యులకు మేం ఉపశమనం కలిగించకూడదనుకోవడం నిజం కాదు. కేంద్రమే మాపై భారీ భారం మోపుతోంది’ ”అని మమతా ఫైర్ అయ్యారు. చదవండి👉ఇదేం పద్దతి, ప్రధాని మాట్లాడే మాటలేనా?.. కేసీఆర్ ఫైర్ తమిళనాడు కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్ కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ విమర్శించారు.సెస్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గుర్తుచేస్తూ.. దయచేసి సెస్ వసూలు చేయవద్దని ప్రధానమంత్రికి కౌంటర్ ప్రతిపాదన చేస్తామని తెలిపారు. సెస్ వసూలు చేస్తూ.. దానిని వ్యాట్‌గా మార్చవద్దని కోరారు. అప్పుడైనా కనీసం కేంద్రం తీసుకునే ధర అయినా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతుందన్నారు. డీఎంకే వ్యాట్ ధరలను ఎప్పుడూ పెంచలేదన్నారు. అంతేగాక పెట్రోల్ ధరలను రూ. 3 తగ్గించామని తెలిపారు. వ్యాట్ ధరలను అన్నాడీఎంకే నిర్ణయించిందన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 26 లక్షల కోట్లు ఆర్జించిందని, ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రధాని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం స్పష్టం చేశారు. ముంబైలో ప్రస్తుతమున్న లీటర్ డీజిల్ ధరలో కేంద్రానికి రూ.24.38, రాష్ట్రానికి రూ.22.37 వాటా ఉందన్నారు. అలాగే పెట్రోల్ ధరలో రూ. 31.58 కేంద్ర పన్ను.. రూ. 32.55 రాష్ట్ర పన్ను ఉందన్నారు. కావున రాష్ట్రాల కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల అనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అంతేగాక రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ఇప్పటికే న్యాచురల్ గ్యాస్‌పై పన్ను మినహాయింపు ఇచ్చిందని చెప్పడం కొసమెరుపు. -
ఇదేం పద్దతి, ప్రధాని మాట్లాడే మాటలేనా?.. కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రాలు పన్నులు తగ్గించాలంటూ మోదీ మాట్లాడారు. ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా అవి? సిగ్గూ ఎగ్గూ ఉందా? ఏ నోటితో అలా మాట్లాడుతున్నావ్? పెంచేది మీరు..తగ్గించేది మేమా? తెలంగాణ ఏర్పడ్డ తరువాత పెట్రోల్, డీజిల్ మీద మేం పన్నులు పెంచలేదు. ఒకేసారి రౌండ్ ఫిగర్ చేయడానికి సర్దుబాటు చేశాం. కానీ ప్రధానమంత్రి కుటిల, దుష్ట రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పకుండా లోగుట్టుగా పన్నులు పెంచుతున్నారు. ‘‘బలమైన కేంద్రం– బక్క రాష్ట్రం’’అనే ధోరణిలో ఉన్నారు. పన్నులు ఎందుకు పెంచుతున్నామో ప్రజలకు చెప్పాలి. మేము రిజిస్ట్రేషన్ చార్జీలు ఎందుకు పెంచుతున్నామో చెప్పి పెంచినం. నువ్వు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కునారిల్లుతున్న ఆర్టీసీని బతికించేందుకు మేం వేల కోట్లు వెచ్చిస్తున్నం. ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్లు ఇస్తామన్న ఘనుడు ప్రధానమంత్రి..’అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. చదవండి👉 గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు.. కరోనా టైంలో శవాలు తేల్చారు: కేటీఆర్ -
Petrol Prices: ‘వ్యాట్’ తగ్గిస్తేనే పెట్రో ఊరట
న్యూఢిల్లీ/ముంబై/కోల్‌కతా: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజలకు ఊరట కలిగించడానికి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని కోరారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్–19 తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెట్రో ధరల మోతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ఎౖMð్సజ్ సుంకాలను తగ్గించిందని గుర్తుచేశారు. వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయని, దీనివల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు. మరికొన్ని రాష్ట్రాలు తమ విజ్ఞప్తిని మన్నించి, వ్యాట్‌ను తగ్గించాయని చెప్పారు. సీఎంలను ప్రత్యేకంగా కోరుతున్నా.. బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాయని వెల్లడించారు. దీనివల్ల రూ.వేల కోట్ల ఆదాయం నష్టపోతున్నప్పటికీ ప్రజలకు సాయం చేయడం కోసం ముందుకొచ్చాయని ప్రశంసించారు. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల వ్యాట్ తగ్గించలేదన్నారు. అందువల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. తాను ఎవరినీ విమర్శించడంలేదని, ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికైనా వ్యాట్ మినహాయించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నానని చెప్పారు. కలిసి పనిచేయాలి ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. సప్లైచైన్ తీవ్రంగా ప్రభావితం అవుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా సవాళ్లు ముగిసిపోలేదు కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు ఇంకా అంతం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ అనేది అతిపెద్ద రక్షణ కవచమని తెలిపారు. పిల్లల్లో అర్హులైనవారందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇచ్చారు. కరోనాపై భారత్ సుదీర్ఘ యుద్ధం చేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. కరోనాపై పోరాటంలో ముఖ్యమంత్రులు, అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలి: కాంగ్రెస్ న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.27 లక్షల కోట్లు ఆర్జించిందని, ఆ సొమ్మంతా ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. యూపీఏ సర్కారు హయాం కంటే మోదీ సర్కారు హయాంలో చమురుపై ఎక్సైస్ సుంకం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. ఈ సుంకాన్ని వెంటనే తగ్గించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను 2014 మే నెల నాటి స్థాయికి తగ్గించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ విమర్శలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తగ్గించలేదని ధ్వజమెత్తారు. రూ.1,500 కోట్లు వెచ్చించాం: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలకు రాయితీ ఇస్తున్నామని, ఇందుకోసం గత మూడేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పెట్రో ధరలపై ప్రధాని అవాస్తవాలు చెబుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరోనాపై సమీక్షించడానికి నిర్వహించిన వర్చువల్ భేటీలో ప్రధానమంత్రి పెట్రోల్ ధరలపై మాట్లాడడం ఏమిటని మమత ఆక్షేపించారు. ఈ భేటీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కేంద్రం రూ.26,500 కోట్లివ్వాలి: ఉద్ధవ్ థాకరే కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరగుదలకు తాము బాధ్యత వహించబోమన్నారు. కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల్లో 38.3 శాతం, జీఎస్టీ వసూళ్లలో 15 శాతం మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని తెలిపారు. తమ వాటా కింద రూ.26,500 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ -
ధరలు తగ్గించాలి.. ధాన్యం కొనాలి
సాక్షి, నెట్వర్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల్ని తగ్గించాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయా లనే డిమాండ్లతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కలెక్టరేట్ల ఎదుట, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్షలు నిర్వహించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు శనిలా దాపురించారన్నారు. మహబూబాబాద్‌లో బెల్లయ్యనాయక్, ఖమ్మంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్, ఇల్లెందులో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్ వద్ద బైఠాయించిన నాయకులు సంగారెడ్డిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించగా, ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం గ్యాస్‌బండకు దండవేసి ప్రధాన రహదారిపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కాగా, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చే క్రమంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై పన్ను తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై రాష్ట్రప్రభుత్వం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నును తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. పెట్రో ల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించిన కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి పెరిగిన పెట్రో ల్, డీజిల్ ధరలతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4, డీజిల్‌పై రూ.3 చొప్పున రాష్ట్రానికి ఆదాయం వస్తోందని సోమవారం నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ భారాన్ని తగ్గించాలని, అలాగే పెంచిన కరెంటు, బస్సు చార్జీలను తగ్గిస్తేనే ప్రజ లు కేసీఆర్‌ను విశ్వసిస్తారని పేర్కొన్నారు. -
ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు
పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. సాధారణంగా డబ్బులను కట్నాలుగా రాపించడం.. లేదా ఏదైనా ఖరీదైన గిఫ్ట్‌లను అందజేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లో చిన్నపిల్లల పాల బాటిళ్లు వంటి ఢిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ కొంతమంది స్నేహితులు కొత్త దంపతులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వారంలో కనీసం నాలుగు రోజులు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లికి విచ్చేసిన అతిథులు వధూవరులకు పెట్రోల్, డీజిల్ నింపినబాటిళ్లను కానుకగా అందించారు. చెంగల్పట్టు జిల్లా చెయ్యూరుకు చెందిన గిరీశ్ కుమార్, కీర్తన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్నేహితులు పెట్రోల్, డీజిల్‌ను లీటర్ బాటిళ్లలో నింపి, వాటిని వధూవరులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తమిళనాడులో గత 15 రోజుల్లో 9 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, డీజిల్ ధర రూ. 100.94గా ఉంది. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
నాటకాలు ఆపి ధాన్యం కొనండి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు. అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని నాయకులు ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపి ధాన్యం కొనాలని, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్‌లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు జిల్లా మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క, వనపర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. -
రాష్ట్రాలపైకి ‘పెట్రో’ పాపం
సాక్షి, హైదరాబాద్: ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిందని, మోదీ నేతృత్వంలో అధికారం లోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిం దని దుయ్యబట్టారు. పెట్రో ధరల పెంపులో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ సహా మన పొరుగు దేశాలతోపాటు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ పెట్రో ఉత్ప త్తుల ధరలు భారత్‌లో కంటే తక్కువగా ఉన్నాయ న్నారు. ‘కరోనా సంక్షోభం లోనూ పెట్రో ఉత్పత్తు లపై ఎక్సైజ్ సుంకం పెంచారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగకున్నా దేశంలో మాత్రం ధరలు పెరుగు తున్నాయి. అసమర్థ ఆర్థిక విధానాలతో సంపదను సృష్టించే తెలివి లేక పన్నులు పెంచడమే సుపరి పాలన అనే భావదారిద్య్రంలో కేంద్రం ఉంది. దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను వడ్డించి సగటున ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష మోదీ ప్రభుత్వం లూటీ చేసింది. పన్నుల రూపంలో బహిరంగ దోపిడీ చేస్తున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులు తగ్గించాలనే వితండ వాదాన్ని తెరమీదకు తెస్తోంది’ అని అన్నారు. రాష్ట్రాలకు పంచుతున్నది అరకొరే..: పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలో 41% తిరిగి రాష్ట్రాలకే చెల్లిస్తున్నా మంటూ కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ సుంకంలో 50 పైసలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారన్నారు. ‘రాష్ట్రాలను బలహీన పరిచే కుట్రలను అమలు చేస్తూ మోదీ కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండేలా చూసుకుంటు న్నారు. సెస్సుల రూపంలో రూ.30 వసూలు చేస్తూ రాష్ట్రాలకు మొండిచేయి చూపుతున్నారు. 2015 నుంచి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా పన్నులు పెంచలేదు. బీజేపీ ప్రభుత్వం మాత్రం 15 రోజుల్లో 14 సార్లు ధరలు పెంచింది. పెట్రో ధరల పెంపుపై అబద్ధాలు చెప్పే నేర్పు ఉన్న మోదీ ప్రభుత్వం అనేక దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నా.. రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతోంది’ అని కేటీఆర్ చెప్పారు. గ్యాస్, పప్పు, ఉప్పు తదితర నిత్యావసరాలతో పాటు ఔషధాల ధరలు కూడా భారీగా పెరిగి.. సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారిందన్నారు. మోదీ చెప్పినట్లుగా పకోడీలు కూడా అమ్ముకుని బతికే పరిస్థితి లేదని ఎద్దేవాచేశారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవ డంలో విఫలమైన మోదీ దేశ ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టిం చుకున్న రోజు.. ధర్మ సంకటాన్ని వీడి కేంద్రంపై తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. -
మోదీజీ.. మీ మాటలు గుర్తున్నాయా?
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలపై మోదీ చేసిన ట్వీట్లను ప్రధానికి గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘మీ పూర్వపు మాటలను పునరుద్ఘాటిస్తున్నాం మోదీజీ... అంటూ ‘కేంద్ర ప్రభుత్వం విఫలం’,‘రాష్ట్రాలపై భారం’, ‘పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి’, ‘పేదల పట్ల జాలి లేని తనం’, ‘అధికార అహంకారం’’అంటూ అప్పట్లో మోదీ చేసిన ట్వీట్లను రీట్వీట్ చేశారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్రం వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలన్నారు. ఎలాంటి సహకారంలేకున్నా ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ జాతీయ టీవీ చానెల్లో బ్రేకింగ్ న్యూస్‌గా ప్రచారం అయిన ‘ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూపాయి చొప్పున పెరిగాయి. 10 రోజుల్లో 9వ సారి పెరిగిన ధరలివి ’అనే ఫొటోను ట్వీట్ చేస్తూ ‘థాంక్యూ మోదీజీ.. ఫర్ అచ్చే దిన్’అనే హాష్‌ట్యాగ్ జత చేశారు. -
రఘునందన్ Vs టీఆర్ఎస్!
మిరుదొడ్డి (దుబ్బాక)/ బెజ్జంకి (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును.. పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించడం, అక్కడ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా ఆందోళనలకు దిగడంతో ఉద్రి క్తత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండ లం గుడికందులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం ఆ గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు.. కేంద్ర ప్రభు త్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వద్ద నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘు నందన్‌రావు పోలీస్ స్టేషన్లో నేలపై భైఠాయించారు. ఏసీపీ దేవారెడ్డి, సీఐ కృష్ణ ఆయన్ను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు స్టేషన్‌కు తరలివచ్చి ఎమ్మెల్యేకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ముందుగా బీజేపీ కార్యకర్తలను, ఆ తర్వాత ఎమ్మెల్యే రఘునందన్‌రావును బలవంతంగా అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించడం తో గొడవ సద్దుమణిగింది. బెజ్జంకి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడిన రఘునందన్‌రావు.. అధికారం ఎప్పుడూ ఒక్కరికే ఉండదనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేను విడుదల చేయండి: బండి సంజయ్ ఎమ్మెల్యే రఘునందన్ రావును వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఫోన్లో ఆయన సిద్దిపేట పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. కొం దరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. -
గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి..
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, సీఎల్పీ నేత భట్టి తన నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా గ్యాస్ సిలిండర్లకు దం డలు వేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాం గ్రెస్, ఫిషర్ మెన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. -
‘ధరల పెరుగుదలతో దిక్కు తోచని స్థితిలో ప్రజలు’
తిరుమలగిరి (తుంగతుర్తి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, రిజిస్ట్రేషన్, బస్ చార్జీలు, ఇంటి పన్నులు పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, పేద మధ్య తరగతి ప్రజలు ఏ వస్తువు కొనలేని దిక్కు తోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం యాత్ర 39వ రోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని రూప్లా తండా, చౌళ్ల తండా, గుండెపురి గ్రామాల్లో సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా గుండెపురిలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పకుంటే మన బతుకులు బుగ్గిపాలవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న పాల్గొన్నారు. -
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి..
-
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్‌లో డీజిల్ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 50 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్ యూసుఫ్ తన బైక్‌ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘లాక్డౌన్ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్‌ను మెయింటెన్ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! -
జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పేదల రక్తాన్ని పీల్చుకుని, వారి సంపాదనను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచుతున్నాయని, మళ్లీ ఆ పార్టీలవారే ధరలు తగ్గించాలంటూ ధర్నా లుచేయడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడమా అని ప్రశ్నించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న కారణంగా నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే మళ్లీ పెరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చేత్తో ఉచితంగా ఇస్తున్నామని చెబుతూనే, మరో చేత్తో విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.12 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం మోపుతోం దని ఆరోపించారు. కరెంటు చార్జీలు తగ్గించాలని 30న ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, వేం నరేందర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తానంటే ఏర్పాట్లు చేస్తాం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీఎం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తామంటే తాము ఏర్పాట్లు చేస్తామని, కాంగ్రెస్ కేడర్ ఆయనకు రక్షణంగా ఉంటుందని రేవంత్ చెప్పారు. కేంద్రం వచ్చి ఐకేపీ కేంద్రాలను పెడుతుందా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, ఆ తర్వాత ఎవరికి అమ్ముకోవాల నేది దాని ఇష్టమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో ప్రధానిని ఎందుకు కలవడం లేదని, ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంలో కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లు తమకు ఇస్తే «ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని రేవంత్ చెప్పారు. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!
ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్‌పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’ విద్యుత్ భారం రూ.165 కోట్లు గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది. వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది. ముట్టుకుంటే షాక్ కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్‌కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. – నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ వంటింటికి గుదిబండ గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. – గుర్రం అన్నపూర్ణ, బడంగ్పేట్ బైక్ ప్రయాణం భారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్‌లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు. – టి.తిరుమలేష్, కర్మన్‌ఘాట్ -
వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్ 2 తరువాత పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. కాగా పెరిగిన ధరలు నేటి(మార్చి 22) నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.21 ►లీటర్ డీజిల్ రూ. 87.47 ►ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 110.78 ►లీటర్ డీజిల్ రూ. 94.94 ►హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10 ►డీజిల్ లీటర్ రూ. 95.49 ►విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.8 ►డీజిల్ రూ. 96.83గా ఉంది. చదవండి: (LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర) -
క్రూడ్ మోత.. పెట్రో వాత..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ ధర మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు. క్రూడాయిల్ 1 డాలర్ పెరిగితే.. సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో తుది విడత పోలింగ్ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు గతేడాది అక్టోబర్ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు. రూపాయికి చమురు సెగలు అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది. రష్యా ఎఫెక్ట్ .. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్ దాదాపు 85 శాతం క్రూడాయిల్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్ 2.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్‌కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్‌ను కలవరపర్చే అంశం. సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన.. రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా. 150 డాలర్లకూ పెరగొచ్చు.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఉత్పత్తి పెంపుపై ఒపెక్ మల్లగుల్లాలు.. ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్‌కు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్ యూనివర్సిటీలోనిక్లైమేట్ పాలసీ ల్యాబ్ ఎండీ అమీ మయర్స్ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే!
సిద్దిపేటజోన్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిజస్వరూపం మళ్లీ బహిర్గతం కానుందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను మరో పది రూపాయలు పెంచడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘బట్టే బాజ్.. ఝూటే బాజ్ పార్టీ బీజేపీ’అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలను తగ్గించి వారికి భద్రత లేకుండా చేసిం దని కేంద్రం తీరుపై మండిపడ్డారు. సబ్సిడీ తగ్గడంతో ఎరువుల ధరలు పెరుగుతాయన్నారు. విద్యుత్ చట్టంలో సవరణలు చేయాలని, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లను పెట్టాలని కేంద్రం మెలిక పెట్టిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, గొంతు లో ప్రాణం ఉన్నంతవరకు వాటిని పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పార న్నారు. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వడ్లు కేంద్రమే కొన్నదని, కానీ యాసంగిలో వడ్లు కొనబోమని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెప్పడం రైతుకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కేంద్రలో బీజేపీ ప్రభుత్వం వల్ల వాతలు, కోతలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. -
ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85
సాక్షి,తాండూరు(వికారాబాద్): ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్ రేటు సుమారు రూ. 100 ఉంది. ఇటీవల కేంద్ర సర్కారు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించింది. దీంతో లీటర్ డీజిల్‌పై రూ. 10, పెట్రోల్‌పై రూ.5 తగ్గింది. ఈనేపథ్యంలో వాహనదారులకు కొంత ఊరట కలిగింది. కేంద్ర సర్కారు పిలుపు మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్ తగ్గించారు. ఈక్రమంలో కర్ణాటకలో డీజిల్‌పై మరో రూ.10 తగ్గడంతో మన జిల్లాకు పొరుగున ఉన్న ఆ రాష్ట్రానికి వాహనదారులు క్యూ కట్టారు. తాండూరు ప్రాంతంలో భారీగా నాపరాతి గనులు ఉన్నాయి. అదేవిధంగా నాపరాతిని లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పొరుగున ఉన్న కర్ణాటకలో పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గడంతో మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకుల్లో వ్యాపారం తగ్గి వెలవెలబోతున్నాయి. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? 8 మండలాలు చేరువలో.. జిల్లాలో 19 మండలాలు ఉండగా అందులో 8 మండలాలు కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. ప్రధానంగా తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలు రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వ్యాట్ తగ్గించడంతో గతంలో లీటర్ పెట్రోల్ రూ.115 ఉండగా ప్రస్తుతం రూ.109.50 లభిస్తోంది. డీజిల్ ధర గతంలో రూ.108 ఉంటే తగ్గిన ధర ప్రకారం ఇప్పుడు రూ.95.91 దొరుకుతోంది. కర్ణాటకలో పెట్రో ధరలు మరింత తగ్గాయి. అక్కడ డీజిల్ రూ. 85, పెట్రోల్ లీటర్ రూ. 100కు లభిస్తోంది. దీంతో సరిహద్దు మండలాల వాహనదారులతో పాటు తాండూరు ప్రాంతంలోని నాపరాతి గనుల లారీలు మన జిల్లాకు చేరువలో ఉన్న కర్ణాటకకు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తున్నారు. నాపరాతి గనులపై తగ్గిన భారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వందల సంఖ్యలో నాపరాతి గనులు ఉన్నాయి. ప్రతిరోజు గనుల నుంచి యంత్రాల ద్వారా నాపరాతిని వెలికి తీస్తారు. అనంతరం నాపరాతి బండలను వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈనేపథ్యంలో ప్రతిరోజు యంత్రాలకు వేల లీటర్ల మేరకు డీజిల్ అవసరం. తాండూరు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర కర్ణాటకతో పోలిస్తే అధికంగా ఉండటంతో సరిహద్దు దాటి వెళ్లి డీజిల్‌ను తీసుకొస్తున్నారు. 100 లీటర్ల డీజిల్ అక్కడ కొనుగోలు చేస్తే సుమారు రూ.1000 కలిసి వస్తోంది. దీంతో అక్కడికే వెళ్లేందుకు వ్యాపారులు, వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వెలవెలబోతున్న జిల్లా బంకులు జిల్లా సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకులు పక్షం రోజులుగా వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. తాండూరు మండలం జిన్గుర్తి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో పక్షం రోజుల క్రితం వరకు రోజుకు 4 వేల లీటర్ల డీజిల్ విక్రయించేవారు. ప్రస్తుతం 1000 లీటర్లు మాత్రమే సేల్ అవుతున్నట్లు బంకు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం జరగడం లేదు.. నెల రోజుల క్రితం వరకు మా పెట్రోల్ బంకులో రోజుకు వేల లీటర్ల ఇంధనం విక్రయించే వాళ్లం. కేంద్రం వ్యాట్ తగ్గించింది. కర్ణాటకలో ఆ రాష్ట్ర సర్కారు మరింత తగ్గించడంతో వాహనదారులు, నాప రాతి గనుల వ్యాపారులు అక్కడికే వెళ్తున్నారు. గతంలో మేము రోజు 5 వేల లీటర్ల డిజిల్ అమ్మితే ఇప్పుడు 1000 లీటర్ల లోపే విక్రయాలు జరుగుతున్నాయి. నష్టాలు వస్తున్నాయి. – రామకృష్ణారెడ్డి, పెట్రోల్ బంకు నిర్వాహకుడు జిల్లా సరిహద్దులోని ఓ పెట్రోల్ బంకు -
పెట్రో ధరల తగ్గింపు: శరద్‌పవార్ స్పందన
పుణె: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శక్రవారం స్పందించారు. ఆయన పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ నిధులు విడుదల చేస్తే, రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తాయని అన్నారు. చదవండి: Petrol and Diesel Price : వాహనదారులకు కేంద్రం శుభవార్త..! సరైన సమయంలో జీఎస్టీ నిధులు రాష్ట్రాలకు బదిలిచేస్తే ఇందన వ్యాట్ తగ్గింపుతో పాటు పలు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. -
పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు
సాక్షి, హైదరాబాద్: పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలతో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరపై అనధికార బాదుడు ప్రారంభమైంది. కాలుష్య రహితం, మైలేజీ అధికంతో పాటు ధర తక్కువగా ఉండటంతో నేచురల్ గ్యాస్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. నగరంలో కేజీ సీఎన్జీ ధర రూ.69 ఉండగా అదనంగా రూ.10 కలిపి బంకుల నిర్వాహకులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరపై నిలదీస్తే. ఇది అంతే.. అంటూ దబాయింపులకు పాల్పడుతున్నట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. స్టేషన్లకు పెరిగిన తాకిడి మహా నగర పరిధిలోని సీఎన్జీ కేంద్రాలకు తాకిడి పెరిగింది. నగరం మొత్తం సుమారు 84 ప్రత్యేక సీఎన్జీ కేంద్రాలు ఉండగా, దాదాపు 42,705 సీఎన్జీ వాహనాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రోజువారీ సవరణలతో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో గ్యాస్ వినియోగం అధికమైంది. దీంతో కార్లు, ఆ వాహనదారులకు సీఎన్జీపై ఆసక్తి పెరిగింది. చదవండి: బంజారాహిల్స్: డబ్బు తీసుకురాకపోతే చంపేస్తా... ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు గ్యాస్‌కు అనుగుణంగా మార్చుకుంటుండగా.. మరికొందరు అనధికారికంగానే వినియోగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో సీఎన్జీ వినియోగం విపరితంగా పెరిగింది. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు ఉన్నప్పటికీ.. అధిక మైలేజీ ఫలితంగా సీఎన్జీపైనే వాహనాలదారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుందన్నది అంచనా. డిమాండ్‌కు సరిపడా సీఎన్జీ సరఫరా లేదని డీలర్లు పేర్కొంటున్నారు. -
పెట్రోల్ రూ.120 దాటేసింది
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది. మధ్యప్రదేశ్‌లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్ తదితర ప్రాంతాల్లో లీటర్ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్‌లోనూ లీటర్ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.121.52కు, డీజిల్ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ ధర 25 సార్లు (లీటర్‌కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేటు 28 సార్లు(లీటర్‌కు రూ.9.45) పెరిగింది. రండి.. మా దగ్గర ధర తక్కువ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్ రేటు లీటర్‌కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం. బాలాఘాట్ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది. -
ఇంటి బడ్జెట్‌కు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు, నిత్యావసరాల ధరలు ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో చాలా మటుకు కుటుంబాలు (సుమారు 60 శాతం) ఖర్చులు చేస్తున్నప్పటికీ.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. తమ బడ్జెట్ దాటిపోకుండా, పెట్టే ఖర్చుకు కాస్తంత ఎక్కువ విలువ దక్కేలా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ టాప్ 10 నగరాల్లో నిర్వహించిన ‘వినియోగదారుల ధోరణులు‘ అనే సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సుమారు 61,000 కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది. పండుగ సీజన్లో ఖర్చు చేయాలని భావిస్తున్న కుటుంబాల సంఖ్య సెప్టెంబర్‌లో 60 శాతానికి చేరింది. ఈ ఏడాది మే లో ఇది 30 శాతం. గడిచిన నాలుగు నెలల్లో కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. గడిచిన 30 రోజులుగా టాప్ 10 నగరాల్లోని కుటుంబాలు.. పెరిగిపోతున్న ఇంధనాలు, నిత్యావసరాల ధరల గురించి ఆందోళన, ఈ పండుగ సీజన్లో షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్‌కు ప్రాధాన్యం ఇవ్వనుండటం గురించి వివిధ ఆన్లైన్ కమ్యూనిటీల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా తెలిపారు. టాప్ 10 నగరాల్లోని ఏడు నగరాల ప్రజలు.. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వెల్లడించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆన్‌లైన్‌కు హైదరాబాదీల మొగ్గు.. టాప్ 8 నగరాల్లోని వారు తమ పండుగ షాపింగ్‌కు సంబంధించి ఆన్లైన్లో ఆర్డర్లివ్వడం లేదా లోకల్‌గా హోమ్ డెలివరీ పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముంబై, కోల్‌కతా నగరాల్లో చాలా కుటుంబాలు ప్రత్యేకంగా స్టోర్స్, మార్కెట్‌కు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. కానీ హైదరాబాద్ (75 శాతం), నోయిడా (72 శాతం), పుణె (67 శాతం), చెన్నై (60 శాతం) నగరాల్లో అత్యధిక శాతం మంది స్టోర్ట్స్, హైదరాబాద్, నోయిడాకు చెందిన కుటుంబాలు .. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై ఆసక్తిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న హైదరాబాదీ కుటుంబాలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సాంప్రదాయ స్వీట్లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు మొదలైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. -
18 నెలల్లోనే పెట్రోల్‌పై రూ.35.98 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా.. కేవలం 18 నెలల్లోనే లీటర్ పెట్రోల్ రూ.35.98, డీజిల్ చొప్పున రూ.26.58 ధరలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటేసింది. డీజిల్ సైతం రూ.100 మార్కును అధిగవిుంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి భారత్‌లోనూ పెంచకం తప్పడం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా కేంద్రంం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తుండడంతో ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం అంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్లే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ సొమ్ముతోనే ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరో 35 పైసలు పెంపు దేశంలో శనివారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24కు, డీజిల్ రూ.95.97కు ఎగబాకింది. -
ఈటల అవినీతిలో టీఆర్ఎస్కు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని, మాజీమంత్రి ఈటల రాజేందర్ అవినీతిలో టీఆర్ఎస్కు కూడా భాగస్వామ్యం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఈటల ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతున్నందుకు బీజేపీకి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని మహేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ అని.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తిని గెలిపించాలని కోరారు. -
ఆ పథకాల్లో కేంద్రానిది.. ఒక్క రూపాయీ లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సంక్షేమ పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్న.. కేంద్ర బడ్జెట్ పుస్తకాలు తీసుకుని వస్తా. కేంద్రమంత్రిగా మీరు రండి. రాష్ట్ర ఆర్థికమంత్రిగా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా’అని అన్నారు. హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చగా, కేంద్రంలోని బీజేపీ మాత్రం తన వాగ్దానాలను విస్మరించిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నల్లధనం వెలికి తీస్తామని, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పినవి ఏవీ చేయని పార్టీ బీజేపీ అని.. అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ మీద 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.99,068 ఆదాయం రాగా గత సంవత్సరం 2020–21లో పెంచిన పన్నుల వల్ల రూ.3,72,970 కోట్లు రాబటి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రం వాటా ఉందనడం హాస్యాస్పదమన్నారు. దళితబంధును తాను ఆపలేదని రాజేందర్ అంటున్నారు కానీ, దీనిపై ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి రాసిన లేఖ సంగతేంటని ప్రశ్నించారు. అబద్ధాల్లో బీజేపీకి ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టా లని చూస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
Rahul Gandhi: సబ్ కా వినాశ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతుండడం పట్ల కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సబ్ కా వికాస్ అనేది ఎక్కడా లేదని, సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోందని, దేశంలో కాదు, కేవలం పెట్రో ఉత్పత్తుల ధరల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు లాక్కుంటోందని ఆరోపించారు. పన్నుల బెడద లేకపోతే ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ.66కు, డీజిల్ రూ.55కే లభిస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీ తన ట్వీట్‌కు జతచేశారు. మోదీ మిత్రులే సంపన్నులవుతున్నారు: ప్రియాంక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతోందని, ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు కష్టాల పాలవుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ట్వీట్ చేశారు. కేంద్రం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచిందని చెప్పారు. బీజేపీ పాలనలో ధరల మంటతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ మిత్రులు మాత్రం నానాటికీ ధనవంతులవుతున్నారని ప్రియాంక నిప్పులు చెరిగారు. వరుసగా నాలుగో రోజు ధరల వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు సైతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు 35 పైసల చొప్పున పెంచినట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. (చదవండి: పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా) -
పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో భారతీయ మంత్రిత్వ శాఖ ప్యానెల్ దేశీయంగా ఒకే రేటు కింద పన్ను విధించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తుల(పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, కోవిడ్-చికిత్స ఔషధాలపై పన్ను రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడగించడం, 8 మిలియన్ రిజిస్టర్డ్ సంస్థలకు ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేసే విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేర్చాలని జూన్ లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17న జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ వ్యవస్థలో ఏదైనా మార్పు చేయాలంటే ప్యానెల్‌లోని 3/4 ప్రతినిదుల ఆమోదం అవసరం. ఈ జీఎస్టీ ప్యానెల్లో అన్ని రాష్ట్రాలు, భూభాగాల ప్రతినిధులు ఉన్నారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చాలా వరకు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొని రావడాన్ని గతంలో వ్యతిరేకించాయి. (చదవండి: జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం) అయితే, గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకడంతో ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోకసభలో వెల్లడించింది. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేల అదే నిజమైతే! ఇది సామాన్యుడికి భారీ ఊరటే అని చెప్పుకోవాలి. నిజంగానే పెట్రోల్, డీజిల్ గనుక జీఎస్టీ పరిధిలోకి వస్తే చాలా వరకు ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. -
పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని ఆమె సూచనప్రాయంగా పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని అన్నారు. ఇంధనం కొనుగోళ్లు–వ్యయాల మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో ప్రభుత్వంపై రూ. 70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని, ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆయిల్ బాండ్ల భారాన్ని భరిం చాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం’’ అని ఆమె ఈ సందర్భంగా వివరించారు. రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. పెట్రోల్‌పై ప్రస్తు తం లీటర్‌కు రూ.32.90 ఎక్సైజ్ సుంకం భారం పడుతుండగా, డీజిల్‌పై ఇది రూ.31.80గా ఉంది. పెట్రోలియం ప్రొడక్టులు... పెట్రోలియం ప్రొడక్టులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోనికి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. జీఎస్టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే, ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ ఒకే పన్నుగా మారతాయి. ద్వంద్వ పన్నుల విధానానికి (ఎక్సైజ్ సుంకంపై వ్యాట్ విధింపు) ఇది ముగింపు పలుకుతుంది. రెట్రో ట్యాక్స్‌పై త్వరలో నిబంధనలు రెట్రో పన్ను రద్దు నేపథ్యంలో పరిస్థితుల నిర్వహణకు త్వరలో నియమ నిబంధనలు తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. రెట్రో పన్న రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. రెట్రో ట్యాక్స్ కేసుల ఉపసంహరణ, రిఫండ్, వివాద పరిష్కారంపై తన శాఖ అధికారులు కెయిర్న్, వొడాఫోన్లతో చర్చిస్తున్నట్లు కూడా ఆర్థికమంత్రి తెలిపారు. రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను ఈ నెలారంభంలో రద్దు చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 2–6 శ్రేణిలో అదుపులోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికమంత్రి వ్యక్తం చేశారు. ఆదాయాలు పెరుగుతాయ్: రానున్న నెలల్లో ప్రభుత్వ ఆదాయాలు భారీగా పెరుగుతాయన్న భరోసాను ఆర్థికమంత్రి ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నులు గత కొన్ని నెలలుగా పెరిగాయని అన్నారు. ఐటీ పోర్టల్ సమస్యలు త్వరలో పరిష్కారం ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు విషయంలో ఈ ఫైలింగ్ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు కొద్ది వారాల్లో పరిష్కారం అవుతాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో తాను పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌తో నిరంతరం చర్చిస్తున్నట్లు వివరించారు. ఇన్ఫోసిస్ హెడ్ నందన్ నీలేకని కూడా ఈ మేరకు హామీ ఇస్తూ తనకు నిరంతరం సందేశాలను పంపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను 2 ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి సంబంధించి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వొడాఫోన్‌పై ‘చర్చలు’ వొడాఫోన్ ఐడియా కుప్పకూలకుండా ప్రభుత్వం ఒక మార్గాన్ని అన్వేషిస్తుందన్న వార్తల నేపథ్యంలో సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా మంది అధికారులు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు’’అని చెప్పారు. అయితే ఏ విషయం తన వద్దకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. చర్చలు జరుపుతున్నది ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లభించకపోతే వొడాఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
దేశంలో పెట్రో ధరలు,19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం జాతీయ మార్కెట్లపై పడింది. దీంతో గత ఆదివారం నుంచి ఈ రోజు(శుక్రవారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెరిగింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ధర 9 సార్లు పెరగ్గా.. డీజిల్ ధర 5 సార్లు తగ్గింది. పెట్రోల్ ధర 39 సార్లు, డీజిల్ ధర 36 సార్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరిగింది. అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర లీటరు రూ .100 దాటింది. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, పంజాబ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక శుక్రవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: తొలి రోజే వాయిదా పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో పోలవ రం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులను పరిచయం చేసేందుకు లేచి నిలబడగానే లోక్‌సభలో విపక్షాలు తమ ఆందోళన ప్రారంభించాయి. దాం తో, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని అర్ధంతరం గా ముగించాల్సి వచ్చింది. విభిన్న అంశాలపై చర్చ కు పట్టుబట్టుతూ నోటీసులు ఇచ్చిన పలు విపక్ష పా ర్టీల సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. ప్రధాన మంత్రికీ తప్పని నిరసన సెగ విపక్షాల ఆందోళనల మధ్య మంత్రులను పరిచయం చేయకుండానే ప్రధాన మంత్రి లోక్‌సభలో అర్ధాంతరంగా తన ప్రసంగం ముగించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి కొత్త మంత్రులను సభకు పరిచయడం చేయడం సంప్రదాయంగా వస్తోంది. సోమవారం వర్షకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి తన నూతన మంత్రివర్గ సహచరులను ఉభయ సభలకు పరిచయం చేయాలని ప్రయత్నించగా విపక్షాలు నిరసనలతో అడ్డుపడ్డాయి. దీంతో ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని కొద్ది సేపట్లోనే ముగించారు. ఈ సందర్భంగా విపక్షాల వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పందిస్తూ ‘కాంగ్రెస్ ప్రవర్తన విచారకరం. దురదృష్టకరం. ఈ ధోరణి అనారోగ్యకరమైనది’అని వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభాపతి ఓంబిర్లా నేరుగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభను వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనప్పటికీ రెండు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 3.30 గంటలకు ప్రారంభమై 8 నిమిషాల పాటు మాత్రమే కొనసాగి మంగళవారానికి వాయిదాపడింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. ఇంధన ధరల పెరుగుదలపై సభలోనూ ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు మద్దతుగా శిరోమణి అకాలీదళ్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొందరికి బాధగా ఉంది: ప్రధాని మోదీ పార్లమెంట్లో విపక్షాల వైఖరిని ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యతిరేక వైఖరిని పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదన్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారు, దళితులు, ఓబీసీలు, మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రులు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తన ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంపై స్పందిస్తూ.. ‘అధ్యక్షా.. కేబినెట్లోని కొత్త సభ్యులను ఈ సభకు పరిచయం చేయాలని మీరు నన్ను ఆదేశించారు. దేశ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారు మంత్రులు కావడం ద్వారా ఈ సభకు పరిచయం అవుతున్నప్పుడు కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఈ సభలో మంత్రులుగా మారిన మహిళలను పరిచయం చేస్తుంటే.. వారిని పరిచయం చేసుకునేందుకు కూడా విపక్షాలు సిద్ధంగా లేవు. మహిళా వ్యతిరేక మనస్తత్వం వారిలో ఉంది. మహిళల పేరు వినడానికి కూడా సిద్ధంగా లేరు. షెడ్యూల్ తెగకు చెందిన మన ఎంపీలు పెద్ద సంఖ్యలో మంత్రులుగా మారారు. ఈ సభలో గిరిజన మంత్రులను పరిచయం చేయడం కూడా వారికి ఇష్టం లేదు. మన గిరిజనుల పట్ల వారికి అలాంటి కోపం ఉంది. ఈ సభలో పెద్ద సంఖ్యలో దళిత మంత్రులు వచ్చారు. దళిత సమాజం ప్రతినిధుల పేర్లు వినడానికి విపక్షాలు సిద్ధంగా లేవు. ఇది ఎలాంటి మానసిక స్థితి. దళితులను గౌరవించడానికి, రైతు బిడ్డలను గౌరవించడానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? మహిళలను గౌరవించటానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? ఈ రకమైన వికృత మనస్తత్వాన్ని సభ మొదటిసారి చూసింది’అని విమర్శించారు. రాజ్యసభ మొత్తం నాలుగుసార్లు వాయిదాపడింది. వివిధ అంశాలపై చర్చించేందుకు రాజ్యసభలో నిబంధన 267 కింద 17 నోటీసులు వచ్చాయని, ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలు చర్చించదగినవేనని, అయితే ఇతర సందర్భాల్లో వాటిని చర్చించవచ్చని చెబుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వాటిని తిరస్కరించారు. కొత్తగా సహాయ మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి బంగ్లాదేశీయుడని పేర్కొంటూ, ఆ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్షం ప్రయత్నించింది. అయితే, అవి నిరాధార వార్తలని ప్రభుత్వం కొట్టిపారేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేతను అవమానించడం సరికాదని పేర్కొంది. 40 కోట్ల బాహుబలులు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందన్నారు. ‘టీకాను బాహువుకు ఇస్తారు. అందువల్ల టీకా తీసుకున్నవారు బాహుబలులు అవుతారు. మనం కరోనాపై పోరాడగలిగే బాహుబలిగా మారాలంటే టీకా తీసుకోవడం ఒక్కటే మార్గం’అని వ్యాఖ్యానించారు. ప్రదాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా బాహుబలిని పలువురు గుర్తు చేశారు. టీకా మొదటి డోసు ‘బాహుబలి 1’అని రెండో డోసు ‘బాహుబలి 2’అని ట్విటర్ యూజర్ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. ‘కరోనా వైరస్ కట్టప్పలాంటిది. వెన్నుపోటు పొడుస్తుంది. బాహుబలి సినిమాలా నిజ జీవితంలో రెండో పార్ట్ ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి’అని మరో యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి మోదీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అన్ని సమస్యలపై ఆరోగ్యకరమైన రీతిలో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాలు, మహమ్మారిపై మా పోరాటం చర్చకు వస్తుందని నేను ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు పదునైన, కఠినమైన ప్రశ్నలను అడగాలని, అయితే స్నేహపూర్వక వాతావరణంలో వాటిపై స్పందించడానికి ప్రభుత్వాన్ని కూడా అనుమతించాలని కోరారు. కోవిడ్–19 రెండో వేవ్ నిర్వహణ వైఫల్యాలు, ఇంధన ధరల పెరుగుదల, రైతుల ఆందోళన సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చుతున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. ‘మేం సభలో, సభ వెలుపల అన్ని స్థాయిల్లో నాయకులతో చర్చించాలనుకుంటున్నాం. నేను నిరంతరం ముఖ్యమంత్రులను సంప్రదిస్తున్నా. అన్ని రకాల చర్చలు వేర్వేరు వేదికల ద్వారా జరుగుతున్నాయి. సభ జరుగుతున్నందున నేను ఫ్లోర్ లీడర్లను కలవాలనుకుంటున్నాను. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మహమ్మారి గురించి ముఖాముఖి మాట్లాడవచ్చు’అని ఆయన అన్నారు. -
ఏంటీ.. జనమంతా మోదీకి మొక్కులు తీర్చుకుంటున్నారా?
ఎదురుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్లు, ఫ్లెక్సీలు.. వాటికి ఎదురుగా నిల్చుని జనాలు దణ్ణం పెడుతున్న ఫొటోలు. సోషల్ మీడియాలో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త ట్రెండ్ #ThankYouModiJiChallenge. బంకుల్లో ఆ ఫొటోలు చూస్తే చాలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈ ఛాలెంజ్ నడుస్తోందని చెప్పనక్కర్లేదు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic #ThankYouModiJiChallenge#NationAgainstPrivatization pic.twitter.com/qC3ZC6EDX8 — PM Naeem (@PMNaeem) July 19, 2021 Join the campaign#ThankYouModiJiChallenge pic.twitter.com/TrnJaql6P1 — Umar A Siddiqui (Shelley Ώïṉḋ)™) (@uashfaq) July 19, 2021 ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అనేది స్పష్టత లేదుగానీ, సరదా కోసమైనా కొందరు ఈ ఛాలెంజ్ పాల్గొంటున్నారు. యూపీఏ పాలనలో మోదీ చేసిన ట్వీట్లను తెరపైకి తెస్తూ.. ఏడేళ్ల పాలనలో ధరల పెంపును ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్‌తో మరికొందరు ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic pic.twitter.com/Jx0RImRPVR#NationAgainstPrivatization — Ashwani Bhatia (@bhatia_movies) July 19, 2021 Thank you modi ji for hike petrol prices#ThankYouModiJiChallenge pic.twitter.com/x5wLmU9JNO — ParacetamoL150MG (@MgL150) July 19, 2021 ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ తమ విమర్శలకు ఈ ట్రెండ్‌ను వాడేసుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టడం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ కొనసాగిస్తున్న ఈ నెగెటివ్ ట్రెండ్‌ను పాజిటివ్‌గా మార్చేచే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మద్ధతుదారులు. How do you "FEEL" when you see this picture ‼🤔#ThankYouModiJiChallenge#PetrolPriceHike pic.twitter.com/p8C0HWklYd — Jagdish Solanki (@iJagdishSolanki) July 18, 2021 #MonsoonSession | Trinamool Congress (TMC) MPs cycled to the Parliament today in protest against the rise in #FuelPrices. (ANI) pic.twitter.com/JA8N1AnAtp — NDTV (@ndtv) July 19, 2021 #ThankYouModiJiChallenge With this golden opertunity i have filled my fuel tank at 105/ltr. I express tons n thousands of guilty to have a Pradhan sevak like u.. pic.twitter.com/tYht98NJxz — Tarique Anjum (@TariqueRainy) July 19, 2021 ఇక ఈరోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మొత్తం మెట్రో నగరాల్లో ముంబైలో గరిష్టంగా పెట్రోల్ లీటర్ ధర రూ.107.83 కాగా, డీజిల్ ధర రూ.97.45గా ఉంది.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. -
మోదీ, కేసీఆర్ గజదొంగలే! ఇద్దరి దోపిడీ రూ.36 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్/ కవాడిగూడ: కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ గజదొంగలేనని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడతామని అధికారంలోకి వచ్చిన వీరు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారి ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారని, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న ఈ ఇద్దరి ఫొటోలను పెట్రోల్ బంకుల వద్ద పెట్టాలని ఎద్దేవాచేశారు. పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాచౌక్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. మలేసియాలో రూ.37, మయన్మార్‌లో రూ.39, పాకిస్తాన్లో రూ.53, రష్యాలో రూ.50, ఇండోనేసియాలో రూ.54 చొప్పున లీటర్ పెట్రోల్ ధర ఉంటే మన దేశంలో మాత్రం రూ.105 అమ్ముతున్నారని మండిపడ్డారు. రూ.40కే రవాణా అవుతున్న పెట్రోల్‌పై మోదీ, కేసీఆర్ కలిసి రూ.66 పన్నులు వేసి పేదలను దోచుకుంటున్నారన్నారు. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరిద్దరికి బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఇలాంటి వారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హోంగార్డులను పెట్టి అరెస్టు చేయిస్తామని వ్యాఖ్యానిం చారు. సీఎం కేసీఆర్ రెండేళ్లే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత వచ్చేది సోనియా రాజ్యమేనన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని పోలీసులతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తోపులాటలు.. ఉద్రిక్తత సభ అనంతరం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా, గవర్నర్ తమిళిసై అందుబాటులో లేకపోవడం తో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్‌రెడ్డి బయలుదేరారు. అయితే, ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు రహదారులను దిగ్బంధనం చేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ బారికేడ్లు దూకేందుకు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను భుజాలపై ఎక్కించుకుని బారికేడ్లు దాటించడంతో ఇందిరా పార్కు చౌరస్తా వరకు వెళ్లారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పోలీసులు ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్లతోపాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. -
Petrol Price: ‘చారానా కోడికి బారానా మసాలా’.. అన్నట్లు
నిర్మల్ / నెట్వర్క్ / సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ‘గులాబీ’చీడ పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చీడను వదిలించుకోవడానికి ఏ మందు కొట్టాలో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ లో ఇప్పుడు ఏ వర్గమూ సంతోషంగా లేదని, టీఆర్ఎస్ సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునే పరి స్థితి దాపురించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు, సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు ఈ కార్యక్రమాల్లో భారీగా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎడ్లబండిపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ, విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేడీ ‘నా లక్కీనంబర్ 9. నియోజకవర్గాల్లో నిర్మల్ నంబర్ కూడా తొమ్మిదే. అలాంటి చోటు నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా తొలి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించా. సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు. దాన్ని తిరిగేసి కొడితే తొమ్మిదే అవుతుంది. కేసీఆర్ సర్కారు దోపిడీ మీద నిర్మల్ నుంచే పోరాటం ప్రారంభమైంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ కలిసి పెట్రోల్, డీజిల్‌పైన పన్నులు బాదుతూ పేదల కడుపులు కొడుతున్నారు. రూ.40కి లీటర్ పోయాల్సిన పెట్రోల్‌పై చారానా కోడికి బారానా మసాలా.. అన్నట్లు రాష్ట్రం రూ.32, కేంద్రం రూ.33 మొత్తం రూ.65 అదనంగా పన్నులు వేసి, వంద దాటించారు. ఏడేళ్లలో 24 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం దారుణం..’అని రేవంత్ ధ్వజమెత్తారు. ‘శంషాబాద్‌లో ఎయిర్పోర్ట్ నడిపే జీఎంఆర్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యాడు. వాళ్ల ఇంధనానికి ఒక్క రూపాయి పన్ను వేస్తూ పేదలు ఉపయోగించే పెట్రోల్‌పై రూ.32 వసూలు చేస్తున్నాడు. ఏడేళ్లలో ఇంధన పన్నుల రూపంలో మోదీ సర్కారు రూ.36 లక్షల కోట్లు వసూలు చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు ప్రజల నుంచి దోచుకుంది’అని రేవంత్ ఆరోపించారు. గోల్కొండ ఖిల్లా కింద ఘోరీ కడతాం.. ‘డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం..ఇలా ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగురవేస్తుంది. అదే ఖిల్లా కింద కేసీఆర్ ఘోరీ కడతాం’ అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటిదొంగలకు ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్ అని, ఆలోపు మారితే ఉంటారని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మంలో భట్టి నిరసన ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎడ్ల బండెక్కి నిరసన తెలిపారు. మిర్యాలగూడలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , తదితరులు ఎద్దుల బండి లాగి నిరసన తెలిపారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. కరీంనగర్లో జరిగిన సైకిల్, ఎడ్ల బండి ర్యాలీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఎడ్లబండిపై వచ్చి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజనర్సింహకు స్వల్ప గాయం మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల నుంచి ఎస్పీ కార్యాయం వరకు చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఎడ్లబండిపై నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతుండగా ఎడ్లు బెదిరాయి. దీంతో రాజనర్సింహ ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడికాలికి స్వల్ప గాయమైంది. -
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
-
సెంచరీ దాటేసిన పెట్రోలు: ఏయే రాష్ట్రాల్లో?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు శుక్రవారం ఎనిమిదవసారి తిరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోలుపై 29 పైసలు, డీజిల్ ధరలు 34 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలను దాటేసింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 లకు చేరువలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 92.34 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు 82.95 రూపాయలు పలుకుతోంది. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధరరూ .98.65, డీజిల్రూ .90.11 చెన్నైలో పెట్రోల్ ధర రూ .94.09 రూ .87.81 . కోల్‌కతాలో రూ .92.44 కు లీటరుకు రూ .85.79 అమరావతిలో పెట్రోలు ధర రూ. 98.49, డీజిల్ ధర రూ. 92.39 హైదరాబాబాదులో పెట్రోలు ధర రూ. 95.97,డీజిల్ ధర రూ. 43 పెట్రోల్ 100 రూపాయలు దాటిన రాష్ట్రాలు మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతంలో పెట్రోల్ లీటరుకు రూ .101, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రూ .102.69, రాజస్థాన్‌లో గంగానగర్‌లో పెట్రోల్ ధర లీటరుకు 103.28 రూపాయలుగా ఉంది. -
కేంద్ర ప్రభుత్వానికి ఇం‘ధనం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చినా దేశీయంగా ఇంధనాల రేట్లు మాత్రం రికార్డు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తుండటమే ఇందుకు కారణం. గడిచిన ఆరేళ్లలో ఇలా పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు 300% పెరిగాయి. మోదీ సర్కార్ ఏర్పాటైన తొలి ఏడాది 2014–15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్‌పై రూ. 29,279 కోట్లు, డీజిల్‌పై రూ. 42,881 కోట్లు కేంద్రం వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కూడా కలిపితే 2014–15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ. 74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరాయి. కేవలం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో.. పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్సుల వసూళ్ల రూపంలో వచ్చేది 2014–15లో 5.4%గా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 12.2%కి పెరిగిందని ఆయన వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 2014లో లీటరుకు రూ. 9.48గా ఉండగా అదిప్పుడు రూ. 32.90కి పెరిగింది. డీజిల్‌పై రూ. 3.56 నుంచి రూ. 31.80కి చేరింది. -
పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి
-
ఉభయ సభలకు పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. పెట్రో ధరలపై కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల కారణంగా కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవగానే కాంగ్రెస్ సభ్యులు పెట్రోల్, డీజిల్ తదితర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఇచ్చిన నోటీస్‌ను చైర్మన్ ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తరచుగా పెరుగుతున్నాయని ఈ అంశంపై చర్చించాలని ఖర్గే 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్టు ౖచైర్మన్ ప్రస్తావించారు. అయితే అప్రొప్రియేషన్ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీనిపై చర్చించవచ్చని చెబుతూ చైర్మన్ ఈ నోటీసును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం ధరల పెరుగుదలపై ఏ సమాధానం ఇస్తుందోనని ఎదురుచూస్తున్నాం. దీనిపై చర్చించాలి’అని కోరారు. నిరసనలతో సభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరకు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక సభాపతి స్థానంలో ఉన్న వందనా చవాన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష కాంగ్రెస్ సభ్యులు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను రాత్రి 7 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. 7 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. నినాదాలు హోరెత్తడంతో మంగళవారానికి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తుండగా.. సభ్యుల కోరిక మేరకు సమావేశాలను పూర్వ రీతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని రాజ్యసభ ౖచైర్మన్ వెంకయ్య, లోక్‌సభ సభాపతి బిర్లా నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల కుదింపు? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల కంటే ముందే సమావేశాలను ముగించాలని తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యుల విన్నపం మేరకు ఏప్రిల్ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను ఈనెల 25వ తేదీ నాటికే కుదించనున్నట్టు తెలుస్తోంది. -
అధిక పెట్రో ధరలు భారమే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న ప్రజా డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వీటి ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అన్నది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకోగా.. రిటైల్ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతుండడం గమనార్హం. డీజిల్ రిటైల్ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే ఉంటోంది. కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ విషయమై ఆర్థిక మంత్రి శుక్రవారం మీడియా ముఖంగా స్పందించారు. తగ్గించాల్సిన అవసరం ఉందంటూనే.. అందుకే తాను ధర్మసంకటం పదాన్ని ప్రయోగించినట్టు చెప్పారు. ‘‘ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటున్నాయి’’ అని పరిస్థితిని ఆమె వివరించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది జీఎస్టీ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన తీసుకువెళతారా? అన్న మీడియా ప్రశ్నకు.. సమావేశానికి ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కెయిర్న్ ఆర్బిట్రేషన్‌పై అప్పీల్ కెయిర్న్ ఎనర్జీకి భారత్ 1.4 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై అప్పీల్ చేయడం తన విధిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమ యంత్రాంగానికి ఉన్న పన్ను విధింపు హక్కును ప్రశ్నించినప్పుడు అప్పీల్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘రెట్రోస్పెక్టివ్ పన్ను అంశంలో మా విధానాన్ని స్పష్టంగా వెల్లడించాము. 2014 నుంచి 2020 వరకు ఏటా దీన్నే పునరావృతం చేశాం. ఇందులో స్పష్టత లేకపోవడమేమీ కనిపించలేదు’’ అని మంత్రి చెప్పారు. ఆర్థిక ఉద్దీపనల భారాన్ని ప్రజలపై వేయం... ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆర్థిక ఉద్దీపనలకు కావాల్సిన నిధులను రుణాలు, ఆదాయాల రూపంలో సమకూర్చుకుంటామే కానీ, ప్రజలపై భారం వేయబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చార్జీ ఉండదన్నారు. ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందే కానీ, ప్రజల నుంచి కాదని చెప్పారు. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. -
పెట్రో సెగతో ధరల మంట!
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయ చర్య అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు. ఏఆర్‌సీలపై ప్రత్యేక దృష్టి మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యల గురించి ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీలు) విషయంలో నియంత్రణా యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయడంపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఎన్పీఏల సమస్య పరిష్కారం విషయంలో ఏఆర్‌సీలే కీలకమన్న సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మొండి బకాయిల నిర్వహణకు 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించిన ఆస్తుల (రుణాల) పునర్ నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ, ప్రస్తుత అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల క్రియాశీలతకు ఎటువంటి అంతరాయం కలగని రీతిలోనే ప్రతిపాదిత ఏఆర్సీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. మొండి బకాయిల సమస్యను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై బ్యాంకింగ్‌లో అవగాహన, చైతన్యం పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎన్పీఏలకు సంబంధించి తగిన కేటాయింపులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యవేక్షణ విధానాలకు ఆర్బీఐ మరింత పదును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్పీఏల విషయంలో బ్యాంకింగ్ అంతర్గత అంశాలనూ ఆర్బీఐ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. లిక్విడిటీ చర్యల వల్ల ఇబ్బంది లేదు అసెట్ పర్చేజింగ్సహా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్న అంచనాలు సరికాదన్నారు. ఇటువంటి ఇబ్బంది ఏదీ తలెత్తబోదని ఆయన స్పష్టంచేస్తూ, సెంట్రల్ బ్యాంకింగ్ మౌలిక సూత్రాల విషయంలో రాజీ ఉండబోదని అన్నారు. ఎటువంటి రిస్క్ సమస్యలు లేని సావరిన్ (ప్రభుత్వ) బాండ్ల కొనుగోలుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ‘అసెట్ పర్చేజ్’ కార్యక్రమం పరిమితమవుతుందని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు డిజిటల్ (క్రిప్టో) కరెన్సీకి సంబంధించి పలు అంశాల్లో ఆర్బీఐలో అంతర్గతంగా పటిష్ట మదింపు జరుగుతోందని అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రతిపాదిత పత్రాలను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ఆర్బీఐకి ఈ అంశంపై పలు ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆయా అంశాలను కేంద్రంతో చర్చించినట్లు వెల్లడించారు. ఎగుమతులు పెంచాలి... దేశ ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వ్యూహాత్మక ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. దేశీయంగా పటిష్టతేకాకుండా, అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకోడానికి కూడా ఎఫ్‌టీఏలు దోహదపడతాయని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల నేపథ్యలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వేర్వేరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల బహుళవిధ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
పెట్రోధరలపై మమత నిరసన
కోల్‌కతా: మండిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సెక్రటేరియట్‌కు వెళ్ళి తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి ఫిరాద్ హకీం ఎలక్ట్రిక్ స్కూటర్ని నడుపుతుండగా మమతా బెనర్జీ పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు రాసివున్న ప్లకార్డుని మెడలో తగిలించుకొని స్కూటర్ వెనుక సీట్లో కూర్చున్నారు. హజ్రామోర్ నుంచి సెక్రటేరియట్‌కి 7 కిలోమీటర్ల దూరం ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. నాబన్నకి చేరుకున్న అనంతరం దీదీ మాట్లాడుతూ ఇంధన ధరలకు వ్యతిరేకంగా శుక్రవారం నుంచి ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి రాకముందు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్పీజీ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో వాటి ధరలను పెంచేస్తోందని మమత ఆరోపించారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని అమ్మేస్తున్నారన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మార్చి, మోదీ పేరు పెట్టడాన్ని తప్పు పట్టారు. వారి తీరు చూస్తే ఈ దేశం పేరుని కూడా మారుస్తారో ఏమో అని వ్యాఖ్యానించారు. -
వరుసగా 12 వ రోజూ పెట్రో సెగ
సాక్షి,న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా భగ్గుమంటున్నాయి. జు ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 20) కూడా ఇంధన ధరలు నింగిని చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా డీజిల్‌పై 35-40 పైసలు, పెట్రోలు పై లీటరుకు మరో 30-40 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో వివిధనగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డును తాకుతున్నాయి. దీంతో ధరల పరుగుకు ఎప్పటికి అడ్డుకట్టపడుతుందో తెలియని గందరగోళంలోవాహనదారులు పడిపోయారు. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ లో పెట్రోల్ రూ. 90.58, డీజిల్ రూ. 80.97 ముంబైలో పెట్రోల్ రూ. 97. కు, డీజిల్ రూ. 88.05 చెన్నై పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98 బెంగళూరు పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84 హైదరాబాద్ పెట్రోల్ రూ. 94.18, డీజిల్ రూ. 88.31 అమరావతి పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33 -
వంట గ్యాస్‌పై 50 పెంపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగని పెట్రో మంట న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్‌లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది. -
మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా రెండోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. నేడు పెట్రోల్ ధరలపై రూ.0.26 పైసలు, డీజిల్ ధరలు లీటర్‌పై 27పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77కు, డీజిల్ ధర రూ.83.46కు చేరింది. గత 10 రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.88.37 నుంచి రూ.89.77 మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.86.30కు చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.76.48కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలా ఉన్నాయి... పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.92.86కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.83.30కు ఎగసింది. ఈ రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.(చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 25 పైసల చొప్పున ఎగబాకాయి. చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం..లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.70 కాగా, ముంబైలో 92.28కి చేరింది. అదేవిధంగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66గా ఉంది. ధరలు ఇలా పైకి ఎగబాకటం వరుసగా నాలుగో వారంలో రెండో రోజు. ఈ వారంలో పెట్రో ధరలు లీటర్‌కు రూ.1 చొప్పున పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ జనవరి 6 నుంచి పెట్రో ధరలను ఏరోజుకారోజు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి లీటర్‌కు పెట్రోల్ ధర రూ.1.99, డీజిల్ ధర రూ.2.01 మేర పెరిగాయి. సేల్స్ ట్యాక్స్, వ్యాట్ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో విధించడమే ధరల్లో పెరుగుదలకు కారణమని ఆరోపిస్తున్న చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..పన్నుల్లో కోత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యాక డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో భారత్‌తోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. -
రెండో రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో రోజుకూడా దేశీయంగా పెట్రోధరలు పెరిగాయి. శనివారం ఇంధన ధరలను మరో 25 పైసలు పెంచాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున వడ్డించిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 కి చేరువ కావడం, అమరావతిలో 92 స్తాయిని టచ్ చేయడంంగమనార్హం. (పెట్రో ధరలు భగ్గు) దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు, డీజిల్ ధర రూ.75.88 ముంబైలో పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ.82.66 చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.88.38, డీజిల్ రూ.82.23 కోల్‌కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48 హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.15 డీజిల్ ధర రూ. 82.80 అమరావతిలో పెట్రోల్ రూ. 91.94 డీజిల్ రూ.85.10 -
పెట్రో ధరలు భగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో శుక్రవారం ఆకాశాన్ని తాకిన పెట్రో ధరలు దేశీయంగా సరికొత్త రికార్డును తాకాయి. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. తాజా పెంపుతో పెట్రోలు ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో పెట్రో 92 రూపాయల వద్ద రికార్డు హైకి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45 వద్ద రికార్డును సృష్టించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 75.63గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.04 డీజిల్ ధర రూ. 82.40 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.07 డీజిల్ ధర రూ.80.90 కోలకతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.87 డీజిల్ ధర రూ.79.23 అమరావతి పెట్రోలు ధర లీటరుకు రూ. 91.68, డీజిల్ ధర రూ.84.84. హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.89, డీజిల్ ధర రూ.82.53 -
మళ్లీ పెట్రో షాక్..
-
ఇంధన ధరలు: 16 రోజుల్లో రూ.8 మేర పెంపు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.36 పైసలు, డీజిల్‌పై రూ.8.82 పైసలు ధరలు పెరిగాయి. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర : చెన్నైలో 82.58 రూపాయలు బెంగుళూరు 81.81 రూపాయలు ఢిల్లీలో 79.23 రూపాయలు కోల్‌కతా 80.95 రూపాయలు ముంబైలో 86.04 రూపాయలు హైదరాబాద్‌లో 82.25 రూపాయలు లీటర్ డీజిల్ ధర : చెన్నైలో 75.80 రూపాయలు బెంగుళూరు 74.43 రూపాయలు ఢిల్లీలో 78.27 రూపాయలు కోల్‌కతాలో 73.61 రూపాయలు ముంబైలో 76.69 రూపాయలు హైదరాబాద్‌లో 7.49 రూపాయలకు చేరుకున్నాయి. -
పదమూడో రోజూ పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మంట అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పదమూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా పెట్రోల్ ధర లీటరుకి 56 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి 63 పైసలు పెరిగింది. రెండు వారాలు పూర్తికాకుండానే పెట్రోల్ ధర రూ.7.11 పైసలు, డీజిల్ ధర రూ.7.67 పైసలు పెరిగింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వెల్లడించిన ధరలను బట్టి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.77.81 నుంచి రూ.78.37కు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి రూ.76.43 నుంచి రూ.77.06కు ఎగబాకింది. జూన్ 7వ తేదీనుంచి కంపెనీలు ధరలు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి ధరలు పెరగడం వరసగా ఇది 13వ రోజు. అంతర్జాతీయంగా చమురు ధరలు పుంజుకోవడవంతో ఆయిల్ కంపెనీలు వాటికనుగుణంగా రిటైల్ ధరలను సవరిస్తున్నాయి. -
పెట్రో మంట
ముడిచమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6న మొదలైన రేట్ల పెంపు దాదాపుగా ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ సంగతి తీసుకుంటే జూన్ 6న లీటరు పెట్రోల్ రేటు రూ.71.26గా ఉండగా, జూన్ 17 నాటికి రూ.77.28కి చేరింది. డీజిల్ రేటు లీటరుకు రూ.69.39గా ఉండగా, రూ. 75.79కి ఎగిసింది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్యాక్సులు, కమీషన్లు లేకుండా వాస్తవానికి డీలరు స్థాయిలో రూ.22.44 స్థాయిలో ఉన్న పెట్రోలు ధర.. రిటైల్‌గా కొనుగోలుదారు స్థాయికి వచ్చేటప్పటికి ఏకంగా అనేక రెట్లు పెరిగిపోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు, వ్యాట్ మోత మోగిస్తుండటమే కారణం. ఇంధనాల రేటులో దాదాపు 60 శాతం పైగా భాగాన్ని ఇవే ఆక్రమిస్తున్నాయి. ఎందుకంటే.. కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌తో పన్ను ఆదాయాలకు గండి పడిన నేపథ్యంలో కొంత భాగాన్నైనా పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు 30 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు కేంద్రం మే 5న ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.10 మేర (లీటరుకు), డీజిల్‌పై రూ.13 మేర పెంచింది. ఇలా వచ్చే ఆదాయాన్ని ఇన్ఫ్రా, ఇతరత్రా అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులను తగ్గించే ఆస్కారం ఉండకపోవచ్చని తెలిపాయి. అటు చమురు కంపెనీలు తమ ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పెంపు 30 పైసలు.. 40 పైసల స్థాయికి తగ్గినా.. మొత్తం మీద చూస్తే జూన్ ఆఖరు దాకా రేట్ల పెంపు కొనసాగడం మాత్రం తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. సుంకాల భారం.. దేశ రాజధాని ఢిల్లీ సంగతి తీసుకుంటే లీటరు పెట్రోలు వాస్తవ ధర రూ. 22.44. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమీషన్ ఇవన్నీ కలిపితే మంగళవారం నాటి రిటైల్ రేటు ఏకంగా రూ. 76.73 పలికింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్స్ఛైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ. 32.98గా, డీజిల్‌పై లీటరుకు రూ. 31.83గా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, కర్ణాటక మొదలైనవి అత్యధికంగా 30% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, డీలర్ కమీషన్ విషయానికొస్తే.. పెట్రోల్ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది రూ. 2–4 మధ్య ఉంటుంది. ఢిల్లీ సంగతి తీసుకుంటే పెట్రోల్‌పై డీలరు కమీషన్ లీటరుకు రూ. 3.57, డీజిల్‌పై రూ. 2.51గా ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి రూ. 3.48 లక్షల కోట్లు, రాష్ట్రాలకు రూ. 2.27 లక్షల కోట్లు వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. -
వినియోగదారులకు మరో బురిడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, ఆ ప్రయోజనాన్ని మన ప్రభుత్వాలు వినియోగదారులకు చేరనివ్వడం లేదు. సొంత ఖజానాలో జమ చేసుకుంటున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకం పెంచగా, కొన్ని రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్ మొత్తం ధరలో పన్నుల వాటా 70 శాతానికి చేరింది. ఈ పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి ప్రభావంపడదు. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోయింది. ఆ లాభాన్ని పొందుతున్న ఆయిల్ కంపెనీల నుంచి ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వసూలు చేయనుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. సుంకాన్ని కేంద్రం పెంచకపోయి ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు కొంతైనా తగ్గించేందుకు ఆస్కారం ఉండేది. దాంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరేది. రాష్ట్రాల నిర్వాకం పెట్రోల్, డీజిల్‌పై ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచేసింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.1.67, డీజిల్ ధర రూ.7.10 చొప్పున పెరిగింది. దీనివల్ల ఢిల్లీ సర్కారుకు రూ.700 కోట్ల అదనపు ఆదాయం రానుంది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెంపు ద్వారా రూ.2,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరియాణా సర్కారు సైతం పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.1.1 చొప్పున వ్యాట్‌ను పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచాయి. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి: రాహుల్ గాంధీ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మనకు పెట్రో ఊరట లేనట్టే!
న్యూఢిల్లీ: అమెరికాలో ఒకపక్క క్రూడ్ ధర మైనస్‌లోకి పడిపోయినప్పటికీ... దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం భారీగా దిగొచ్చే పరిస్థితి లేదా? ప్రభుత్వ రంగ చమురు రిటైలర్లు(ఓఎంసీ) ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే మనం కేవలం అమెరికా క్రూడ్‌ను మాత్రమే దిగుమతి చేసుకోమని.. దేశీ ధరలను బ్రెంట్ క్రూడ్(ప్రస్తుతం బ్యారెల్ 25 డాలర్ల స్థాయిలో ఉంది) ఇతరత్రా విభిన్న ప్రామాణిక రేట్ల ప్రకారం నిర్ణయించడమే దీనికి కారణమనేది వారి వాదన. ఇప్పటికే రిఫైనరీలన్నీ భారీ నిల్వలతో నిండిపోయాయని కూడా చెబుతున్నారు. కాగా, కేవలం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో మే నెల కాంట్రాక్టులకు డెలివరీ స్టోరేజీ లేకపోవడం వల్లే ఇలా అమెరికా క్రూడ్ ధర మైనస్‌లోకి కుప్పకూలిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. చమురు ధర ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడం స్వల్పకాలంలో ప్రయోజనకరమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఆయిల్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రూడ్ ఉత్పత్తిదారులకు పెట్టుబడులకు నిధుల్లేక అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు దిగజారుతాయన్నారు. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీగా పడిపోయినప్పటికీ మార్చి 16 నుంచి ఇప్పటిదాకా మనదగ్గర రిటైల్ చమురు ధరల్లో ఎలాంటి తగ్గింపూ ఎందుకు లేదన్నదానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిజానికి ధరలు తగ్గించకపోగా, రూ.3 ఎక్సైజ్ సుంకం, బీఎస్–6 ప్రమాణాలంటూ మరో రూ.1 చొప్పున అదనపు భారాన్ని ఈ నెల 1 నుంచి ప్రజలపై ఓఎంసీలు వడ్డించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.69.59, డీజిల్ రూ.62.29 రేటుకు విక్రయిస్తున్నారు. -
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల ఫలితం ఇకపై దేశీయ వినియోగదారుకు అందదు. ఎందుకంటే, ఆ మేరకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఈ నిర్ణయంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీని ఫలితంగా కేంద్రానికి రూ.39వేల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని అభివృద్ధి పథకాలు, మౌలికరంగ వసతుల కోసం వెచ్చించనున్నట్లు కేంద్రం తెలిపింది. తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌పై స్పెషల్ ఎౖక్సైజ్ డ్యూటీ రూ.8 వరకు చేరుకోగా డీజిల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.4కు పెరిగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. అదనంగా రోడ్ సెస్సు.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున పెరిగి రూ.10కి చేరింది. అంతిమంగా ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.22.98కు, డీజిల్‌పై 18.83కు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.69.87, డీజిల్ రూ.62.58కి అందుబాటులో ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను లీటరుకు రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉంది. కాంగ్రెస్ మండిపాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్జైజ్ డ్యూటీ పెంపును కాంగ్రెస్ విమర్శించింది.అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం ఆ మేరకు వినియోగదారుకు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. -
మూడో రోజు తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు రోజుకూడా తగ్గుముఖం పట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల తగ్గింపుతో శనివారం మరో 15 పైసలు దిగి వచ్చింది. దీంతో ఈ మూడు రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు 44 పైసలు, డీజిల్‌పై లీటరుకు 45 పైసల ఉపశమనం లభించింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలను లీటరుకు 15 పైసలు తగ్గా, ఢిల్లీ కోల్‌కతాలో డీజిల్ ధరను 16 పైసలు తగ్గింది. ముంబై, చెన్నైలలో లీటరుకు 17 పైసలు తగ్గించడం గమనార్హం. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం పలు నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 75.26,లీటరు డీజిల్ ధర 68.61 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. రూ .77.85 లీటరు డీజిల్ ధర రూ .70.97 ముంబై: లీటరు పెట్రోలు రూ .80.85 లీటరు డీజిల్ ధర రూ .71.94 చెన్నై : లీటరు పెట్రోలు రూ .78.19 లీటరు డీజిల్ ధర రూ .72.50 హైదరాబాద్ : లీటరు పెట్రోలు రూ .80.03 లీటరు డీజిల్ ధర రూ .74.81 విజయవాడ లీటరు పెట్రోలు రూ .79.20 లీటరు డీజిల్ ధర రూ .73.66 -
మండిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్‌కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్‌పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్‌పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం, డీజిల్‌పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్‌పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది. -
పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకాలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.74.88 ఉండగా, అది రూ.77.57కు చేరింది. అంటే పెట్రోల్‌పై రూ.2.69 పెరిగింది. డీజిల్ ధర బుధవారం లీటర్ రూ.70.06 ఉండగా, అది రూ.72.71కి చేరింది. అంటే డీజిల్‌పై రూ.2.65 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ఒక్కో లీటర్‌పై 1 శాతం చొప్పున విధించిన స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌తో పాటు రాష్ట్రం పరిధిలోని ఇతరత్రా సుంకాలతో కలిపి ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం తెలంగాణలోని 90 లక్షల వాహనదారులపై పడనుంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 60 లక్షల వాహనాలున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణాపై ఈ భారం ఎక్కువ ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసరాలు, కూరగాయాలు, పండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారమే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా పెట్రో ధరలు మాత్రం దిగిరావట్లేదు. పన్నులతో బాదుడు.. పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.17.98లు, డీజిల్‌పై రూ.13.83 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 24 శాతం వ్యాట్ ఉండగా, డిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ పన్ను 27 శాతం ఉండగా, గోవాల్లో అతి తక్కువగా 17 శాతం వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌పైనే చమురు ఉత్పత్తుల ధరలు ఆధారపడినట్లు కనిపిస్తోంది. -
జనం నెత్తిన పెట్రో బాంబ్
-
పెరగనున్న పెట్రోల్,డిజీల్ ధరలు
-
కొత్త ఏడాదిన రాష్ట్ర ప్రభుత్వం షాక్
సాక్షి బెంగళూరు: కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు హెచ్డీ.కుమారస్వామి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి లీటరు పెట్రోల్‌పై 3.27 శాతం, డీజిల్‌పై 3.27 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి పెట్రోల్‌పై 28.75 శాతం, డీజిల్‌పై 17.73 శాతం మేర అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే ప్రస్తుత పెంపు నేపథ్యంలో అమ్మకపు పన్ను పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతానికి చేరుకుంది. అమ్మకపు పన్ను పెంపు వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఒక రూపాయిమేర మార్పు కనిపించనుంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచుతూ ఆదేశాలు జారీచే యడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో కర్ణాటకలో శుక్రవారం పెట్రోల్ ధర 69.01 ఉండగా పెంపు తర్వాత రూ. 70.35కు చేరుకుంంది. అలాగే డీజిల్ కూడా రూ. 62.80 ఉండగా.. అది కాస్తా 64.13కు చేరుకుంది. ప్రతి లీటరు పెట్రోల్ రూ.70.35, డీజిల్ రూ.69.21 మేర «లభించనున్నాయి. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.46 వేల కోట్లు రైతుల రుణమాఫీకి హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన లోటును పూరించుకునేందుకు పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుందని అందరూ భావిస్తున్నారు. -
ఏడాది కనిష్టానికి ‘పెట్రోల్’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరింత తగ్గాయి. పెట్రోల్ లీటర్‌కు 22 పైసలు తగ్గడంతో దేశ రాజధానిలో రూ.69.26 నుంచి ఈ ఏడాదిలోనే కనిష్ట స్థాయి రూ.69.04కు చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటరుపై 23 పైసలు తగ్గడంతో రూ.63.32 నుంచి తొమ్మిది నెలల కనిష్ట స్థాయి రూ.63.09కి దిగి వచ్చిందని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో పెట్రో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడించాయి. ఆగస్టు 15వ తేదీన పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.14, ముంబైలో రూ.84.58, డీజిల్ లీటర్ ఢిల్లీలో రూ.68.72, ముంబైలో రూ.72.96గా ఉండగా 16వ తేదీ నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించి, అక్టోబర్ 4వ తేదీన రికార్డు స్థాయికి ఢిల్లీలో రూ.91.34, ముంబైలో రూ.84కు చేరుకుంది. అదే రోజు డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటర్‌కు రూ.75.45, ముంబైలో రూ.80.10కు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గడంతో ఆ ప్రభావం దేశీయంగా పడింది. హైదరాబాద్‌లో..: ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.73.22కు చేరింది. అక్టోబరులో రూ.89.06 ధరతో రికార్డు సృష్టించిన పెట్రోల్ ధర నవంబర్ నాటికి రూ.84.14కు చేరింది. డిసెంబర్ మొదటివారంలో రూ.76.89 ఉన్న ధర చివరి వారంలో మరో రూ.3.67 తగ్గడం విశేషం. డీజిల్ ధర లీటరుకు ప్రస్తుతం రూ.68.67కు చేరింది. అక్టోబర్‌లో లీటరు డీజిల్ ధర రూ.82.33 కాగా, నవంబర్ నెలలో 80.20కు చేరింది. -
ఫ్రాన్స్‌లో జనాగ్రహం
యూరప్ యూనియన్(ఈయూ)లో జర్మనీ, బ్రిటన్ల తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్ నిరసనలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షుడు మేక్రాన్ ప్రభుత్వం పెంచిన డీజిల్ పన్నుతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్షం రోజులక్రితం ప్రారంభమైన ఈ నిరసనలు క్రమేపీ కొడిగట్టడం ఖాయమని అంచనా వేసుకున్న ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతిపరుస్తూ పారిస్ నగ రంలో ఆదివారం భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ‘పసుపు కోటు’ నిరసనలుగా పిలుస్తున్న ఈ ఉద్యమంలో చెలరేగిన హింసలో ముగ్గురు చనిపోగా, దాదాపు 260మంది గాయపడ్డారు. 400 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, భవంతులకు నిప్పెట్టడంతోపాటు దుకాణాల్ని లూటీ చేశారు. పారిస్ వీధులు యుద్ధరంగాన్ని తలపించాయి. వీటిని అదుపు చేయ డానికి అవసరమైతే అత్యవసర పరిస్థితి విధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం భావిస్తున్నదంటే వీటి తీవ్రత ఎంతో అంచనా వేయొచ్చు. అర్ధ శతాబ్దం తర్వాత...అంటే 1968నాటి విద్యార్థి తిరుగుబాటు తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగడం ఇదే ప్రథమం. ఈయూకు భవిష్యత్తులో తానే సారథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్న మేక్రాన్‌కు సహజంగానే ఈ ఆందోళనలు మింగుడుపడటం లేదు. నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మధ్యస్థ మితవాద పక్షానికి నేతృత్వం వహించిన మేక్రాన్ 66.06 శాతం ఓట్లతో విజయం సాధించారు. లీ పెన్ వంటి తీవ్ర మితవాదులు అధికారం చేజిక్కించుకునే ప్రమాదం ఉన్నదని ఆందోళనపడ్డవారంతా ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదంతా త్వరలోనే ఆవిరైంది. జీడీపీలో 56 శాతంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాల వ్యయాన్ని 52 శాతానికి తగ్గిస్తానని, కార్మిక సంస్కరణలు తీసుకొస్తానని గద్దెనెక్కిన అనంతరం మేక్రాన్ ప్రక టించారు. ఆ బాణీలోనే ఆయన పాలన సాగుతోంది. నిరసనలకు లొంగి సంస్కరణల పథం విడిచి పెట్టే ప్రసక్తి లేదని ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే ఈ సంస్కరణలు జనంలో నానాటికీ ఆగ్రహాన్ని పెంచుతున్నా ఆయన ఖాతరు చేయలేదు. దేశం ఆర్థిక శక్తిగా ఎదగాలంటే తీవ్ర చర్యలు అవసరమని చెబుతూ వచ్చారు. డీజిల్‌పై అదనపు పన్ను విధించిన కొన్ని గంటల్లోనే దేశం నలుమూలలా అసంతృప్తి రాజుకో వడం, ఆ తర్వాత ఒకటి రెండురోజులకే అది ఉద్యమ రూపం సంతరించుకోవడం ఆశ్చర్యకరమై నదే. అంతకన్నా ఆశ్చర్యమేమంటే ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులు, సంఘాలూ లేక పోవడం. కేవలం ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలే ఉద్యమానికి నారూ నీరూ పోశాయి. రహదార్ల మధ్యన ఉండే ట్రాఫిక్ ఐలాండ్‌లే ఆందోళనకారుల స్థావరాలు. అక్కడ టార్పాలిన్లతో శిబిరాలు ఏర్పాటు చేసుకుని మంచు కురుస్తున్నా, వర్షం పడుతున్నా వందలాదిమంది రాత్రింబగళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారంటే వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని అంచనా వేయొచ్చు. ఈ అసంతృప్తి డీజిల్‌పై తాజాగా విధించిన పన్నుతో రాజుకున్నది మాత్రమే కాదు. మేక్రాన్ వచ్చాక ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయని, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని సాధారణ పౌరులు ఆరోపిస్తున్నారు. రెండు నెలలక్రితం మేక్రాన్‌తో ఒక యువకుడు ఈ మాటే చెప్పినప్పుడు ఆయన దాన్ని కొట్టిపారేశారు. ఏదో ఒక పని చేయాలన్న సంకల్పం ఉంటే ఉద్యోగం దొరకడం కష్టమేమీ కాదని హితబోధ చేశారు. హోటళ్లు, కెఫెలు, రెస్టరెంట్లు, నిర్మాణ రంగ సంస్థలు వగైరాలన్నీ పని వాళ్లకోసం ఎదురుచూస్తున్నాయని వాదించారు. అలాగని ఉద్యోగవర్గాలు కూడా సంతోషంగా లేవు. అన్నిటి ధరలూ ఆకాశాన్నంటడం వల్ల నెలకు 1,500 యూరోలు సంపాదిస్తున్నవారు సైతం నెలాఖరుకు అప్పులు చేయాల్సి వస్తున్నది. పారిస్, కొన్ని ఇతర నగరాల్లో జీవన వ్యయం ఎక్కువ కావడం వల్ల అక్కడ పనిచేసేవారిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలనుంచే వస్తారు. వారికి రవాణా సదుపాయాలు అంతంతమాత్రం. ప్రపంచంలో రైల్వే నెట్వర్క్ విస్తృతంగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. కానీ ఆ రైల్వేలైన్లు గ్రామీణ ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. కనుక నగ రాల్లో పనిచేసేవారు సొంత వాహనాలపైనే ఆధారపడతారు. పర్యవసానంగా యూరప్‌లో వేరే దేశాలతో పోలిస్తే డీజిల్ కార్లు అత్యధికంగా వాడేది ఫ్రాన్సే. పారిస్‌లో నిరుడు జరిగిన వాతావరణ శిఖరాగ్ర సదస్సులో కాలుష్య నివారణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం వాహన వినియోగాన్ని తగ్గించాలని మేక్రాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల గురించి ఆలోచించకుండా పన్నులు పెంచుకుంటూ పోవడం పరిష్కారమని అను కోవడం వల్లే పరిస్థితి వికటించింది. జీవన వ్యయం బాగా పెరిగిందని, ఆర్థికంగా జనం ఇబ్బం దులు పడుతున్నారని మేక్రాన్‌కు తెలియందేమీ కాదు. 2008నాటి ఆర్థిక మాంద్యం ప్రభావంతో దెబ్బతిన్న మధ్యతరగతి ఇంకా కోలుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బ తినడంతో నగరాలకు వలసలు పెరిగాయి. మేక్రాన్ అధికారంలోకొచ్చి ఏడాది దాటుతున్నా సమస్యలకు మూలం ఎక్కడున్నదో, దాన్ని సరిచేయడానికి ఏం చేయాలో సక్రమంగా ఆలోచించలేకపోయారు. సంపద పన్ను భారీగా తగ్గిం చారు. అదే సమయంలో ఇతరత్రా పన్నులు బాగా పెంచారు. విద్య, వైద్యం వంటి సామాజిక సంక్షేమ పథకాల వ్యయంపై కోత విధించారు. ఉద్యమకారులతో చర్చించి వారి సమస్యలు తెలుసు కుని పరిష్కరించడానికి సిద్ధమని ఇప్పుడాయన చేసిన ప్రకటనకు మొదట సానుకూల స్పందనే వచ్చింది. అయితే ఆ చర్చల్ని వీడియో తీసేందుకు అనుమతించబోమని ప్రభుత్వం చెప్పడంతో ఉద్యమకారులు వెనక్కి తగ్గారు. తాము నిలదీసే అంశాలేమిటో, వాటికి పాలకుల సంజాయిషీ ఏమిటో దేశ పౌరులందరికీ తెలియాలని వారు భావిస్తున్నారు. ఈయూకు సారథ్యం వహించాలని కలలుగంటున్న మేక్రాన్ తొలుత స్వదేశంలో తలెత్తే సంక్షోభాలను చక్కదిద్దుకోవడం నేర్చుకోన ట్టయితే అసలుకే ఎసరు వస్తుంది. తాజా ఉద్యమం చెబుతున్నది అదే. -
ఫ్రాన్స్‌లో ఆందోళనలు హింసాత్మకం
పారిస్: ఫ్రాన్స్‌లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా రెండువారాల నుంచి జరుగుతున్న ఆందోళనలు శని, ఆదివారాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి బెంజమిన్ గ్రైవాక్స్ వెల్లడించారు. జీ–20 సమావేశాల కోసం అర్జెంటీనా వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకుని ప్రధాని, హోం మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హింస చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు తగ్గించాలని కోరుతూ నిరసనకారులు నవంబర్ 17 నుంచి రాజధాని పారిస్‌తోపాటు పలుచోట్ల ‘యెల్లో వెస్ట్’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన యువకులు ఇనుప రా డ్లు, గొడ్డళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రయోగించే బాష్పవాయువు నుంచి రక్షించుకునేందుకు కొందరు ఆందోళనకారులు గ్యాస్ మాస్క్‌లను, ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం చర్చలకు రావాలి: ప్రభుత్వం ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా చర్చలకు రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. ‘హింసను నేను ఎన్నటికీ అనుమతించను. అధికార భవనాలపై దాడులు చేయడం, వాణిజ్య సముదాయాలను కొల్లగొట్టడం, రోడ్లపై వెళ్తున్న వారిని, విలేకరులను బెదిరించడం వంటి చర్యలకు ఏ కారణమూ సమర్థనీయం కాదు’ అని మేక్రాన్ చెప్పారు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి ఓ నాయకుడు, నేతృత్వం వహించే పార్టీ/సంస్థ అంటూ ఏదీ లేదు. దీంతో ఎవరితో చర్చలు జరపాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. పన్నులు పెంచి, డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణహిత ఇంధనాలవైపునకు ప్రజలను మళ్లించేందుకేననీ, ఈ విషయం వారికి సరిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయామని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూలుడిగా పేరున్న మేక్రాన్ ఇప్పటివరకు పన్నులను తగ్గించేందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే మేక్రాన్ అధికారంలోకి వచ్చాక కంపెనీలపై పన్నులను తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇవి అవసరమని ఆయన వాదన. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వమే కారణమని పలువురు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మేక్రాన్