tamil heroine
-
అప్పుడు సినిమాలకు గుడ్‌బై చెబుతా!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయంలో చాలామంది నటీనటులు ఎప్పుడూ ముందుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. లీడ్ రోల్ దశ దాటాక కొందరు తారలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తుంటారు. అయితే ఈ విషయంలో తన రూటే సపరేటు అంటున్నారు హీరోయిన్ దుషారా విజయన్ . క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయరట. ఎందుకంటే ముప్పై ఐదేళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానంటున్నారామె.‘బోదై ఏరి బుద్ధి మారి’ (2019) సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దుషారా. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ‘సార్పట్ట పరంబరై’ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, విక్రమ్ ‘వీర ధీర శూరన్’, ధనుష్ ‘రాయన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు దుషారా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘నాకు ముప్పై ఐదేళ్లు వచ్చాక నటనకు స్వస్తి పలుకుతాను. ఆ తర్వాత విదేశాలన్నీ చుట్టేయాలనుకుంటున్నాను. నేను చూడని దేశమంటూ ఉండకూడదు. అలా ΄ప్లాన్ చేసుకుంటున్నాను’’ అన్నారు. -
చాలామంది హేళనగా చూశారు, ఎందుకో అర్థం కాలేదు: హీరోయిన్
'ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుంది. అలా నాకు నటించడంలోనే కిక్ కలుగుతుంది. చిత్రంలో నటిస్తున్నప్పుడు నేను హిందుజాని అనుకోను. పాత్ర స్వభావాన్ని బట్టి మారడం నాకు కిక్ ఇస్తుంది’ అని నటి హిందూజా పేర్కొంది. 'మేయాదమాన్' చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పార్కింగ్ చిత్రంలో హరీష్ కళ్యాణ్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా హిందూజా ఓ భేటీలో పేర్కొంటూ పార్కింగ్ చిత్రంలో తాను అధ్యాపకురాలిగా నటిస్తున్నానని చెప్పింది. పార్కింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? తద్వారా జరిగే పరిణామాలు ఏమిటి? వంటి అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ చిత్రంలో ఉంటాయని చెప్పింది. ఇందులో కొన్ని ఛాలెంజింగ్‌తో కూడిన సన్నివేశాల్లో నటించానని చెప్పింది. తను కథానాయకగా నటించాలనే ధ్యేయంతోనే ఈ రంగంలోకి వచ్చానని, అయితే ఆరంభంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశానంది. అలాగని వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని భావించి ఇప్పుడు కథానాయిక పాత్రలకే ప్రాముఖ్యతనిస్తున్నట్లు పేర్కొంది. తాను తమిళ్ అమ్మాయినని చెప్పగా ఆరంభ దశలో పలువురు హేళనగా చూశారంది. ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని చెప్పింది. కథా పాత్రలను అర్థం చేసుకొని నటించడానికి మాతృభాష చాలా అవసరం అవుతోందని దర్శకులు భావిస్తున్నారంది. మంచి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని చెప్పుకొచ్చింది హిందూజ. చదవండి: బిగ్‌బాస్ 7 క్రేజీ ప్రోమో.. చూశారా? -
20 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోయిన్గా చేస్తున్న రేఖ
'కడలోరం కవిదైగళ్' చిత్రం ఫేమ్ రేఖ చాలా కాలం తరువాత కథానాయికగా నటిస్తున్న చిత్రం మిరియమ్మ. ఇతర ముఖ్యపాత్రల్లో ఎళిల్ దురై, స్నేహకుమార్, అనితా సంపత్, వీజే.ఆషిక్, మాలతీ నారాయణ్ నటిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా మావతి నారాయణ్ దర్శకుడిగా పరిచయం అవుతూ 72 ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఏఆర్.రిహానా సంగీతాన్ని, జెసన్ విలియమ్స్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ఇది మహిళల ఇతి వృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఒకప్పుడు కథానాయికగా నటించిన రేఖ 20 ఏళ్ల తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిరియమ్మ అని చెప్పారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. చిత్రంలో జనరంజక అంశాలతో పాటు చక్కని సందేశం ఉంటుందన్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. రేఖ మళ్లీ ప్రధాన పాత్రలో నటించడంతో మిరియమ్మ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వీడియో వైరల్ -
బిగ్‌బాస్‌లోకి ప్రదీప్ హీరోయిన్!
తెలుగులో ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అటు తమిళ, హిందీలో మాత్రం ఈ షో ఇంకా ప్రారంభం అవనేలేదు. దీంతో అక్కడి బిగ్‌బాస్ ప్రేమికులు ప్రోమోలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇదిలా వుంటే తమిళ బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 'బిగిల్' హీరోయిన్ అమృతా అయ్యర్ పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఓ అభిమాని ఈ డౌటానుమానాన్ని అమృత దగ్గర ప్రస్తావించాడు. మీరు నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడుతున్నారా? అని ప్రశ్నించాడు. అందుకు సదరు హీరోయిన్ ఏం సమాధానం చెప్పాలో తెలీక ఇరకాటంలో పడ్డారు. (చదవండి: తీవ్ర అనారోగ్యం.. సర్జరీకి సిద్ధమైన నటి) ఓ క్షణమాగి.. "తెలీదు... దీన్ని సస్పెన్స్‌గానే ఉంచుదాం" అని చెప్పుకొచ్చారు. ఈ సమాధానంతో ఆమె బిగ్‌బాస్ ఎంట్రీ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమృతా విజయ్ బిగిల్ సినిమాలో ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కనిపించారు. ప్రదీప్ హీరోగా నటిస్తున్న "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల అవకముందే హీరో రామ్ "రెడ్" చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా రిలీజ్ కాకపోయినప్పటికీ "30 రోజుల్లో ఎలా?" సినిమా నుంచి విడుదలైన "నీలి నీలి ఆకాశం" పాటతో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. (చదవండి: ప్రేయసిని పెళ్లాడిన బిగ్‌బాస్ విన్నర్!) -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు సృష్టించిన సంచలనం ఇంకా వీడిపోక ముందే మరో తమిళ నటి తనపై ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. తమిళంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, స్వయంగా హీరోయిన్ కూడా అయిన వరలక్ష్మి తనపై చోటుచేసుకున్న వేధింపుల విషయాన్ని వెల్లడించారు. తాను ఇటీవల ఒక టీవీ చానల్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుంచి బయటకు వచ్చేశానన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, తనను వేధించాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిత్రసీమలో హీరోయిన్లపై కూడా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందని తెలిపారు. ట్విట్టర్లో ఈ అంశంపై ఆమె ఒక భారీ లేఖ పోస్ట్ చేశారు. (వరలక్ష్మి లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి) అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందని, మహిళల భద్రత అనేది జోక్‌గా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ వెధవలను ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు శిక్ష పడి తీరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పెట్టిన సందర్భంలోనే ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఒక భారీ లేఖ రూపంలో ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని రెండు రోజులుగా మధనపడుతున్నానని, చివరకు చెప్పి తీరాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ రాస్తున్నానని అన్నారు. ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో తాను సమావేశంలో పాల్గొన్నానని, ఒక అరగంట తర్వాత సమావేశం ముగుస్తోంది అనగా అతడు తనను ''మనం బయట ఎక్కడ కలుద్దాం'' అని అడిగాడని, ఏదైనా పని కోసమా అని తాను అడగ్గా.. కాదని, ఇతర విషయాల కోసమని అతగాడు అన్నట్లు ఆమె తెలిపారు. తాను కోపంగా అక్కడినుంచి వెళ్లిపోవాలని అతడికి చెప్పానన్నారు. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని, పరిశ్రమలోకి తాను శరీరాన్ని అమ్ముకోడానికి రాలేదని, మహిళలపై జరుగుతున్న దోపిడీ ప్రమాణాలను పాటించడానికి కూడా రాలేదని చెప్పారు. తనకు నటన అంటే ఇష్టమని, ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకుని, వాటిపై బయటకు మాట్లాడాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. పురుషులకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందని, వాళ్లు మహిళలను అగౌరవపరచడం మానుకోవాలి లేదా బయటకు పోవాలని ఆవేశంగా ఆ లేఖలో వరలక్ష్మి రాశారు. తాను ఒక నటినని, వెండితెర మీద గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదని స్పష్టం చేశారు. తన జీవితం, తన శరీరం తన ఇష్టమని, ఏ మగాడూ కూడా తనను అగౌరవంగా చూసి సులభంగా వెళ్లిపోతానని అనుకోకూడదని వరలక్ష్మి అన్నారు. ఇది చిన్న విషయమని, ఏమీ జరగలేదని అనుకునేవాళ్లు కూడా ఉంటారని, అయితే ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమేనని తెలిపారు. అదృష్టవశాత్తు తాను సురక్షితంగా బయటపడ్డాను గానీ, దీనివల్ల చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని తెలిపారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాక.. అన్ని రకాల పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితులు, సంస్కృతులు, వయసులో కూడా ఇలాంటి వేధింపులు ఉంటున్నాయని, మనది పురుషాధిక్య సమాజం కావడంతో మహిళలను వస్తువులుగా చూస్తూ అసమానతలు పెంచుతున్నారని ఆవేశంగా చెప్పారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి 'రేప్' అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని ఆమె ప్రశ్నించారు. తాను మౌనంగా ఊరుకునేది లేదని, తన స్నేహితులు, చెల్లెళ్లు కూడా మౌనాన్ని వీడాలని తెలిపారు. మీరు ఒంటరి కారని.. తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. What the hell is going on??!!! #WomenSafety has become a joke.. hang those bloody b@st@rds.. strength to #bhavna ... they will be punished — varu sarathkumar (@varusarath) 19 February 2017 Needs to be said..!! pic.twitter.com/GjJimBIKd3 — varu sarathkumar (@varusarath) 20 February 2017 -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
-
ఆవిడ మాటలే ఈరోజు నన్నిక్కడ నిలబెట్టాయి!
అమ్మ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ప్రగతిని చూస్తే. యంగ్ మదర్‌గా తల్లి పాత్రలకు క్రేజ్‌ను తెచ్చిన నటి ఆవిడ. తమిళనాట హీరోయిన్గా అడుగు పెట్టి, సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో సత్తా చాటి, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రగతి. ఇటీవలే ‘ఆగడు’ చిత్రంలో తమన్నాకి తల్లిగా నటించిన ప్రగతి తన అనుభవాలు, అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు... నటన వైపు అడుగులెలా పడ్డాయి? నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. పదో తరగతి చదువుతుండగా కొన్ని కుటుంబ సమస్యలు రావడంతో చెన్నై వెళ్లి సెటిలయ్యాం. మొదట్నుంచీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఆసక్తి ఎక్కువ. మోడలింగ్ చేశాను. యాడ్స్‌లో నటించాను. డిగ్రీ చేస్తున్నప్పుడు నా ఫొటోలు భాగ్యరాజాగారి చేతిలో పడ్డాయి. దాంతో ఆయనతో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా తెలుగులోకి కూడా డబ్ చేశారు... ‘గౌరమ్మా... నీ మొగుడెవరమ్మా’ పేరుతో. మొదటి సినిమాయే భాగ్యరాజాతో... ఫుల్ హ్యాపీ ఏమో కదా? అంతే కదా మరి! ఆ తర్వాత ఒక్క సంవత్సరంలో ఏడు సినిమాల్లో హీరోయిన్గా చేశాను. కానీ ఎప్పుడూ నాకు నటన మీద ప్యాషన్ ఉండేది కాదు. ఒక నటిగా ఏదేదో సాధించేద్దాం అని తాపత్రయపడేదాన్ని కాదు. అందుకే 1994లో నటిని అయితే, మరుసటి సంవత్సరమే పెళ్లి చేసేసుకున్నాను. వెంటనే బాబు పుట్టడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయాను. మరి మళ్లీ ఎలా వచ్చారు? ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఓ మూల ఉండేది... రెడ్ కార్పెట్ వేసి పిలిస్తే కాదనుకున్నానే అని! అందుకే మళ్లీ నటించాలని అనుకున్నాను. అయితే అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఇక హీరోయిన్గా చేసే చాన్స లేదు కాబట్టి సీరియల్స్‌వైపు వెళ్లాను. తమిళ, మలయాళ, తెలుగు భాషల సీరియళ్లతో బిజీ అయిపోయాను. అంతలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ‘నువ్వు లేక - నేను లేను’లో ఆఫర్ వచ్చింది. సంతోషపడ్డారా? లేదు. అప్పుడే తల్లి పాత్రలు చేయమంటారేమిటి అని ఫీలయ్యా. అప్పటికి ‘అక్కాచెల్లెళ్లు’ సీరియల్ చేస్తున్నాను. అందులో సీనియర్ నటి శ్రీవిద్య నా తల్లి. షూటింగ్ గ్యాప్‌లో ఆవిడతో బాధగా అన్నాను... తల్లిగా నటించమని అడుగుతున్నారు అని. దానికావిడ... ‘నువ్విక హీరోయిన్ పాత్రలు చేయలేవు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగాలి. అలాంటప్పుడు తల్లయితే ఏంటి, అత్తయితే ఏంటి? ఏదైనా నటనే కదా’ అని. అది నిజమే కదా! అందుకే ఓకే అన్నాను. ఈరోజు ఇలా ఉన్నానంటే శ్రీవిద్యమ్మ వల్లనే! సీరియల్స్‌కి దూరమైపోయారెందుకు? ఎంత లీడ్ రోల్సే చేసినా, సీరియళ్లలో నటిస్తున్నామంటే సినిమా అవకాశాలు తగ్గుతాయి. అందుకే దూరంగా ఉన్నాను. చేసినవాటిలో తృప్తినిచ్చిన పాత్ర? ఇప్పటి వరకూ నేను చేసింది కేవలం 25 శాతం. ఇంకా 75 శాతం ఉంది సాధించాల్సింది. అప్పుడే తృప్తి ఏమిటి! తెలుగులో బిజీ. మిమ్మల్ని నటిని చేసిన తమిళసీమను గుర్తుంచుకున్నారా? కచ్చితంగా. తెలుగు అమ్మాయిని కాబట్టి నా మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఉంటుంది. కానీ అసలు నన్ను నటిగా నిలబెట్టిందే తమిళ పరిశ్రమ కదా! అందుకే ఇప్పటికీ తమిళంలో చేస్తున్నాను. కాకపోతే అక్కడ పాత్రల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటాను. ఎందుకంటే... వాళ్లకి నేను హీరోయిన్గా తెలుసు. కాబట్టి నా మీద ఒక అంచనా ఉంటుంది. దాన్ని పాడు చేసుకోకూడదు కదా! మీరు కాకుండా మీకు నచ్చే తల్లి పాత్రధారి ఎవరు? నేను కాకుండా కాదు, తల్లి పాత్రల్లో నేనే నాకు చాలా నచ్చుతాను. చాలామంది అంటారు... మీరు నటిస్తున్నట్టు ఉండదు, నిజంగా అమ్మతనం ఉట్టిపడుతుంది అని. కొందరైతే మా అమ్మ మీలా ఉంటుంది, మీలానే మాట్లాడుతుంటుందని చెప్తారు. చాలా సంతోషమేస్తుంది. సినిమాలో ఏ పాత్ర గురించీ అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు. కానీ తల్లి పాత్రలంటే అందరికీ గౌరవం ఉంటుంది. అందుకే తల్లిగా నటించడాన్ని ఎంజాయ్ చేస్తుంటాను. నిజ జీవితంలో మీరెలాంటి తల్లి? మంచి తల్లినే. నా పిల్లలతో తగినంత సమయం గడుపుతాను. వాళ్లకు సంబంధించిన విషయాలన్నీ పట్టించుకుంటాను. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించనివ్వను. మేం చెన్నైలో ఉన్నంత వరకూ పిల్లలిద్దరికీ నా కెరీర్ గురించి పెద్ద తెలియదు. హైదరాబాద్ వచ్చేశాక నాకు వచ్చిన గుర్తింపును చూసి, ‘నువ్వింత ఫేమసా మమ్మీ’ అని ఆశ్చర్యపోయారు వాళ్లు! మీవారి సపోర్ట్ గురించి...? మావారు ఐటీ రంగంలో ఉన్నారు. ఆయనకు అసలు సినిమా ప్రపంచం గురించి అవగాహన లేదు. సినిమాలు కూడా పెద్దగా చూడరు. కాకపోతే నన్ను మాత్రం బాగానే ప్రోత్సహిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు...? పెద్దగా ఏం లేవు. ఎందుకంటే నాకెప్పుడూ అది కావాలి, ఇది కావాలి అన్న ఆలోచన ఉండదు. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరిస్తాను. ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. దేవుడు మనకి సంతోషంగా జీవించమనే జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి సంతోషంగా ఉండాల్సిన బాధ్యత మనదే. అందుకే నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను. భవిష్యత్తు గురించి ఎక్కువ బెంగపడను. దేనినీ అతిగా ఆశించను! - సమీర నేలపూడి