'కడలోరం కవిదైగళ్' చిత్రం ఫేమ్ రేఖ చాలా కాలం తరువాత కథానాయికగా నటిస్తున్న చిత్రం మిరియమ్మ. ఇతర ముఖ్యపాత్రల్లో ఎళిల్ దురై, స్నేహకుమార్, అనితా సంపత్, వీజే.ఆషిక్, మాలతీ నారాయణ్ నటిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా మావతి నారాయణ్ దర్శకుడిగా పరిచయం అవుతూ 72 ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఏఆర్.రిహానా సంగీతాన్ని, జెసన్ విలియమ్స్ చాయాగ్రహణం అందిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ఇది మహిళల ఇతి వృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఒకప్పుడు కథానాయికగా నటించిన రేఖ 20 ఏళ్ల తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిరియమ్మ అని చెప్పారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. చిత్రంలో జనరంజక అంశాలతో పాటు చక్కని సందేశం ఉంటుందన్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. రేఖ మళ్లీ ప్రధాన పాత్రలో నటించడంతో మిరియమ్మ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment