బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) డెలివరీ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది. తాజాగా తొలిసారి ఆమె ర్యాంప్ వ్యాక్ చేసింది. సబ్యసాచి 25వ ఫ్యాషన్ షోలో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తుల్లో ఆమె స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేసింది. చోకర్, క్రాస్ నెక్లెస్, చేతికి బ్రాస్‌లెట్, కళ్లజోడుతో ఆమె దర్శనమిచ్చింది. అయితే తన లుక్ చూసిన జనాలు దీపికను గుర్తుపట్టలేకుండా ఉన్నారు.
దీపికా పదుకొణె, రేఖ
మొదట చూడగానే..
కాస్త బొద్దుగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ నటి రేఖలా ఉందని పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి అవుట్‌ఫిట్‌లోనే కనిపించింది. వెరైటీ హెయిర్‌స్టైల్, కళ్లజోడుతో అచ్చం ఇలాంటి లుక్‌లోనే ఉంది. అందుకే చాలామంది.. మొదట చూడగానే తనను రేఖ అని పొరబడుతున్నారు.
సినిమా
ఇకపోతే దీపిక చివరగా కల్కి 2989 ఏడీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కల్కి 2898 ఏడీ సీక్వెల్, పఠాన్ 2 చిత్రాలున్నాయి. పర్సనల్ విషయానికి వస్తే.. 2018లో రణ్‌వీర్ సింగ్, దీపికా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్‌లో పాప పుట్టింది. తమ కూతురికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థనలు అని అర్థం.
International 🔥 Deepika walking the ramp after a gap but still the supermodel uff yaasss!! #DeepikaPadukone pic.twitter.com/zZngQFWcnF
— Banno 🇮🇳 (@BannoReBanno) January 25, 2025
చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment