rekha
-
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
ఇది సుమచరితం..! రెండు దేశాల సంస్కృతుల సమ్మేళ్లనం
పూల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా రాయడానికి ఇంకా ఉంటుంది. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన ఫ్లవర్ ఆర్ట్. ఇకబెనాలో చేస్తున్న సేవకి గాను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ అందుకున్నారు రేఖారెడ్డి. జపాన్ ఫ్లవర్ ఆర్ట్‌ను భారతీయ చేనేతకళతో సమ్మిళితం చేస్తూ తన ‘లూమ్స్ అండ్ బ్లూమ్స్, పెటల్స్ అండ్ ప్యాలెట్, మిశ్రణం’ రచనలను పరిచయం చేశారు రేఖారెడ్డి. పువ్వులు, రంగులు జీవితంలో భాగం. లైఫ్ కలర్ఫుల్గా ఉంచుకోవడం తోపాటు సుమభరితంగానూ ఉండాలి. భారతీయ సంస్కృతి పూలు ఆస్వాదనకు, ఆడంబరానికి, రసమయమైన, విలాసవంతమైన జీవితానికి ప్రతీకలు. అలాగే దైవానికి చేసే నిత్యపూజలో పూలది ప్రధానపాత్ర. మన పూల అలంకరణ ఈ తీరులోనే ఉంటుంది. జపాన్ వాళ్లు మాత్రం తాము అనుసరించే నిరాడంబర జీవనశైలిలో పూలతో ఆధ్యాత్మికపథం నిర్మిస్తారు. బౌద్ధం నుంచి నేర్చుకున్న వైరాగ్యతను పూల అలంకరణ ద్వారా నిత్యధ్యానం చేస్తారు. మనిషి జీవితాన్ని పువ్వుతో పోలుస్తారు. త్రికోణాకారపు అమరికలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపం ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్. ఒక మొగ్గ, ఒక అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలు. మనిషి జీవన చక్రానికి ప్రతీక. ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా ధ్యానం వంటిదే. ఒకరు దేవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఒకరు ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తారు. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో నిమగ్నమైతే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యానం తర్వాత కలిగే అలౌకిక ఆనందం వంటిదే ఇది కూడా. ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం జపాన్ సంస్కృతిలో భాగమైన ఇకబెనాలో భారతీయ సంస్కృతిని మమేకం చేస్తూ పసుపుకుంకుమలతో పరిపూర్ణం చేశారు. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ కాన్సెప్ట్ జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేయడం. ‘మిశ్రణం’లో మన ఆహారంలో ఉన్న పోషకాలు – జపాన్ పూల అలంకరణతో అనుసంధానం చేయడం. పెటల్స్ అండ్ ప్యాలెట్స్లో పూలు– రంగుల మధ్య విడదీయలేని బంధాన్ని వర్ణించారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనమే ఇవన్నీ. స్టేజ్ టాక్‌లో ఆతిథులను సమ్మోహనపరిచిన ఈ ప్రయోగాలే ఆమెను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’కు ఎంపిక చేశాయి. (చదవండి: -
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్‌గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్‌కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
రేఖ.. మామూలు చీటర్ కాదు
యశవంతపుర(కర్ణాటక) : ఐశ్వర్య గౌడ తరువాత.. బెంగళూరులో మరో యువతి ఘరానా మోసానికి పాల్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి రూ.25 కోట్ల ఆర్థికసాయం ఆశ చూపించి రూ. 6 కోట్లు శఠగోపం పెట్టింది. రేఖ అనే యువతిని, ఆమె భర్త మంజునాథ ఆచారి, అతని స్నేహితుడు చేతన్‌లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద తెలిపారు. ఈ నెల 13న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఎలా చేసిందంటే వివరాలు.. తమకు బ్యాంకుల అధికారులు, ఐటీ, ఈడీ అధికారులు తెలుసని రేఖా ప్రచారం చేసుకునేది. అలా ఒక రియల్టర్‌ను నమ్మించింది. రూ.25 కోట్ల రుణం ఇప్పిస్తానని ఆశ చూపింది. తమ ఖాతాలో భారీగా డబ్బులు ఉన్నాయని, వాటిని ఈడీ సీజ్ చేసిందని, ఆ డబ్బును తీయాలంటే పన్నులు, లంచాలు కట్టాలని వ్యాపారికి తెలిపింది. ఇలా అతని నుంచి విడతలవారీగా రూ.6 కోట్లను రేఖా, మంజునాథ ఆచారి, చేతన్‌లు తీసుకున్నారు. తరువాత వారిది పచ్చి మోసమని తెలుసుకున్న రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోసకోట సమీపంలోని ఒక ప్రైవేటు హాస్టల్లో తలదాచుకున్న రేఖాను అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు భర్త మంజునాథ్ ఆచారి, చేతన్‌లను కేఆర్‌పుర అయ్యప్పనగరలోని నివాసంలో పట్టుకున్నారు.మోసాల చిట్టా పెద్దదే విచారణ జరపగా రేఖా బాగోతాలు బయటకు వచ్చాయి. అనేక మందికి లోన్ ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయట పడింది. ఒక వ్యక్తికి వీడియోకాల్‌లో బెదిరించి రూ.31 లక్షలు వసూలు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని కొందరి నుంచి లక్షలు గుంజుకుంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతోంది. రేఖాకు చెందిన హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లలో 2022 నుంచి 2024 వరకు రూ.24 కోట్ల వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. మరింత విచారణ కోసం చేతన్‌ను సకలేశపురకు తరలించారు. చదవండి: పెళ్లి బ్యానర్‌తో పట్టుబడ్డ నిత్యపెళ్లి కూతురు -
డెలివరీ తర్వాత తొలి ర్యాంప్ వాక్.. గుర్తుపట్టలేనట్లుగా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) డెలివరీ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది. తాజాగా తొలిసారి ఆమె ర్యాంప్ వాక్ చేసింది. సబ్యసాచి 25వ ఫ్యాషన్ షోలో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తుల్లో ఆమె స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేసింది. చోకర్, క్రాస్ నెక్లెస్, చేతికి బ్రాస్లెట్, కళ్లజోడుతో ఆమె దర్శనమిచ్చింది. అయితే తన లుక్ చూసిన జనాలు దీపికను గుర్తుపట్టలేకుండా ఉన్నారు.దీపికా పదుకొణె, రేఖమొదట చూడగానే..కాస్త బొద్దుగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ నటి రేఖలా ఉందని పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి అవుట్‌ఫిట్‌లోనే కనిపించింది. వెరైటీ హెయిర్‌స్టైల్, కళ్లజోడుతో అచ్చం ఇలాంటి లుక్‌లోనే ఉంది. అందుకే చాలామంది.. మొదట చూడగానే తనను రేఖ అని పొరబడుతున్నారు.సినిమాఇకపోతే దీపిక చివరగా కల్కి 2989 ఏడీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కల్కి 2898 ఏడీ సీక్వెల్, పఠాన్ 2 చిత్రాలున్నాయి. పర్సనల్ విషయానికి వస్తే.. 2018లో రణ్వీర్ సింగ్, దీపికా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్‌లో పాప పుట్టింది. తమ కూతురికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థనలు అని అర్థం. International 🔥 Deepika walking the ramp after a gap but still the supermodel uff yaasss!! #DeepikaPadukone pic.twitter.com/zZngQFWcnF— Banno 🇮🇳 (@BannoReBanno) January 25, 2025 చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్ -
జియో వరల్డ్‌లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్‌లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
నా బిడ్డవు కదూ..!
రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘ఎవర్గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక. వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు. ‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే! -
Indian actress Rekha: పన్నీరద్దుకున్న పసిడి రేఖ
రేఖ... నేటితో 70 నిండి 71లోకి అడుగుపెడుతోంది. కాని మొన్న ఐఫా వేడుకలో వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ – ఎన్నో ఆటుపోట్లు జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. కాని ముందుకు సాగడం సౌందర్య భరితంగా జీవించడమే జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?1993.ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్ స్టేజ్ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్ అందుకుని ‘నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’...రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. ‘రేఖ నా కూతురు’ అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.∙∙ స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో ‘అక్రమ సంతానం’ గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. కాని మద్రాసులో రేఖను హీరోయిన్గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్గా నటించిన ‘సావన్ భాదో’ సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. ‘అగ్లీ డక్లింగ్’ అని పేరు పెట్టాయి. ‘33 ఇంచుల నడుము హీరోయిన్’ అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ‘ముద్దు సీన్లు నటించే’ అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.రేఖ బి–గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బోయ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో ‘దో అంజానే’లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్–రేఖల జోడి సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్సిలా. ఆమ్స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్ ఖ్వాబ్ తో ఏ సిల్సిలే హుయే’ పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమింటిక్ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ. ఇందుకు అమితాబ్ గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు. రేఖ కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ‘ఘర్’. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్సూరత్’ (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘ఉమ్రావ్ జాన్’ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగళ్ ‘కలియుగ్’ (1981), గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్లి ‘ఖూన్ భరీ మాంగ్’, ‘ఫూల్ బనే అంగారే’ వంటి సినిమాలు చేసి ‘లేడీ అమితాబ్’ అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది.రేఖ అన్‌స్టాపబుల్. అన్లిమిటెడ్. ఆమె ‘కల్ హోన హో’,‘క్రిష్’ వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్ చేస్తూ కవర్‌గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లిందిగానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది. రేఖ గొప్ప డాన్సర్. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ‘నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను’ అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.రేఖకు జన్మదిన శుభాకాంక్షలు. రేఖ టాప్ 10 సాంగ్స్1. తేరే బినా జియా జాయేనా – ఘర్2. ఆజ్కల్ పావ్ జమీ పర్ – ఘర్3. సున్ దీదీ సున్ తేరేలియే – ఖూబ్సూరత్4. సలామే ఇష్క్ మేరీ జాన్ – ముకద్దర్ కా సికిందర్5. దిల్ చీజ్ క్యా హై – ఉమ్రావ్ జాన్6. ఛోటి సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్7. పర్దేశియా ఏ సచ్ హై పియా – మిస్టర్ నట్వర్లాల్8. మన్ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్9. గుమ్ హై కిసీ కే ΄్యార్ మే – రామ్‌పూర్ కా లక్ష్మణ్10. ఏ కహా ఆగయే హమ్ – సిల్సిలా -
అట్టహాసంగా ఐఫా వేడుక.. సీనియర్ నటి డ్యాన్స్ అదుర్స్!
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ఐఫా-2024 అట్టహాసంగా జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులను అందజేస్తారు. ఇప్పటికే పలువురు సినీతారలు ఈ అవార్డ్స్ దక్కించుకున్నారు. సెప్టెంబరు 27న మొదలైన ఈ వేడుక ఆదివారంతో ముగియనుంది. ఇప్పటికే సౌత్ ఇండియా, బాలీవుడ్ తారలకు అవార్డులను ప్రకటించారు.అయితే ఈ వేడుకలకు హాజరైన సీనియర్ నటి రేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. 1965లో వచ్చిన ఆమె నటించిన చిత్రం గైడ్లోని ఓ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టింది. 150 మంది డ్యాన్సర్లతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు అభిమానులను అలరించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పింక్ అనార్కలి సూట్లో రేఖ మిస్టర్ నట్వర్లాల్ చిత్రంలోని "పర్దేశియా" పాటకు డ్యాన్స్‌తో అదరగొట్టింది.(ఇది చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్)కాగా.. టాలీవుడ్లో ఉత్తమ నటుడిగా నాని(దసరా) నిలిచారు. ఉత్తమ చిత్రంగా దసరా మూవీకి అవార్డ్ దక్కింది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్(జవాన్) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ నిలిచింది. The one and only #Rekha ji ❤️#IIFA2024 pic.twitter.com/DMUVNOHju7— Raj Nayak (@rajcheerfull) September 29, 2024 #Rekha ji mesmerizing the audience with her ever charming charisma 💓💓💓💓 #IIFA2024 pic.twitter.com/hRc4gV1zZ0— 💖👑 GreatestLegendaryIconRekhaji👑 💖 (@TheRekhaFanclub) September 28, 2024 -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్‌లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ 'మై హస్బెండ్ ఫర్ఫెక్ట్'. ఈ సిరీస్‌లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఖరారు చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.కాగా.. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‌ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. -
ఆమె కంటే నేనేం తక్కువ? నిలదీసిన హీరోయిన్
ఫలానా హీరోతో పని చేయాలని దర్శకనిర్మాతలు కలలు కన్నట్లే ఫలానా ఫిలిం మేకర్స్‌తో పని చేస్తే బాగుండని హీరో హీరోయిన్లు కూడా అనుకుంటారు. అదే విధంగా దర్శకనిర్మాత మీరా నాయర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తహతహలాడింది సీనియర్ కథానాయిక షబానా అజ్మీ. కానీ ఆమె కోరిక నెరవేరనేలేదు.రేఖ, షబానా అజ్మీమీరా డైరెక్ట్ చేసిన 'ద రెలక్టెంట్ ఫండమెంటలిస్ట్'(2012) అనే సినిమాలో కేవలం చిన్న పాత్ర వరించింది. ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తుందనుకుంటే ఏదో చిన్న పాత్ర ఆఫర్ చేసిందని బాధపడింది. దర్శకురాలికి తన మీద నమ్మకమే లేదని విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాలను మీరా నాయర్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దర్శకనిర్మాత మీరా నాయర్ఆమె మాట్లాడుతూ.. 'ముంబై జుహులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వాష్‌రూమ్‌కు వెళ్తుంటే షబానా నా వెంటే వచ్చింది. నా కంటే రేఖ గొప్పగా చేసిందేముంది? అంటూ రెస్ట్ రూమ్‌లోనే గొడవపెట్టుకుంది. ఎందుకు నాకు పెద్ద రోల్ ఇవ్వవని నిలదీసింది. నిజంగానే ద రెలక్టెంట్.. సినిమాలో షబానాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది.. మరో ప్రాజెక్ట్‌కు తప్పకుండా కలిసి పని చేద్దామని నచ్చజెప్తేగానీ ఊరుకోలేదు' అని మీరా నాయర్ పేర్కొంది. కాగా మీరా.. రేఖతో కలిసి కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ (1996) అనే సినిమా చేసింది. 2012 తర్వాత ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఆమె అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో షబానాతో సినిమా చేస్తానన్న హామీ కూడా అటకెక్కింది.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
సందేశ్‌ఖాళీ ఓ కట్టుకథ.. మాజీ బీజేపీ నేత సంచలన కామెంట్స్
కోల్కత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో సందేశ్‌ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్ డ్రామా). సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్ కార్డ్స్, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్ చేశారు. ఇక, సందేశ్‌ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్ కూడా ఒకరు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్‌ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్ షాజాహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్‌ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది. బసిర్హత్ లోక్‌సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది. -
KOITA FOUNDATION: నై‘పుణ్య’ సేవ
కెరీర్లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు. తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు. క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్. ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్. హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్. ‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్టూల్స్ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్. ‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు. ‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్వర్కర్కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లకు ఇన్పుట్ డాటాతో ఔట్పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్. ‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ. -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
భారత్ గెలుస్తే అంటూ..'బోల్డ్ ఆఫర్' ఇచ్చిన వైజాగ్ అమ్మాయి రేఖా భోజ్ (ఫోటోలు)
-
భారత్ గెలుస్తే అంటూ.. 'బోల్డ్ ఆఫర్' ప్రకటించిన తెలుగు హీరోయిన్
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా వరల్డ్ కప్-2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్‌ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి ప్రపంచ కప్ భారత్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉండటమే.. ఇలాంటి సమయంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 'ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా' అంటూ పోస్ట్ పెట్టింది. స్ట్రీకింగ్ అంటే ఏంటి..? ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది దుస్తులు తొలగించి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడమే స్ట్రీకింగ్ అంటారు. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అలాంటి పని చేయనుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ఆమె తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తే...వైజాక్ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండియా గెలుస్తే... బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. వాటికి రేఖా భోజ్ కూడా ఇలా రిప్లై ఇచ్చింది. లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.' అని రేఖా బోజ్ తెలిపింది. కానీ కొందరు మాత్రం అంతే బోల్డ్‌గా వైజాగ్ వచ్చేస్తామంటూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. రేఖా భోజ్ ఎవరు..? బోల్డ్ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఆమె గతంలో వైరల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.. విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్లకు అది దక్కట్లేదు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
తెలుగులో అప్పట్లో 'రుద్రనేత', 'కొండపల్లి రాజా' సినిమాల్లో నటించిన రేఖ.. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ భాషలకే పరిమితమైంది. మరోవైపు సీరియల్, షోల్లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'మిరియం మా'. ఐర్లాండ్ కి చెందిన మాలతి నారాయణన్ దర్శకురాలు. ఆమెనే ఈ చిత్రానికి నిర్మాత కూడా. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేఖ.. హీరోయిన్ల జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను 35 ఏళ్లుగా నటిస్తున్నా. మొదట్లో హీరోయిన్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను. నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది' 'ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు. కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది' అని రేఖ తన ఆవేదన చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) -
రాకేష్ ఝున్‌ఝున్ వాలా.. ‘ఆకాశ ఎయిర్’లో ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్’ సంచలన నిర్ణయం తీసుకుంది. నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా సంస్థ నుంచి వైదొలగిన 43 మంది పైలెట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పైలెట్లు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ప్రాంతాలకు సర్వీసులు అందించే ఆకాశ ఎయిర విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అధిక సంఖ్యలో విమానాల సేవల్ని రద్దు చేసింది. పైలెట్ల కొరతే విమానయాన సేవలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బాంబే హైకోర్టుకు ఈ నేపథ్యంలో సంస్థకు రాజీనామా చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా 6 నెలల పాటు నోటీస్ పిరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మరో సంస్థలో చేరిన పైలెట్లపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థతో పైలెట్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మరో సంస్థలో చేరే ముందు పైలెట్లు నోటీస్ సర్వ్ చేయాలి. కానీ అలా చేయకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించింది. కాబట్టి సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల తామెంతో నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరింది. పైలెట్లది అనైతిక, స్వార్థపూరిత చర్య ఈ సందర్భంగా విమానయాన చట్టం ప్రకారం.. ఉద్యోగులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించారని ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు.‘ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పైలెట్ల అనైతిక, స్వార్థపూరిత చర్య కారణంగా ఈ ఆగస్టులో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. పైలెట్ల కొరత కారణంగా చివరి నిమిషంలో విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. కాగా, ప్రస్తుతం 20 విమానాల సేవల్ని అందిస్తున్న ఆకాశా ఎయిర్ గత ఏడాది ఆగస్టు నెలలో కార్యకలాపాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే? -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
రేఖ వేదవ్యాస్.. 2001లో తెలుగు తెరకు పరిచయమైంది. ఆనందం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్‌ను, పేరుప్రఖ్యాతలను సంపాదించింది. జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది. అయితే కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2014 తర్వాత మరే సినిమాలోనూ కనిపించని ఈ బ్యూటీ ఆ మధ్య ఓ షోలో బొద్దుగా కనిపించింది. తాజాగా మరోసారి బుల్లితెరపై అడుగుపెట్టింది రేఖ. వేణు తొట్టెంపూడితో కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెను చూసి అందరూ షాకవుతున్నారు. కళ తప్పి బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి వచ్చింది. ఆమెను చూసి నటి ఇంద్రజ సైతం షాకైంది. మిమ్మల్ని చూడగానే విపరీతమైన సంతోషం.. అలాగే చాలా షాకయ్యాను అంది. దీనికి రేఖ బదులిస్తూ.. అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ దేని గురించో మాట్లాడింది. బహుశా ఏదైనా అనారోగ్య కారణాల వల్లే ఆమె ఇలా బక్కచిక్కి పోయి ఉండవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా రేఖను ఇలా చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేఖ ఏ సమస్యతోనైనా బాధపడుతూ ఉండుంటే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. చదవండి: శృంగార తారగా ముద్రపడ్డ నటి జీవితంపై వెబ్ సిరీస్.. -
దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?
దివంగత పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝన్ ఝన్‌వాలా తన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దు కునేందుకు కలలు కన్నారు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్‌లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం, మలబార్ హిల్స్ ప్రాంతంలో 14-అంతస్తుల విశాలమైన బంగ్లా నిర్మాణం పూర్తి చేయకముందే కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో 2022 ఆగస్టులో కన్నుమూశారు. 2016-2017 మధ్య కాలంలో రిడ్జ్‌వే అపార్ట్మెంట్స్ అనే మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 371 కోట్లు వెచ్చించిన బిగ్ బుల్ ఝున్‌ఝన్‌వాలా. 2013 సంవత్సరంలో 6 ఫ్లాట్లను స్టాండర్డ్ చార్టర్డ్ నుండి రూ. 176 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు వేచి చూసి మరీ నాలుగేళ్ల తర్వాత, రూ. 195 కోట్లకు అత్యధికంగా బిడ్ చేసి మరీ సొంతం చేసుకున్నారు. (యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే! ) ఇటీవల ట్విటర్ యూజర్ ఝన్‌ఝన్‌వాలా ఇంటికి చెందిన సీఫేస్టెర్రస్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా మారింది. ఆర్జే అని స్నేహితులు ప్రేమగా పిలుచుకునే ఝన్‌ఝన్ వాలా అభిరుచిని గుర్తు చేసుకున్నారు. అబ్బురపరిచే ఈ బంగ్లా జీవితం పట్ల ఆర్జేకు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ బంగ్లా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రేస్‌లో ఆరు-సీట్ల డైనింగ్ టేబుల్, బార్, అవుట్డోర్ సీటింగ్ ఏరియాలు, పచ్చటి గడ్డి కార్పెట్, పచ్చదనంతో చక్కగా ఉండది. అలాగే నాలుగో అంతస్తులో పార్టీల కోసం బాంకెట్ హాల్, ఎనిమిదో అంతస్తులో జిమ్, స్టీమ్ రూమ్, స్పా , ప్రైవేట్ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. బాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, 5వ అంతస్తులో భారీ హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి. పై అంతస్తు 70.24 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్జర్వేటరీ ఏరియా, రీ-హీటింగ్ కిచెన్, పిజ్జా కౌంటర్, అవుట్డోర్ సీటింగ్ స్పేస్, వెజిటబుల్ గార్డెన్‌గా రూపొందించారు. మిగిలినదాన్ని కుటుంబంకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 10వ అంతస్తులో 4 పెద్ద గెస్ట్ బెడ్రూమ్ లున్నాయి. ఇక్కడ పిల్లలు కుమార్తె నిషిత, కవల కుమారులు ఆర్యమాన్ , ఆర్యవీర్ కోసం 11వ అంతస్తులో లగ్జరీ బెడ్ రూంలు ఉండేలా ప్లాన్ చేశారు. Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB — Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023 తన కోసం పెద్ద బెడ్రూం స్టాక్ మార్కెట్ లెజెండ్ ఝున్ఝన్వాలాతన భార్య రేఖతో కలిసి 12వ అంతస్తులో విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలతో మాస్టర్ బెడ్రూమ్ తయారు చేయించుకున్నారు. ఇది సగటు 2BHK కంటే 20 శాతం పెద్దది. అలాగే బాత్రూమ్ ముంబైలో విక్రయించే సగటు 1 BHK అంత పెద్దది. ఇక భోజనాల గది 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ కంటే పెద్దది. అంతేకాదు చిన్నప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అమెరికా బడా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్లను తన ఇంట్లో విందుకు ఆహ్వానించాలనే కోరిక ఉండేదిట. వీటితోపాటు, తన కలల ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన కన్నుమూయడం విషాదం. -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా: హాట్ టాపిక్‌గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్‌మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్‌ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్‌ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్‌జున్‌వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్‌గా ర్యాంక్‌ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్‌ఝన్ వాలా అందుకున్నారు -
రేఖా ఝున్‌ఝున్ వాలా.. ఈ కంపెనీ స్టాక్స్‌తో ఒక్క రోజే 100 కోట్లు లాభం
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా ఈ రోజు తన నికర విలువలో గణనీయమైన వృద్దిని సాధించారు. అందుకు టాటా మోటార్స్ స్టాక్ పనితీరుతో పాటు జూన్ త్రైమాసిక ఫలితాలే కారణమని తెలుస్తోంది. రేఖా కొనుగోలు చేసిన టాటా షేర్లు బుధవారం 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40ను తాకింది. వెరసీ ఒక్కరోజే 132 కోట్లకు పైగా సంపాదించారు. రేఖా ఝున్ ఝున్ వాలా టాటా మోటార్స్‌లో 52,256,000 షేర్లు ఉన్నాయి. మంగళ వారం రోజు షేరు రూ.639.45 వద్ద క్లోజ్ అయినప్పుడు ఆమె హోల్డింగ్ విలువ రూ.3,341.50 కోట్లుగా ఉంది. బుధవారం రూ.665.40కు పెరగడంతో ఆమె షేరు విలువ రూ.3,477.11 కోట్లకు పెరిగింది. టాటా మోటార్స్ ఫలితాలు టాటా గ్రూప్ కంపెనీ విశ్లేషకులను, ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపార పనితీరుతో బలహీనంగా ఉన్న త్రైమాసికంలో కంపెనీ పనితీరు అంచనాలను అధిగమించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. జేఎల్ఆర్ వ్యాపారం మరింత వృద్ధిని, లాభదాయకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ర్యాలీస్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
సెక్రటరీతో సహజీవనం.. అది భరించలేకే ఉరేసుకున్న హీరోయిన్ భర్త?
అందాల అభినయానికి నిలువెత్తు నిదర్శనం రేఖ. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రేఖ జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్ బచ్చన్‌ను ప్రేమించింది రేఖ. కానీ జయాబచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ ఆ మధ్య ఓ పేపర్ క్లిప్ బాగా వైరలయింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారనుకునేలోపే విడిపోయారని అందులో రాసుకొచ్చారు. ఏడాది తిరగకముందే ఆత్మహత్య పెళ్లి కాకముందే రేఖ నుదుటన సింధూరం ధరించేది. వినోద్ మెహ్రాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని, కానీ అతడితో సెట్ అవ్వకపోవడంతో తనకు దూరంగా వచ్చేసిందని కూడా ప్రచారం నడిచింది. సెలబ్రిటీలతో నడిపిన ఏ లవ్ స్టోరీకి మంచి క్లైమాక్స్ పడకపోవడంతో అవుట్సైడర్ను పెళ్లాడింది. నాలుగు పార్టీల్లో కలిసిన వ్యాపారవేత్త ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడగడం, రేఖ సరేనని తలూపడంతో ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముఖేశ్ ఉరేసుకుని మరణించాడు. మహిళా సెక్రటరీతో ఎఫైర్ ఆ సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ భర్త మరణానికి ఆమె తన సెక్రటరీయే ప్రపంచంగా బతకడమనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇకపోతే రేఖ జీవిత కథను రచయిత యాజీర్ ఉస్మాన్ ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ఇందులో రేఖకు తన మహిళా సెక్రటరీతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాడు. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా సరే రేఖ బెడ్రూమ్లోకి అడుగుపెట్టే స్వేచ్ఛ, అధికారం ఒక్క ఫర్జానాకు మాత్రమే ఉండేదట. ఈవిడ రేఖ దగ్గర వ్యక్తిగత సెక్రటరీగా పని చేసేది. ఫర్జానా ఏది చెప్తే అదే చేసేది రేఖ. వీరిద్దరూ మూడు దశాబ్దాలపాటు కలిసి పని చేశారు. ఆమె లేకుండా రేఖ బతకలేదా? రేఖ ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే, తన సెక్రటరీ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు. రేఖ భర్త ముఖేశ్ మరణానికి ఫర్జానాయే కారణమని సదరు పుస్తకంలో పరోక్షంగా ప్రస్తావించారు. 'రేఖకు ఫర్జానా సరైన జోడి. ఆమె తన స్నేహితురాలు, మద్దతురాలు.. తన ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె లేకుండా రేఖ బతకలేదు' అని పుస్తకంలో పొందుపరిచారు. రేఖ ఆమెతో సహజీవనం చేసిందని అందరూ అంటుంటే.. తను మాత్రం ఆమెను సొంత సోదరిలా భావిస్తానని ఎప్పుడూ చెప్పుకొచ్చేది. చదవండి: నో అంటే నో అంతే.. ఇంక ఎక్కువ వాగద్దు.. విశ్వక్ ట్వీట్ బేబి డైరెక్టర్నుద్దేశించేనా? తమన్నాతో పెళ్లి.. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైందన్న విజయ్ వర్మ -
బార్బీరేఖ.. పిక్స్ వైరల్
అమెరికా బొమ్మల కంపెనీ ‘మ్యాటల్’ 1959లో ఫ్యాషన్ డాల్ ‘బార్బీ’ని లాంచ్ చేసింది. జర్మన్ అందాల బొమ్మ ‘బిల్డ్’ను స్ఫూర్తిగా తీసుకొని సృష్టించిన ‘బార్బీ’ తరాలకు అతీతంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఈ నెల 21న హాలీవుడ్ లైవ్–యాక్షన్ మూవీ ‘బార్బీ’ విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ప్రచారంతో సంబంధం లేకపోయినా ‘మింత్ర’ సృష్టించిన చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. 68 సంవత్సరాల రేఖను ఏఐ వపర్‌తో అందాల బార్బీ బొమ్మగా మార్చి నెటిజనులను అబ్బుర పరిచింది ఇండియన్ ఫ్యాషన్ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్ర. pic.twitter.com/4oeHzPU0Lm — Myntra (@myntra) July 5, 2023 -
అక్కడ చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి.. అంతే కానీ: నటి బోల్డ్ కామెంట్స్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో తరచుగా ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతుంటారు. అంతేకాకుండా ఇటీవల హీరోయిన్స్ ఎక్కువగా వేధింపులకు గురైనట్లు మన వింటుంటాం. కానీ ఇటీవల ఓ బుల్లితెర మహిళల పట్ల వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖా నాయర్ మహిళల డ్రెస్ కోడ్ పట్ల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే తాజాగా మహిళల పట్ల ఆమె చేసిన కామెంట్స్‌పై మండిపడుతున్నారు. రేఖా నాయర్ మహిళల డ్రెస్ కోడ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇటీవల మహిళలు చాలా సెక్సీ డ్రెస్సులు ధరిస్తున్నారు. అందువల్లే అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారంటారా? ఈ విషయంలో మరీ మీ సంగతి ఏంటి? అని యాంకర్ ఆమెను ప్రశ్నించింది. దీనికి రేఖ సమాధానమిస్తూ.. 'అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి. అంతే కానీ ఏదో జరిగిపోయిందంటూ నానా హడావుడి చేయొద్దు. ఈ విషయంలో అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నేను వేసుకునే డ్రెస్ గురించి చాలా మంది లేడీస్ అడుగుతుంటారు. కానీ ఎవరైనా వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే నేను కోప్పడను.. ఆనందిస్తా. నేను చీర కట్టుకుంటే నా నడుము కనిపిస్తుంది. బస్సులో వెళ్లినా ఎవరైనా చేయి వేస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి మనసత్వాలను దూరం చేసుకోవాలి. నేను జాగింగ్ చేసినా, ఏదైనా పోటీలో పాల్గొన్నా నడుము కనిపించే డ్రెస్సులే వేసుకుంటా. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.' అంటూ వివాదస్పద కామెంట్స్ చేసింది. అంతేకాకుండా అమ్మాయిల డ్రెస్సులను మెచ్చుకునేది కేవలం అబ్బాయిలు మాత్రమేనన్నారు. అయితే ఆమె మాటలను కొందరు ప్రశంసించగా.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!
సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్‌హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝన్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది. టైటన్‌లో ఝున్‌ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది. -
20 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోయిన్గా చేస్తున్న రేఖ
'కడలోరం కవిదైగళ్' చిత్రం ఫేమ్ రేఖ చాలా కాలం తరువాత కథానాయికగా నటిస్తున్న చిత్రం మిరియమ్మ. ఇతర ముఖ్యపాత్రల్లో ఎళిల్ దురై, స్నేహకుమార్, అనితా సంపత్, వీజే.ఆషిక్, మాలతీ నారాయణ్ నటిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా మావతి నారాయణ్ దర్శకుడిగా పరిచయం అవుతూ 72 ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఏఆర్.రిహానా సంగీతాన్ని, జెసన్ విలియమ్స్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ఇది మహిళల ఇతి వృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఒకప్పుడు కథానాయికగా నటించిన రేఖ 20 ఏళ్ల తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిరియమ్మ అని చెప్పారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. చిత్రంలో జనరంజక అంశాలతో పాటు చక్కని సందేశం ఉంటుందన్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. రేఖ మళ్లీ ప్రధాన పాత్రలో నటించడంతో మిరియమ్మ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వీడియో వైరల్ -
ఒక్క రోజు.... 48 గంటలు! టైమ్ ట్రావెల్ చేసిన హీరో!
ఆదిత్య బద్వేలి, రేఖా నిరోషా జంటగా నిరంజన్ బండి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క రోజు.. 48 హవర్స్’. ప్రీతీ క్రియేషన్స్, హేమలత సమర్పణలో కృష్ణా రెడ్డి, కేకే నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, షేడ్ స్టూడియోస్ అధినేత బలివాడ దేవి ప్రసాద్ ఆవిష్కరించారు. నిర్మాత కేకే మాట్లాడుతూ– ‘‘మా బేనర్లో ఇది తొలి చిత్రం. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఔట్పుట్ బాగా వచ్చింది. విజయం పట్ల నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. నిరంజన్ బండి మాట్లాడుతూ– ‘‘అనుకోని పరిస్థితుల్లో కష్టాలపాలైన హీరో టైమ్ ట్రావెల్ చేసి తనని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు ఆదిత్య, రేఖా నిరోషా. -
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా
సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్‌ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్‌వర్త్‌కు జోడించుకున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్డేట్స్తో సోమవారంనాటి మార్కెట్లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా పోర్ట్ ఫోలియోలోని షేర్ల మార్నింగ్ డీల్స్‌తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది. రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్ జూమ్ 2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ!సూపర్!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుడు బిలియనీర్, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్‌లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ లిస్ట్‌లోచేరింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్ టాప్‌లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ , క్రిసిల్ రేఖ టాప్ పిక్స్‌గా చెప్పుకోవచ్చు. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్‌లు రేఖ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. రేఖ ఝున్‌ఝున్‌వాలా ఎవరు? బిగ్‌బుల్‌గా పాపులర్ అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖ. రాకేష్‌ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా. వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ లో రాకేష్ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు. కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్‌గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పద్మశ్రీ మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ కుటుంబం ఆయన తరపున అవార్డును స్వీకరించింది. -
Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..
నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి. స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్‌ఝున్‌వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్‌జున్‌వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. (ఇదీ చదవండి: తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..) -
అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్గ్రీన్ బ్యూటీ చెప్పిన చిట్కాలివే!
Beauty Tips- Rekha: అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ ఏడు పదుల వయసుకు చేరువవుతున్నా అందంతో మెరిసిపోతూ ఎవర్గ్రీన్ బ్యూటీ అనిపించుకుంటున్నారు. ఫంక్షన్ ఎక్కడైనా.. పార్టీ ఏదైనా తనదైన స్టైల్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారామె. నిండైన చీరకట్టుతో అందానికి మారుపేరులా అనిపించే రేఖ.. కురుల ఆరోగ్యం గురించి తన తల్లి చెప్పిన చిట్కాల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవును.. అతివల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో నల్లని, ఒత్తైన కురులది కూడా కీలక పాత్రే! ఆ కురులకు సంబంధించి రేఖ చెప్పిన టిప్స్ ఆమె మాటల్లోనే.. ‘‘అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు కదా.. కురుల ఆరోగ్యం కూడా! దానికి నేను నమ్ముకున్నది హోమ్ రెమిడీస్‌నే. వారంలో రెండుమూడు సార్లు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటాను. చాలా తరచుగా పెరుగు, తేనె, గుడ్డులోని తెల్లసొనను కలిపి జుట్టుకు ప్యాక్‌గా వేసుకుంటాను. స్ట్రెయిటెనర్స్, కర్లర్స్, హెయిర్ డ్రయర్లు అస్సలు వాడను. వాటివలన జుట్టు సహజత్వం దెబ్బతింటుంది’’ అని రేఖ పేర్కొన్నారు. చదవండి: Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
టాలీవుడ్ దరిద్రం.. వాళ్లసలు హీరోయిన్సే కాదు: నటి
టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్‌కు గుర్తింపు, ఛాన్సులు రెండూ తక్కువేనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. తెలుగమ్మాయిలు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నా సరే వారికి అవకాశాలు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్పిందో తెలుగు నటి. 'దామిని విల్లా', 'రంగీలా', 'స్వాతి చినుకులు సంధ్య వేళలో' సినిమాల్లో నటించిన రేఖా బోజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి, కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్స్. కన్నడ వాళ్లు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఇది చూసైనా మన దర్శకులు కాస్త మారాలి(బుద్ధి తెచ్చుకోవాలి). ఇవే కాకుండా రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా సినిమాలున్నాయి. కార్తికేయ 2లో ఆ మలయాళీ కాకుండా ఒక తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ మూవీ అలానే ఆడుతుంది. మన సబ్జెక్ట్‌లో, మన గుండెల్లో దమ్ము ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పడాలు, వొడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్ సేన్ లాంటి వాళ్లు.. ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలను తీసుకుంటారు. కానీ అదే సినిమాను మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లసలు వాళ్ళ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ కాదు!చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిలింస్‌లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది రేఖా బోజ్. చదవండి: సంపాదన విషయంలో సుమకు, రాజీవ్‌కు గొడవలు? 62 దేశాలు, 18 నెలల.. హీరో షాకింగ్ నిర్ణయం -
అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు..
రంగురంగుల పూలు కంటికి హాయినిస్తాయి. పూల అమరిక మనసుకు సాంత్వననిస్తుంది. ఫ్లవర్‌వాజ్ ఇంటి ఆహ్లాదానికి చిరునామా. భూమి... స్వర్గం... మధ్యలో మనిషి... జీవిత తత్వానికి, జీవన సూత్రానికి ప్రతీక పువ్వు. ఈ తాత్వికతకు ప్రతిబింబం ఇకబెనా పూల అమరిక. కళ... పాటలు పాడడం ఒక కళ. నాట్యం చేయడం ఒక కళ. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను... నేల మీదకు తెచ్చి రంగవల్లిక ఆవిష్కరించడం ఓ కళ... అలాగే కాన్వాస్ మీద ఆవిష్కరించడం మరో కళ. అదే పూలు, లతలను వస్త్రం మీద కుట్టడం ఓ కళ. తాజా పూలను కుండీలో అమర్చడమూ ఓ కళ. అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ కళను సాధన చేయడం ధ్యానంతో సమానం అంటారు ఇకబెనా కళాకారిణి రేఖారెడ్డి. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. జీవితానికి అన్వయిస్తూ సూత్రబద్ధంగా చేసే అమరిక. జపాన్ కళకు భారతీయ సొగసులద్ది విదేశాల్లో భారతీయతకు రాయబారిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న రేఖారెడ్డి. ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి నేపథ్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ప్రకృతికి ఆహ్వానం ‘‘ఇది బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ. బుద్ధుని ప్రతిమ ఎదురుగా ఒక పాత్రలో నీటిని పెట్టి అందులో కొన్ని పూలను సమర్పించడం నుంచి ఆ పూల అమరిక మరికొంత సూత్రబద్ధతను ఇముడ్చుకుంటూ ఎన్నో ఏళ్లకు ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ అనే రూపం సంతరించుకుంది. పూలను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట. అలా బౌద్ధ చైత్యాల నుంచి ఈ సంస్కృతి బౌద్ధావలంబకుల ఇళ్లలోకి వచ్చింది. ఈ పూల అలంకరణ ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ప్రతీక. ఒక త్రికోణాకారంలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపంగా ఉంటుందీ అమరిక. మనిషి జీవన చక్రం ఇమిడి ఉంటుంది. పై నుంచి కిందకు... ఒకటి విచ్చుకోవాల్సిన మొగ్గ, ఒకటి అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు పూలు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలన్నమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ ధ్యానం వంటిదే. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో గడిపితే ధ్యానం తర్వాత కలిగే ప్రశాంతత కలుగుతుంది. ఇక నాకు ఈ ఆర్ట్ మీద ఆసక్తి ఎలా కలిగింది... అంటే ఈ కళ మా ఇంట్లో నేను పుట్టకముందే విచ్చుకుంది. ఆకట్టుకున్న జపాన్ మా నాన్న పిల్లల డాక్టర్. కెనడాకు వెళ్లే ప్రయాణంలో మధ్యలో నాలుగు రోజులు జపాన్‌లో ఉన్నారు. నాన్నతోపాటు అమ్మ కూడా వెళ్లిందప్పుడు. ఆమెకు స్వతహాగా ఇంటిని పూలతో అలంకరించడం ఇష్టం. ఫ్లవర్‌వాజ్‌లో తాజా పూలను అమర్చేది. జపాన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆమెను బాగా ఆకర్షించింది. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మీనా అనంతనారాయణ్ గారి దగ్గర కోర్సు చేసింది అమ్మ. సిటీలో అనేక పోటీల్లో పాల్గొని ప్రైజ్‌లు తెచ్చుకునేది. ఇదంతా చూస్తూ పెరిగినా కూడా నాకు అప్పట్లో పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ అవగాహన మాత్రం ఉండేది. కాలేజ్ పోటీలప్పుడు ఫ్లవర్‌వేజ్‌లో తాజా పూలను చక్కగా అలంకరించి ప్రైజ్‌లు తెచ్చుకోవడం వరకే ఇంటరెస్ట్. నా కెరీర్ ప్లాన్స్ అన్నీ న్యూట్రిషన్లోనే ఉండేవి. ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ హోమ్‌సైన్స్‌లో న్యూట్రిషన్ చేశాను, యూనివర్సిటీ టాపర్‌ని. పీహెచ్డీ చేసి ప్రపంచంలో అనేక దేశాల్లో పిల్లలు పోషకాహారలోపంతో బాధపడడానికి కారణాలను, నివారించడానికి చర్యల మీద పరిశోధనలు చేయాలనుకున్నాను. అలాంటిది హఠాత్తుగా నాన్న పోవడం, నాకు పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకోవాలని అమ్మ అనుకోవడం... నా న్యూట్రిషన్ కెరీర్ కల కలగానే ఉండిపోయింది. నా పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబంతో గృహిణిగా కొనసాగుతున్న సమయంలో కాలక్షేపం కోసం ఫ్లవర్ అరేంజ్మెంట్ మొదలుపెట్టాను. ఒక్కో డౌట్ అమ్మను అడుగుతూ పూలను అమర్చేదాన్ని. అప్పుడు అమ్మ సూచన మేరకు ఆమె టీచర్ దగ్గరే నేను కూడా ఇకబెనా కోర్సు చేశాను. ఇది ముప్ఫైఐదేళ్ల నాటి సంగతి. ఇందులో ఇంట్రడక్టరీ నుంచి టీచింగ్ వరకు ఉన్న దశలన్నీ పూర్తిచేసి 1995 నుంచి ఇకబెనా టీచింగ్ మొదలు పెట్టాను. ఇన్నేళ్లలో వందలాది మందికి నేర్పించాను. నా స్టూడెంట్స్‌లో చాలామంది టీచర్లయ్యారు. మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు నన్ను చూసి ఓసారి ‘గోల్డ్ మెడలిస్ట్వి. న్యూట్రిషన్ కోసం చాలా సర్వీస్ ఇస్తావని ఊహించాం. ఇలా పూల డెకరేషన్ చేసుకుంటున్నావా’ అని నొచ్చుకున్నారు. మనను నడిపించే ఓ శక్తి మన గమనాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. ఇకబెనా కోసం పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇందులోనే ప్రయోగాలు చేస్తున్నాను. నేను విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయతకు ప్రాతినిధ్యం వహించినట్లే, కాబట్టి మన వస్త్రధారణనే పాటిస్తాను. ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో భారతీయత ప్రతిబింబించేటట్లు మన పసుపు, కుంకుమను థీమ్ ప్రకారం చేరుస్తాను. ఈ ప్రయోగం నాకు గర్వంగా ఉంటోంది కూడా. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ అనే పుస్తకం ద్వారా జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేశాను. అలాగే ‘మిశ్రణం’ పుస్తకంలో మన ఆహారంలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్‌కి– జపాన్ పూల అలంకరణను మమేకం చేశాను. సంస్కృతుల సమ్మేళనంగా నేను చేసిన ఈ ప్రయోగాలే నన్ను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ ఎంపిక చేశాయనుకుంటున్నాను. ఈ పురస్కారాన్ని ఈ నెలలో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ తగా మసాయుకి అందిస్తారు’’ అని తన ఇకబెనా ప్రయాణాన్ని వివరించారు రేఖారెడ్డి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి సమాజ హితం కోసం పాఠాలు ఇంట్లో నేనే చిన్నదాన్ని. అన్న, అక్క ఉన్నత విద్య కోసం హాస్టల్కెళ్లిపోయిన తరవాత నన్ను కూడా హాస్టల్‌కి పంపించడానికి అమ్మానాన్న ఇష్టపడలేదు. అలా ఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజ్‌లో సీటు వదులుకున్నాను. న్యూట్రిషన్లో పీహెచ్డీ సీటు వచ్చినా చేయలేకపోయాను. నేను హాబీగా మొదలు పెట్టిన ఇకబెనా కోసం విస్తృతంగా పని చేస్తున్నాను. మనదేశంలో దాదాపుగా పది రాష్ట్రాల్లో, పద్నాలుగు దేశాల్లో వర్క్‌షాప్‌లు, డెమోలలో పాల్గొన్నాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా నా విద్యార్థుల పరిధి ఖండాలు దాటింది. లిథువేనియా స్టూడెంట్స్‌కి కూడా నేర్పించాను. పిల్లల ఆరోగ్యం కోసం పని చేసే రుగుటె ఫౌండేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కోసం ఇకబెనా పాఠాలు చెప్పాను. రష్యా– ఉక్రెయిన్ వార్ రిలీఫ్ ఫండ్ కోసం కూడా ఇకబెనా పాఠాలు చెప్పాను. ఈ జర్నీ నాకు సంతృప్తిగా ఉంది. – రేఖారెడ్డి, ఇకబెనా ఆర్టిస్ట్ -
పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. అందుకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: పొన్నియన్ సెల్వన్- పార్ట్ 2 ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం) అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం మీరు ఎవరినైనా ఎంపిక చేయాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మణిరత్నం స్పందించారు. ఆ పాత్రకు అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు దర్శకధీరుడు మణిరత్నం. తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయాలనుకున్నట్లు తెలిపారు. 1994, 2011లో ఈ చిత్రం చేయడానికి ప్రయత్నించగా.. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టేకాఫ్ కాలేదని వివరించారు. కాగా పొన్నియన్ సెల్వన్ -1లో ఐశ్వర్రాయ ద్విపాత్రాభినయం చేస్తోంది. నందిని, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి పాత్రల్లో కనిపించనుంది. జూలైలో ఐశ్వర్య పాత్రకు చెందిన నందిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించి యుద్ధ సన్నివేశాలను ఎక్కువ భాగం థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
పుట్టినరోజే వివాహ బంధనం నుంచి రేఖకు విముక్తి
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్‌పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది. ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో.. రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్‌పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది. దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది. ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం -
నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను
కాఫీ విత్ కరణ్.. వెండితెర సెలబ్రిటీలను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసే షో. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ రన్ అవుతోంది. ఎంతోమంది గొప్పగొప్ప సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్న ఈ షోలో ఇద్దరు మాత్రం ఎప్పటికీ రారని బల్ల గుద్ది చెప్తున్నాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను నా షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా అడిగా. తను ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంటే తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయినా తను ససేమీరా నో చెప్పింది కాబట్టి ఇకపై ఎప్పుడూ ఆమెను రమ్మని ఆహ్వానించను. అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని చెప్పను. ఎందుకంటే తనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి బహుశా వీళ్లిద్దరూ నా షోలో కనిపించకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు కరణ్. కాగా 2005లో కాఫీ విత్ కరణ్ తొలిసారిగా టీవీలో ప్రసారమైంది. అయితే ఏడో సీజన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. గత వారం విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా షోలోకి విచ్చేయగా ఈ వారం షాహిద్ కపూర్, కియారా అద్వానీ రానున్నారు. చదవండి: త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే? మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి.. -
వారెవ్వా అనిపించే వైజాగ్ అమ్మాయి రేఖా భోజ్ (ఫోటోలు)
-
నయనతారలా ఉన్నావ్ అన్నారు..
‘కమిట్మెంట్ ఇచ్చినా నువ్వు హీరోయిన్ అయ్యే చాన్సే లేదు. సైడ్ క్యారెక్టర్.. సిస్టర్ క్యారెక్టర్ లాంటివి ట్రై చేస్కో..’ అన్న మాటలు మొదట్లో ఆమెను నిరుత్సాహ పరిచాయి. సినిమా అవకాశాలు అడిగే అమ్మాయిలంటే ఎందుకంత లోకువ? అని తనలో తానే మదనపడింది. కానీ ఆమె లక్ష్యం హీరోయిన్ కావడం. నటనపై తనకున్న ఆసక్తి.. ప్రతిభ.. పట్టుదలతో అవకాశాల కోసం ప్రయత్నించింది. క్రమంగా సినీ అవకాశాలు వచ్చాయి. హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించిన ఆమె.. మన విశాఖ అమ్మాయి.. పేరు రేఖ భోజ్. –సీతమ్మధార(విశాఖ ఉత్తర) నగరంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. ప్రస్తుతం హీరోయిన్గా ఐదు సినిమాలు పూర్తి చేసింది. మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద బ్యానర్లు, హీరోల సినిమాల్లో చెల్లెల పాత్రలు వచ్చినా ఆమెను అంగీకరించలేదు. ఇంకేదైనా ప్రోత్సాహం ఉండే ఫీల్డ్ ఎంచుకోవచ్చు కదా అన్న తల్లిదండ్రులు థియేటర్లో కాలాయ తస్మై నమః సినిమా చూసి ‘గో హెడ్’ అన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ.. రేఖ భోజ్ ముందుకు సాగుతోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభం రాకేష్ రెడ్డి బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్‌ను హీరోగా, రేఖ హీరోయిన్గా ‘లవ్ ఇన్ వైజాగ్’ అనే షార్ట్ ఫిలిం తీశారు. అదే కాంబినేషన్లో ‘డర్టీ పిక్చర్’తెరకెక్కించారు. విశాలమైన కళ్లు.. మంచి భావాలు పలికించడం, నటనలో ప్రతిభను గుర్తించిన రాకేష్ తన వరుస ప్రాజెక్ట్‌ల్లో ఆమెను ప్రోత్సహించాడు. తన దర్శకత్వంలో ‘కాలాయ తస్మై నమః’ సినిమాలో అవకాశం కల్పించాడు. 1980 ప్రాంతపు గ్రామీణ నేపథ్యంతో సాగిన ఈ సినిమాలో పని మనిషి పాత్ర రేఖది. ఆ పాత్రలో ఆమె దుమ్ము దులిపేసింది. దీంతో రాకేష్ తర్వాత ప్రాజెక్ట్ రంగీలా(రంజిత–గీత–లాస్య)లో గీత తనే అయింది. మూడో ప్రాజెక్ట్ ‘దామిని విల్లా’లో డైనమిక్ స్త్రీ వాద జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తోంది. ఇందులో ఆదిత్య ఓం హీరో. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా స్వాతి చినుకు సంధ్య వేళలో, నిర్బంధం సినిమా ఫేం బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించింది. మరో మూడు సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం రేఖ తండ్రి కె.భోజరాజు ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి సూర్య కుమారి గృహిణి. రేఖ భోజ్కు బీ–ఫార్మసీ చదువుతున్న సోదరి ఉంది. హీరో శోభన్‌బాబుకు ఆమె తల్లి వీరాభిమాని. నిత్యం శోభన్ బాబు సినిమాలు తల్లితో పాటు చూసే రేఖకు సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. సహజ నటన, భిన్నమైన పాత్రల పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరీక్షణ సినిమాలో అర్చన పోషించిన పాత్ర అంటే ఆమెకు చాలా ఇష్టం. హీరోల్లో ఫేవరేట్ పవన్ కల్యాణ్, ప్రభాస్, దర్శకుల్లో రాజమౌళి. బిచ్చగత్తె, ట్రాన్స్‌జెండర్, మతి స్థిమితం లేని, దగాపడ్డ మహిళ.. తదితర డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమే అంటోంది రేఖ భోజ్. మరిన్ని అవకాశాల కోసం.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రవేశం ఉన్న రేఖ మంచి పాత్రలతో కూడిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. పెద్ద, చిన్న సినిమాలు ఉండవనీ, సక్సెస్ వైపు మాత్రమే సినిమా పరిశ్రమ చూస్తుందని ఆమె అంటున్నారు. ఈ ఏడాదిలో తనవి మూడు సినిమాలు విడుదల అవుతాయని... ఈ సినిమాల ద్వారా మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలు కొలిక్కి వస్తే ఒకేసారి రెండు, మూడు సినిమాల చిత్రీకరణ ప్రారంభమవుతుందని రేఖ ‘సాక్షి’కి వివరించారు. ఇది కూడా చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ -
రియల్ లెజెండ్స్, రీల్ రొమాంటిక్ కపుల్
సాక్షి, హైదరాబాద్: 67 ఏళ్లు దాటినా అందానికే అందం ఆమె. ఎనభైకి దగ్గర పడుతున్నా ఉరిమే ఉత్సాహానికి.. గాంభీర్యానికి పెట్టింది పేరు ఆయన. ఇద్దరి కిద్దరూ బాలీవుడ్ మెగాస్టార్లే ..వారే ది లెజెండ్స్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అందాల అభినయం రేఖ. సంవత్సరాలు వేరైనా ఇద్దరి పుట్టిన రోజులు ఒకటే నెలలో రావడం, అదీ ఒక రోజు తేడాలో ఉండటం విశేషమే మరి. చీర కడితే ఆ చీరకే వన్నె తెచ్చే అందం రేఖ సొంతమైతే, 79 ఏళ్ల వయసులో టోటల్ బాలీవుడ్లోనే బెటర్ డ్రెస్సర్‌గా నిలిచిన ఘనత బీగ్ బీ సొంతం. రియల్ లెజెండ్స్.. రీల్ లైఫ్ సూపర్ జోడీపై స్పెషల్ స్టోరీ... -
అనూహ్య రేఖ
ఆమె సరళ రేఖ కాదు. వక్రరేఖ కాదు. ఒక అనూహ్య రేఖ. తెలుగు, తమిళం అనే మాతృ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్లో చక్రం తిప్పింది. హీరోలకు ఇన్స్పిరేషన్. హీరోయిన్లకు గ్లామర్ టీచర్. నేడు ఆమెకు 67 నిండి 68 వస్తున్నాయి. రేఖను తాడేపల్లిగూడెం అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి నటి పుష్పవల్లిది అదే ఊరు. పుష్పవల్లి నటిగా ఎదగడం, జెమిని గణేశన్‌తో సహజీవనం చేయడం ఆ రోజుల్లో సంచలనం. జెమిని గణేశన్ వల్ల ఆమెకు రేఖ, మరో కుమార్తె రాధ పుట్టారు. కాని రేఖ జీవితంలో తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. తండ్రి చాలా కాలం రేఖను తన కూతురుగా అంగీకరించలేదు. అప్పటికే ఒక పెళ్లి అయిన జెమినీ గణేశన్ సావిత్రితో పెళ్లి సమయంలో పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు. సావిత్రితో పెళ్లి బహిర్గతం అయ్యాక ఆమెకు దూరం అయ్యాడు. అందువల్ల కావచ్చు బహుశా పబ్లిక్‌గా రేఖను తన కుమార్తె అని ఆయన చెప్పుకోలేదు. రేఖకు ఈ గాయం ఒకటైతే తల్లి ఆ తర్వాత మరో సంబంధంలోకి వెళ్లి ఫలితంగా పుట్టిన మరో ముగ్గురిని పెంచాల్సి రావడంతో రేఖ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. తన జీవితం తాను జీవించాలనుకుంది. తన జీవిత రేఖ తానే గీసుకోవాలనుకుంది. రేఖ అలా పెరిగింది. ఇంతేరా ఈ జీవితం ‘రంగుల రాట్నం’లో భుజంగరాయ శర్మ రాసిన ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ పాట రేఖకు సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రేఖ ‘బేబీ రేఖ’ పేరుతో నటించింది. రంగుల రాట్నంలో పైకి కిందకు ఉత్థాన పతనాలు ఉంటాయి. రేఖ జీవితంలో కూడా ఉన్నాయి. తెలుగులో ‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణంరాజు పక్కన నటించిన రేఖ తన తల్లి సమాజానికి తండ్రి సమాజానికి దూరంగా వెళ్లదలుచుకుంది. ముంబై వెళ్లి 14–15 ఏళ్లకే ‘సావన్ భాదో’ సినిమాలో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయినా రేఖను ఎవరూ లెక్క చేయలేదు. పైగా ‘నల్లబాతు’ అని పిలిచేవారు. ఆమె రంగు, బొద్దుగా ఉండే రూపం నార్త్‌కు పనికి రాదని పత్రికలు రాశాయి. కాని రేఖ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మన రూపాన్ని మనం చెక్కుకోవచ్చు అని మొదటిసారి బాలీవుడ్‌కి తెలియచేసింది రేఖ. ఆ తర్వాత ఆమె రూపం మారింది. ఫ్యాషన్ మారింది. నటన మారింది. రేఖ అంటే ‘ఫ్యాషన్ దివా’ అని పేరు తెచ్చుకుంది. తోడు ఎవరు? రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అమితాబ్‌తో ఆమె తొలిసారిగా ‘దో అంజానే’ లో నటించింది. పెళ్లయిన అమితాబ్ రేఖ ఆకర్షణలో పడ్డాడని ఆ వెంటనే వాళ్లు కలిసి చేసిన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘మొకద్దర్ కా సికిందర్’, ‘సిల్సిలా’... ఇవి రేఖ–అమితాబ్‌ల చిత్రాలు. వీరి ప్రేమ, ఆ సమయంలో జయభాదురి మానసిక సంఘర్షణ యశ్‌చోప్రాను ‘సిల్సిలా’ తీసేలా చేశాయి. నిజ జీవితం లోని పాత్రలు సినిమా తెర మీద నటించడం బహుశా మొదటి చివరి సారిగా ఈ సినిమాలోనే జరిగిందేమో. అయితే ఈ సినిమా అంత విజయం సాధించలేదు. రేఖ తన తోటి నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకుందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ముంబై వ్యాపారి ముఖేశ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. నాలుగు పార్టీల్లో కలిసిన ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని దూకుడుగా అడిగితే రేఖ కూడా అంతే దూకుడుగా ఓకే అనడం ఆ రోజే వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ వెంటనే ఒకరి లోపాలు ఒకరికి తెలిసి ఆ పెళ్లి ప్రమాదంలో పడింది. ముఖేశ్ అగర్వాల్ పెళ్లయిన ఒక సంవత్సరం లోపే రేఖ చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దృష్టి నుంచే చూసింది. గొప్పనటి రేఖ గొప్ప నటి, డాన్సర్. రేప్ విక్టిమ్గా ‘ఘర్’ సినిమాలో నటించి ఆమె తన సీరియస్ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్ అలీ దర్శకత్వంలో ‘ఉమ్రావ్‌జాన్’లో నటించి రేఖ విమర్శకులను అప్రతిభులను చేసింది. ఒక తవాయిఫ్ జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్ ‘కలియుగ్’, గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ ఆమెను పార్లల్ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు ‘ఫూల్ బనే అంగారే’, ‘ఖూన్ భరీ మాంగ్’ ఆమెను యాక్షన్ హీరోయిన్ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది. జుట్టు తెల్లబడని నటి రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘ఆజ్ కల్ పావ్ జమీపర్ నహి పడ్తే హై మేరే’, ‘తేరే బినా జియా జాయేనా’, ‘సున్ సున్ దీదీ తేరే లియే ఏక్ రిష్టా ఆయాహై’, ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే రాజ్ హై’, ‘పర్ దేశియా ఏ సచ్ హై పియా’... ఎన్నో హిట్ సాంగ్స్ రేఖకు. ఆమెకు 68 వచ్చేశాయంటే నమ్మడం కష్టం. కాని వయసును జయించిన భాగ్యం ఈ భానురేఖదే కదా. రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. -
బిగ్‌బుల్‌ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దిల్‌ఖుష్‌గా తన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ’ మంగళవారం ట్విటర్లో ఆయన ఓ ఫొటో పోస్ట్ చేశారు. సింప్లిసిటీకి, స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేరాఫ్ అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించే ఇదంతా. దేశ ప్రధాని మోదీ, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను మంగళవారం కలిశారు. భారత ఆర్థిక వ్యవస్థలో అగ్రపథాన దూసుకుపోతున్న ఈయన్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు మోదీ. రాకేష్‌తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా సైతం ఆ ఫొటోలో ఉండడం విశేషం. నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా ఝున్‌ఝున్‌వాలా కనిపించిన ఫొటో ఒకటి, మరో ఫొటోలో ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా మోదీ చేతులు కట్టుకుని ఉన్న ఫొటో ట్విటర్లో షేర్ అయ్యి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. Delighted to meet the one and only Rakesh Jhunjhunwala...lively, insightful and very bullish on India. pic.twitter.com/7XIINcT2Re — Narendra Modi (@narendramodi) October 5, 2021 Look who is standing …Power of stock-market! #RakeshJhunjhunwala 🔥 pic.twitter.com/kGsiDGnpOY — Mr. Singh (@MrSingh20201) October 5, 2021 ఇక లాభాల కోసం ఎక్కడో అమెరికా కంటే సొంత దేశంలో(భారత్) పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లకు ఝున్‌ఝున్‌వాలా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయన్ని అభినందించినట్లు సమాచారం. పనిలో పనిగా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘‘ఇంట్లో తిండి దొరుకుతుంటే బయట తినడం ఎందుకు? భారత్‌ను నమ్మండి. పెట్టుబడులు పెట్టండి’’ అంటూ ఝున్‌ఝున్‌వాలా జూన్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఇండియా రిచ్ జాబితాలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 22,300 కోట్ల రూపాయలుగా ఉంది. పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
పాక్ ప్రధాని ప్రేమ కహానీ: ఆ హీరోయిన్స్‌తో ఇమ్రాన్ లవ్ ఎఫైర్, పెళ్లి వరకు వచ్చి..
Pakistan PM Imran Khan Love Story: సినిమా, క్రికెట్.. ఈ దేశంలో వినోదాన్ని పంచే రంగాలు. వదంతులుగానో.. వర్చువల్‌గానో.. వాస్తవంగానో.. వీరాభిమానుల భ్రాంతిగానో.. ఈ రెండు రంగాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ కథలు వినిపిస్తే.. వాళ్లు జంటగా కనిపిస్తే.. అంతకు మించిన సినిమా.. ఉత్కంఠ గొలిపే మ్యాచ్ ఏం ఉంటుంది? అలాంటి ఊసులు.. బాసలు.. కబుర్లను మోసుకొస్తోంది ఈ మొహబ్బతే! వీటిల్లో విషాదాంతాలుండొచ్చు.. హ్యాపీ ఎండింగ్లూ కనిపించొచ్చు! ఆ వరుసలో ఈ వారం శీర్షిక ముఖ్య భూమికలు బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ట్ జీనత్ అమన్.. పాకిస్తానీ ఏస్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. ఇంకా.. చదవండి ఇది 1970,80ల ముచ్చట.. ఇటు బాలీవుడ్లో జీనత్.. అటు పాకిస్తాన్ క్రికెట్లో ఇమ్రాన్ హవా నడుస్తున్న కాలం. ఏదో మ్యాచ్ ఆడడానికి ఇమ్రాన్ ఖాన్ అండ్ టీమ్ ఇండియా వచ్చింది. మ్యాచ్ అయిపోయింది. సరదాగా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి కొందరు ప్రముఖులు.. సెలబ్రిటీలూ హాజరయ్యారు. వాళ్లలో జీనత్ అమన్ కూడా ఉంది. ఆ అందాన్ని చూసి అప్రతిభుడయ్యాడు ఇమ్రాన్. తెర మీద కన్నా అద్భుతంగా కనిపించింది. ఇమ్రాన్ హ్యాండ్సమ్నెస్కూ అంతే ఫిదా అయిపోయింది జీనత్. అతని కళ్లలోని సమ్మోహనం ఇంటికి వెళ్లినా ఆమెను వెంటాడింది. ఆమె నవ్వులోని స్వచ్ఛత అతన్నీ నిద్రపోనివ్వలేదు. స్నేహం పెంచుకున్నారు. ఇద్దరి షెడ్యూల్స్ ఏ మాత్రం మ్యాచ్ అయినా విదేశాలే వాళ్ల హ్యాంగవుట్ విలాసాలు. పత్రికల్లో ఆ ఫొటోలు.. అనుగుణంగా అల్లిన వార్తలు హల్చల్ చేశాయి. ఇద్దరి అభిమానులనూ ఎంతలా అలరింపచేశాయంటే ఆ ఇద్దరి ప్రణయంతో ఇండియా, పాకిస్తాన్ దగ్గరైపోయినట్టు.. వాళ్లు పరిణయమాడితే ఆ రెండు దేశాలూ కలసిపోతాయన్నట్టూ కలలు కనేంతగా. కానీ హఠాత్తుగా జీనత్ అమన్ మజహర్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్ జీవితంలోకీ ఇంకో స్త్రీ వచ్చింది. ఈ బ్రేకప్ గురించి ఎక్కడా ఏ వార్తా లేదు. ఆ ఇద్దరూ కూడా పెదవి విప్పలేదు. ఆ మాటకొస్తే ప్రేమలో పడ్డ విషయాన్నే అంగీకరించలేదు. కానీ.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఓ పుస్తకంలో ఇమ్రాన్, జీనత్ అనుబంధం గురించి రాసింది. అంటే అతని జీవితంలో జీనత్ ఉనికిని స్పష్టం చేసిందన్నమాట. అదీగాక.. కొన్నేళ్ల కిందట ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జీనత్ లాహోర్ (పాకిస్తాన్)కు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఒక జర్నలిస్ట్ అడిగాడు ఇమ్రాన్‌తో ఆమెకున్న అనుబంధం గురించి! దానికి ఆమె ‘మేం పెద్దవాళ్లమైపోయాం. మా పిల్లలు పెరిగారు. పాత సంగతులను చర్చకు పెట్టడం ఇప్పుడు అవసరమా? గతాన్ని గతంలాగే ఉండనివ్వండి’ అందట. ఈ మధ్య జీనత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడట నాటి క్రికెటర్.. నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన బాలీవుడ్ మేటి నటి రేఖతో కూడా ప్రేమలో పడ్డాడని నిజం లాంటి వదంతి ప్రచారంలో ఉంది. దీనికీ నాటి సినిమా పత్రికలే సాక్ష్యం. ఆ కహానీ ఏంటంటే.. రేఖ అంటే ఇమ్రాన్ పంచప్రాణాలు పెట్టేవాడట. మ్యాచ్‌ల కోసం అతనెప్పుడు ఇండియా వచ్చినా పార్టీల్లో.. సన్నిహితుల గెట్ టుగెదర్ అకేషన్స్‌లో ఆ జంట ఫొటోలు నాటి మీడియాలో ప్రధానాకర్షణగా నిలిచేవి. వాళ్ల ప్రేమ వ్యవహారం కథనాలుగా సాగేది. ఒక పత్రికలో ప్రచురితమైన వ్యాసం ప్రకారం.. రేఖ వాళ్లమ్మ కూడా ఆ ప్రేమకు సమ్మతం తెలిపిందట. అంతేకాదు ఓ జ్యోతిష్యుడిని కలసి వాళ్ల జాతకాలూ చూపించిందట ఆ ఇద్దరి వైవాహిక బంధం ఎలా ఉండనుందని! రేఖతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి చాలా ఆసక్తి చూపేవాడట ఇమ్రాన్. ఆ జంట తరచుగా బీచ్‌లో, నైట్ క్లబ్లో కనిపించేదట. ‘వాళ్లిద్దరూ ఒకర్నొకరు చాలా ఇష్టపడ్డారు’ అని ఆ ఇద్దరి సన్నిహితుల మాట కూడా. ఒకానొక సమయంలో ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలూ వచ్చాయట. దానిమీదే స్పందిస్తూ కావచ్చు ‘ఆ నటి సాంగత్యాన్ని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ రిలేషన్‌ను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు’ అని ఇమ్రాన్ చెప్పిన మాటకూ ఆ వ్యాసం చోటిచ్చింది. అలా ఆయన జీవితంలో రేఖ అధ్యాయమూ ముగిసింది. షబానా ఆజ్మీ, మున్మున్ సేన్లతోనూ ఇమ్రాన్ ప్రేమ ప్రయాణం సాగిందని రూమర్స్. - ఎస్సార్ -
ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ
సినీ పరిశ్రమలో ప్రేమించడం, విడిపోవడం సర్వసాధారణం అన్నట్లు కనిపిస్తాయి. ఇక ఎవరైనా హీరో-హీరోయిన్ కాస్త సన్నిహితంగా ఉంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ధోరణే ఎప్పటి నుంచో ఉంది. 1970 దశకంలో ఇలాంటి లవ్‌ట్రాక్ వార్తలు ఎక్కువగా అప్పటి హీరోయిన్ రేఖ గురించి వచ్చేవి. అందం, అభినయంతో ఉత్తమ నటిగా ఎందరో అభిమానాన్ని, ఎన్నో అవార్డులను దక్కించుకున్న రేఖ గురించి.. మీడియాలో మాత్రం ఎక్కువగా వచ్చే వార్తలు ఆమె లవ్ ట్రాక్‌కు సంబంధించినవే. రేఖ-వినోద్ మెహ్రాల లవ్ ట్రాక్ కూడా ఇలానే వార్తల్లో నిలిచింది. వినోద్ మెహ్రా, రేఖతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు. ముఖ్యంగా వినోద్ మెహ్రా తల్లి వీరిద్దరి బంధాన్ని గట్టిగా వ్యతిరేకంచేవారు. రేఖ పట్ల ఆమె వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదో తెలిపే సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి అప్పట్లో మీడియాలో వచ్చింది. ఆ క్లిప్పింగ్‌లోని వివరాలు.. (చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్) పీకల్లోతు ప్రేమలో మునగిపోయిన రేఖ-వినోద్మెహ్రాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. అనంతరం వినోద్ మెహ్రా.. రేఖను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. ఈ వార్త విని వినోద్ తల్లి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రేఖ మీదకు ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే.. తన చెప్పు తీసుకుని రేఖను కొట్టడానికి వెళ్లారు. తల్లిని శాంతిపజేసేందుకు వినోద్ మెహ్రా ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె ఆగ్రహం చల్లారలేదు. రేఖను తీవ్రంగా అవమానించారు. వీటిని తట్టుకోలేకపోయిన రేఖ కన్నీరుపెట్టుకుంటూ వినోద్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. (చదవండి: వైరల్: పాక్ పీఎం, బాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరి) ఇంతటి అవమానం జరిగిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు రేఖ-వినోద్ మ్రెహా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. అనంతరం 1988లో వినోద్ మెహ్రా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీని గురించి 1973లో రేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘వినోద్ మెహ్రా తల్లి దృష్టిలో నేను కేవలం ఓ నటిని మాత్రమే కాదు.. ఎన్నో అపవాదులు ముటగట్టుకున్న ఓ మహిళను. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిగిన మహిళను వినోద్ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు’’ అని చెప్పుకొచ్చారు రేఖ. ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు. చదవండి: అమితాబ్-రేఖల లవ్ ట్రాక్: జయా బచ్చన్ ఏమన్నారంటే -
పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు!
అమెజాన్‌తో వ్యాపారం చేసి జెఫ్ బేజోస్ ప్రపంచలోనే కుబేరుడయ్యాడు, రిలయన్స్‌తో ముఖేశ్ అంబానీ ఆసియాలోనే ధనవంతుడయ్యాడు. అయితే వీరిలా ఏ కంపెనీ స్థాపించలేదు, ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురాలేదు. కానీ మార్కెట్‌తోనే ఆడుకున్నాడు. లాభాలు తెచ్చే కంపెనీల వాటాలను వేటాడాడు... వేల కోట్ల రూపాయలకు కూడబెట్టాడు. అతనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ఈ రోజు రాకేశ్ 61వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం. వెబ్‌డెస్క్: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ మార్కెట్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కర్లేని పేరు. సొంత కంపెనీ అంటూ లేకుండా కేవలం వాటాదారుడిగా ఉంటూ వేల కోట్ల రూపాయలు సంపద పోగేసిన ఘనాపాఠీ. అది కూడా కేవలం 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అంటే ఏడాదికి సుమారు 9,00 కోట్లకు పైగానే ఆర్జించాడు. అయితే ఆ ఆర్జన వెనుక అతని శ్రమ ఉంది. మేథస్సు ఉంది. భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు ఉంది. అవన్ని కలిపితేనే వేల కోట్ల ఆస్తులు. పుట్టింది హైదరాబాద్‌లోనే ఇండియన్ బిగ బుల్ , వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా జన్మించింది మన హైదరాబాద్‌లోనే. అయితే తండ్రి ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో ఆ కుటుంబం ముంబైకి వెళ్లిపోయింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఆయన చిన్నప్పటి నుంచి లెక్కలు ఒంటబట్టిచ్చుకున్నాడు. అందుకే చదువు పూర్తి కాకుండానే డిగ్రీలో ఉండగానే స్టాక్‌మార్కెట్‌పై కన్నేశాడు. 1986లో.. ఇప్పుడంటే బీఎస్ఈ సెన్సెక్స్ 50 వేల పాయింట్లు దాటింది. ఆరోజుల్లో అంటే 1985లో 150 పాయింట్ల దగ్గరే ఉండేది. అప్పటికి దేశంలో లైసెన్స్‌రాజ్ నడుస్తుండేది. ఏ పని చేయాలన్నా రెడ్ టేపిజం అడ్డొచ్చేది. అయినా సరే ఆ రోజుల్లోనే స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కి ఇండియాలో ఉన్న భవిష్యత్తును ఝున్‌ఝున్‌వాలా అంచనా వేయగలిగాడు. ఐదు వేల పెట్టుబడితో తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లోకి ఎంటరయ్యాడు. ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాడు. అయితే మార్కెట్‌పై ఒక అంచనా వచ్చింది. ఏ కంపెనీ షేర్లు ఎలా వర్కటవుతాయో తెలిసింది. ఈసారి గురి చూసి టాటా టీ షేర్లు ఒక్కొక్కటి రూ. 43 వంతున 5,000 షేర్లు 1986లో కొనేశాడు. మూడు నెలలు తిరిగే సరికి షేర్ వాల్యు అమాంతం రూ. 143కి పెరిగింది. అంటే మూడు నెలల్లలో ఐదు లక్షల రూపాయల లాభం. ఇక అక్కడి నుంచి రాకేశ్ స్టాక్‌మార్కెట్ బుల్గా మారాడు. 1986 నుంచి 89 మధ్య ఏకంగా రూ. 25 లక్షలు సంపాదించాడు. హర్షద్ మెహతా షాక్‌తో ఆర్థిక సంస్కరణలు అమలవుతున్న కాలంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి హర్షద్ మెహతా రూపంలో భారీ షాక్ తగిలింది. హర్షద్ మెహెతా ఎఫెక్ట్‌ని షేర్ మార్కెట్‌పై వెంటనే అంచనా వేసిన రాకేశ్ తన దగ్గరున్న షేర్లు సకాలంలో అమ్మి నష్టాలు తప్పించుకోగా... ఈ పరిణామం ముందుగా అంచనా వేయలేకపోయిన వారి సంపద ఆవిరైపోయింది. ఎంతో నేర్పుతో హర్షద్ ఎఫెక్ట్ నుంచి రాకేశ్ తప్పించుకోగలిగాడు. టైటాన్దే! రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపదనలో అత్యధికం వాచీలు, వజ్రాలు తయారు చేసే టైటాన్ కంపెనీ నుంచే వచ్చింది. రాకేశ్ ఝున్‌ఝున్ వాటా సంపాదనలో ఒక్క టైటాన్ వాటాయే రూ.7,879 కోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో టాటా మోటార్స్ రూ. 1,474, క్రిసిల్ రూ. 1,063 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికీ రాకేశ్ పోర్ట్‌పోలియోలో మొత్తం 37 కంపెనీలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవిగా లుపిన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నజరా టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్, డీబీ రియల్టీ, టాటా టెలి కమ్యూనికేషన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. రారే తోడుగా బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1987 నాటికి రాకేశ్ రాధేశ్యామ్ ఝున్‌ఝున్ వాలా నిలదొక్కకున్నాడు. ముంబైలో అంధేరీకి చెందిన మరో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రేఖాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా రారే పేరుతో 2003లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే 2016 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై రాకేశ్‌ను సెబీ ప్రశ్నించింది. మరోసారి 2020 జనవరిలో జరిగిన ట్రేడింగ్‌పైనా సెబీ విచారణ చేపట్టింది. సినిమాల్లోనూ.. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చిన రాకేశ్ హంగామా డిజిటల్ మీడియా సంస్థను స్థాపించారు. ఇంగ్లీష్ వింగ్లీ్ష్, షమితాబ్ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. రాకేశ్ ఝున్‌ఝున్ వాలాపై సీక్రెట్ జర్నీ ఆఫ్ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా అనే పుస్తకం వచ్చింది. అతని అభిమానులు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలచుకుంటారు. ఫ్యూచర్ ఉంది కోవిడ్ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ రంగంపై కోవిడ్ ప్రభావం పెద్దగా ఉండబోదనేది రాకేశ్ అభిప్రాయం. పెద్ద విపత్తులను తట్టుకునేలా ఇండియన్ ఎకానమీ ఉందనేది రాకేశ్ నమ్మకం. -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి. బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్‌తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
ఆమెకు సముద్రమే అన్నం ముద్ద
భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్డౌన్ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె. కేరళ త్రిచూర్ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్ బాస్కెట్‌ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్ షెల్స్). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ. సముద్రంలో రేఖ తొలి డీప్ ఫిషింగ్ లైసెన్స్ హోల్డర్ డీప్ ఫిషింగ్ లైసెన్స్‌ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్‌ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్ ఫిషింగ్ లైసెన్స్ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్ పడేవాడు. సముద్రంలో చేపల వేటలో... చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ. కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్‌వాటర్స్‌లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ. కుటుంబ సభ్యులతో... ‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ. సెకండ్ వేవ్ సవాలు రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్‌తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్‌కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్‌పోన్ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్డౌన్ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్ షెల్స్‌ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె. కొత్త సముద్రం ‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్ ఇచ్చారు. పోస్ట్‌పోన్ అయ్యింది కరోనా వల్ల’ అందామె. చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
మతాలు వేరైనా.. మమతలు ఒక్కటే
చివరి ఘడియల్లో చాలాచోట్ల ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందే అయినవారు అవుతున్నారు. ఆఖరి చూపులూ వారివే అవుతున్నాయి. పాలక్కాడ్ లోని ఒక ఆసుపత్రిలో తాజాగా ఒక ముస్లిం మహిళ చివరి క్షణాలలో ఆ ఆసుపత్రి డాక్టర్.. రేఖ మాత్రమే ఆమె చెంతన ఉన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆ మహిళ చెవిలో ‘షహాద’ కూడా వినిపించారు! హిందూ మహిళ అయివుండీ షహాద చెప్పిన డాక్టర్ రేఖ ‘సంస్కారానికి’ ముస్లిం సమాజం అంతా హర్షిస్తోంది. డాక్టర్ రేఖాకృష్ణకు తనిక చేయగలిగిందేమీ లేదని అర్థమైంది! ఐసీయులో ఉన్న ఒక కోవిడ్ పేషెంట్ చివరి ఉఛ్వాస నిశ్వాసాలను ఆ క్షణంలో ఆమె చూస్తూ ఉన్నారు. పాలక్కాడ్‌లోని పఠంబి లో ‘సేవన హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్’లో ఆమె వైద్యురాలు. మే 17 ఆ రోజు. డాక్టర్ రేఖ కళ్లెదుట మరణశయ్యపై ఉన్నది ఒక ముస్లిం మహిళ. అప్పటికి కొద్దిసేపటికి క్రితమే వెంటిలేటర్‌ను తొలగించారు. కుటుంబ సభ్యులకు కబురు కూడా వెళ్లింది. పోయే ప్రాణం ఎందుకోసమో ఆగి ఉన్నట్లుగా అనిపించింది డాక్టర్ రేఖకు ఆమెను సమీపాన్నుంచి చూస్తున్నప్పుడు! ఆమె మనసులో ఏదో స్ఫురించింది. వెంటనే ఆ పేషెంట్ చెవిలో మెల్లిగా.. ‘లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్..’ అని ‘షహాద’ పఠించారు. అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మదు అతడిచే అవతరించబడిన ప్రవక్త’ అనే విశ్వాస వచనమే షహాద. సంప్రదాయం ప్రకారం ఆ మతస్తులు చేయవలసిన ప్రార్థన షహాద. కుటుంబ సభ్యులు వచ్చేలోపు డాక్టర్ రేఖ తనే ఆ ప్రార్థన వచనాలను ఆఖరి మాటలుగా ఆ మహిళకు వినిపించారు. అప్పటికి రెండు వారాలుగా కోవిడ్ న్యుమోనియాతో చికిత్స పొందుతున్నారు ఆవిడ. అన్నీ రోజులూ ఆమె తరఫువాళ్లు ఆమెను చూడ్డానికి వీల్లేకపోయింది. ఆఖరికి.. చివరి చూపును కూడా! వారికి ఆ లోటు తెలియకుండా, పేషెంట్ మనసును గ్రహించినట్లుగా డాక్టర్ రేఖ ఒక ముస్లింలా ఆ ప్రార్థన వచనాలను పలికారు. ∙∙ హిందూ మహిళ అయుండీ షహాదను పఠించినందుకు ముస్లిములంతా డాక్టర్ రేఖపై దీవెన లు కురిపిస్తున్నారు. ‘‘ముందుగా అనుకున్నదేమీ కాదు. నాకెందుకో అలా చేయాలని అనిపించింది. బహుశా నేను దుబాయ్‌లో కొన్నాళ్లు పని చేసి వచ్చినందువల్ల, అక్కడి వారితో కలిసిమెలిసి ఉన్నందు వల్ల, వాళ్లు నా పట్ల చూపిన గౌరవ మర్యాదలకు కృతజ్ఞతగా నేనిలా చేసి ఉంటాను’’ అంటున్నారు డాక్టర్ రేఖ. ఆమెకు అరబిక్ వచ్చు. ‘‘అందుకే ఉచ్చారణ దోషాలు లేకుండా షహాద ను జపించగలిగాను’’ అంటారు. అయితే ఈ విషయం బయటికి రావడంలో డాక్టర్ రేఖ ప్రమేయం ఏమాత్రం లేదు. సాటి వైద్యుడి ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ముస్లిం ప్రొఫెసర్ ఒకరు ఫేస్బుక్లో డాక్టర్ రేఖ చొరవ ను కొనియాడుతూ పెట్టిన పోస్ట్ చదివిన వారు అభినందనలు తెలియజేస్తుంటే ఆమె స్పందించవలసి వచ్చింది. అబ్దుల్ హమీద్ ఫైజీ అంబలక్కడవు అనే సున్నీ స్కాలర్ అయితే డాక్టర్ రేఖ చేసిన పని పట్ల అమితమైన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మతం పేరుతో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్న తరుణంలో పర మత సహనానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు’’అని అభివాదాలు తెలియజేశారు. ఇటీవలే మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఇలాంటి ‘సంస్కారవంతమైన’ ఘటనే జరిగింది. అయితే ఆ ఘటనలో.. ఆయేషా అనే ముస్లిం మహిళ.. అయినవారెవరూ దగ్గర లేకపోవడంతో ఒక హిందూ పురుషుడికి మత సంప్రదాయాల ప్రకారం తనే అంత్యక్రియలు జరిపించి అందరి మన్ననలు పొందారు. ‘‘దీన్నొక మత విషయంగా నేను చూడలేదు.. మనిషికి మనిషి సాయం అన్నట్లుగానే భావించాను’’ – డాక్టర్ రేఖాకృష్ణ -
వైరల్: పాక్ పీఎం, బాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరి
పాత తరం హీరో హీరోయిన్ల ప్రేమ కథలు అనగానే టక్కున గుర్తుకు వచ్చే జంట అమితాబ్ బచ్చన్-రేఖ. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్‌ని ప్రేమించారు రేఖ. కానీ జయా బచ్చన్ కఠినంగా వ్యహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ రేఖ జీవితంలో మరో లవ్ స్టోరీ కూడా ఉందట. అది కూడా మన దాయాది దేశ క్రికెటర్‌తో. ప్రస్తుతం వీరి లవ్‌స్టోరికి సంబంధించిన ఓ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఎవరా క్రికెటర్ అని ఆలోచిస్తున్నారా.. మరేవరో కాదు.. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అవును రేఖ, ఇమ్రాన్లు ప్రేమించుకున్నారని.. వారి బంధం పెళ్లి వరకు వెళ్లిందనేది ఆ క్లిప్పింగ్ సారాంశం. క్రికెట్లో ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ సారథ్యంలో 1992లో పాక్ జట్టు వరల్డ్ కప్ కూడా గెలుచుకుంది. ఇక అప్పట్లో ఇమ్రాన్‌కు లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. వీరిలో మన దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు. గతంలో ఇరు దేశాల మధ్య తరచుగా ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లు జరిగేవి. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్ల్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఇమ్రాన్‌కు పలువురు బాలీవుడ్ అందాల హీరోయిన్లతో పరిచయం ఏర్పడింది. అలా ఇమ్రాన్‌కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్లలో రేఖ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి పరిచయం కాస్త ముందుకు వెళ్లింది. రేఖతో రిలేషన్ కారణంగా ఇమ్రాన్ అడపదడపా ఇండియా వచ్చేవారు. వీరిద్దరి విషయం రేఖ తల్లికి కూడా తెలుసు. ఆమె కూడా వీరి రిలేషన్ పట్ల చాలా సంతోషించారని పేపర్ క్లిప్పింగ్ పేర్కొంది. ఒకానొక సమయంలో వీరిద్దరు వివాహం చేసకోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ క్రమంలో ఇమ్రాన్ ఓ నెల రోజుల పాటు ముంబైలోనే ఉన్నాడని క్లిప్పింగ్ కోట్ చేసింది. ఇమ్రాన్-రేఖలు బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారని.. ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవారని.. చూసేవారికి లవర్స్‌గా కనిపించేవారని పేపర్ క్లిప్పింగ్‌లో ఉంది. అయితే కారణాలు తెలియదు కానీ ఆ తర్వాత విడిపోయారని రాసుకొచ్చింది. ఇక ఇమ్రాన్ రేఖతోనే కాక.. షబానా ఆజ్మి, జీనత్ అమాన్లతో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించడని క్లిప్పంగ్ కోట్ చేసింది. ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు వీరిద్దరికి వివాహం జరిగి ఉంటే.. ఇండియా-పాక్ మధ్య చాలా సమస్యలకు పరిష్కారం దొరికేదేమో అని కామెంట్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్లోనే సినిమా హీరోయిన్లతో తన డేటింట్ గురించి ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్లతో కొద్ది రోజుల పాటు తిరగడం బాగానే ఉంటుంది. కానీ నా జీవితంలో సినిమా తారను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదని అనడం విశేషం. View this post on Instagram A post shared by Sanam Maher (@topbastard) చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే.. -
అమితాబ్-రేఖల లవ్ ట్రాక్: జయా బచ్చన్ ఏమన్నారంటే
బాలీవుడ్లో హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ఎఫైర్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అమితాబ్ బచ్చన్-రేఖ. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది వీరి ప్రేమ కథ. ‘దో అన్జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. కానీ అప్పటికే రేఖ అమితాబ్ కంటే సీనియర్. అంతకు ముందు వరకు రేఖకు, అమితాబ్ బచ్చన్ అంటే దీదీబాయి (జయా బచ్చన్) భర్తగానే తెలుసు. ‘దో అన్జానే’సెట్స్ మీదే అమితాబ్ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చింది. దాంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమాల సంఖ్య పెరిగింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటపడింది అంటే 1978లో ‘గంగా కీ సౌగంద్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించసాగాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు. ఇదంతా గమనిస్తున్న అమితాబ్ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్ రియాక్షన్‌కి అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మేడం పట్ల సార్‌కు ఈ స్పెషల్ కేర్ ఏంటి అని గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఈ వార్తలు కాస్త జయా బచ్చన్ చెవిన పడ్డాయి. ‘సిల్సిలా’ సినిమా విడుదల వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత రేఖ-అమితాబ్‌ల మధ్య ఉన్న బంధం బలహీనపడుతూ వచ్చింది. గతంలో పీపుల్ మ్యాగ్జైన్కిచ్చిన ఇంటర్వ్యూలో జయా బచ్చన్.. అమితాబ్-రేఖల లవ్ ఎఫైర్‌పై స్పందించారు. ఇన్ని పుకార్ల మధ్య ఎలా తన వివాహ బంధాన్ని నిలబెట్టుకున్నారో వెల్లడించారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘వీటి గురించి తెలిసినప్పుడు నేను బిగ్ బీని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు. ఆయనను ఒంటరిగా వదిలేసేదాన్ని. ఆలోచించుకునే అవకాశం ఇచ్చేదాన్ని. ఇక మా వివాహబంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఎంతో మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నాను. బంధాలకు విలువిచ్చే ఇంటికి కోడలిగా వెళ్లాను’’ అన్నారు. ‘‘ఇక సినిమా ఇండస్ట్రీలాంటి రంగుల ప్రపంచంలో అన్ని సవ్యంగా సాగవు. నాకే సొంతం.. అంటూ కట్టుబాట్లు విధించడం కూడా క్షేమం కాదు. ఇక్కడ మీరు ఆర్టిస్టిలను పిచ్చివాళ్లు చేయవచ్చు.. లేదా వారి ఎదుగుదలకు సాయం చేయవచ్చు. ఎవరిని బలవంతంగా కట్టి పడేయలేం’’ అన్నారు. బిగ్ బీ ఎఫైర్స్కు సంబంధించిన వార్తలు విన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటనే ప్రశ్నకు జయా బచ్చన్ బదులిస్తూ.. ‘‘నేను మనిషినే.. తప్పక స్పందించాలి. చెడు వార్తలు, మంచి వార్తలు అన్నింటిపై స్పందించాలి. మన మాట, స్పందన, చూపు ద్వారా తనకు నమ్మకం కలిగించాలి. ఇక బిగ్ బీతో నటించిన ప్రతి హీరోయిన్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు మీడియా రాసుకొచ్చేది. వాటన్నింటిని మనసులోకి తీసుకుంటే నా జీవితం నరకం అయ్యేది. ఏళ్లు గడుస్తున్న కొద్ది మా బంధం మరింత బలపడింది’’ అంటూ చెప్పుకొచ్చారు జయా బచ్చన్. చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
ఆ దర్శకుడి గరించి ఆసక్తికర విషయం చెప్పిన రేఖ
ఇండియన్ ఐడెల్ సీజన్ 12లో మొన్నటి శని, ఆదివారాల ఎపిసోడ్లను ప్రముఖ నటి రేఖ పేరిట డెడికేట్ చేశారు. ఈ షో అతిథిగా పాల్గొన్నా ఆమె తన పాటలు కంటెస్టెంట్లు పాడుతూ ఉంటే ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ సినిమా, పాటల చిత్రీకరణ సమయంలోని అనుభవనాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఒక కంటెస్టెంట్ ‘ఉమ్రావ్ జాన్’లోని ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాడుతూ ఉంటే ఆ పాట వెనుక కథ ఇలా వివరించారు. ‘పాటల్లో అభినయం తాను ప్రత్యేకంగా నేర్చుకోలేదని... లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడేది వింటే ఎక్స్ప్రెషన్స్ వాటికవి వచ్చేస్తాయి’ అని ఆమె అన్నారు. గట్టి చలికాలంలో లక్నోలో ‘ఉమ్రాన్ జాన్’ చేస్తున్నప్పుడు ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాట చిత్రీకరణకు గ్లిజరిన్ కంట్లో పెట్టుకుంటే అది గడ్డ కట్టిందా అనిపించిందని ఆమె అన్నారు. షాట్ ప్రకారం చెమర్చిన కళ్లతో పాడాల్సి ఉన్నా చలి వల్ల గ్లిజరిన్ పని చేయక కన్నీరు రాలేదని, కాని ఒక్కసారి నగారాలో పాట మొదలయ్యాక ఆశాభోంస్లే పాటకు హృదయం ద్రవించి కన్నీరు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.‘ఆయన కాస్ట్యూమ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టేవాడు కాదు. ‘ఖూబ్సూరత్’లో నేను నటించేటప్పుడు అది గమనించి ఇంటి దగ్గరి నుంచి మంచి మంచి డ్రస్సులు వేసుకొని వచ్చేదాన్ని. వాటిని ఆయన చూసి ఇవే బాగున్నాయి... వీటిలోనే నటించు అనేవాడు’ అని ఆమె గుర్తు చేసుకుంది. రేఖకు ఇప్పుడు 67 సంవత్సరాలు. కాని రెండు ఎపిసోడ్లలో ఆమె అద్భుతంగా డాన్సు చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. డోలక్ వాయిస్తున్నట్టు అభినయించింది. రేఖా ఎప్పటికీ రేఖానే అనిపించింది. -
సీనియర్ నటి వీడియో చూసి శివగామి కంటతడి!
శివగామి రమ్యకృష్ణ ఎమోషనల్ అయింది. కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ ఆమెను అంతలా ఏడిపించిన సంఘటన ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి.. అలనాటి అందాల తార రేఖ 'ఇండియన్ ఐడల్ 12' అనే మ్యూజిక్ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఆమె తన నాట్య ప్రతిభతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వీకెండ్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ను టీవీలో వీక్షించిన రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనైంది. సీనియర్ నటి రేఖ డ్యాన్స్ చూస్తూ టీవీకి అతుక్కుపోయిన శివగామి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మై గాడ్ మై గాడ్.. నా దేవత రేఖ గారూ.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 'ఆమెను చూసి మీరు కన్నీరుపెట్టుకుంటే మిమ్మల్ని చూసి మేము ఉద్వేగానికి లోనవుతున్నాం' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన క్వీన్ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ శక్తి శేషాద్రిలా కనిపించిన విషయం తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిందీ వెబ్ సిరీస్. సెకండ్ సీజన్‌కు స్క్రిప్ట్ రెడీ అయిందని, త్వరలోనే షూటింగ్ జరగనుందని ఇటీవల రమ్యకృష్ణ తెలిపింది. చదవండి: రిపబ్లిక్: స్పెషల్ లుక్‌లో రమ్యకృష్ణ, సాయి ధరమ్ తేజ్ రష్మిక ఫస్ట్ ఆడిషన్: వీడియో రిలీజ్ చేసిన మాజీ ప్రియుడు -
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’
-
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్
బాలీవుడ్ అందాల నటి రేఖకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికి వయసు పెరుగుతుంటే.. రేఖ విషయంలో మాత్రం అది యుక్త వయసులోనే ఆగిపోయింది. తన అందంతో ఎందరినో పిచ్చి వాళ్లని చేసిన రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక రేఖ-అమితాబ్ బచ్చన్ల ప్రేమ గురించి ప్రపంచానికంతా తెలుసు. ఒకానొక దశలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అప్పటికే అమితాబ్ బచ్చన్‌కు జయతో వివాహం అయ్యింది. ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు. తాజాగా శనివారం నాటి ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రేఖ.. సెట్స్‌పై సందడి చేశారు. షణ్మఖప్రియ పాడిన పాటకు డ్యాన్స్ కూడా చేశారు. ఇక నిన్నటి షోలో యాంకర్ ఆదిత్య నారాయణ్ స్థానంలో వచ్చిన జయ్ భానుశాలి ఓ కంటెస్టెంట్‌ని ఉద్దేశించి.. ‘‘రేఖాజీ, నేహు(నేహా కక్కర్) ఒక స్త్రీ.. మగాడి కోసం.. అది కూడా పెళ్లైన వాడి కోసం పిచ్చిదానిలా వెంట పడటం ఎక్కడైనా చూశారా’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రేఖ వెంటనే ‘‘నన్ను అడగండి’’ అంటారు. ఆమె సమాధానంతో షాక్ తిన్న యాంకర్ రేఖ వైపు చూడగానే ‘‘నేనేం చెప్పలేదు’’ అంటూ దాటవేస్తారు. అందుకు జయ్.. వావ్.. మీరు సిక్సర్ బాదారు అని ప్రశంసిస్తాడు. ఇక రేఖ మాటలకు అక్కడున్న వారంతా పడి పడి నవ్వుతారు. లేచి నిల్చుని చప్పట్లతో ప్రశంసిస్తారు. ఇక నిన్నటి షోలో రేఖ ఇండియన్ ఐడల్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నేహా కక్కర్‌కి కాంజీవరం పట్టు చీర బహుకరించారు. అలానే మరో జడ్జి విశాల్ దల్దాని గుండు మీద సరదగా తబాలా వాయించారు. శనివారం నాటి ఏపిసోడ్‌లో రేఖ తన చిలిపి చేష్టలతో కంటెస్టెంట్లు, ప్రేక్షకులు హృదయాలను గెలిచారు. చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే.. తెలుగు లేడీ కిశోర్ కుమార్ -
శ్రీవారి ముచ్చట్లు @40
కాలు పెట్టిననాడే కాపురం చేసే కళ తెలుస్తుందని సామెత. కొన్ని సంవత్సరాలు మొదటి రోజునే తమ విజయోత్సవ లక్షణాన్ని బయటపెట్టేస్తాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అలాంటి ఏడాది – 1981. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం జనవరి 1న దాసరి దర్శకత్వంలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు ‘పండంటి జీవితం’తో ఆ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం మొదలైంది. ఇద్దరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువుండే హీరోలే. ఇద్దరి సినిమాలూ లేడీస్ సబ్జెక్ట్లే. ఒకే రోజున రెండూ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. గమ్మత్తుగా రెండూ హిట్టే. అలా మొదలైన ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, ఎన్టీయార్ ‘కొండవీటి సింహం’ లాంటి ఎన్నో ఘన విజయాలను అందించింది. చరిత్రకెక్కిన తల్లీ కూతుళ్ళు తెలుగు సినీ చరిత్రలో తొలి తరం మహిళా నిర్మాతల్లో ఒకరు సి. కృష్ణవేణి. జీవిత భాగస్వామి అయిన శోభనాచలా పిక్చర్స్ మీర్జాపురం రాజా గారి బాటలో ఆమె ఎన్టీఆర్ ‘మనదేశం’ లాంటి సినిమాలు తీశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వారి సంతానమైన ఎన్.ఆర్. (నంగునూరి రాజ్యలక్ష్మీ) అనూరాధాదేవి కూడా మహిళా నిర్మాతగా పలు చిత్రాలు తీయడం విశేషం. తెలుగు సినీచరిత్రలో ఇలా తల్లీ కూతుళ్ళిద్దరూ నిర్మాతలుగా వెలిగిన అరుదైన ఘట్టం ఇది. పైపెచ్చు, తల్లితండ్రులు తీసిన సినిమాల (‘కీలుగుర్రం’) బాటలో కూతురు కూడా అదే హీరో అక్కినేనితో ఏకంగా 6 సినిమాలు (‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఇల్లాలే దేవత’) తీయడం విశేషం. ముక్కోణపు డ్రామా అక్కినేని, దాసరి కాంబినేషన్లో అంతకు ముందు ‘రావణుడే రాముడయితే’ (1979) నిర్మించారు అనూరాధాదేవి, శ్రీనివాసరావు దంపతులు. అది రిలీజైన ఏడాదికి మళ్ళీ అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వారు నిర్మించిన ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ‘శ్రీవారి ముచ్చట్లు’ (1981). అక్కినేని, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రధారులుగా మహిళలు మెచ్చిన ముక్కోణపు కుటుంబకథ ఇది. ప్రేమించిన కాశ్మీరీ పిల్ల(జయప్రద)తో కాకుండా అనుకోని పరిస్థితుల్లో అయినవాళ్ళ అమ్మాయి (జయసుధ) సంబంధం చేసుకుంటాడు హీరో. తీరా తాళి కట్టాక, ప్రేమించిన పిల్ల పెళ్ళిమండపంలోకి వస్తుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య నలిగిన ఆ శ్రీవారి ముచ్చట్లు ఏమిటి, ఒకరి సంగతి మరొకరికి తెలిసి ఆ స్త్రీమూర్తులు చేసిన త్యాగం ఏమిటన్నది సినిమా. ఒక సినిమా... రెండు ఓపెనింగ్లు... కథానుసారం కాశ్మీర్లో జరిగే ‘శ్రీవారి ముచ్చట్లు’ ఓపెనింగ్, ఓ మేజర్ షెడ్యూల్ అక్కడే చేశారు. హీరో, హీరోయిన్లతో దాసరి, నిర్మాతలు ఫ్లైట్‌లో చేరారు కానీ, కెమేరాతో సహా యూనిట్‌గా బయల్దేరిన దాసరి శిష్యుడు రేలంగి నరసింహారావు బృందానికి జమ్ము నుంచి కాశ్మీర్ రైలు మిస్సయింది. మరునాడే ముహూర్తం షాట్. నిర్మాత శ్రీనివాసరావు ముహూర్తం సెంటిమెంట్. దాంతో దేవుడి పటాల కోసం రాత్రికి రాత్రి జమ్మూ అంతా రేలంగి వెతికారు. చివరకు కృష్ణుడి పటాలు మినహా ఏమీ దొరకలేదు. కథ ప్రకారం హీరో పాత్రకు శ్రీకృష్ణుడి పటం సరిపోతుందని, దాని మీదే జమ్ములో ముహూర్తం షాట్ చేశారు రేలంగి. మరోపక్క కాశ్మీర్లో తన వద్ద యూనిట్ ఏమీ లేకపోయినా నిర్మాత సెంటిమెంట్ కోసం హీరో, హీరోయిన్లకు మేకప్ వేయించి, స్థానిక స్టిల్ ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించారు దాసరి. పాటలతో... కాసుల మూటలు నిజానికి, ఈ సినిమా టైటిల్ సాంగ్ వేటూరి రాయాల్సింది. ఆయన టైముకు బెంగుళూరు రాకపోవడంతో, నిర్మాతల కోరిక మేరకు సినిమాలో రెండుసార్లు వచ్చే ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే టైటిల్ సాంగ్ ను దాసరే రాసేశారు. అదే ఊపులో సినిమాలో పాటలన్నీ దాసరి రచనలయ్యాయి. సినిమా రిలీజుకు ముందే ‘కాళ్ళా గజ్జా కంకాళమ్మా’ మొదలు ‘శ్రీవారి ముచ్చట్లు’ టైటిల్ సాంగ్, ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’, ‘ఉదయకిరణ రేఖలో...’ – ఇలా పాటలన్నీ మారుమోగేవి. ఆ క్రేజుతో రిలీజైన సినిమా సూపర్ హిట్టయి, కాసులు కురిపించింది. పూర్ణా పిక్చర్స్ జి. విశ్వనాథ్ పంపిణీ చేసిన ఈ చిత్రం తొలి వారంలో ఏకంగా రూ. 22 లక్షలు వసూలు చేసింది. హీరోగా అక్కినేని కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. కాశ్మీరులో ఈ సినిమా షూటింగ్ లోనే దాసరికి ‘ప్రేమాభిషేకం’ (1981) స్టోరీ లైన్ తట్టింది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజు వేళ నిర్మాత అనూరాధాదేవి, పూర్ణా పిక్చర్స్ వారి విజయవాడ ఊర్వశి థియేటర్‌కు వెళ్ళారు. సినిమా చూసి జనసందోహం మధ్య నుంచి ఆమె, ‘పూర్ణా’ విశ్వనాథ్, ఆయన సోదరుడు బాలు అంబాసిడర్ కారులో హోటలుకు బయలుదేరారు. సినిమా చాలా బాగుందనే ఆనందంలో అభిమాన ప్రేక్షకులు తాము కూర్చున్న కారును ఆనందంగా పైకి ఎత్తేశారని అనూరాధాదేవి ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. విశేష మహిళా ప్రేక్షకాదరణతో ‘శ్రీవారి ముచ్చట్లు’ నేరుగా 5 కేంద్రాల (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ లలో 100 రోజులు, కాకినాడలో 98 రోజులు)లో, నూన్ షోలతో 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మధ్యాహ్నం ఆటలతో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజైన సరిగ్గా 48 రోజుల తర్వాత వచ్చిన ఇదే కాంబినేషన్లో ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. అది ఏకంగా ఏడాది ఆడి, గోల్డెన్ జూబ్లీ జరుపుకొంది. అప్పట్లో నెల్లూరు కల్యాణి కాంప్లెక్స్ (కృష్ణ– కావేరి–కల్యాణి థియేటర్స్)లో ‘శ్రీవారి ముచ్చట్లు’ శతదినోత్సవం ఘనంగా చేశారు. తమిళ స్టార్ శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ట్రాకు పక్కనే ఉన్న ఆ సినిమా హాలులో వేడుకలలో పాల్గొంటున్న అక్కినేని, తదితర తారలను రైళ్ళు ఆపి మరీ జనం చూడడం గమనార్హం. కాశ్మీర్ షూటింగ్... కచ్చిన్స్ డ్రెస్సులు... కాశ్మీరులో 15 రోజుల షెడ్యూల్లో 4 పాటలు, 10 సీన్లు తీశారు. బొంబాయిలోని ప్రసిద్ధ కచ్చిన్స్ సంస్థ అక్కినేనికీ, కాశ్మీరీ పాత్రలోని జయప్రదకూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అందించింది. ఒక పాటలో అక్కినేని డజను డ్రస్సులు మార్చారు. షెడ్యూల్ చివరలో పని ముగించుకొని అక్కినేని, దాసరి వచ్చేస్తే, జయప్రద, చాట్ల శ్రీరాములుపైన కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ రేలంగే షూట్ చేశారు. హిందీ రీమేక్‌లో రేఖ అనుమానం! ఈ హిట్ చిత్రాన్ని మూడేళ్ళ తరువాత హిందీలో ‘ఆశాజ్యోతి’ (1984) పేరిట దాసరి దర్శకత్వంలోనే నిర్మాత కోవై చెళియన్ తీశారు. రాజేశ్ ఖన్నా, రేఖ, రీనారాయ్ తారాగణం. హిందీ రీమేక్ రెండో షెడ్యూల్ సమయంలో దాసరి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దాంతో, మైసూరులో చేయాల్సిన 15 రోజుల షూటింగ్‌ను శిష్యుడు రేలంగి నరసింహారావుకు అప్పగించారు. తీరా రేలంగి అక్కడకు వెళ్ళాక రేఖ తదితరులకు అనుమానం వచ్చింది. తొలి షెడ్యూలులో నిర్మాతకూ, దాసరికీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకని నిర్మాతే, దాసరి బదులు రేలంగిని తెచ్చారేమోనని భ్రమపడ్డారు. ఆ మాటే రేఖ అచ్చ తెలుగులో గౌరవంగా రేలంగితో చెప్పేశారు. చివరకు దాసరి ఫోన్ చేసి, రేలంగిని తానే పంపినట్టు వివరించారు. హిందీలోనూ ఈ లేడీస్ సెంటిమెంట్ కథ సక్సెస్ సాధించింది. - రెంటాల జయదేవ -
మలుపులే జీవితం
ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బీఎడ్‌లో సీటు పరీక్ష పెట్టింది. పాఠాలు చెప్పడంలో ఉన్న ఇష్టం.. పర్వతారోహణను పక్కన పెట్టించింది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్‌గా ఆమె దిశ మారింది. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పెళ్లితో ఆడవాళ్లకు కెరీర్ ఆగిపోకూడదని, భర్త బదిలీలతో పాటుగా కెరీర్‌ను మలుచుకోవాలన్నారామె. ఆ మలుపులే తనను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా మార్చాయన్నారు. తను సమాజానికి ఎలా ఉపయోగపడాలని భగవంతుడు నిర్ణయించి ఉంటే... తన పయనం ఆ దిశగా సాగుతుందని నమ్ముతున్నారు రేఖారావు. బచేంద్రిపాల్ నేర్పించిన జీవిత జ్ఞానమే తనకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తోందని చెప్తున్నారు రేఖారావు. రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం తో బాల్యం, చదువు జమ్షెడ్పూర్ లో సాగాయి. బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నది కూడా జమ్‌షెడ్‌పూర్‌లోనే. జేఆర్‌డి టాటా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’లో శిక్షణ తరగతులు నిర్వహించేవారు బచేంద్రిపాల్. టీనేజ్‌లో మెదడు మైనపుముద్దలా ఉంటుంది. అప్పుడు పడిన ముద్ర జీవితాన్ని నడిపిస్తుంది. బచేంద్రిపాల్ దగ్గర నేర్చుకున్నది పర్వతారోహణ మాత్రమే కాదు, సామాజిక జీవి అయిన మనిషి ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా మెలగాలనే జ్ఞానాన్ని కూడా. ఆ శిక్షణతోపాటు ఆర్మీ నేపథ్యం కూడా తన మానసిక వికాసంలో కీలకమేనంటారు రేఖ. ‘‘పర్వతారోహణ శిక్షణలో ఉన్నప్పుడు నాకు భారతీయత అర్థమైంది. మేము గురువు పాదాలకు నమస్కారం చేస్తాం. సాహసమే జీవితంగా భావిస్తాం. ఆడపిల్లలకు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకనే మాట వినిపించేది కాదు. దేహం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మానసికంగా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు. సాహసోపేతమైన క్రీడలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలిగిన మంచి లక్షణం కూడా అబ్బుతుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఏవీ బాధించనంత గా పరిణతి వచ్చేస్తుంది. అలాగని వైరాగ్య జీవనమూ కాదు. జీవితం విలువ తెలుస్తుంది. బతికున్న ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపడం అలవడుతుంది. అందుకే పిల్లలకు ఆటలు లేని విద్యాభ్యాసాన్ని అంగీకరించలేను. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర టీచర్ దే. ప్రభుత్వ పాఠశాలను దత్తత ఇస్తే అద్భుతాలు చేయవచ్చని కూడా అనిపిస్తుంటుంది. నన్ను ఆహ్వానించిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇస్తున్నాను’’ అని చెప్పారు రేఖ. ఉత్తర శిఖరం.. దక్షిణాపథం కశ్మీర్‌లోని లేహ్, లధాక్, శ్రీనగర్, అమృత్సర్ నుంచి చంఢీఘర్, భటిండా, అస్సాం, నాసిక్, బెంగుళూరు కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాల్లో నివసించాను. మనదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యతతోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూడగలిగాను. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేయగలగడానికి అప్పటి సామాజిక అధ్యయనం చాలా దోహదం చేసింది. ప్రాంతం, భాష ఏదైనా సరే... ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఒకటే. మంచి పరిపాలన. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ఫలాల పట్ల నిశితమైన గమనింపు ఉంటుంది. చదువు రాని వాళ్లలో రాజకీయ చైతన్యం ఉండదని మేధావులు భావిస్తుంటారు. కానీ తమ ప్రయోజనాల గురించిన చైతన్యాన్ని కలిగి ఉంటారు. కరెంటు, టీవీ, రేడియో లేని కుగ్రామాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తమకు అవసరమైన మేరకు తెలుసుకుంటూనే ఉంటారు. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం మాత్రం తీవ్రంగా ఉంది. గ్రామాలనే కాదు, మహానగరాల్లోని బస్తీల్లో కూడా సమతులాహారం తినడం తెలియదు. ఎక్కువమంది ఒబేసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. బస్తీల్లో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కరోనా సమయంలో ఇంటికి పరిమితం కాకుండా ఎక్కడ సహాయం అవసరమైతే రాచకొండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తూ ఒక వారధి గా పని చేశాను. బస్తీల్లో పదోతరగతి ఫెయిలయ్యి చదువు మానేసిన పిల్లలు ఎక్కువగా కనిపిస్తారు. ఆ పిల్లలు అసాంఘిక శక్తులుగా పరిణమించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న మనందరి మీదా ఉంది. చదువు మీద ఆసక్తి లేకపోతే బలవంతం వద్దు, నీకు ఏ పని చేయడం ఇష్టమో చెప్పు, నేర్పిస్తానని అడిగితే పిల్లలు చక్కగా ఓపెన్ అవుతారు. టైలర్ కావాలని ఉంటే అదే పని చేయాలి. వంట చేయడం ఇష్టమైతే అదే చేయాలి. ఏది చేసినా అందులో నువ్వే బెస్ట్ అనిపించుకునేటట్లు నైపుణ్యాన్ని సాధించాలి... అని చెప్పినప్పుడు పిల్లలతోపాటు ఆ తల్లిదండ్రులు కూడా ఒక దారి కనిపించినట్లు సంతోషపడతారు. ఇలా భగవంతుడు నాకిచ్చిన నైపుణ్యం ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్నాను’’ అన్నారు రేఖారావు. పర్వతారోహణ శిక్షణ అనంతరం బచేంద్రీపాల్ నుంచి సర్టిఫికేట్ అందుకుంటున్న రేఖ మైక్ పట్టుకుని కామెంటరీ ఇవ్వడం అంటే నాకు చెప్పలేనంత. ఎంతగా అంటే... పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్లో కామెంటరీ అవకాశం కోసం ఐదేళ్ల పాటు ప్రయత్నించి సఫలమయ్యాను. అలాగే హైకోర్టు వందేళ్ల వేడుకల్లోనూ కామెంటరీ ఇవ్వగలిగాను. ‘నాట్ పాజిబుల్’ అన్నవాళ్లే ఇప్పుడు ‘పలానా రోజు ప్రోగ్రామ్. కామెంటరీ ఇవ్వడానికి మీకు వీలవుతుందా’ అని అడిగినప్పుడు ఎవరెస్టును అధిరోహించినంతగా సంతోషపడ్డాను. అలాగే 150 దేశాల ప్రతినిధులు హాజరైన సభలో అన్నా హజారే, బబితా పోగట్ల ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో అనువదించడం కూడా నన్ను నేను గర్వంగా తలుచుకోగలిగిన క్షణాలు. – రేఖారావు స్కిల్ ట్రైనర్ – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..
నీతూ సింగ్, రిషీ కపూర్ పెళ్లిలో రేఖ కట్టుబొట్టు, నడత తీరు జయా బచ్చన్‌ను చాలానే ఇబ్బంది పెట్టింది. తమ వైవాహిక అనుబంధం గురించి రేఖకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంది జయా. ఆ సమయం కోసం వేచి చూస్తోంది. ‘సిల్సిలా’ సినిమా షూటింగ్ ప్రారంభం అవడానికి ముందు.. రేఖను భోజానానికి పిలిచింది జయా. భోజనాలయ్యాక.. హాయిగా కబుర్లు చెప్పుకున్నారిద్దరూ. బొట్టుపెట్టి రేఖను సాగనంపేటప్పుడు చెప్పింది జయా ‘ఏది ఏమైనా అమిత్‌ను వదిలిపెట్టే సమస్యే లేదు’ అని చిరునవ్వు చెదరనివ్వకుండానే స్థిరంగా. ఆ విందు ఆంతర్యం అర్థమైంది రేఖకు. ‘సిల్సిలా’ తర్వాత రేఖ, అమితాబ్ బచ్చన్ల మధ్య స్నేహం తగ్గసాగింది. కారణం రేఖతో జయ చెప్పిన మాటే కావచ్చు. అయినా అమితాబ్ బచ్చన్.. రేఖ హీరోయిన్గా ఉన్న సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘ముకద్దర్ కా సికందర్’ ఒకటి. ఇది నిజమేనా? ‘ముకద్దర్ కా సికందర్’లో రేఖది చిన్న పాత్రే. అందులో కథానాయిక రాఖీ. సినిమా పూర్తయింది. ‘‘ట్రయల్ షో చూడ్డానికి అమిత్జీతోపాటు అతని పేరెంట్స్, జయాజీ కూడా వచ్చారు. ఆమె ఒక్కరే ముందు వరుసలో కూర్చున్నారు. జయాజీ వెనకాల లైన్లో అమిత్జీ, అతని పేరెంట్స్ కూర్చున్నారు. ఆ ముగ్గురికీ జయాజీ ఫీలింగ్స్ కనపడట్లేదు కాని ప్రొజెక్షన్ రూమ్‌లో ఉన్న నాకు క్లియర్‌గా కనపడ్తున్నాయి. ఆ సినిమాలో మా ఇద్దరి లవ్ సీన్స్ వచ్చినప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం, వాటిని దాచుకోవడానికన్నట్టు ఆమె తలవంచుకోవడం.. నాకు స్పష్టంగా కనపడింది. ఇది జరిగిన వారానికి ఇండస్ట్రీలోని అందరూ నాతో చెప్పసాగారు ‘ఇకమీదట అమిత్జీ మీతో కలిసి నటించరట. ప్రొడ్యూసర్స్‌కి ఇన్ఫార్మ్ చేసేశారు’ అంటూ. కాని ఆ నిర్ణయం తీసుకున్న అతను మాత్రం నాతో ఒక్కమాటా అనలేదు. అందుకే నేరుగా అమిత్జేనే అడిగా ఇది నిజమేనా? అని. ‘దాని గురించి నన్నేం అడగొద్దు.. నేనేం చెప్పలేను’ అని దాటవేశారు’’ అని చెప్పారు రేఖ ఒక ఇంటర్వ్యూలో. అమితాబ్ ఆ నిర్ణయం వెనుక జయా హెచ్చరికలే కారణం అని చెప్తారు ఆ ముగ్గురి సన్నిహితులు. ‘ముకద్దర్ కా సికందర్’ సినిమా ట్రయల్ షో తర్వాత జయా బచ్చన్.. అమితాబ్ బచ్చన్‌ను హెచ్చరించింది అని.. అందుకే రేఖతో కలిసి నటించేదిలేదనే నిశ్చయానికి వచ్చాడని ఆ సన్నిహితుల అభిప్రాయసారం. తిరిగి ఇచ్చేసింది.. అమితాబ్ బచ్చన్, రేఖకు మధ్య ఎడబాటు మొదలైన సమయంలో రేఖ ‘ఖూబ్సూరత్’ సినిమా షూటింగ్లో ఉంది. అమితాబ్ మీది నుంచి మనసు మళ్లించాలనే తాపత్రయంతో పనిచేస్తోందే కాని తనవల్ల కావడంలేదు. దానికి తోడు తన వేళ్లకున్న ఆ రెండు ఉంగరాలు అతణ్ణి మరచిపోనివ్వడంలేదు. అవి అమితాబ్ సన్నిహితంగా ఉన్న రోజుల్లో ఆమెకు కానుకగా ఇచ్చిన ఉంగరాలు. వాటిని చూస్తూ అతని తలపుల్లో మరింత కూరుకుపోవడమే తప్ప బయటపడలేను అనుకుంది. అయినా అతని ప్రేమే దూరమైప్పుడు ఆ ఆనవాళ్లు మాత్రం ఎందుకు? అనీ మనసు దిటవుచేసుకుంది. అందుకే వెంటనే ఆ రెండు ఉంగరాలనూ తిరిగి అమితాబ్ బచ్చన్‌కు పంపించేసింది. ‘‘వాటిని అమిత్జీ నా వేళ్లకు పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా తీయలేదు నేను. నిద్రపోయేప్పుడు కూడా ఉండేవి. అతను నన్ను కాదనుకున్నాక అతను ఇచ్చిన కానుకలను నేనెందుకు కావాలనుకోవాలి.. అందుకే తిరిగి ఇచ్చేశా. అందుకే ‘ఖూబ్సూరత్’ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత నా వేళ్లకు ఉంగరాలు కనపడవు’’ అని చెప్పింది రేఖ. అక్కడితో ఆ ఇద్దరి ప్రేమకే కాదు, స్నేహానికీ ది ఎండ్ పడింది. ఇంత జరిగినా అమితాబ్ బచ్చన్ నోటివెంట ఒక్క పలుకూ లేదు రేఖ గురించి కాని, రేఖ మీదున్న తన ప్రేమ గురించి కానీ. ఇప్పటికీ అదే మౌనం. అయితే ఆ ఇద్దరి గురించి మీడియా జయా బచ్చన్ అడిగింది. ‘‘అమితాబ్ పేరు అతనితో కలిసి నటించిన చాలా మంది హీరోయిన్లతో లింక్ అయింది. అవన్నీ నిజమైతే నా జీవితం నరకమయ్యేది. నేను హ్యాపీగానే ఉన్నాను. అంటే అవన్నీ రూమర్స్ అనే కదా’’ అంటూ ఆ ప్రేమను కొట్టిపారేసింది ఆమె. రేఖ ది అన్‌టోల్డ్ స్టోరీ ‘‘యెస్.. అమిత్జీతో ప్రేమలో పడ్డాను. ఈ లోకంలోకెల్ల అతణ్ణి మించిన ఇష్టం లేదు. నా జీవితంలోని అద్భుతాల్లో అమిత్జీ ఒకరు. అతను నాకో టీచర్.. గురువు. అతణ్ణించి కెమెరా ముందు నేర్చుకునేవెన్నుంటాయో.. కెమెరా వెనక నేర్చుకునేవీ అన్ని ఉంటాయి’’ అంటుంది రేఖ తన బయోగ్రఫీ లో. తమ వ్యవహారాన్ని అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ బయటపెట్టకపోవడం పట్ల రేఖ స్పందిస్తూ ‘‘తన ఇమేజ్, తన కుటుంబం, తన పిల్లలను కాపాడుకోవడానికి బయటపెట్టలేదు. అయినా బయటపెట్టాల్సిన అవసరం ఏంటి? నేను అతణ్ణి ప్రేమిస్తున్నాను.. అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే. ఒకవేళ నా దగ్గర కూడా తన ప్రేమను బయటపెట్టకపోయుంటే అప్పుడు కచ్చితంగా బాధపడేదాన్ని’’ అని చెప్పింది రేఖ ఒక ఇంటర్వ్యూలో. ఇదే విషయం మీద ఇంకో చోట ‘‘మిస్టర్ బచ్చన్.. పాత తరం మనిషి. ఎవరినీ బాధపెట్టాలనుకోడు. తన ప్రేమ వ్యవహారం బయటపెట్టి భార్యనెలా బాధపెడ్తాడు?’’ అని కూడా స్పందించింది రేఖ. -ఎస్సార్ -
నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా
‘సలామే ఇష్క్ మేరీ జా.. జరా కుబూల్ కర్లో.. తుమ్ హమ్సే ప్యార్ కర్నేకీ జరా సీ భూల్ కర్లో.. మెరా దిల్ బేచైన్ హై.. హమ్‌సఫర్ కె లియే..’ (నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా.. నాతో ప్రేమలో పడే పొరపాటు చెయ్... తోడు కోసం నా మనసు తపిస్తోంది) అంటూ ఆలపిస్తుంది జోరాబాయి సికందర్ను ఉద్దేశించి.. ‘ముకద్దర్ కా సికందర్’లో. ఆ పాట, సినిమా పేరు చెప్పగానే జోరాబాయి, సికందర్లు ఎవరో తెలిసిపోయే ఉంటుంది. అవును.. రేఖ, అమితాబ్ బచ్చన్. వాళ్ల అధూరీ ప్రేమ్ కహానీ (అసంపూర్ణ ప్రేమ కథ)యే ఈ వారం ‘మొహబ్బతే’. సాధారణంగా సినిమా జంటల ప్రేమకథలన్నీ వాళ్లు నటించిన సినిమా సెట్స్ మీదే మొదలవుతాయి. దీనికి రేఖ, అమితాబ్లూ మినహాయింపు కాదు. ‘దో అన్జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. ఆ నాటికే రేఖ సీనియర్ అమితాబ్ కంటే. అప్పటిదాకా అమితాబ్ బచ్చన్ ఆమెకు దీదీబాయి (జయా బచ్చన్) భర్తగానే తెలుసు. ‘దో అన్జానే’ సెట్స్ మీదే అమితాబ్ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు. అతను ఆమెనెంత ఆకర్షించాడో ఆమే అతణ్ణంతే సమ్మోహనపరచింది. ఆ సినిమా పూర్తయ్యేసరికి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారాన్ని మూడో కంటపడనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉందీ జంట. రేఖ స్నేహితురాలి బంగ్లాలో కలుసుకునేవాళ్లు. అలా దాదాపు రెండేళ్లు గుట్టుగానే సాగింది ఆ లవ్ స్టోరీ. చెడమడా తిట్టేశాడు.. 1978లో ‘గంగా కీ సౌగంద్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించనారంభించాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు. ఇదంతా గమనిస్తున్న అమితాబ్ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్ రియాక్షన్‌కి అక్కడున్న క్రూలోని అందరి కనుబొమలూ పైకి ఎగసాయి. ‘రేఖ మీద సర్కున్న ప్రత్యేక అభిమానం’ గురించి ఆరా తీశారు. ప్యార్ కే సివా కుఛ్ నహీ హై అని తేల్చేశారు. ఆ వివరం నెమ్మదిగానే అయినా షికారు మొదలుపెట్టింది. మీడియాకూ చేరి.. ఆ ఇద్దరినీ ప్రశ్నించింది. ‘అలాంటిదేమీ లేదు’ అంటూ కొట్టిపారేశారిద్దరూ. కాని ఆ పుకారు ఆగలేదు. ఎంతదాకా వెళ్లిందంటే అమితాబ్ బచ్చన్, రేఖ రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు అనేదాకా. పాపిట్లో కుంకుమ.. ఆ రూమర్ నిజమే అన్న అనుమానాన్ని కలిగించింది రేఖ.. నితూ, రిషి కపూర్ పెళ్లిలో. పాపిట్లో కుంకుమ దిద్దుకుని, మెడలో మంగళ సూత్రం వేసుకొని ఆ శుభకార్యానికి హాజరై. అలా ఆమెను చూసి పందిట్లోనే చెవులు కొరుక్కోసాగారంతా. అదేమీ పట్టించుకోని రేఖ.. సతీసమేతంగా (జయా భాదురి) విచ్చేసిన అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్లి అతని పక్కన నిలబడి మాట్లాడసాగింది. ఈసారి విస్తుపోవడం జయా భాదురి వంతైంది. ఆ సమయంలో అతిథుల దృష్టి రేఖ మీద కంటే జయా మీదే ఉండింది.. ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలని. వాళ్లు నిరాశ పడక తప్పలేదు. జయా మౌనంగానే అమితాబ్ వెంట నడిచింది. సిల్సిలా.. ఈ విషయమూ మీడియా చెవిన పడింది. రేఖను అడిగితే.. ‘నాకు అలా పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం ఇష్టం. అందుకే పెట్టుకున్నాను’ అని జవాబిచ్చింది. అమితాబ్‌నూ వదిలిపెట్టలేదు ప్రెస్. అయితే ఆయన ఎక్కడా.. ఎప్పుడూ అది అబద్ధమని కాని, నిజమని కాని నోరు విప్పి చేప్పలేదు. ఆ మాటకొస్తే రేఖ అంటే ఇష్టమనీ ఇప్పటికీ ఒప్పుకోలేదు. మాట్లాడకపోవడమే సమాధానంగా ఎంచుకున్నాడు బిగ్‌బీ. ఆ సంఘటన తర్వాత ‘సిల్సిలా’ స్క్రిప్ట్ పట్టుకొని ఇటు రేఖను, అటు అమితాబ్ దంపతులనూ కలిశాడు దర్శకుడు యశ్ చోప్రా. ఆశ్చర్యంగా ఆ సినిమాకు ముగ్గురూ ఒప్పుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అని భృకుటి ముడి వేయొద్దు. ఒక రకంగా అది ఆ ముగ్గురి జీవితమే.. కథగా తెర మీద ఆడింది. ‘సిల్సిలా’ టైమ్‌లో హ్యాంగర్‌కు వేళ్లాడుతున్నట్టుండేది నా పరిస్థితి. రియల్ లైఫ్లోలాగే ఆ సినిమాలోనూ జయ.. అమితాబ్ భార్య, రేఖ అతని ప్రియురాలు.నిజజీవితంలోని కోపతాపాలను నటించేప్పుడు ఎక్కడ బయటపెడతారో అని హడలి పోయేవాడిని’ అని చెప్పాడు యశ్‌చోప్రా ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు రేఖ, అమితాబ్‌ల మధ్య ప్రేమ నిజమని బయటపెట్టిందీ చోప్రానే. అయితే.. యశ్ చోప్రా భయపడ్డట్టుగా ‘సిల్సిలా’ సినిమా షూటింగ్ సమయంలో ఆ ముగ్గురూ ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాలేదు కాని.. సిల్సిలా విడుదల తర్వాత మాత్రం రేఖ, అమితాబ్‌ల ప్రేమ కృష్ణపక్షంలోని చంద్రుడిలా తగ్గుతూ వచ్చింది. -ఎస్సార్ -
సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని ఇప్పటికే మూడు నెలలవుతోంది. మొదట ఆత్మహత్యగా భావించినప్పటికి.. తరువాత కేసు అనేక మలుపులు తిరుగుతూ.. చివరకు మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్సీబీ సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ కేసును పలు అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. కానీ వాటి కంటే ఎక్కువగా మీడియా, సోషల్ మీడియా రియాను దారుణంగా వేధిస్తోందంటూ ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెటబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల కన్నా ముందు మీడియానే రియాను దోషిగా తేల్చాయి. అసలిప్పటి వరకు సుశాంత్ ఎందుకు చనిపోయాడో తెలియలేదు. కానీ మీడియా ట్రయల్స్ మాత్రం ఆమెను దోషిగా నిలబెట్టాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరలవుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే సంఘటన జరిగింది.. నటి రేఖ విషయంలో కూడా మీడియా ఇలానే ప్రవర్తించింది అంటూ సమినా షేక్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...) This! 💔 pic.twitter.com/1aTTf3dwu6 — Samina Shaikh (@saminaUFshaikh) September 12, 2020 వ్యాపారవేత్త ముఖేష్‌కి, రేఖకి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడు నెలలలోపే అనగా 1990, అక్టోబర్ 2న ముఖేష్ చనిపోయారు. భార్య దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతడు కూడా సుశాంత్ లానే చనిపోయే ముందు రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నాడని అతడి సోదరుడు పోలీసులకు తెలిపాడు. ముఖేష్ కూడా డిప్రెషన్‌తో బాధపడేవాడు. ఆ విషయం పెళ్లైన తర్వాత రేఖకు తెలిసింది. ఈ విషయాల గురించి ఆమె రేఖ: అన్‌టోల్డ్ స్టోరిలో వివరించింది. ముఖేష్ డిప్రెషన్ సమస్య తనను ఎంతో బాధపెట్టిందని.. తమ బంధం మీద కూడా ప్రభావం చూపించిందని వెల్లడించింది. అప్పడప్పుడు ముఖేష్ చాలా విపరీతంగా ప్రవర్తించేవడు. దాంతో రేఖ ఆ బంధం నుంచి విడిపోవాలనుకుంది. దీనికి తోడు.. బిజినేస్‌లో నష్టాలు. దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖేష్ తరచుగా తమ దగ్గర సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని అనేవాడని అతడి స్నేహితులు తెలిపారు. అసలు ముఖేష్ ఎందుకు చనిపోయాడనే విషయం మాత్రం తెలియలేదు అంటూ ట్వీట్ చేసింది సమీన. (చదవండి: జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..) కానీ మీడియా మాత్రం రేఖను మంత్రగత్తె అని పిలిచింది. ముఖేష తల్లి కూడా రేఖను దారుణంగా విమర్శించింది. నటులు అనుపమ్ ఖేర్, సుభాష్ ఘయ్ వంటి వారు విరుద్ధ ప్రకటనలు చేశారు. ఇప్పుడు రియా విషయంలో కూడా అలానే జరిగుతోంది. అసలు సుశాంత్ ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ మీడియా మాత్రం రియాను మంత్రగత్తె అంటుంది. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా వేధిస్తుంది. సుశాంత్ కేసులో రియానే దోషిగా నిర్థారించింది అంటూ సమీన సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. -
రేఖ బోయలపల్లికి అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ సమయంలో లక్ష మందికి పైగా వలస కార్మికులకు అండగా నిలిచిన రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టెన్నిస్ క్రీడాకారిణి రేఖ బోయలపల్లికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు విశ్వగురు సంస్థ ఇంటర్నేషనల్ కరోనా వారియర్ అవార్డును రేఖా బోయలపల్లికి అందజేసింది. పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కుటుంబాలు హైదరాబాద్‌లో చిక్కుకుపోవడంతో వారందరికీ రేఖ నిత్యం భోజన ప్యాకెట్లను, నిత్యావసర సరుకులను, బాలింతలకు కిట్లను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే సొంత ఖర్చుతో బస్సులు, వ్యాన్లు ఏర్పాటు చేసి కూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమించారు. ఈ అవార్డు లభించడం పట్ల పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. -
కంటైన్మెంట్ జోన్‌గా నటి బంగ్లా
ముంబై: ప్రముఖ నటి రేఖ ఇంటికి కరోనా సెగ తాకింది. ఆమె సెక్యూరిటీ గార్డుకు శనివారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముంబైలోని ఆమె భవనాన్ని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీసును అతికించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. రేఖ నివాసముండే బంగ్లాకు "సీ స్ప్రింగ్స్" అని పేరు. ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. తాజాగా అందులో ఒకరు కరోనా బారిన పడగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, కరణ్ జోహార్, బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే సిబ్బంది సైతం ఈ మధ్యే వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. (‘మాస్టర్ జీ’ మరి లేరు) ఇదిలా వుండగా శనివారం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, అతని కొడుకు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించగా పలువురు సెలబ్రిటీలు వారు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ముంబైలో శనివారం కొత్తగా 1284 కేసులు వెలుగు చూడగా ఒక్క ముంబైలోనే మొత్తం కేసుల సంఖ్య 91,745కు చేరుకుంది. (అమితాబ్, అభిషేక్‌లకు కరోనా) -
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'
చెన్నై : విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ మధ్యన వివాదాల్లో నిలుస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సీనియర్ హీరోయిన్ రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొనడం ఆసక్తిని రేకెత్తించింది. వివరాలు.. కె. బాల చందర్ దర్శకత్వంలో 1986లో 'పున్నగై మన్నన్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్, రేఖల హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాలో కమల్, రేఖల మధ్య ఒక ముద్దుసన్నివేశం ఉంటుంది. అయితే రేఖ16 ఏళ్ల వయసులో ఆమె అనుమతి లేకుండానే సినిమాలో ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు తెలిసింది. (కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు పోలీసు నోటీసులు) ఇదే విషయమై సీనియర్ నటి రేఖ స్పందిస్తూ.. ' నేను ఈ విషయాన్ని ఇప్పటికే వంద సార్లు చెప్పాను. డైరెక్టర్ బాలచందర్ నాకు తెలియకుండానే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడానికి విసుగు అనిపిస్తుంది. కథలో బావోద్వేగం నింపడం కోసం ముద్దు సన్నివేశం పెట్టినట్లు ఆ షాట్ చిత్రీకరణ తర్వాత నాకు చెప్పారు. కాగా షూటింగ్ ముగిసిన తర్వాత అప్పటి అసోసియేట్ డైరెక్టర్లుగా ఉన్న సురేశ్ కృష్ణ, వసంత్‌ల దగ్గర ముద్దు విషయం తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరించారని అడిగాను. దానికి వారు ఒక చిన్న పిల్లను ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు.. అయినా ఈ సీన్‌కు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలుపుతుందని వారంటే.. సెన్సార్ అంటే ఏమిటని అడిగినట్లు నాకు గుర్తుంది. కాగా ఆ షాట్ ముగిసిన తర్వాత డైరెక్టర్ బాలచందర్, కమల్ హాసన్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అయితే సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాకు మంచి అవకాశాలు రావడంతో ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు' అంటూ వెల్లడించారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్) తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ' ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కె.బాలచందర్ మన మధ్య లేరు. కమల్ హాసన్‌తో పాటు సినిమా యూనిట్ మాత్రమే ఉన్నారు. అయినా వారికి క్షమాపణ చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు.. లేదంటే లేదు. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయం. మళ్లీ ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం నాకు ఇష్టం లేదు' అని రేఖ చెప్పుకొచ్చారు. -
ఆత్మహత్య చేసుకుంది నా భర్త కాదు: నటి
చెన్నై, పెరంబూరు: ఆత్మహత్యకు పాల్పడి మరణించింది తన భర్త కాదని బుల్లితెర నటి రేఖ పేర్కొంది. ఈ నెల 25న గోపీనాథ్ అనే వ్యక్తి పెరంబూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను బుల్లితెర నటి, వ్యాఖ్యాత రేఖ భర్త అని, తన కార్యాలయంలో పని చేసే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ వ్వవహారం కారణంగా గోపీనాథ్ రేఖ మధ్య తరుచూ గొడవలు జరిగేవని ప్రచారం జరిగింది. అక్రమ సంబంధం, అప్పుల బాధ కారణంగా గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరిగింది. ఈ ప్రచారంపై బుల్లితెర నటి రేఖ స్పందిస్తూ.. ఆత్మహత్య చేసుకుంది తన భర్త కాదని, అతని భార్య పేరు జెనీఫర్ రేఖ అని తెలిపింది. ఆమె పేరులో రేఖ ఉండడంతో తన భర్త గోపీనాథ్ అని ప్రచారం చేశారని తెలిపారు. -
బుల్లితెర నటి భర్త ఆత్మహత్య
చెన్నై ,పెరంబూరు: బుల్లితెర నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెరంబూరు ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి స్థానిక అన్నానగర్, టీవీఎస్ కాలనీలోని ఒక ప్రైవేట్ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ. ఆమె బుల్లితెర నటి, వ్యాఖ్యత కూడా. కాగా గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న కార్యాలయాన్ని తెరవడానికి కార్మికులు వచ్చారు. వారు లోనికి వెళుతుండగా గోపీనాథ్ గదిలో ఉరి వేసుకుని వేలాడుతున్న దృశ్యం కంటపడింది. జేజే.నగర్ పోలీసులు మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టానికి పంపారు. కాగా భార్య రేఖతో గొడవ కారణంగానే గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. గోపీనాథ్ పదేళ్ల క్రితం రేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం రేఖ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో పని చేస్తోంది. గత ఆరు నెలల క్రితమే గోపీనాథ్ జేజే.నగర్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినట్లు, అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై గోపీనాథ్‌కు రేఖకు మధ్య తరచూ గొడవలు జరిగేవని, గురువారం కూడా భార్యతో గొడవ పడి తన కార్యాలయానికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అప్పుల బాధ కూడా ఉన్నట్లు తెలిసింది. -
అక్కినేని జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం
-
నడిచే నిఘంటువు అక్కినేని
‘‘అందం, అభినయంతో సూపర్‌స్టార్స్ అయిన రేఖ, శ్రీదేవిగార్లకు అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డుని నా చేతులమీదుగా ఇవ్వడం నా అదృష్టం. వారిద్దరూ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు’’ అని చిరంజీవి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీçసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంజనాదేవిగారికి నాగేశ్వరరావుగారంటే చాలా ఇష్టం. నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘రోజులు మారాయి’ సినిమా చూశారు. ఆ టైంలో అమ్మ కడుపులో ఉన్నది నేనే. అందుకేనేమో.. నాకూ సినిమాలంటే ఇష్టం కలిగింది. చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చా. అది కూడా నాగేశ్వరరావుగారు, రామారావుగారు వంటి లెజెండ్స్ టైమ్‌లో. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నాగేశ్వరరావుగారితో నటించడం అద్భుతమైన జ్ఞాపకం. నేను క్రమశిక్షణగా ఉన్నానంటే అది ఆయన వల్లే.. ఓ రకంగా నా గురుతుల్యులు. ఆయన నడిచే నిఘంటువు. నటనలో ఒక ఎన్సైక్లోపీడియా. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఏదో ఒక రోజు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ అంత గొప్ప స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. శ్రీదేవి, రేఖగార్లు మనందరం గర్వించే స్థాయిలో ఉన్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేసిన శ్రీదేవిగారు ‘ఇండియా లేడీ సూపర్‌స్టార్’ అయ్యారు. రేఖగారిపై నాకున్న అభిమానంతో నా భార్య సురేఖని ఇప్పటికీ రేఖ అనే పిలుస్తుంటా.. ఆ విషయం తనకి తెలియదు(నవ్వుతూ)’’ అన్నారు. రేఖ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా, తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’. శ్రీదేవిగారు గొప్పనటి. ఆమెలా ఉండాలి. నా జీవితంలో తొలిసారి చూసిన సినిమా ‘సువర్ణ సుందరి’. అంజలీదేవిగారి ‘అమ్మకోసం’ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగేశ్వరరావుగారు, అంజలి అత్తయ్యే కారణం. ‘సువర్ణసుందరి’ సినిమా వందసార్లు చూసి ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేనూ చూశాను. ముంబైలో ఉన్నప్పుడు టి.రామారావుగారు, పూర్ణచంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్‌గారు, జితేందర్గారు ఇక్కడ సినిమాలు చేయమని పిలిచేవారు. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం మరో తెలుగు సినిమా తప్పకుండా చేస్తా’’ అన్నారు. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ వేడుక సందడి చూస్తుంటే అక్కినేనిగారి చిరునవ్వును చూసినట్లుంది. నాకు, ఏయన్నార్‌గారికి వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ క్లాస్‌మేట్స్‌లా ఉండేవాళ్లం. అందంతో పాటు మంచి మనసున్న నటి శ్రీదేవి. 35 ఏళ్ల క్రితం రేఖ ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగా ర్జున వంటి వారి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి’’ అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. శ్రీదేవి, రేఖగార్లకు ఈ అవార్డులు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. ఈ వేదికమీదున్న అవార్డుతో పాటు నాన్న కూడా ఇక్కడే మనమధ్యే ఉంటారు. శ్రీదేవిగారితో నేను నాలుగు సినిమాలు చేశా. బోనీకపూర్గారు భర్తగా లభించడం శ్రీదేవిగారి అదృష్టం. అక్కినేనిగారు, శ్రీదేవిగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. రేఖగారు, శ్రీదేవిగారు ఇద్దరూ తెలుగువాళ్లే.. ఇద్దరూ ఇండియా సూపర్స్టార్సే.. ఇది మనకు గర్వకారణం’’ అన్నారు. ఈ వేడుకలో బ్రహ్మానందం, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, సుమంత్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, అడివి శేష్, అమల, సుప్రియ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...
సాక్షి, హైదరాబాద్ : ‘తాను ఇవాళ వేదికపై ఉన్నానంటే అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవిగారే. వారిద్దరూ నటించిన ‘సువర్ణసుందరి’ చిత్రం నా జీవితంలో చూసిన తొలి సినిమా. వందసార్లు అయినా ఆ సినిమా చూశాను. సినిమా అంటే ఏంటి అనే తెలియని వయసులో ఆ సినిమా చూశాక నాకు పిచ్చి పట్టేసింది’ అని ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు. నా చిన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ అబ్బాయ్ చాలా ఫోకస్డ్... చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, ప్రేమ, క్వయిట్ కానీ ...కెమెరా ఆన్ అయితే అదరగొట్టేస్తారు. ఎవరూ...ఎవరూ అని అడిగితే ఇంకెవరూ నాగేశ్వరరావుగారు అని చెప్పారు. నేను చూసిన మొదటి సినిమా ‘సువర్ణ సుందరి’. ఇక్కడ నేను నిల్చున్నానంటే దానికి కారణం నాగేశ్వరరావుగారు, అంజలీదేవినే. ఆ సినిమా చూశాక పిచ్చి పట్టేసింది. ఎలాగేనా సినిమాల్లో నటించాలని అనుకున్నాను. చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. నటి అయ్యాక షూటింగ్‌కు వెళుతూ... రోజూ బంజారాహిల్స్ నుంచి వెళుతూ గుడిలోకి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి అలా తిరిగితే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇంకోవైపు సుబ్బరామిరెడ్డిగారి ఇల్లు. రోడ్డు మీద వెళుతూనే నాగేశ్వరరావుగారికి మనసులోనే నమస్కరించేదాన్ని. పెద్ద స్టార్‌ను అయ్యేలా దీవించమని. ఒకరోజు భోజనానికి వాళ్ల ఇంటికి పిలిచారు. అమ్మ బాబోయ్ అని భయపడ్డాను. అమ్మాయ్ ఏం అనుకున్నావ్. నిన్ను చాలా గమనించేవాడిని తెలుసా? అని అన్నారు. నేను ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. చూడమ్మాయ్.... నువ్వు ఏం తింటున్నావో అనేది కూడా ముఖ్యం. కానీ అన్నింటికి కంటే ముఖ్యం నువ్వు ఏం తింటావో అది మన మీద ప్రభావం చూపుతుందని. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది. నాగేశ్వరరావుగారితో పాటు అలాగే మా నాన్నగారు చదువు, నటన గురించి చెప్పిన రెండు మాటలు జీవితాంతం చీర పల్లులో మూటకట్టుకుని పెట్టుకున్నాను. అందరూ అడుగుతున్నారు ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. అవి నాకు అమ్మా,నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్ అంతే. ఇందుకోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. సినిమా కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. అప్పట్లో హాస్పటల్లో ఉన్న అమ్మ తన కోసం ఓ తెలుగు సినిమా చేయమంది. అమ్మ కోసం తెలుగు సినిమాలో నటిస్తా. తెలుగు బాగా నేర్చుకుని శ్రీదేవి అంత స్పష్టంగా మాట్లాడతాను’ అని తెలిపారు. -
అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
-
రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని జాతీయ పురస్కారాలు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు అక్కినేని కుటుంబం స్వయంగా స్వాగతం పలికి ఆహ్వానించింది. ఈ వేడుకల్లో 2018, 2019 సంవత్సరాలకు అవార్డులు ప్రదానం చేశారు. 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి పురస్కారం ప్రకటించగా, శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్ ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. అలాగే 2019కి గానూ బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు అక్కినేని అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని అన్నారు. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నాన్న అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ జాతీయ పురస్కారంతో పాటు నాన్న తనపేరు కూడా చిత్ర పరిశ్రమలో చిరకాలం ఉంటుందనుకునేవారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మన మధ్య, మనతో ఇక్కడే ఉంది. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.’ అని పేర్కొన్నారు. గతంలో దేవానంద్ , షాబానా ఆజ్మీ , లతా మంగేష్కర్ , కే బాల చందర్ ,హేమమాలిని, అమితాబచ్చన్ , రాజమౌళి లాంటి ప్రముఖులకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, నటి రేఖా మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నటి రేఖ తొలి తెలుగుచిత్రంతో పాటు, అందంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా రేఖా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రేఖ స్పష్టమైన తెలుగులో మాట్లాడి వేడుకకు వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు. తన తొలి తెలుగు చిత్రం ‘ఇంటిగుట్టు’ అని.. సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఆ సినిమాలో ఏడాది వయసు పాత్ర తనదని అన్నారు. ‘రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు’ అన్న నాగార్జున ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... ‘మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే అందంగా ఉన్నాను’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అవార్డుల ఫంక్షన్‌లా లేదని, ప్రశ్నల కార్యక్రమంలా ఉందంటూ రేఖ సరదాగా వ్యాఖ్యలు చేశారు. సినిమా ...సినిమానే...జీవితం ...జీవితమే అని ఆమె అన్నారు. ఆఖరీ రాస్తా చిత్రానికి శ్రీదేవికి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. ఆమె బిజీగా ఉండటంతో ఆ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పానని తెలిపారు. అలాగే శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాలు చేశాను. మీతో కలిసి నటించాలని ఉందంటూ నాగార్జున ఈ సందర్భంగా రేఖను కోరగా... నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తే అందులో ఒక పాత్రలో రేఖ నటిస్తారంటూ చిరంజీవి మధ్యలో మైక్ తీసుకుని తన మనసులో ఉన్న మాట అంటూ చెప్పుకొచ్చారు. -
మహోన్నతుడు అక్కినేని
‘‘అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నతమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు(ఏయన్నార్). అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేం. ఆయన పేరిట నెలకొల్పిన ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డు గ్రహీతలు అదృష్టవంతులు’’ అని ‘ఏయన్నార్ జాతీయ అవార్డు కమిటీ చైర్మన్’, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకుగానూ ఏయన్నార్ జాతీయ అవార్డు గ్రహీతల పేర్లను హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఏయన్నార్ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2018కి దివంగత ప్రముఖ నటి శ్రీదేవికి, 2019కి నటి రేఖలను ఎంపికచేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘నాకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారు పిలిచి ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, అవార్డులు ఇవ్వాలనే ఆలోచన గురించి చెప్పారు. తాను ఉన్నా లేకున్నా తన వారసుల చేత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూనే ఉండాలన్నారు. అలా 2006లో ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, తొలిసారి నటుడు దేవానంద్‌కు ఇచ్చాం. 2017లో దర్శకుడు రాజమౌళికి ఇచ్చాం. నటీమణులుగా శ్రీదేవి, రేఖ జాతీయస్థాయిలులో కీర్తి గడించారు. అందరూ గర్వించే గొప్ప నటి శ్రీదేవికి ఈ అవార్డు ఇవ్వాలనేది నాగేశ్వరరావుగారి కోరిక కూడా. అందుకే 2018 అవార్డును శ్రీదేవికి ఇస్తున్నాం. తండ్రి ఆలోచనలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్న నాగార్జునగారిని అభినందిస్తున్నాను’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నాన్నగారి(ఏయన్నార్) పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును ప్రదానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా నాన్నగారికి సుబ్బరామిరెడ్డిగారు ఎంత సన్నిహితులో, నాకూ అంతే సన్నిహితులు. ఈ అవార్డు కమిటీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన ఉండాలి అనేది నాన్నగారి కోరిక. శ్రీదేవి తరపున ఈ అవార్డును ఆమె భర్త బోనీకపూర్, కుటుంబ సభ్యులు తీసుకుంటారు. రేఖగారికి ఈ అవార్డు గురించి చెప్పగానే చాలా సంతోపడ్డారు. నాన్నగారితో మంచి అనుబంధం ఉందని, ఆయన దగ్గర నటనకు సంబంధించిన సలహాలు తీసుకున్నట్లు చెప్పారామె. అవార్డు గ్రహీతలకు ఐదు లక్షల నగదు బహుమతి అందజేస్తాం. ఈ కార్యక్రమంలో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రేఖగారు సర్టిఫికెట్లు అందజేస్తారు’’ అన్నారు. -
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి అందించే ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం కమిటీ ప్రకటించింది. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్ హీరోయిన్ రేఖ.. ఏఎన్ఆర్ అవార్డులను అందుకోనున్నారు. కాగా 2013లో ఏఎన్ఆర్ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. నవంబరు 17న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డులను అందించనున్నారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ ఈ పురస్కారాన్నిస్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది. కాగా ఏఎన్ఆర్ తొలి జాతీయ అవార్డును బాలీవుడ్ హీరో దేవానంద్, 2017లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ (2014), సూపర్‌స్టార్ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు. -
వైరల్ : బిగ్‌బీ ఫోటో చూడగానే రేఖ రియాక్షన్..!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రేఖ ఒకప్పటి హిట్‌పెయిర్. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందనీ, కానీ చివరకు అది బెడిసికొట్టిందని బీటౌన్‌లో అందరికీ తెలిసిందే. తను ఉన్న చోట బిగ్‌బీ కనబడితే.. అక్కడినుంచి రేఖ వెళ్లిపోతుంటుంది. తాజాగా డబూ రత్నాని క్యాలెండర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన రేఖకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఈ ఈవెంట్‌కు వెళ్లిన రేఖ.. మీడియా ఫోటోగ్రాఫర్స్‌కు ఫోజులిస్తుండగా.. వెనకాల బిగ్‌బీ పోస్టర్ ఉంది. అది చూసిన వెంటనే రేఖ.. హుటాహుటిన అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
బిగ్‌బీ ఫోటో చూడగానే రేఖ రియాక్షన్..!
-
స్క్రీన్ టెస్ట్
1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్ ఏ సినిమాలోనిది? ఎ) బాబీ బి) అతడు సి) ఖలేజా డి) ఒక్కడు 2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) కొసరాజు బి) ఆత్రేయ సి) శ్రీశ్రీ డి) సినారె 3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) యన్టీఆర్ సి) అక్కినేని డి) కృష్ణ 4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి డి) కోడి రామకృష్ణ 5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు) ఎ) ఉదయ్‌కిరణ్ బి) నవదీప్ సి) ప్రిన్స్ డి) దిలీప్ రెడ్డి 6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్. ఈ పాటలో నటించిన క్యారెక్టర్ నటుని పేరేంటి ? ఎ) రామ్‌జగన్ బి) తనికెళ్ల భరణి సి) పరుచూరి గోపాలకృష్ణ డి) అజయ్ ఘోష్ 7. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్–కోటి డి) చక్రవర్తి 8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు). ఎ) బొంబాయి బి) రోజా సి) దిల్సే డి) దళపతి 9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుమలత డి) జీవిత 10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు) ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయంతి 11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్ చేసుకున్న ఈ క్రాస్ ఓవర్ సినిమాకు దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. విశ్వనాథ్ సి) సింగీతం శ్రీనివాసరావు డి) భారతీరాజ 12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) బి. గోపాల్ బి) ప్రభుదేవా సి) జయంత్.సి. పరాన్జీ డి) వీవీ వినాయక్ 13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్ కింగ్స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో కనుక్కోండి? ఎ) బి) రేఖ సి) రోహిణి హట్టంగడి డి) హేమమాలిని 14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) రాణీ ముఖర్జీ బి) కరిష్మా కపూర్ సి) కరీనా కపూర్ డి) అమీషా పటేల్ 15. ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు? ఎ) శ్రీకాంత్ బి) రవితేజ సి) ప్రకాశ్‌రాజ్ డి) బ్రహ్మాజీ 16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా...’ పాట సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ‘పరదేశ్’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా సి) కాజోల్ డి) కత్రినాకైఫ్ 17. సంజయ్‌దత్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, అర్మాన్ కోహ్లి, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్ఓసి కార్గిల్’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) రానా డి) వెంకటేశ్ 18. శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్. మళ్లీ సేమ్ కాంబినేషన్లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ ప్రారంభించారో కనుక్కోండి? ఎ) 22 బి) 18 సి) 20 డి) 25 19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు) ఎ) చంద్రమోహన్ బి) విజయ్ చందర్ సి) మురళీమోహన్ డి) నరేశ్ 20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) జగపతిబాబు బి) సుదీప్ సి) అమితాబ్ డి) విజయ్ సేతుపతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి) 11) (సి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల